02 June 2021 TELUGU Murli Today – Brahma Kumari

June 1, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - తండ్రితో పాటు ఎగిరేందుకు పూర్తిగా పవిత్రంగా అవ్వండి, సంపూర్ణంగా సరెండర్ అవ్వండి, ఈ దేహం కూడా నాది కాదు - పూర్తిగా అశరీరులుగా అవ్వండి”

ప్రశ్న: -

 ఉన్నతమైన గమ్యాన్ని చేరుకునేందుకు ఏ భయం తొలగిపోవాలి?

జవాబు:-

చాలామంది పిల్లలు మాయా తుఫాన్లకు చాలా భయపడుతారు. బాబా, ఈ తుఫాన్లు చాలా సతాయిస్తున్నాయి, వీటిని ఆపండి అని అంటారు. బాబా అంటారు – పిల్లలూ, ఇది బాక్సింగ్. ఆ బాక్సింగ్ లో కూడా ఒక వైపు నుండే దాడి జరుగుతుందని కాదు. ఒకవేళ ఒకరు 10 దెబ్బలు వేస్తే, రెండవవారు తప్పకుండా 5 వేస్తారు, అందుకే మీరు భయపడకూడదు. మహావీరులుగా అయి విజయులుగా అవ్వాలి, అప్పుడు ఉన్నతమైన గమ్యాన్ని చేరుకోగలరు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ప్రమాణం చేసి మీ ద్వారం వద్దకు వచ్చాము….. (దర్ పర్ ఆయే హై కసమ్ లేకే…..)

ఓంశాంతి. పిల్లలు పాట విన్నారు. పాటలో తప్పకుండా ఏదో రహస్యం ఇమిడి ఉంది, ఎందుకంటే బాబా ఈ రికార్డును కొని దీని అర్థాన్ని కూర్చొని అర్థం చేయిస్తారు. దీనినే, జీవిస్తూ మరణించి తండ్రికి చెందినవారిగా అవ్వడమని అంటారు. తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత టీచరుకు చెందినవారిగా అవ్వాలి, టీచరు తర్వాత మెజారిటీ గురువులను ఆశ్రయిస్తారు. క్రైస్తవులు కూడా పిల్లలు జన్మిస్తూనే, వారిని క్రిస్టియనైజ్ చేస్తారు (క్రైస్తవులుగా చేస్తారు). వారిని గురువు ఒడిలో పెడతారు, ఆ గురువు ఫాదర్ కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు. ఫాదర్ అంటే క్రీస్తు కాదు. అతని పేరు మీద మేము క్రైస్తవులుగా అవుతామని వారంటారు.

ఇప్పుడు పిల్లలైన మీరు ముందు తండ్రికి చెందినవారిగా అవుతారు, అశరీరులుగా అవుతారు. మా తనువు-మనసు-ధనము ఏవైతే ఉన్నాయో, అవన్నీ బాబాకు అర్పణ చేస్తాము, జీవిస్తూ మరణిస్తాము అనగా ఆత్మలమైన మనం వారికి చెందినవారిగా అవుతాము, ఇది బుద్ధిలో ఉండాలి. నావి అంటూ ఏవైతే ఉన్నాయో, నా శరీరం, నా ధనం, సంపద, సంబంధీకులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, అన్నింటినీ మర్చిపోతాము. మరణించిన తర్వాత అంతా మర్చిపోతారు కదా. ఇది ఎంత పెద్ద గమ్యము. మనం అశరీరి ఆత్మలము అనేది పక్కా చేసుకోవాలి. అంతేకానీ, మీరు శరీరాన్ని వదిలి మరణిస్తారని కాదు. ఆత్మ పూర్తిగా పవిత్రంగా అవ్వలేదు. తండ్రికి చెందినవారిగా అయ్యారు కానీ, బాబా అంటారు – మీ ఆత్మ అపవిత్రంగా ఉంది. ఆత్మ రెక్కలు తెగిపోయాయి. ఇప్పుడు ఆత్మ ఎగరలేదు. తమోప్రధానంగా ఉన్న కారణంగా ఒక్క మనిషి కూడా తిరిగి వెళ్ళలేరు. మాయ రెక్కలను పూర్తిగా విరిచేసింది. ఆత్మ అన్నింటికన్నా వేగంగా వెళ్తుందని బాబా అర్థం చేయించారు. ఆత్మ కన్నా వేగవంతమైనది ఇంకేదీ ఉండదు. ఆత్మ వేగాన్ని ఎవరూ చేరుకోలేరు. చివర్లో ఆత్మలన్నీ దోమల వలె పరుగెడతాయి. ఎక్కడకు వెళ్తాయి? చాలా చాలా దూరంగా, సూర్య, చంద్రులను కూడా దాటి వెళ్తాయి. అక్కడ నుండి అవి తిరిగి రావు. వారి రాకెట్లు మొదలైనవి వెళ్ళి తిరిగి వస్తాయి. అవి సూర్యుని వరకు చేరుకోలేవు. మీరైతే వాటికన్నా చాలా దూరంగా వెళ్ళాలి. సూక్ష్మవతనం కన్నా పైనున్న మూలవతనానికి వెళ్ళాలి. ఆత్మకు రెక్కలు లభిస్తాయి. లెక్కాచారాన్ని సమాప్తం చేసుకొని ఆత్మ పవిత్రంగా అవుతుంది. వినాశన సమయానికి సంబంధించి చాలా మహిమ రాయబడి ఉంది. ఆత్మలందరూ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే ఆత్మలందరూ మలినంగా, పాపాత్ములుగా ఉన్నారు. పెద్ద గురువులు, సాధు-సన్యాసులు మొదలైనవారు ఉన్నారు, తాము గురువులమని భావిస్తారు. అహమ్ బ్రహ్మస్మి… అహమ్ బ్రహ్మోహమ్ అని అంటారు. మేము బ్రహ్మా తత్వానికి చేరుకున్నామని అంటారు. ఇప్పుడు, ఇక్కడే కూర్చొని ఉంటూ బ్రహ్మా తత్వానికి ఎక్కడ చేరుకున్నారు. ఆత్మలమైన మనం బ్రహ్మా తత్వంలో నివసించేవారమని ఇప్పుడు మీకు తెలుసు. కానీ, ఇప్పుడు అక్కడకు ఎవరూ వెళ్ళలేరు. ఆత్మలన్నీ ఇక్కడ పునర్జన్మలు తీసుకుంటాయి. ఇది అనంతమైన డ్రామా. పాత్రధారులందరూ పాత్రను అభినయించేందుకు అక్కడ నుండి తప్పకుండా రావాలి. అందరి ఆత్మలు స్టేజి పైకి వచ్చాయి. వినాశన సమయం వచ్చినప్పుడు అందరూ వచ్చేస్తారు, అక్కడ ఉండి ఏం చేస్తారు! పాత్రధారి పాత్రను అభినయించకుండా ఇంట్లో కూర్చొని ఉండిపోరు. నాటకంలోకి తప్పకుండా రావాల్సి ఉంటుంది. అక్కడ నుండి అందరూ వచ్చిన తర్వాత, తండ్రి అందరినీ తీసుకువెళ్తారు. తండ్రి అంటారు – నేను ఇక్కడ ఉన్నా కానీ ఆత్మలు వస్తూ ఉంటాయి, నంబరువారుగా వృద్ధి చెందుతూ ఉంటాయి. తర్వాత మీరు వెళ్ళడం కూడా నంబరువారుగా వెళ్తారు. అంతా మీ అవస్థపై ఆధారపడి ఉంది, అందుకే మీరు మరజీవులుగా అవ్వాలి. నేను ఆత్మను అన్న నిశ్చయం ఏర్పరచుకోవడం కష్టము. పిల్లలు పదే-పదే దేహాభిమానంలోకి వచ్చి మర్చిపోతారు. పూర్తిగా సరెండర్ అయినప్పుడే దేహీ-అభిమానులుగా అవ్వగలరు. బాబా, ఇదంతా మీదే. నేను కూడా మీ వాడినే. ఈ దేహం కూడా నాది కాదు, నేను దీనిని వదిలేస్తాను. బాబా, నేను మీ వాడిని. బాబా అంటారు – నా వారిగా అయ్యి, మిగిలినవారందరి పట్ల మమకారాన్ని తొలగించండి. అలాగని ఇక్కడకు వచ్చి కూర్చోవడం కాదు. మీరు మీ వ్యాపార-వ్యవహారాలను చేసుకోవాలి. ఇంటిని సంభాళించాలి. పిల్లలు తల్లిదండ్రుల ఋణాన్ని తీర్చుకోవాలి. వారి సేవ చేసి రిటర్ను ఇవ్వాలి. తల్లిదండ్రుల పాలనకు పిల్లలు ఋణగ్రస్తులు అవుతారు. ఇప్పుడు తండ్రి మీ పాలనను చేస్తున్నారు. ప్రారంభంలో ఎవరైతే వచ్చారో, వారంతా వెంటనే సరెండర్ చేసారు. వారి వద్ద ఏమీ ఉంచుకోలేదు, సరెండర్ చేసారు, ఆ ధనంతో పిల్లలైన మీరు భారత్ ను పావనంగా చేస్తున్నారు. భారత్ మాత్రమే పూర్తిగా పవిత్రంగా ఉండేది. భారతవాసులంతటి పవిత్రమైనవారు, సుఖమయమైనవారు ఇంకెవరూ ఉండరు. భారత్ అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానము. ఇక్కడకు పతితపావనుడైన తండ్రి వచ్చి మొత్తం సృష్టిని మరియు పతితులను కూడా పవిత్రంగా చేస్తారు. ఇప్పుడు ఈ తత్వాలు మొదలైనవన్నీ శత్రువుల వలె ఉన్నాయి. భూకంపాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి ఎందుకంటే తమోప్రధానంగా ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, అవి చాలా దుఃఖం కలిగిస్తాయి. ఈ సమయంలో అన్నీ దుఃఖమిచ్చే వస్తువులే ఉన్నాయి. సత్యయుగంలో అన్నీ సుఖమిచ్చే వస్తువులే ఉంటాయి. అక్కడ, ఈ తుఫాన్లు లేదా వేడి గాలులు మొదలైనవేవీ ఉండవు. మీలో కూడా ఈ విషయాలను కొద్దిమందే అర్థం చేసుకుంటారు. ఈ రోజు ఇక్కడ ఉండి, రేపు లేకపోతే, వారు ఏమీ అర్థం చేసుకోలేదని అనడం జరుగుతుంది. ఇక్కడకు వస్తారు కానీ అందరూ నిలవరు. ఇక్కడ నుండి వెళ్ళి, 10 రోజుల తర్వాత – బాబా, ఫలానా వారిని మాయ తినేసిందని సమాచారం రాస్తారు. ఇలా జరుగుతూ ఉంటుంది. చిన్న పుష్పాలు పెద్దవిగా అయ్యాక వాటి నుండి ఫలాలు వెలువడతాయి. అటువంటి వారిలో ఇతరులను తమ సమానంగా తయారుచేసే శక్తి ఉంటుంది. వారి నుండి ఫలం వెలువడుతుంది.

తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత ప్రజలను కూడా తయారుచేయాలి, వారసులను కూడా తయారుచేయాలి. పండాలు (మార్గదర్శకులు)గా అయి బాబా వద్దకు వచ్చి, ఇక మేము గమ్యాన్ని చేరుకున్నామని అనుకోకూడదు. గమ్యం చాలా పెద్దది. మాయ తుఫాన్లు చాలా వస్తాయని అంటారు. మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు కావున తుఫాన్లు అయితే వస్తాయి. బాబా, మేము మీ వారిగా ఉండేవారము, మీ నుండి వారసత్వాన్ని తీసుకున్నాము, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలను దాటి, మళ్ళీ వచ్చి మీ వారిగా అయ్యామని అంటారు. నేనైతే మీ నుండి వారసత్వాన్ని తీసుకుని తీరుతాను అని అంటారు. కావున ఇటువంటి తండ్రిని అంతగా స్మృతి చేయాలి మరియు ఇతరులను తమ సమానంగా తయారుచేసి ఫలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే మాల ఎలా తయారవుతుంది. తండ్రి యొక్క వారసులను ఎలా తయారుచేస్తారు. ప్రజలు కూడా కావాలి, సింహాసనంపై కూర్చొనే వారసులు కూడా కావాలి. తండ్రి వద్దకు చాలామంది వస్తారు, తర్వాత విడాకులు ఇచ్చేస్తారు. బుద్ధియోగం తెగిపోయిందంటే, ఇక ఆట సమాప్తమైపోతుంది.

చాలామంది పిల్లలు బాబా వద్దకు వచ్చి – బాబా, ఏ తుఫాను ప్రభావితం చేయని విధంగా అవస్థను ఎలా తయారుచేసుకోవాలి అని అడుగుతారు. తండ్రిని స్మృతి చేయండి అని దీని మార్గాన్ని తెలియజేస్తూనే ఉంటారు. తుఫాన్లు అయితే వస్తాయి. బాక్సింగ్ లో ఒకరే దెబ్బలు తింటూ ఉండడాన్ని ఎప్పుడైనా చూసారా. తప్పకుండా ఇరువురిలోనూ ధైర్యముంటుంది. ఒకరు 5 దెబ్బలు వేస్తే, మరొకరు 10 దెబ్బలు వేస్తూ ఉండవచ్చు. ఇది కూడా బాక్సింగ్. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే, మాయ పారిపోతూ ఉంటుంది, కానీ అది వెంటనే జరగదు. మాయతో కుస్తీ పట్టాల్సి ఉంటుంది. అది ఎవరైనా సరే, మాయ చెంప దెబ్బ వేయదని అనుకోకండి. ఇది పెద్ద బాక్సింగ్. చాలామంది భయపడతారు, మాయ బాగా ఇబ్బంది పెడుతుంది. ఇది యుద్ధ స్థలం కదా. బుద్ధియోగాన్ని జోడించడంలో మాయ పెద్ద విఘ్నాలను వేస్తుంది. శ్రమ అంతా యోగంలోనే ఉంది. జ్ఞానయుక్త ఆత్మలంటే నాకు ప్రియమని బాబా అంటారు. అలాగని, కేవలం జ్ఞానాన్ని ఇచ్చే వారే ప్రియమని కాదు. ముందు యోగం పూర్తిగా ఉండాలి. తండ్రిని స్మృతి చేయాలి. మాయ విఘ్నాలకు భయపడకూడదు. విశ్వానికి యజమానులుగా అవుతారు కదా. అందరూ అవుతారా? 16108 మాల చాలా పెద్దది. ఇది అంతిమానికి పూర్తవుతుంది. త్రేతా అంతిమానికి ఎంతమంది రాకుమార-రాకుమారీలుగా తయారవుతారు, దీనికి సంబంధించిన కొన్ని గుర్తులైతే ఉన్నాయి కదా. 8 కి కూడా గుర్తులున్నాయి. 108 కి కూడా గుర్తులున్నాయి. ఇది పూర్తిగా రైట్. త్రేతా అంతిమంలో 16108 రాకుమార-రాకుమారీలు ఉంటారు. ప్రారంభంలో అంతమంది ఉండరు. ముందు కొద్దిమంది ఉంటారు, ఆ తర్వాత సంఖ్య వృద్ధి చెందుతూ ఉంటుంది. వారంతా ఇక్కడే తయారవుతారు. ఈ అవకాశం చాలా మంచిది కానీ ఇందులో చాలా శ్రమ ఉంది. మరణిస్తాను కానీ ఎప్పుడూ వదలను… అని పాటలో కూడా అంటారు. బాబా, ఈ తనువు-మనస్సు-ధనము, అంతా మీదే, మేము అశరీరులుగా అయి మిమ్మల్ని స్మృతి చేస్తాము, బుద్ధియోగాన్ని మీతో జోడిస్తాము అని అంటారు. అప్పుడు, ఇదంతా మీ కోసమే అని బాబా అంటారు. మా వద్ద ఉన్నదంతా మీదే అని పిల్లలు అంటారు. అంతా భగవంతుడే ఇచ్చారని అంటారు కదా! ఇదంతా సమాప్తమవ్వనున్నదని ఇప్పుడు తండ్రి అంటారు. మీ వద్ద ఏముంది? ఈ శరీరం కూడా సమాప్తమైపోతుంది. ఇప్పుడు, నేను వాటిని ఎక్స్ చేంజ్ చేసి మీకు ఇస్తాను. కేవలం ఎక్స్ చేంజ్ చేస్తారు కదా. కావున, తండ్రి అంటారు – పిల్లలూ, అశరీరులుగా అవ్వండి, నన్ను స్మృతి చేయండి, బుద్ధితో అంతా సరెండర్ చేయండి. రాజా హరిశ్చంద్రుని కథ ఉంది కదా. తాకట్టు పెట్టమని అన్నారు కదా.

బాబా అంటారు – నేను ఈ శాస్త్రాలు మొదలైనవాటి సారాన్ని మీకు అర్థం చేయిస్తాను. నేనే మిమ్మల్ని బ్రహ్మా నోటి ద్వారా రాజా-రాణులుగా తయారుచేసాను, ఇప్పుడు మళ్ళీ తయారుచేస్తాను. మనుష్యులు, మనుష్యులకు ఎప్పుడూ గీతను వినిపించి, రాజయోగాన్ని నేర్పించి, రాజా-రాణులుగా తయారుచేయలేరు. అటువంటప్పుడు, గీత వినడం వల్ల లాభమేముంది? తండ్రి అంటారు – నేను స్వయంగా కల్ప-కల్పము వచ్చి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. నా వారిగా అయితేనే వారసులుగా అవుతారు కదా. కావున, ఎంతగా యోగంలో ఉంటారో, అంతగా శుద్ధంగా అవుతూ ఉంటారు. బాబా, ఇదంతా మీదే. మేము ట్రస్టీలము. మీ ఆజ్ఞ లేకుండా మేము ఏమీ చేయము అని అంటారు. శరీర నిర్వహణ ఎలా చేసుకోవాలనే మతాన్ని కూడా తీసుకుంటారు. చాలా వరకు పేదవారే పూర్తి లెక్కాపత్రాన్ని ఇస్తారు. షావుకారులు ఇవ్వలేరు, సరెండర్ అవ్వలేరు, వారిలో ఎవరో అరుదుగా వెలువడుతారు. జనకుని పేరు ఉంది కదా. పిల్లాపాపలున్నారు, జాయింట్ ప్రాపర్టీ ఉంది, మరి దాన్ని ఎలా వేరు చేస్తారు. షావుకారులు సరెండర్ అవ్వాలంటే, తమ ఆస్తిని విడిగా ఎలా తీయాలి? తండ్రి పేదల పెన్నిధి. అందరికన్నా పేదవారు మాతలు, వారికన్నా పేదవారు కన్యలు. కన్యలకు ఎప్పుడూ వారసత్వం యొక్క నషా ఉండదు. కొడుకులకు తండ్రి ఆస్తి యొక్క నషా ఉంటుంది. కావున, వాటన్నింటినీ వదిలి వైకుంఠ వారసత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దానం అనేది సదా పేదవారికే ఇవ్వడం జరుగుతుంది. భారత్ అన్నింటికన్నా పేదది, అమెరికా చాలా షావుకారు. వారికి వారసత్వాన్ని ఇస్తారా? భారత్ అన్నింటికన్నా షావుకారుగా ఉండేది, అప్పుడు వేరే ధర్మమేదీ ఉండేది కాదు. కేవలం భారతవాసులే ఉండేవారు, ఒకే భాష ఉండేది. భగవంతుడు ఒక్కరే. నేను ఒకే రాజ్యాన్ని, ఒకే ధర్మాన్ని, ఒకే భాషను స్థాపన చేస్తాను. ఒకే సర్వశక్తివంతమైన గవర్నమెంటును స్థాపన చేస్తాను. ఒకటి నుండి తర్వాత రెండు, మూడు అవుతాయి. ఇప్పుడు ఎన్ని ధర్మాలున్నాయి, తర్వాత తప్పకుండా ఒకే ధర్మం రావాల్సి ఉంటుంది. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయం. అప్పుడు ఒకే ధర్మముండేది. విద్వాంసులు సత్యయుగ ఆయువును లక్షల సంవత్సరాలని రాసారు. సత్యయుగం అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోరు. ఎవరైనా మరణించినప్పుడు వారు స్వర్గవాసులయ్యారు అనగా పైకి వెళ్ళి ఉండవచ్చని భావిస్తారు. దిల్వాడా మందిరంలో కూడా స్వర్గాన్ని పైకప్పులో చూపించారు. కావున మనుష్యులు తికమకపడతారు. వాస్తవానికి స్వర్గమనేది పైన ఏమీ లేదు. బాబా వద్దకు వెళ్ళి, మళ్ళీ ఇక్కడికే వచ్చి రాజ్యం చేస్తామని ఇప్పుడు మీకు తెలుసు. ఎవరికైనా అర్థం చేయించగలిగేలా ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి. కచ్చాగా (అపరిపక్వంగా) ఉండేవారిని మాయ పిచ్చుక తినేస్తుంది, అందుకే ఫోటోలు కూడా తెప్పించడం జరుగుతుంది. రిజిస్టరు పెట్టడం జరుగుతుంది.

బాబా వద్దకు సమాచారం వస్తూ ఉంటుంది – ఫలానావారు ఒకే ఒక జ్ఞాన బాణాన్ని వేసారు, దానితో నేను బాబాకు చెందినవాడిగా అయిపోయాను అని. శాస్త్రాలలో కూడా – కుమారీల ద్వారా బాణం వేయించారని రాయబడి ఉంది. అరే, తండ్రిని ఎందుకు మర్చిపోయారు? దీనిని జ్ఞాన బాణం అని అంటారు. కేవలం తండ్రి స్మృతిని ఇప్పించాలి. అంతేకానీ, హింసాత్మకమైన బాణాల విషయమేమీ కాదు. బాబా అంటారు – నేను బ్రహ్మా ముఖం ద్వారా అన్ని శాస్త్రాల రహస్యాన్ని మీకు అర్థం చేయిస్తాను. బ్రహ్మా తప్పకుండా ఇక్కడే ఉండాలి. వారు విష్ణువు నాభి కమలం నుండి బ్రహ్మాను చూపించారు. వారికి ఏమీ తెలియదు. మనుష్యులకు ఏది తోస్తే అది రాసేసారు. చాలా అశుద్ధి ఉంది. మంత్ర­-తంత్రాల వారు కూడా చాలామంది అయిపోయారు. సత్యం వెలువడినప్పుడు అసత్యమైనవారు దానిని ఎదిరిస్తారు. శివబాబా నిరాకారుడు మరియు ఈ బ్రహ్మా సాకారుడు, అంతేకానీ, నాభి మొదలైనవాటి విషయమేమీ లేదు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడు జ్ఞానయుక్త ఆత్మలుగా అవ్వాలి, కేవలం జ్ఞానాన్ని వింటూ, వినిపించేవారిగా కాదు. స్మృతి చేసే శ్రమను కూడా చేయాలి. అశరీరులుగా అయి, అశరీరి తండ్రిని స్మృతి చేయాలి.

2. తండ్రికి చెందినవారిగా అయి వేరే విషయాలన్నింటి నుండి మమకారాన్ని తొలగించాలి. ఈ దేహం కూడా నాది కాదు. పూర్తి దేహీ-అభిమానులుగా అయి పూర్తిగా సరెండర్ అవ్వాలి.

వరదానము:-

ఎలాంటి పతిత వాతావరణాన్ని అయినా పరివర్తన చేసేందుకు మరియు పాత సంస్కారాల రూపీ క్రిములను భస్మం చేసేందుకు, నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను అనే స్మృతి ఉండాలి. సూర్యుని కర్తవ్యము – ప్రకాశాన్ని ఇవ్వడం మరియు చెత్తను సమాప్తం చేయడం. కావున జ్ఞాన-యోగాల శక్తి మరియు శ్రేష్ఠ నడవడిక ద్వారా ఈ కర్తవ్యం చేస్తూ ఉండండి. ఒకవేళ శక్తి తక్కువగా ఉన్నట్లయితే, జ్ఞానమనేది కేవలం ప్రకాశాన్ని మాత్రమే ఇస్తుంది, అంతేకానీ పాత సంస్కారాల రూపీ క్రిములు సమాప్తమవ్వవు, అందుకే ముందు యోగ తపస్సు ద్వారా శక్తివంతంగా అవ్వండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

0 Comment

No Comment.

Scroll to Top