02 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

May 1, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మనన శక్తి మరియు మగ్న స్థితి”

♫ వినండి ఆడియో (audio)➤

ఈ రోజు డబల్ కిరీటధారులుగా, డబల్ రాజ్యాధికారులుగా తయారుచేసే తండ్రి విశేషంగా తమ డబల్ విదేశీ పిల్లలతో మిలనం జరుపుకునేందుకు వచ్చారు. నలువైపుల ఉన్న స్నేహీ, సహయోగులైన డబల్ విదేశీయులు, సదా సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలతో స్నేహం మరియు సేవ, రెండింటిలోనూ ముందుకు వెళ్తూ ఉన్నట్లుగా బాప్ దాదా చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మనసులో, మేము బాప్ దాదా యొక్క ప్రత్యక్షతా జెండాను ఎగురవేయాలనే ఉత్సాహముంది. ప్రతి రోజు ఉత్సాహమున్న కారణంగా సంగమయుగాన్ని ఉత్సవం వలె అనుభవం చేస్తూ, ఎగురుతూ వెళ్తున్నారు, ఎందుకంటే ఎక్కడైతే ప్రతి సమయం ఉత్సాహముంటుందో, అది బాప్ దాదాతో స్మృతి ద్వారా మిలనం జరుపుకునే ఉత్సాహమైనా, లేదా సేవ ద్వారా ప్రత్యక్ష ఫలం ప్రాప్తించిందనే అనుభవం యొక్క ఉత్సాహమైనా – ఈ రెండు ఉత్సాహాలు ప్రతి క్షణం, ప్రతి రోజు ఉత్సవాన్ని అనుభవం చేయిస్తాయి. ప్రపంచంలోని వారు విశేషంగా ఉత్సవం రోజున ఉత్సాహాన్ని అనుభవం చేస్తారు, కానీ బ్రాహ్మణాత్మల కోసం సంగమయుగమే ఉత్సాహాల యుగము. ప్రతి రోజు కొత్త ఉత్సాహము, ఉల్లాస-ఉత్సాహాలు స్వతహాగానే అనుభవమవుతూ ఉంటాయి, అందుకే సంగమయుగంలోని ప్రతి రోజు సంతోషమనే ఔషధాన్ని తింటూ, తండ్రి ద్వారా లభించిన అనేక ప్రాప్తుల గుణాలను పాడుకుంటూ, డబల్ లైట్ గా అయి సదా ఉత్సాహంలో నాట్యం చేస్తూ ఉంటారు. ఉత్సవంలో ఏమి చేస్తారు? తింటారు, పాడుతారు మరియు నాట్యం చేస్తారు. విదేశాలలో ఇప్పుడు విశేషంగా క్రిస్మస్ జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తినడం, పాడడం, సంగీతం మ్రొగించడం మరియు నాట్యం చేయడం, ఇవే చేస్తారు కదా, మరియు మిలనం జరుపుకుంటారు. మీరు ప్రతి రోజు ఏమి చేస్తారు? అమృతవేళ నుండి మొదలుకొని రాత్రి వరకు ఇవే పనులు చేస్తారు కదా. సేవ కూడా చేస్తారు, సేవ అనగా జ్ఞాన డాన్స్ చేస్తారు. బాప్ దాదా గుణాల పాటను ఆత్మలకు వినిపిస్తారు. కావున రోజూ ఉత్సవాన్ని జరుపుకుంటారు కదా. సత్యమైన బ్రాహ్మణులు ఈ కార్యము చేయని రోజు ఒక్కటి కూడా ఉండదు. సంగమయుగములోని ప్రతి రోజు ఉత్సాహభరితమైన ఉత్సవం రోజు. వారైతే ఒకటి-రెండు రోజులు జరుపుకుంటారు కానీ బాప్ దాదా బ్రాహ్మణ పిల్లలందరినీ ఏ విధంగా శ్రేష్ఠంగా చేస్తారంటే, ఎలాంటి గోల్డెన్ గిఫ్ట్ ను ఇస్తారంటే, దానితో మీరు సదా కోసం సంపన్నులుగా, సదా నిండుగా అవుతారు. వారు క్రిస్మస్ ఫాదర్ వచ్చి ఈ రోజు గిఫ్ట్ ఇస్తారని క్రిస్మస్ రోజు కోసం ఎదురుచూస్తారు. వారు క్రిస్మస్ ఫాదర్ ను గుర్తు చేసుకుంటారు మరియు మీరు కిస్మిస్ వలె మధురంగా తయారుచేసే తండ్రిని స్మృతి చేస్తారు. మీకు ఎన్ని గిఫ్టులు లభిస్తాయంటే, ఈ గిఫ్టులు 21 జన్మల వరకు ఉంటాయి! ఆ వినాశీ గిఫ్ట్ అయితే కొంత సమయం ఉంటుంది, తర్వాత సమాప్తమైపోతుంది, కానీ ఈ అవినాశీ గిఫ్ట్ అనేక జన్మలు మీతో పాటు ఉంటుంది. ఎలాగైతే వారు క్రిస్మస్ ట్రీ ని అలంకరిస్తారో, అలా ఇక్కడ బాప్ దాదా ఈ అనంతమైన ప్రపంచమనే వృక్షంలో మెరుస్తున్న నక్షత్రాలైన మీకు, సంగమయుగ శ్రేష్ఠ ధరణి యొక్క నక్షత్రాలైన మీకు అవినాశీ లైట్-మైట్ స్వరూపంలో స్థితులయ్యే అనుభవాన్ని చేయిస్తారు. వారు కూడా నక్షత్రాలను నమ్ముతారు, నక్షత్రాలను అలంకరిస్తారు. నక్షత్రాలైన మీకు స్మృతి చిహ్నంగా, మెరుస్తున్న లైట్లను స్థూల రూపంలో చూపిస్తారు, లేదా లైట్లతో అలంకరిస్తారు, లేదా పుష్పాలతో అలంకరిస్తారు, ఇది ఎవరి స్మృతి చిహ్నము? ఆత్మిక సుగంధభరిత పుష్పాలైన బ్రాహ్మణాత్మల స్మృతి చిహ్నము. ఈ ఉత్సవాలన్నీ సంగమయుగ బ్రాహ్మణులైన మీ యొక్క ఉత్సాహభరితమైన ఉత్సవాలకు స్మృతి చిహ్నము. సంగమయుగంలో కల్పవృక్షం యొక్క మెరిసే నక్షత్రాలు, ఆత్మిక గులాబీలు, బ్రాహ్మణాత్మలైన మీరే. మీ స్మృతి చిహ్నమును మీరే స్వయంగా చూస్తున్నారు. అవినాశీ తండ్రి ద్వారా అవినాశీ రత్నాలుగా తయారవుతారు కావుననే అంతిమ జన్మ వరకు మీ స్మృతి చిహ్నమును చూస్తున్నారు. డబల్ రూపం యొక్క స్మృతి చిహ్నమును చూస్తున్నారు. సంగమయుగ రూపం యొక్క స్మృతి చిహ్నమును రకరకాల రూపాలలో, పద్ధతులలో చూపిస్తారు మరియు రెండవది – భవిష్య దేవ పదవి యొక్క స్మృతిచిహ్నమును చూస్తున్నారు. కేవలం మీ రూపం యొక్క స్మృతిచిహ్నమును చూడడం మాత్రమే కాదు, శ్రేష్ఠ ఆత్మలైన మీ శ్రేష్ఠ కర్మల స్మృతి చిహ్నము కూడా ఉంది. తండ్రి మరియు పిల్లల చరిత్రకు సంబంధించిన స్మృతిచిహ్నము కూడా ఉంది. కావున మీ స్మృతిచిహ్నాన్ని చూసి, మేము ప్రతి కల్పము ఇటువంటి విశేషమైన ఆత్మలుగా అవుతామని సహజంగా గుర్తుకొస్తుంది కదా. మీరే అలా అయ్యారు, అవుతున్నారు మరియు ఇక ముందు కూడా మీరే అలా అవుతూ ఉంటారు.

ఇలా సదా స్మృతిలో ఉండే పిల్లలను, ఎవరి స్మృతి చిహ్నమైతే ఇప్పుడు ఉందో, అలాంటి పిల్లలను చూసి బాప్ దాదా హర్షిస్తున్నారు. ఇది స్మృతిలో ఉండేవారి స్మృతి చిహ్నము. స్మృతి మహత్వము యొక్క స్మృతి చిహ్నాన్ని చూస్తున్నారు. కావున డబల్ విదేశీ పిల్లలకు తమ స్మృతి చిహ్నాన్ని చూసి సంతోషం కలుగుతుంది కదా. బాప్ దాదాకు డబల్ విదేశీ పిల్లలను చూసి డబల్ సంతోషం కలుగుతుంది, ఎందుకు? ఒకటేమో – మూల మూలలలో ఉన్న కల్పక్రితం విడిపోయిన, తప్పిపోయిన పిల్లలు మళ్ళీ కలిసారు. తప్పిపోయిన వస్తువు ఒకవేళ మళ్ళీ లభిస్తే సంతోషం కలుగుతుంది కదా. తండ్రి అయితే పిల్లలందరినీ చూసి సంతోషిస్తారు, వారు భారతవాసులైనా లేక విదేశీయులైనా సరే. రెండవ విషయము – డబల్ విదేశీ పిల్లలకు సంబంధించినది, వారు రకరకాల ధర్మాలు, రకరకాల ఆచార-వ్యవహారాల తెర లోపల దాగి ఉన్నా సరే, ఈ తెరను సహజంగా సమాప్తం చేసి తండ్రికి చెందినవారిగా అయ్యారు. ఈ తెరను తొలగించిన విశేషత ఉంది. తెర లోపల నుండి కూడా తండ్రిని తెలుసుకునే విశేషత డబల్ విదేశీయులకు ఉంది. కావున డబల్ సంతోషం ఉంది కదా. డబల్ విదేశీ పిల్లల నిశ్చయము మరియు నషా అలౌకికమైనది. ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న డబల్ విదేశీ పిల్లలకు, విశేషంగా సదా ఉత్సాహంలో ఉండే, ప్రతి రోజు ఉత్సవాన్ని జరుపుకునే, ప్రతి రోజు వరదాత తండ్రి ద్వారా విశేష వరదానాలను మరియు విశేష ఆశీర్వాదాలను తీసుకునే డైమండ్ గిఫ్టును విశాల హృదయంతో ఈ పెద్ద రోజున ఇస్తున్నారు – సదా ఉత్సవభరితమైన జీవన భవ, సదా సహజంగా ఎగిరే కళ యొక్క అనుభవీ శ్రేష్ఠ జీవన భవ. అచ్ఛా!

ఈ రోజు బాప్ దాదా వతనంలో మూడు రకాల పిల్లలను చూస్తున్నారు. ఏ మూడు రకాల వారిని చూసారు? 1. వర్ణన చేసేవారు 2. మననం చేసేవారు 3. అనుభవంలో మగ్నమై ఉండేవారు. ఈ మూడు రకాల వారిని దేశ-విదేశాలలో ఉన్న పిల్లలందరిలోనూ చూసారు. వర్ణన చేసే బ్రాహ్మణులను అనేకమందిని చూసారు, మననం చేసేవారి సంఖ్య మధ్యస్థంగా ఉండడాన్ని చూసారు, అనుభవంలో మగ్నమై ఉండేవారి సంఖ్య అంతకన్నా తక్కువగా ఉండడాన్ని చూసారు. వర్ణన చేయడం అతి సహజము, ఎందుకంటే ఇది 63 జన్మల సంస్కారము. ఒకటి – వినడము, రెండవది – విన్నదానిని వర్ణన చేయడము – ఇవి చేస్తూ వచ్చారు. భక్తి మార్గం అంటేనే వినడము లేదా కీర్తన ద్వారా, ప్రార్థన ద్వారా వర్ణించడము. వీటితో పాటు దేహాభిమానములోకి వచ్చిన కారణంగా వ్యర్థం మాట్లాడడమనేది పక్కా సంస్కారముగా ఉంది. ఎక్కడైతే వ్యర్థ మాటలుంటాయో, అక్కడ విస్తారం స్వతహాగానే ఉంటుంది. స్వచింతన అంతర్ముఖులుగా చేస్తుంది, పరచింతన వర్ణన చేసే విస్తారంలోకి తీసుకొస్తుంది. కావున అనేక జన్మలుగా వర్ణన చేసే సంస్కారం ఉన్న కారణంగా, బ్రాహ్మణ జీవితంలో అజ్ఞానం నుండి జ్ఞానంలో వచ్చినప్పుడు కూడా, జ్ఞానాన్ని వర్ణన చేయడంలో త్వరగా తెలివైనవారిగా అవుతారు. వర్ణన చేసేవారు వర్ణన చేసేంతవరకు సంతోషాన్ని మరియు శక్తిని అనుభవం చేస్తారు కానీ సదా కోసం కాదు. నోటి ద్వారా జ్ఞాన-దాతను వర్ణన చేసిన కారణంగా శక్తి మరియు సంతోషము – ఇవి జ్ఞానానికి ప్రత్యక్ష ఫలంగా ప్రాప్తిస్తాయి కానీ శక్తిశాలి స్వరూపులుగా, సదా సంతోషపు స్వరూపులుగా అవ్వలేరు. కానీ ఎంతైనా ఇవి జ్ఞాన రత్నాలు మరియు డైరెక్ట్ భగవానువాచ కనుక యథా శక్తి ప్రాప్తి స్వరూపులుగా అవుతారు.

మననం చేసేవారు సదా విన్నదానిని మననం చేసి స్వయం కూడా ప్రతి జ్ఞాన పాయింటు యొక్క స్వరూపులుగా అవుతారు. మనన శక్తి కలవారు గుణ స్వరూపులుగా, శక్తి స్వరూపులుగా, జ్ఞాన స్వరూపులుగా మరియు స్మృతి స్వరూపులుగా స్వతహాగానే అవుతారు ఎందుకంటే మననం చేయడం అనగా బుద్ధి ద్వారా జ్ఞాన భోజనాన్ని జీర్ణించుకోవడము. ఎలాగైతే స్థూల భోజనము జీర్ణమవ్వకపోతే శక్తిగా తయారవ్వదో, కేవలం నోటి రుచి వరకు మాత్రమే ఉండిపోతుందో, అలా వర్ణన చేసేవారికి కూడా జ్ఞానము కేవలం నోటి ద్వారా వర్ణించేంత వరకే ఉండిపోతుంది. కానీ మనన శక్తి కలవారు మనన శక్తితో బుద్ధి ద్వారా ధారణ చేసి శక్తిశాలిగా అవుతారు. మనన శక్తి కలవారు అన్ని విషయాలలోనూ శక్తిశాలి ఆత్మలుగా అవుతారు. మననం చేసేవారు సదా స్వచింతనలో బిజీగా ఉన్న కారణంగా మాయ కలిగించే అనేక విఘ్నాల నుండి సహజంగా ముక్తులుగా అవుతారు ఎందుకంటే బుద్ధి బిజీగా ఉంది. కనుక మాయ కూడా వారు బిజీగా ఉండడం చూసి పక్కకు వెళ్ళిపోతుంది. రెండవ విషయము – మననం చేయడంతో శక్తిశాలిగా అయిన కారణంగా స్వస్థితి అనేది ఎలాంటి పరిస్థితిలోనూ ఓడిపోనివ్వదు. కనుక మనన శక్తి కలవారు అంతర్ముఖులుగా ఉండడం వలన సదా సుఖంగా ఉంటారు. సమయమనుసారంగా శక్తులను కార్యంలో వినియోగించే శక్తి ఉన్న కారణంగా, ఎక్కడైతే శక్తి ఉంటుందో, అక్కడ మాయ నుండి ముక్తి ఉంటుంది. కావున ఇలాంటి పిల్లలు విజయీ ఆత్మల లిస్టులోకి వస్తారు.

మూడవ రకం పిల్లలు – సదా అన్ని అనుభవాలలోనూ మగ్నమై ఉండేవారు. మననం చేయడమనేది రెండవ స్టేజ్ కానీ మననం చేస్తూ మగ్నమై ఉండడము – ఇది ఫస్ట్ స్టేజ్. మగ్నమై ఉండేవారు స్వతహాగానే నిర్విఘ్నులుగా ఉంటారు, కానీ అంతకంటే ఉన్నతమైన విఘ్నవినాశక స్థితి ఉంటుంది అనగా స్వయం నిర్విఘ్నులుగా ఉంటూ ఇతరుల పట్ల కూడా విఘ్నవినాశకులుగా అయి సహయోగులుగా అవుతారు. ‘అనుభవము’ అన్నింటికంటే గొప్ప అథారిటీ. అనుభవం యొక్క అథారిటీతో బాబా సమానమైన మాస్టర్ ఆల్మైటీ అథారిటీ స్థితిని అనుభవం చేస్తారు. మగ్న అవస్థ కలవారు తమ అనుభవాల ఆధారంగా ఇతరులను నిర్విఘ్నులుగా చేయడంలో ఉదాహరణగా అవుతారు ఎందుకంటే బలహీన ఆత్మలు వారి అనుభవాలను చూసి – స్వయం మేము కూడా ఇలా అవ్వగలమనే ధైర్యం చేస్తారు, ఉత్సాహంలోకి వస్తారు. మగ్నమై ఉండే ఆత్మలు బాబా సమానంగా ఉన్న కారణంగా స్వతహాగానే అనంతమైన వైరాగ్య వృత్తి కలవారిగా, అనంతమైన సేవాధారులుగా మరియు అనంతమైన ప్రాప్తుల నషాలో ఉండేవారిగా సహజంగా అవుతారు. మగ్నమై ఉండే ఆత్మలు సదా కర్మాతీతంగా ఉంటారు అనగా కర్మ బంధనాల నుండి అతీతంగా, సదా తండ్రికి ప్రియంగా ఉంటారు.

మగ్నమై ఉండే ఆత్మలు సదా తృప్త ఆత్మలుగా, సంతుష్ట ఆత్మలుగా, సంపన్న ఆత్మలుగా, సంపూర్ణతకు అతి సమీపంగా ఉన్న ఆత్మలుగా ఉంటారు. సదా అనుభవాల అథారిటీగా ఉన్న కారణంగా శ్రేష్ఠమైన సహజ యోగీ, స్వతహా యోగి జీవితాన్ని, అతీతమైన మరియు ప్రియమైన జీవితాన్ని అనుభవం చేస్తారు. వారి నోటి ద్వారా అనుభవంతో కూడిన మాటలు వెలువడిన కారణంగా అవి మనసులో ఇమిడిపోతాయి, మరియు వర్ణన చేసేవారి మాటలు బుద్ధి వరకే కూర్చొంటాయి. కనుక మొదటి స్టేజ్ ఏదో అర్థమయిందా? మననం చేసేవారు కూడా విజయులే కానీ ‘సహజము మరియు సదా’ లో వ్యత్యాసముంటుంది. మగ్నమై ఉండేవారు సదా తండ్రి స్మృతిలో ఇమిడి ఉంటారు. కనుక అనుభవాలను పెంచుకోండి కానీ ముందు వర్ణన నుండి మననంలోకి రండి. మనన శక్తి, మగ్న స్థితిని సహజంగా ప్రాప్తి చేయిస్తుంది. మననం చేస్తూ-చేస్తూ అనుభవం స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది. మననం చేసే అభ్యాసము చాలా అవసరము. అందుకే మనన శక్తిని పెంచుకోండి. వినడము మరియు వినిపించడము చాలా సులభము. మనన శక్తి కలవారు, మగ్నమై ఉండేవారు సదా పూజ్యులుగా ఉంటారు, వర్ణన చేసేవారు కేవలం గాయన యోగ్యులుగా ఉంటారు. కనుక సదా స్వయాన్ని గాయన యోగ్యులుగా, పూజన యోగ్యులుగా చేసుకోండి. అర్థమయిందా?

మూడు రకాల వారు సేవాధారులే కానీ సేవ యొక్క ప్రభావం నంబరువారుగా ఉంది. నంబరువారులోకి రాకూడదు, నంబరు వన్ గా అవ్వాలి. అచ్ఛా!

సదా స్వయాన్ని డబల్ రాజ్య అధికారులుగా, డబల్ కిరీటధారులుగా, శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేసేవారు, సదా మనన శక్తి ద్వారా మగ్న స్థితిని అనుభవం చేసేవారు, సదా బాబా సమానమైన అనుభవజ్ఞులు, మాస్టర్ ఆల్మైటీ అథారిటీ స్థితి యొక్క అనుభవీ మూర్తులుగా అయ్యేవారు, సదా తమ శక్తిశాలి పూజ్య స్థితిని ప్రాప్తి చేసుకునేవారు – ఇలాంటి నంబరువన్, సదా విజయీ పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

విదేశీ సోదరీ-సోదరుల గ్రూపుతో

విదేశములో ఉంటూ స్వదేశము మరియు స్వ స్వరూప స్మృతిలో సదా ఉంటున్నారా? ఎలాగైతే తండ్రి పరంధామము నుండి ఈ పాత పరాయి దేశంలోకి ప్రవేశించి వస్తారో, అలా పరంధామ నివాసి శ్రేష్ఠ ఆత్మలు, సహజయోగి ఆత్మలైన మీరందరూ కూడా – పరంధామ నివాసి ఆత్మలమైన మేము ఈ సాకార శరీరంలోకి ప్రవేశించి విశ్వ కార్యార్థము నిమిత్తంగా ఉన్నామని అనుభవం చేస్తున్నారా? మీరు కూడా అవతరించిన బ్రాహ్మణాత్మలు. శూద్ర జీవితము సమాప్తమైంది, ఇప్పుడు మీరు శుద్ధమైన బ్రాహ్మణాత్మలు. బ్రాహ్మణులు ఎప్పుడూ అపవిత్రంగా అవ్వరు. బ్రాహ్మణులు అనగా పవిత్రులు. కనుక బ్రాహ్మణులా లేక మిక్స్ గా ఉన్నారా? రెండు నావలలోనూ కాళ్ళు పెట్టేవారు కాదు. ఒకే నావలో రెండు కాళ్ళను పెట్టేవారు. కనుక బ్రాహ్మణాత్మలు అవతరించిన ఆత్మలు. మామూలుగా కూడా ఏ ఆత్మలైతే అవతారాలుగా వచ్చారో, అవతారాల రూపంలో ప్రసిద్ధమయ్యారో, ఆ ఆత్మలు ఎందుకు వస్తారు? శ్రేష్ఠమైన పరివర్తన చేసేందుకు వస్తారు. కనుక అవతారాలైన మీ పని ఏమిటి? విశ్వాన్ని పరివర్తన చేయడము, రాత్రిని పగలుగా చేయడము, నరకాన్ని స్వర్గంగా చేయడము. ఇంత పెద్ద కార్యం చేయడానికి అవతరించారు అనగా బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ పని గుర్తు ఉంటుంది కదా? లౌకిక సర్వీసు కూడా ఎందుకు చేస్తారు? సంపాదించేది కూడా దేని కొరకు? సెంటరు తెరిచేందుకు సంపాదిస్తారా లేక లౌకిక పరివారం కోసం సంపాదిస్తారా? ఒకవేళ సంపాదన కూడా ఈశ్వరీయ కార్యంలో వినియోగించేందుకే సంపాదిస్తున్నాము అనే లక్ష్యం ఉంటే, లౌకిక కార్యం చేస్తున్నా కానీ సేవయే గుర్తుంటుంది కదా? మరియు ఎవరి డైరెక్షన్ తో చేస్తున్నారు? తండ్రి శ్రీమతమనుసారంగా చేస్తున్నట్లయితే, ఎవరి శ్రీమతమో వారే గుర్తుకొస్తారు కదా. అందుకే బాప్ దాదా చెప్తున్నారు – లౌకిక కార్యాన్ని చేస్తూ కూడా సదా స్వయాన్ని ట్రస్టీగా భావించండి. మీరు ట్రస్టీలు మరియు వారసులు కూడా. ఎక్కడ ఉంటున్నా కానీ, మనసుతో సమర్పణ అయితే వారసులే. వారసులు అనగా మధువనంలో వచ్చి ఉండడమని కాదు, కానీ సేవా క్షేత్రంలో ఉన్నప్పుడు కూడా ఒకవేళ మనసులో మేరాపన్ (నేను, నాది) అనేది లేకుంటే అనగా సమర్పితులైనట్లయితే, వారసులుగా అయినట్లే. కనుక సమర్పణ అయ్యారా లేక ఇప్పుడింకా కర్మ బంధనాల ఆధీనంలో ఉన్నారా? మనసుతో సమర్పణ అయినట్లయితే సమర్పిత ఆత్మను బంధనము బంధించలేదు ఎందుకంటే సమర్పణ అయ్యారు అంటే బంధనాలన్నింటినీ కూడా సమర్పణ చేసినట్లు. ఒకవేళ ఏదైనా బంధనము మనసును లాగుతుందంటే బంధనముందని అర్థం చేసుకోండి. ఇకపోతే వచ్చి, వెళ్ళిపోతూ ఉంటే అది బంధనము కాదు. కనుక మేము అవతారాలము, పై నుండి వచ్చాము – ఇది సదా స్మృతిలో ఉంచుకోండి. అవతరిత ఆత్మలు ఎప్పుడూ శరీర లెక్కాచారాల బంధనములోకి రారు, విదేహీగా అయి కార్యం చేస్తారు. శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు కానీ శరీర బంధనములో బంధించబడరు. మరి ఇలా అయ్యారా? కావున సదా స్వయాన్ని శరీరము యొక్క బంధనం నుండి అతీతంగా చేసుకునేందుకు అవతారముగా భావించండి. ఈ విధి ద్వారా నడుస్తూ ఉన్నట్లయితే సదా బంధనముక్తులుగా, అతీతులుగా మరియు సదా తండ్రికి ప్రియులుగా అవుతారు.

వరదానము:-

ఏ పిల్లలైతే సదా తండ్రి పట్ల, స్వయం యొక్క పాత్ర పట్ల మరియు డ్రామాలోని ప్రతి సెకండు యొక్క పాత్ర పట్ల వంద శాతం నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారో, వారి విజయము మరియు సఫలత నిశ్చితము. విజయము నిశ్చితమైన కారణంగా వారు సదా నిశ్చింతగా ఉంటారు. వారి ముఖముపై చింత యొక్క ఎలాంటి రేఖలు కనిపించవు. వారికి సదా – ఈ కార్యము లేక ఈ సంకల్పము సిద్ధించే ఉంది అనే నిశ్చయము ఉంటుంది. వారికి ఎప్పుడూ ఏ విషయంలోనూ ప్రశ్నలు తలెత్తవు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

0 Comment

No Comment.

Scroll to Top