03 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

May 2, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఆత్మాభిమాని భవ, నడుస్తూ-తిరుగుతూ, లేస్తూ-కూర్చొంటూ ఈ అభ్యాసమునే చేస్తూ ఉన్నట్లయితే మీ ఉన్నతి ఎంతగానో జరుగుతూ ఉంటుంది”

ప్రశ్న: -

తండ్రి యొక్క యథార్థ స్మృతి ఏ పిల్లల బుద్ధిలో ఉంటుంది?

జవాబు:-

ఏ పిల్లలైతే తండ్రిని యథార్థంగా తెలుసుకున్నారో, వారి బుద్ధిలో ఉంటుంది. బిందువును ఎలా స్మృతి చేయాలని చాలా మంది పిల్లలు అడుగుతారు. భక్తిలోనైతే అఖండ జ్యోతిగా భావించి స్మృతి చేస్తూ వచ్చారు, ఇప్పుడు బిందువు అని అనేటప్పటికి తికమకపడతారు. కావుననే, మొట్టమొదటగా తండ్రి అఖండ జ్యోతి కాదు, వారు అతి సూక్ష్మ బిందువు అని నిశ్చయమున్నట్లయితే యథార్థ స్మృతి ఉండగలదు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. పిల్లలందరూ స్మృతిలో కూర్చొన్నారు. మన్మనాభవ. వాస్తవానికి ఇది సంస్కృత పదం కాదు. తండ్రి సహజ రాజయోగాన్ని నేర్పించినప్పుడు, ఈ సంస్కృత పదాన్ని చెప్పలేదు. అసలు వీరికి (బ్రహ్మా) సంస్కృతము తెలియదు. తండ్రి అయితే హిందీలోనే అర్థం చేయిస్తారు. ఈ రథము హిందీ, సింధీ మరియు ఇంగ్లీషు తెలిసినవారు కానీ తండ్రి హిందీలోనే అర్థం చేయిస్తారు. ఎవరు ఏ ధర్మానికి చెందినవారో, వారికి వారి భాష ఉంటుంది. ఇక్కడ హిందీ భాషనే నడుస్తుంది, ఈ భాషను అర్థం చేసుకోవడం సహజము మరియు ఈ పాఠశాల కూడా అద్భుతమైనది. ఇందులో పేపరు, పెన్సిల్, పేజీలు మొదలైనవాటి అవసరం ఉండదు. ఇక్కడ కేవలం ఒక్క పదాన్ని స్మృతి చేయాలి అనగా తండ్రిని స్మృతి చేయాలి. గాడ్ ను లేదా ఈశ్వరుడిని లేదా పరమపిత పరమాత్మను ఎవరూ స్మృతి చేయకుండా ఉండడమనేది కష్టము, అందరూ స్మృతి చేస్తారు కానీ వారి పరిచయం లేదు. తండ్రియే వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. శాస్త్రాలలో ఇంత ఎక్కువగా రాసేసిన కల్పం యొక్క ఆయువు గురించి తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఇది చాలా పెద్ద విషయమేమీ కాదు. అహల్యలు, వృద్ధ మాతలు ఏమి అర్థం చేసుకుంటారు. ఇది చాలా సహజము. చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. బాబా అన్న పదము కొత్తదేమీ కాదు. శివుని మందిరానికి వెళ్ళినప్పుడు వీరు శివబాబా అని, వీరు నిరాకారుడని బుద్ధిలోకి వస్తుంది. మనుష్యమాత్రులందరూ బాబా అని అంటారు. ఆత్మలైన మనందరికీ తండ్రి ఒక్కరే. శరీరంలో నివసించే జీవాత్మలన్నీ తండ్రిని స్మృతి చేస్తాయి. అన్ని ధర్మాల వారెవరైతే ఉన్నారో, అందరూ పరమపిత పరమాత్మను తప్పకుండా స్మృతి చేస్తారు. వారు పరంధామములో నివసించే తండ్రి. మనం కూడా అక్కడ నివసించేవారము. కావున ఇప్పుడు కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మేము పావనంగా అవ్వాలని కూడా కోరుకుంటారు. హే పతితులను పావనంగా చేసేవారు రండి, అని కూడా పిలుస్తారు. కొత్త ప్రపంచం పావనంగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ పాతదిగా అయ్యింది, దీనిని ఎవరూ కొత్తదని అనరు. కొత్త భారత్ లో దేవీ దేవతలు రాజ్యం చేసేవారని భారతవాసులకు తెలుసు. కొత్త భారత్ ఉండేది అన్నప్పుడు, దాని కన్నా ముందు ఏముండేది? సంగమము. ఇంతకన్నా సహజంగా చెప్పాలి. కొత్తదాని కన్నా ముందు పాతది ఉండేది. సంగమమును మనుష్యులు అంత సహజంగా అర్థం చేసుకోలేరు. న్యూ వరల్డ్, ఓల్డ్ వరల్డ్, వీటి మధ్యన ఉన్నదానిని సంగమము అని అంటారు. హే పతితపావనా రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి, మేము పతితులుగా అయిపోయాము అని తండ్రినే పిలుస్తారు. కొత్త ప్రపంచంలో ఎవరూ పిలవరు. ఈ భారత్ పావనంగా ఉండేదని ఇప్పుడు మీకు అర్థమయ్యింది. హే పతితపావనా రండి అని చాలా సమయం నుండి పిలుస్తూ వచ్చారు. ఈ పతిత ప్రపంచం ఎప్పుడు సమాప్తమవుతుంది అనేది వారికి తెలియదు. కలియుగము (పతిత ప్రపంచము) ఇంకా 40 వేల సంవత్సరాలు కొనసాగుతుందని శాస్త్రాలలో రాసి ఉన్నట్లు చెప్తారు. పూర్తిగా ఘోరమైన అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. తండ్రి మిమ్మల్ని ఇప్పుడు ప్రకాశంలోకి తీసుకువచ్చారు. ఈ సృష్టి చక్రం 5 వేల సంవత్సరాలలో పూర్తవుతుంది. ఇది నిన్నటి విషయము. మీరు రాజ్యము చేసేవారు, ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది, స్వర్గముండేది. పావన ప్రపంచంలో ఉపద్రవాలు మొదలైనవేవీ జరగజాలవు. రావణ రాజ్యంలోనే ఉపద్రవాలు జరుగుతాయి. ఇక్కడ మీకు తండ్రి అర్థం చేయిస్తారు, మీరు చెవుల ద్వారా సమ్ముఖంగా వింటారు. ఎవరు వింటారు? ఆత్మ. తండ్రి మళ్ళీ వచ్చి మమ్మల్ని కలుసుకున్నారని ఆత్మకు చాలా సంతోషం కలుగుతుంది. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారు, ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. ఇందులో రాసే-చదివే విషయమేమీ లేదు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు, మీరు ఎందుకు వచ్చారు అని అడగడం జరుగుతుంది, అప్పుడు వారు ఇక్కడ ఉండే మహాత్మను కలుసుకునేందుకు వచ్చామని అంటారు. ఎందుకు, మీకు ఏమి కావాలి, ఏమైనా భిక్ష కావాలా చెప్పండి అని అడగండి. సన్యాసులకైతే రొట్టె ముక్క కావాలి. సన్యాసులు ఎవరి వద్దకైనా వెళ్ళినప్పుడు లేదా వారు దారిలో కలిసినప్పుడు, వీరు పవిత్రమైన వ్యక్తులు, వీరికి భోజనం పెట్టడం మంచిదని ధార్మిక వ్యక్తులు భావిస్తారు. ఇప్పుడైతే పవిత్రత కూడా లేదు. ఇది పూర్తి తమోప్రధానమైన ప్రపంచము, ఇందులో చాలా మురికి ఉంది. మనుష్యులు ఎంతగా కలత చెందుతారు! ఇక్కడ కలత చెందే విషయమేమీ లేదు. ఏమీ రాయాల్సిన పని కూడా లేదని తండ్రి అంటారు. ఈ పాయింట్లు మొదలైనవి కూడా ధారణ చేసేందుకు రాస్తారు. ఉదాహరణకు డాక్టర్ల దగ్గర కూడా ఎన్ని మందులు ఉంటాయి, వారికి ఆ మందులన్నీ గుర్తుంటాయి. బ్యారిస్టర్ల బుద్ధిలో లా కు సంబంధించిన విషయాలు ఎన్ని గుర్తుంటాయి. మీరు ఏమి గుర్తు చేయాలి, ఒకే విషయమును గుర్తు చేయాలి, అది కూడా చాలా సహజమైనది. ఒక్క శివబాబాను గుర్తు చేయమని మీరు చెప్తారు. శివబాబా ఎలా వస్తారని వారు అడుగుతారు. ఇది కూడా మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఈశ్వరుడు ఎక్కడ ఉంటారు అని అడిగితే, వారు నామ రూపాలకు అతీతమైనవారు అని అంటారు లేదా వారు సర్వవ్యాపి అని అనేస్తారు. ఈ రెండింటికీ రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. నామ-రూపాలకు అతీతమైన వస్తువేదీ లేదు. ఇంకొకవైపు కుక్క, పిల్లి అన్నింటిలోనూ పరమాత్మ ఉన్నారని అనేస్తారు. రెండూ ఆపోజిట్ (వ్యతిరేక) విషయాలు అయినట్లు. కావున తండ్రి తమ పరిచయాన్ని ఇస్తూ, తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. సహజ రాజయోగము అని గాయనం కూడా చేస్తారు. యోగము అనే పదాన్ని తొలగించండి, కేవలం స్మృతి చేయండి అని బాబా అంటారు. ఉదాహరణకు చిన్న పిల్లలు తల్లిదండ్రులను చూసిన వెంటనే హత్తుకుంటారు. అంతేకానీ, వీరు నా తల్లిదండ్రులేనా అని ఆలోచిస్తారా? లేదు, ఇందులో ఆలోచించే విషయమే లేదు. మీరు కూడా కేవలం శివబాబాను స్మృతి చేయాలి. భక్తి మార్గంలో కూడా మీరు శివునికి పుష్పాలను అర్పిస్తూ వచ్చారు. సోమనాథుని మందిరం ఎంత వైభవంగా నిర్మించబడింది, దానిని తర్వాత మహమ్మద్ గజిని వచ్చి దోచుకున్నారు. సోమనాథ మందిరం భారత్ లో ప్రసిద్ధమైనది. అందరికన్నా ముందు శివుని పూజ జరగాలి. పిల్లలకు ఈ జ్ఞానమంతా ఇప్పుడు బుద్ధిలోకి వచ్చింది. పూజ మొదలైనవి చేస్తూ వచ్చారు కానీ ఇది జడ చిత్రమని, తప్పకుండా వారు చైతన్యంలో ఎప్పుడో వచ్చి ఉంటారు కావుననే ప్రతి సంవత్సరము శివజయంతిని కూడా జరుపుకుంటామని మీకు తెలియదు. శివ పరమాత్మ నిరాకారుడని కూడా అంటారు. నేను కూడా నిరాకారి – అని ఆత్మకు తెలుసు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతారు, ఇది చాలా సహజము. వారు మన బాబా. వారు జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, పతితపావనుడు. వారికి చాలా మహిమ ఉంది. బ్రహ్మా-విష్ణు-శంకరులకు అంత మహిమ లేదు. ఒక్కరి మహిమనే పాడుతారు. బాబా వచ్చి మనకు వారసత్వాన్ని ఇస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. లౌకిక తండ్రి పిల్లల ఆలన-పాలన చేస్తారు కానీ చదివించరు. చదువుకునేందుకు స్కూలుకు వెళ్తారు, తర్వాత వానప్రస్థంలో గురువులను ఆశ్రయిస్తారు. ఈ రోజుల్లోనైతే చిన్న-పెద్ద, అందరూ గురువులను ఆశ్రయించేలా చేస్తారు. ఇక్కడ పిల్లలైన మీకు శివబాబాను స్మృతి చేయండి అని చెప్పడం జరుగుతుంది. అందరికీ హక్కు ఉంది. అందరూ నా పిల్లలే. మీలో కూడా కొందరు చాలా బాగా స్మృతి చేస్తారు. చాలా మంది ఇలా అడుగుతారు – బాబా, ఎవరిని స్మృతి చేయాలి, బిందువును ఎలా స్మృతి చేయాలి అని. పెద్ద వస్తువును స్మృతి చేయడం జరుగుతుంది. అచ్ఛా, పరమాత్మ అని ఎవరినైతే మీరు స్మృతి చేస్తారో, వారెవరు? వారు అఖండ జ్యోతి స్వరూపమని చెప్తారు. కానీ అలా కాదు. అఖండ జ్యోతిని స్మృతి చేయడం రాంగ్ అవుతుంది. స్మృతి యథార్థంగా ఉండాలి. ముందు యథార్థంగా తెలుసుకోవాలి. తండ్రియే వచ్చి వారి పరిచయాన్ని ఇస్తారు మరియు పిల్లలకు సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల సమాచారాన్ని కూడా వినిపిస్తారు. విస్తారంగానూ మరియు సంక్షిప్తంగా కూడా వినిపిస్తారు. ఇప్పుడు బాబా అంటారు – పిల్లలూ, మీరు పావనంగా అవ్వాలంటే ఒకే ఉపాయము ఉంది, నన్ను స్మృతి చేయండి, నన్నే పతితపావనా అని అంటారు. ఆత్మను పావనంగా తయారుచేయాలి. నేను పతితంగా అయిపోయానని ఆత్మనే అంటుంది. ఒకప్పుడు నేను పావనంగా ఉన్నాను, ఇప్పుడు పతితంగా అయ్యాను. అందరూ తమోప్రధానంగా ఉన్నారు. ప్రతి వస్తువు ముందు సతోప్రధానంగా ఉంటుంది, తర్వాత తమోప్రధానంగా అవుతుంది. నేను పతితంగా అయ్యాను, నన్ను పావనంగా చేయండి అని ఆత్మనే స్వయంగా అంటుంది. శాంతిధామములో పతితులు ఉండరు. ఇక్కడ పతితులు ఉన్నారు కావున దుఃఖమయంగా ఉన్నారు. పావనంగా ఉన్నప్పుడు సుఖమయంగా ఉండేవారు. కావున, నన్ను పావనంగా చేసినట్లయితే నేను దుఃఖం నుండి విముక్తి చెందుతానని ఆత్మనే అంటుంది. ఆత్మనే అన్నీ చేస్తుందని మీరు భావిస్తారు. ఆత్మనే జడ్జి, బ్యారిస్టర్ మొదలైనవారిగా అవుతుంది. నేను రాజును, నేను ఫలానా అని ఆత్మనే అంటుంది. ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకోవాలి. దీనినే ఆత్మాభిమానిగా ఉండడము, దేహము ఉంటూ ఆత్మాభిమానిగా ఉండడము అని అంటారు. రావణ రాజ్యంలో దేహాభిమానులుగా ఉంటారు. ఇప్పుడే తండ్రి ఆత్మాభిమానులుగా తయారుచేస్తారు. ఈ సమయంలో ఆత్మ పతితంగా, దుఃఖమయంగా ఉంది కావున, హే బాబా రండి, అని పిలుస్తుంది. డ్రామా ప్లాన్ అనుసారంగా పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా అవుతూ వచ్చామని కూడా మీకు తెలుసు. ఇలా చక్రం తిరుగుతూనే ఉంటుంది. మనం 84 జన్మలను ఎలా తీసుకున్నామనేది ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చొంది. ఇప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకండి. స్వదర్శన చక్రధారులుగా ఉండండి. మనకు లేస్తూ-కూర్చొంటూ, నడుస్తూ-తిరుగుతూ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. అనంతమైన తండ్రి నుండి మనం అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీరు అర్థం చేసుకున్నారు. మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయాలి, రొట్టె ముక్క తినాలి. అంతే.

మధురాతి-మధురమైన, చాలా కాలం వేరై తర్వాత కలిసిన పిల్లలకు పదే-పదే తండ్రి తెలియజేస్తారు – పిల్లలూ, పొట్ట కోసం కేవలం రొట్టె ముక్కను తినాలి. పొట్ట ఎక్కువగా ఏమీ తినదు. ఒక పావు పిండి అంత తింటుంది. పప్పు, రొట్టె అంతే, 10 రూపాయలలో కూడా మనిషి కడుపు నిండుతుంది, అలాగే 10 వేల రూపాయలతో కూడా కడుపు నింపుకుంటారు. అసలు పేదవారు ఏమి తింటారు? అయినా సరే వారు దృఢంగా ఉంటారు. మనుష్యులు రకరకాల పదార్థాలను తింటే ఇంకా ఎక్కువ అనారోగ్యం పాలు అవుతారు. ఒకే రకమైన భోజనాన్ని తీసుకున్నట్లైతే, అనారోగ్యం పాలు అవ్వరని డాక్టర్లు కూడా అంటారు. కావున తండ్రి కూడా అర్థం చేయిస్తారు – రొట్టె ముక్క తినండి, ఏమి దొరికితే, అందులో సంతోషంగా ఉండండి. పప్పు-రొట్టె లాంటి పదార్థమే ఇంకొకటి ఉండదు. ఎక్కువ లోభం కూడా ఉండకూడదు. సన్యాసులు ఏమి చేస్తారు? ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవుల్లోకి వెళ్ళిపోతారు. తత్వాన్ని పరమాత్మగా భావిస్తూ స్మృతి చేస్తారు, మేము బ్రహ్మములో లీనమైపోతామని భావిస్తారు. కానీ అలా జరగదు. ఆత్మ అమరమైనది. లీనమయ్యే విషయమే లేదు. ఇకపోతే, ఆత్మ పవిత్రంగా, అపవిత్రంగా అవుతుంది. మీకు ఎంత మంచి జ్ఞానం లభించింది. మీరే ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు, అప్పుడిక ఈ జ్ఞానాన్ని మర్చిపోతారు. తర్వాత మెట్లు దిగవలసి ఉంటుంది. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం కూర్చొని ఉంది. మనం 84 జన్మలను ఎలా అనుభవిస్తాము. ఈ పాత్ర ఎప్పుడూ, ఎవరిదీ ఆగిపోదు. ఇది తయారై, తయారవుతున్న డ్రామా, ఇది తిరుగుతూనే ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు, ఎలా, ఎక్కడ కూర్చొని ఈ డ్రామాను తయారుచేసారు అనేది చెప్పలేము. ఇది కొనసాగుతూనే వస్తుంది. ప్రపంచ చరిత్ర-భూగోళము రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ విషయాలను అసలు ఎవరూ అర్థం చేసుకోరు. మనం డ్రామా ప్లాన్ అనుసారంగా వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ డ్రామానుసారంగా రాజ్యం తీసుకుంటున్నాము. ఈ విషయాలను ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. డ్రామా సర్వశక్తివంతమైనదా లేదా ఈశ్వరుడు సర్వశక్తివంతుడా అని అడగడం జరుగుతుంది. అప్పుడు, ఈశ్వరుడు సర్వశక్తివంతుడు అని అంటారు. ఈశ్వరుడు అన్నీ చేయగలరని భావిస్తారు. నేను కూడా డ్రామా బంధనంలో బంధించబడి ఉన్నానని తండ్రి అంటారు. పతితులను పావనంగా చేసేందుకు నేను రావలసి ఉంటుంది. మీరు సత్యయుగంలో సుఖమయంగా అవుతారు. నేను కూడా పరంధామానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. మీరు నా తలపైకి ఎక్కి కూర్చొంటారు. మీరు సింహంపై సవారి చేస్తారు (బంగారు యుగములోకి వెళ్తారు).

క్షణ-క్షణం ఏదైతే నడుస్తుందో, అది డ్రామాలో నిశ్చితమని మీకు తెలుసు. పిల్లలైన మీకు ఎంత మంచి జ్ఞానముంది. ఇప్పుడు కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, అంతే. పేపరు, పెన్సిల్ మొదలైనవాటి అవసరమేమీ లేదు. బ్రహ్మాబాబా కూడా చదువుకుంటారు, వీరైతే ఏమీ ఉంచుకోరు. కేవలం తండ్రిని స్మృతి చేస్తే వారసత్వం లభిస్తుంది. ఇది ఎంత సహజము. స్మృతితో మీరు ఎవర్ హెల్దీ (సదా ఆరోగ్యవంతులు) గా తయారవుతారు. ఇది ధారణ చేసే విషయము. రాయడం వలన ఏమి లాభముంటుంది, ఇదంతా వినాశనమైపోతుంది. కానీ కొందరు జ్ఞాపకము ఉంచుకునేందుకు వ్రాస్తారు. ఇలా ఏ విషయాన్ని అయినా గుర్తుంచుకోవాలనుకుంటే కొంతమంది ముడి వేసుకుంటారు కదా. అలా మీరు కూడా శివబాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలని ముడి వేసుకోండి. ఇది చాలా సులభము. యోగము అనగా స్మృతి. బాబా, స్మృతి నిలవడం లేదు, యోగములో ఎలా కూర్చోవాలి అని అడుగుతారు. అరే! లౌకిక తండ్రి స్మృతి లేస్తూ-కూర్చొంటూ, నడుస్తూ-తిరుగుతూ ఉంటుంది. మీరు కూడా కేవలం స్మృతి చేయండి చాలు. నావ తీరానికి చేరుతుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడు మనం వనవాహములో ఉన్నాము కావున చాలా-చాలా సాధారణంగా ఉండాలి. ఏ రకమైన దేహాభిమానం లేక వస్త్రాలు మొదలైనవాటి పట్ల అభిమానం ఉండకూడదు. ఏ కర్మ చేస్తున్నా సరే తండ్రి స్మృతి యొక్క నషా ఎక్కి ఉండాలి.

2. మేము అనంతమైన త్యాగులము మరియు రాజఋషులము అనే నషాలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. జ్ఞాన ధనంతో నిండుగా అయి దానం చేయాలి. సత్యాతి-సత్యమైన వ్యాపారులుగా అయి తమ లెక్కాపత్రాన్ని పెట్టుకోవాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే బుద్ధి రూపీ పాదము ద్వారా మర్యాదల రేఖను దాటి వెళ్ళరో – వారు లక్కీగా మరియు లవ్లీగా అవుతారు. వారికి ఎప్పుడూ ఏ విఘ్నము గాని, తుఫాను గాని, ఆందోళన గాని, ఉదాసీనత గాని రాదు. ఒకవేళ వచ్చిందంటే, తప్పకుండా వారి బుద్ధి రూపీ పాదము మర్యాదల రేఖ దాటిందని అర్థము. రేఖను దాటి బయటకు రావడం అనగా ఫకీరుగా అవ్వడము. అందుకే, ఎప్పుడూ ఫకీరుగా అనగా యాచించేవారిగా అవ్వద్దు, సర్వ ప్రాప్తి సంపన్న శక్తిశాలిగా అవ్వండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

0 Comment

No Comment.

Scroll to Top