03 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

September 2, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - తండ్రి స్మృతిలో ఉండేందుకు పరస్పరంలో ఒకరికొకరు సూచనలు ఇచ్చుకుంటూ, సావధానపర్చుకుంటూ ఉన్నతిని పొందుతూ ఉండండి”

ప్రశ్న: -

తండ్రి సమానంగా నాలెడ్జ్ ఫుల్ గా అయ్యే పిల్లల జీవితంలోని ముఖ్య ధారణలను వినిపించండి?

జవాబు:-

వారు సదా చిరునవ్వుతో ఉంటారు, వారికి ఎప్పుడూ ఏ విషయంలోనూ ఏడుపు రాదు. ఏం జరిగినా, కొత్తేమీ కాదు అని భావిస్తారు. అలా, ఎవరైతే ఇప్పుడు నాలెడ్జ్ ఫుల్ గా అనగా ఏడుపు-ప్రూఫ్ గా అవుతారో, ఎప్పుడూ ఏ విషయంలోనూ అశాంతి చెందరో, వారికే స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది. ఎవరైతే ఏడుస్తారో, వారు పోగొట్టుకుంటారు, ఏడ్చేవారు తమ పదవిని పోగొట్టుకుంటారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మిమ్మల్ని పొంది మేము సర్వమును పొందాము….. (తుమ్హే పాకే హమ్ నే…..)

ఓంశాంతి. మధురాతి-మధురమైన పిల్లలు స్వయం తాము పాడిన పాటనే విన్నారు. మనం అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చున్నామని పిల్లలకు తెలుసు. కావున పిల్లలంటారు – బాబా, ఒకప్పుడు మీ నుండి పొందిన విశ్వ రాజ్యాధికారాన్ని ఇప్పుడు మళ్ళీ పొందుతున్నాము. సత్యయుగంలో ఈ విధంగా పాడరు. ఈ సంగమయుగంలోనే మీరు ఇలా పాడగలరు. ఇంట్లో కూర్చుని ఉన్నా లేక ఉద్యోగం చేస్తున్నా, మనము అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని మళ్ళీ తీసుకుంటున్నామని మీకు తెలుసు. తండ్రిని స్మృతి చేయండి అని మరియు మనం విశ్వానికి యజమానులుగా అవుతున్నాము అన్నదానిని గుర్తుంచుకోండి అని సెంటర్లలో కూడా సావధానపరుస్తారు. ఇది కొత్త విషయమేమీ కాదు. మనం కల్ప-కల్పము తండ్రి నుండి విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటాము. కొత్తవారు ఎవరైనా వింటే, ఈ బ్రహ్మాను శివబాబా అని పిలుస్తున్నారని అనుకుంటారు. ఇప్పుడు వారైతే నిరాకార ఆత్మల తండ్రి. ఆత్మ నిరాకారి, అలానే పరమాత్మ తండ్రి కూడా నిరాకారి. సాకార రూపం తీసుకోనంతవరకు ఆత్మను నిరాకారి అని అంటారు. మనం అనంతమైన తండ్రి నుండి ఈ నాలెడ్జ్ వింటున్నామని పిల్లలు తెలుసుకున్నారు. మీరు పరస్పరంలో ఒకరినొకరు సావధానపర్చుకునేందుకు, ఆత్మిక టీచరు చదివిస్తున్నారు. ముందు ఈ ఆత్మిక అటెన్షన్ లభిస్తుంది. అందరూ అనంతమైన తండ్రి స్మృతిలోనే ఉంటారు మరియు సూచననిస్తారు – తండ్రి స్మృతిలో ఉండండి మరియు బుద్ధి ఇంకెక్కడికి వెళ్ళకూడదు అని. అందుకే, ఆత్మాభిమాని భవ మరియు తండ్రిని స్మృతి చేయండి అని అంటారు. వారు పతిత పావనుడైన తండ్రి. ఇప్పుడు వారు సమ్ముఖంగా కూర్చొని, నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. ఇది ఎంత సులభమైన యుక్తి. మన్మనాభవ అనే పదం కూడా ఉంది కానీ దానిని ఎవరైనా అర్థం చేసుకోవాలి కదా! స్మృతి యాత్రను నేర్పించేవారు ఒక్క తండ్రి మాత్రమే. మనం ఆత్మిక యాత్రలో ఉన్నామని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. అది దైహిక యాత్ర. ఇప్పుడు మనం దైహిక యాత్రికులము కాదు. మనం ఆత్మిక యాత్రికులము. ఈ స్మృతితోనే వికర్మలు వినాశనమవుతాయి, మీరు వికర్మాజీతులుగా అయిపోతారు. మీరు వికర్మాజీతులుగా అవ్వడానికి ఇంకే ఉపాయము లేదు. ఒకటి వికర్మాజీత శకము, రెండవది విక్రమ శకము, అప్పుడిక వికర్మలు మొదలవుతాయి. రావణ రాజ్యం మొదలవ్వగానే వికారాలు మొదలయ్యాయి. ఇప్పుడు మీరు వికర్మాజీతులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. అక్కడ వికర్మలేవీ జరగవు. అక్కడ రావణుడే ఉండడు. ఈ విషయం ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. మీరు తండ్రి ద్వారా అంతా తెలుసుకున్నారు. తండ్రినే నాలెడ్జ్ ఫుల్ అని అంటారు కావున పిల్లలకే నాలెడ్జ్ ఇస్తారు కదా. గాడ్ ఫాదర్ కు పేరు కూడా కావాలి. వారు నామ రూపాలకు అతీతమైనవారేమీ కాదు. వారిని పూజిస్తారు, వారి పేరు శివ. వారే పతితపావనుడు, జ్ఞానసాగరుడు. ఆత్మ ఆ పరమపిత పరమాత్మ తండ్రిని స్మృతి చేస్తుంది. ఆత్మ తండ్రిని మహిమ చేస్తుంది. వారు సుఖ-శాంతుల సాగరుడు. తండ్రి, పిల్లలకు తప్పకుండా వారసత్వాన్నే ఇస్తారు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్తారో, వారి స్మృతిచిహ్నాలను తయారుచేస్తారు. ఒక్క శివబాబాకు మాత్రమే గాయనం కూడా జరుగుతుంది మరియు పూజలు కూడా జరుగుతాయి. వారు తప్పకుండా శరీరం ద్వారా కర్తవ్యాన్ని చేస్తారు, అందుకే వారికి గాయనముంటుంది. వారు సదా పవిత్రమైనవారు. తండ్రి ఎప్పుడూ పూజారిగా అవ్వరు, వారు సదా పూజ్యులు. తండ్రి అంటారు – నేను ఎప్పుడూ పూజారిగా అవ్వను. నేను పూజించబడతాను. పూజారులు నన్ను పూజిస్తారు. సత్యయుగంలో నాకు పూజ చేయరు. భక్తి మార్గంలో పతితపావన తండ్రినైన నన్ను స్మృతి చేస్తారు. మొట్టమొదట అవ్యభిచారీ భక్తి అనేది ఆ ఒక్కరికి మాత్రమే జరుగుతుంది, తర్వాత వ్యభిచారీ భక్తిగా అయిపోతుంది. బ్రహ్మా-సరస్వతులను కూడా ఆ శివబాబా విశ్వానికి యజమానులుగా చేస్తారు. భక్తికి ఎంత విస్తారముంది. బీజానికి విస్తారమేమీ ఉండదు.

తండ్రి అంటారు – నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, అంతే. ఎలాగైతే వృక్షానికి విస్తారముంటుందో, అలా భక్తికి కూడా చాలా విస్తారముంటుంది. జ్ఞానం బీజం వంటిది. మీకు జ్ఞానం లభించినప్పుడు సద్గతిని పొందుతారు. మీరు తల బాదుకోవాల్సిన అవసరమేమీ లేదు. జ్ఞానం మరియు భక్తి ఉన్నాయి కదా. సత్య-త్రేతా యుగాలలో భక్తి యొక్క వృక్షం ఉండదు. తర్వాత అర్ధకల్పం ఈ భక్తి యొక్క వృక్షం కొనసాగుతుంది. అన్ని ధర్మాల వారికి తమ-తమ ఆచార-పద్ధతులు ఉన్నాయి. భక్తి ఎంత పెద్దది. జ్ఞానమైతే అందరికీ ఒక్కటే – మన్మనాభవ, అంతే. అల్ఫ్ ను (భగవంతుడు), ఆ తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వారసత్వం తప్పకుండా గుర్తుకొస్తుంది. వారసత్వానికి విస్తారముంటుంది కదా. అది హద్దు ఆస్తి. ఇక్కడ మీకు అనంతమైన ఆస్తి గుర్తుకొస్తుంది. అనంతమైన తండ్రి వచ్చి భారతవాసులకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. వారి జన్మ కూడా ఇక్కడే జరుగుతుందని అంటూ ఉంటారు. ఇది ఈ డ్రామాలో అనాదిగా నిశ్చయించబడి ఉంది. ఎలాగైతే భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైనవారో, అలా భారత ఖండం కూడా ఉన్నతాతి ఉన్నతమైనది. ఇక్కడికి తండ్రి వచ్చి మొత్తం ప్రపంచమంతటికీ సద్గతినిస్తారు. కావున ఇది అన్నింటికంటే గొప్ప తీర్థం అయినట్లు కదా. ఓ గాడ్ ఫాదర్, మమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటారు. భారత్ పట్ల అందరికీ ప్రేమ ఉంది. తండ్రి కూడా భారత్ లోనే వస్తారు. ఇప్పుడు మీరు కృషి చేస్తున్నారు. మీరే గోపీ-వల్లభుని గోప గోపికలు. సత్యయుగంలో గోప-గోపికల మాటే ఉండదు. అక్కడ నియమానుసారంగా రాజ్యం నడుస్తుంది. చరిత్ర అనేది కృష్ణునికి ఏమీ లేదు, చరిత్ర ఒక్క తండ్రికి మాత్రమే ఉంది. వీరి చరిత్ర ఎంత గొప్పది. మొత్తం పతిత సృష్టిని పావనంగా చేస్తారు. ఇది ఎంతటి చతురత. ఈ సమయంలో మనుష్యమాత్రులందరూ అజామిళుడు వంటి పాపులుగా ఉన్నారు. ఈ సాధువులు మొదలైనవారు శ్రేష్ఠాచారులని మనుష్యులు భావిస్తారు. వీరి ఉద్ధరణ కూడా నేనే చేయాలి అని తండ్రి అంటారు. మీరు ఎలాగైతే పాత్రధారులో, అలా తండ్రి కూడా పాత్రధారే కదా. మీరు 84 జన్మలు తీసుకుని పాత్రను అభినయిస్తారు. వారు కూడా క్రియేటర్, డైరెక్టర్, ముఖ్య యాక్టర్, చేసేవారు-చేయించేవారు కదా. ఏం చేస్తారు? పతితులను పావనంగా చేస్తారు. తండ్రి అంటారు – మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని మీరు నన్ను పిలుస్తారు. నేను కూడా ఈ పాత్రలో బంధించబడి ఉన్నాను. ఈ డ్రామా ఎందుకు తయారయ్యింది లేక ఎప్పుడు తయారయ్యింది అని ఎవరూ అడగలేరు. ఇది అనాదిగా తయారై తయారవుతున్న డ్రామా. దీనికి ఆదిమధ్యాంతాలు లేవు. ప్రళయమేమీ జరగదు. ఆత్మ అవినాశీ, ఎప్పుడూ వినాశనం అవ్వదు. ఆత్మకు పాత్ర కూడా అవినాశీ అయినది లభించింది. ఇది అనంతమైన డ్రామా కదా. ఈ డ్రామా పాత్ర ఎలా నడుస్తుంది అనేది తండ్రి కూర్చుని సారంలో అర్థం చేయిస్తారు. అంతేకానీ పరమాత్మ ఉన్నారు అంటే, వారు మరణించినవారిని బ్రతికించగలరని కాదు. ఈ అంధశ్రద్ధ విషయాలు, రిద్ధి-సిద్ధుల విషయాలు ఇక్కడ లేవు. ఓ పతితపావనా రండి, వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయండి అని నన్ను పిలుస్తారు. కావున తప్పకుండా వస్తారు. గీత సర్వశాస్త్రమయీ శిరోమణి. భగవంతుడే గీతను వినిపించారు. అచ్ఛా, సహజ రాజయోగాన్ని ఎప్పుడు నేర్పించారు, ఇది కూడా మీకు తెలుసు. తండ్రి కల్పం యొక్క సంగమయుగంలోనే వస్తారు. వారు వచ్చి పావన ప్రపంచాన్ని, కొత్త రాజధానిని స్థాపన చేస్తారు. సత్యయుగంలోనైతే స్థాపన చేయరు కదా! అక్కడ ఎలాగూ పావన ప్రపంచమే ఉంటుంది. కల్పం యొక్క సంగమయుగంలోనే కుంభ మేళా జరుగుతుంది. ఆ కుంభ మేళా 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ పెద్ద కుంభ మేళా 5 వేల సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది ఆత్మలు మరియు పరమాత్మల మేళా. ఇప్పుడు పరమపిత పరమాత్మ వచ్చి ఆత్మలందరినీ పావనంగా చేసి తీసుకువెళ్తారు. కల్పం ఆయువును ఎక్కువగా చేయడం వలన మనుష్యులు తికమకపడిపోయారు. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీ మ్యాగజీన్స్ ఏవైతే వెలువడుతాయో, వాటిని కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు. ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి అన్నారు, ఇలా వ్రాయండి – ఏదైతే గతించిందో, అది 5 వేల సంవత్సరాల క్రితం వలె జరిగింది, కొత్తేమీ కాదు, 5 వేల సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో, అదే ఇప్పుడు రిపీట్ అవుతుంది, ఎవరైనా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే వచ్చి తెలుసుకోండి అని. ఇటువంటి యుక్తులను రచించాలి. మనము వార్తాపత్రికలలో ఏమని ముద్రించాలి? మీరు ఇది కూడా వ్రాయవచ్చు – ఈ మహాభారత యుద్ధం పావన ప్రపంచం యొక్క గేట్లను ఎలా తెరుస్తుంది, సత్యయుగ స్థాపన కల్పక్రితం వలె ఎలా జరుగుతుంది, దేవీ-దేవతల రాజధాని ఎలా స్థాపన అవుతుంది, వచ్చి తెలుసుకోండి. గాడ్ ఫాదర్ నుండి బర్త్ రైట్ (జన్మ సిద్ధ అధికారం) తీసుకోవాలంటే వచ్చి తీసుకోండి. ఈ విధంగా విచార సాగర మథనం చేయాలి. మనుష్యలు కథలు మొదలైనవి తయారుచేస్తారు, అది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. వారు ఆ విధమైన పాత్రను అభినయిస్తారు. వ్యాసుడు కూడా డ్రామా ప్లాను అనుసారంగా శాస్త్రాలు మొదలైనవి తయారుచేసారు. అతనికి పాత్రే అటువంటిది లభించింది. ఇప్పుడు మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు. మళ్ళీ ఇదే డ్రామా రిపీట్ అవుతుంది. ఇప్పుడు మీరు వచ్చారు, మళ్ళీ జ్ఞానాన్ని వింటున్నారు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం మళ్ళీ ఉంటుందని మీకు తెలుసు. మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. ఇప్పుడు మీరు నాలెడ్జ్ ఫుల్ గా అవుతున్నారు. బాబా మిమ్మల్ని తమ సమానంగా నాలెడ్జ్ ఫుల్ గా తయారుచేస్తారు. అర్ధకల్పం మనం పీస్ ఫుల్ గా (శాంతిగా) ఉంటామని మీకు తెలుసు. ఏ విధమైన అశాంతి ఉండదు. అక్కడ పిల్లలు మొదలైనవారు ఎప్పుడూ ఏడవరు. సదా చిరునవ్వుతో ఉంటారు. ఇక్కడ కూడా మీరు ఏడవకూడదు. అమ్మ మరణించినా హల్వా తినండి….. అని అంటూ ఉంటారు. ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. పదవి కూడా భ్రష్టమైపోతుంది. మీకు స్వర్గ రాజ్యాధికారాన్నిచ్చే పతులకే పతి లభించారు. వారెప్పుడూ మరణించరు. ఇక ఏడవాల్సిన అవసరం ఏముంది. ఎవరైతే ఏడుపు-ప్రూఫ్ గా ఉంటారో, వారే రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. మిగిలినవారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఈ పరిస్థితిలో మేము ఏమవుతామని ఒకవేళ బాబాను ఎవరైనా అడిగితే, బాబా చెప్తారు. పిల్లలకు చివర్లో అంతా సాక్షాత్కారం అవుతుంది. ఎలాగైతే స్కూల్లో అందరికీ రిజల్ట్ తెలిసిపోతుంది కదా. అలాగే రుద్ర మాలలో ఎవరెవరు ఉంటారు అనేది చివర్లో మీకు తెలిసిపోతుంది. విద్యార్థులు చివరి రోజుల్లో చాలా పురుషార్థం చేస్తారు. మేము ఫలానా సబ్జెక్టులో ఫెయిల్ అవుతామని అర్థం చేసుకుంటారు. అలా, మీకు కూడా తెలిసిపోతుంది. మాకు పిల్లల పట్ల మోహముందని చాలా మంది అంటారు. దానిని తొలగించుకోవాల్సిందే. మోహం ఒక్కరి పట్లనే ఉంచుకోవాలి. ఇకపోతే, ట్రస్టీగా ఉంటూ సంభాళించాలి. ఇదంతా తండ్రి ఇచ్చారని అంటారు కదా కావున ట్రస్టీగా ఉంటూ నడుచుకోండి. మమకారాన్ని తొలగించుకోండి. అందరి పట్ల మమకారాన్ని తొలగించండి అని స్వయంగా తండ్రి వచ్చి చెప్తున్నారు. ఇదంతా వారిదేనని భావించండి, వారి మతమునే అనుసరించండి. వారి కార్యంలోనే నిమగ్నమవ్వండి. అవినాశీ జ్ఞాన రత్నాలను దానం చేస్తూ ఉండండి. ఇక్కడ తండ్రికి కన్యల పట్ల అందరికంటే ఎక్కువ గౌరవముంది. కన్య కర్మ బంధనాల నుండి ఫ్రీ గా ఉంటారు. కొడుకులకైతే లౌకిక తండ్రి ఇచ్చే వారసత్వం యొక్క నషా ఉంటుంది. కన్యలు లౌకిక తండ్రి యొక్క వారసత్వాన్ని పొందరు. ఇక్కడ ఈ తండ్రి వద్ద స్త్రీ-పురుషుల బేధం లేదు. తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు. మనమంతా సోదరులమని, తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఆత్మ చదువుకుంటుంది, తండ్రి నుండి వారసత్వం తీసుకుంటుంది. ఎంత ఎక్కువ వారసత్వం తీసుకుంటారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. బాబా వచ్చి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. శివబాబా నిరాకారుడు, వారిని పూజిస్తారు కూడా. సోమనాథ మందిరాన్ని నిర్మించారు. శివబాబా వచ్చి ఏం చేసారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. వారి స్మృతిచిహ్నంగా మందిరాన్ని ఎందుకు నిర్మించారు అనేది కూడా మీరు అర్థం చేసుకుంటారు. కల్ప-కల్పము ఇలాగే జరుగుతుంది. డ్రామాలో నిశ్చయించబడి ఉంది, అది రిపీట్ అవుతుంది. తండ్రి రావాల్సిందే. పాత ప్రపంచ వినాశనం జరగనున్నది. ఇందులో దుఃఖం యొక్క విషయమేమీ లేదు. ఇది అనవసర రక్తసిక్తమైన ఆట. అనవసరంగా అందరూ హతమార్చబడతారు. లేదంటే ఎవరైనా ఎవరినైనా హత్య చేస్తే, వారికి ఉరి శిక్ష ఉంటుంది. మరి ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి. ఈ ప్రకృతి వైపరీత్యాలు రావాల్సిందే. వినాశనం జరగాల్సిందే. అమరలోకము, మృత్యులోకముల అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ రోజు మనం మృత్యులోకంలో ఉన్నామని, రేపు మనం అమరలోకంలో ఉంటామని, అందుకే మనం చదువుకుంటున్నామని మీకు తెలుసు. మనుష్యులైతే ఘోర అంధకారంలో ఉన్నారు. మీరు జ్ఞానామృతాన్ని తాగిస్తారు. సరే, సరే అని అంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు. అనంతమైన తండ్రి వారసత్వాన్ని ఇస్తున్నారని వింటారు కూడా. ఇది అదే మహాభారత యుద్ధం, దీనితో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. చాలా బాగుంది, ఈ జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు, మేము ఒప్పుకుంటున్నామని వ్రాస్తారు కూడా, అంతే. స్వయం కొంచెం కూడా జ్ఞానాన్ని తీసుకోరు. మళ్ళీ నిద్రపోతారు. ఇటువంటి వారిని కుంభకర్ణులని అంటారు. మీరు ఇలా చెప్పవచ్చు – మీరు రాసి అయితే ఇస్తున్నారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నిద్రపోవడం కాదు. వారిని కుంభకర్ణుని చిత్రం వద్దకు తీసుకువెళ్ళండి. వీరి వలె నిద్రపోకండి అని చెప్పండి. అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి కదా.

బాబా అంటారు – పిల్లలూ, మీ దుకాణాలలో కూడా ముఖ్యమైన చిత్రాలను పెట్టండి. ఎవరైనా వస్తే, వాటిని చూపి అర్థం చేయించండి. ఆ వ్యాపారం కూడా చేయండి, ఇది కూడా సత్యమైన వ్యాపారము. దీనితో మీరు అనేకుల కళ్యాణం చేయగలరు. ఇందులో సిగ్గుపడే విషయమేమీ లేదు. కొంతమంది, మీరు బి.కె.లుగా అయ్యారా అని అంటారు. అరే, మీరు కూడా ప్రజాపిత బ్రహ్మా యొక్క కుమార-కుమారీలే కదా అని వారికి చెప్పండి. తండ్రి కొత్త సృష్టిని రచిస్తున్నారు. పాతదానికి నిప్పు అంటుకుంటుంది. మీరు కూడా బి.కె.లుగా అవ్వనంత వరకు స్వర్గానికి వెళ్ళలేరు. ఈ విధంగా దుకాణాలలో సేవ చేసినట్లయితే ఎంత అనంతమైన సేవ జరుగుతుంది! పరస్పరంలో చర్చించుకోండి. దుకాణం చిన్నదైనా కూడా గోడలకు చిత్రాలు తగిలించవచ్చు. దానం ఇంటి నుండే మొదలవుతుంది. మొట్టమొదట వారి కళ్యాణం చేయాలి. తండ్రి అంటారు – ఇప్పుడు ఏ దేహధారినీ గుర్తు చేయకండి. శివబాబాను స్మృతి చేయండి, వీరి నుండే వారసత్వం లభిస్తుంది. మనుష్యులైతే పాపం తికమకలో ఉన్నారు. దైవీ ప్రపంచ రాజ్యాధికారాన్ని పొందాలంటే, నరుని నుండి నారాయణునిగా తయారవ్వాలంటే, వచ్చి అలా తయారవ్వండి అని వారికి తెలియజేయాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క తండ్రి పట్లనే శుద్ధమైన, సత్యమైన మోహం పెట్టుకోవాలి, వారినే స్మృతి చేయాలి. దేహధారుల పట్ల మమకారాన్ని తొలగించుకోవాలి. ట్రస్టీగా ఉంటూ సంభాళించాలి.

2. వికర్మాజీతులుగా అవ్వాలి కనుక కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి వికర్మలు జరగకూడదు. దీని పట్ల చాలా-చాలా అటెన్షన్ పెట్టాలి.

వరదానము:-

ఈ డ్రామాలో ఏం జరిగినా, అందులో కళ్యాణం నిండి ఉంది. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వివేకవంతులకు ఉత్పన్నమవ్వవు. నష్టంలో కూడా కళ్యాణం ఇమిడి ఉంటుంది, తండ్రి తోడు మరియు చేయి ఉంటే అకళ్యాణం జరగదు. ఇటువంటి గౌరవం యొక్క సీటుపై ఉన్నట్లయితే ఎప్పుడూ వ్యాకులపడలేరు. సాక్షీతనం యొక్క సీటు వ్యాకులత అనే పదాన్ని సమాప్తం చేసేస్తుంది, అందుకే త్రికాలదర్శిగా అయి ‘నేను వ్యాకులపడను, ఇతరులను వ్యాకులపరచను’ అని ప్రతిజ్ఞ చేయండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top