06 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

May 5, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది అనగా దేవీ దేవతా ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉంటారో, శివుని లేక దేవతల పూజారులు ఎవరైతే ఉంటారో, మొట్టమొదట వారికి జ్ఞానాన్ని ఇవ్వండి”

ప్రశ్న: -

తండ్రి యొక్క ఏ కర్తవ్యము మనుష్యులెవరూ చేయలేరు మరియు ఎందుకు?

జవాబు:-

మొత్తం విశ్వంలో శాంతిని స్థాపన చేసే కర్తవ్యము ఒక్క తండ్రిది. మనుష్యులు విశ్వంలో శాంతిని స్థాపన చేయలేరు ఎందుకంటే అందరూ వికారులుగా ఉన్నారు. ఎప్పుడైతే తండ్రిని తెలుసుకొని పవిత్రంగా అవుతారో, అప్పుడు శాంతి స్థాపన జరుగుతుంది. తండ్రిని తెలుసుకోని కారణంగా అనాథలుగా అయిపోయారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీ దారిలోనే మరణించాలి….. (మర్నా తేరీ గలీమే…..)

ఓంశాంతి. ఓం శాంతి అర్థాన్ని కూడా పదే-పదే తెలియజేయవలసి ఉంటుంది ఎందుకంటే ఓం శాంతి అర్థము ఎవరికీ తెలియదు. మన్మనాభవ అనగా అనంతమైన తండ్రిని స్మృతి చేయండి అని పదే-పదే చెప్పవలసి ఉంటుంది. ఓం అనగా భగవంతుడు అని ఓం యొక్క అర్థాన్ని చెప్తారు. తండ్రి అంటారు – ఓం అనగా నేను ఆత్మను, ఇది నా శరీరము. పరమపిత పరమాత్మ కూడా ఓం అని అంటారు. నేను కూడా ఆత్మను, పరంధామ నివాసిని. ఆత్మలైన మీరు జనన-మరణ చక్రంలోకి వస్తారు, నేను రాను. అయితే నేను పిల్లలైన మీకు, సృష్టి ఆదిమధ్యాంతాల సారాన్ని అర్థం చేయించేందుకు, సాకారంలోకి తప్పకుండా వస్తాను. ఇది ఇతరులెవరూ అర్థం చేయించలేరు. ఒకవేళ నిశ్చయం లేకపోతే, మొత్తం ప్రపంచమంతా తిరగండి, వెతకండి, స్వయం గురించి మరియు సృష్టి ఆదిమధ్యాంతాల నాలెడ్జ్ ను ఇచ్చేవారు, ప్రపంచంలో ఎవరైనా ఉన్నారేమో చూడండి. పరమపిత పరమాత్మ తప్ప, సృష్టి చక్రం యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని ఎవరూ తెలియజేయలేరు, ఎవరూ రాజయోగాన్ని నేర్పించలేరు, పతితులను పావనంగా చేయలేరు. దేవీ-దేవతల పూజారులు ఎవరైతే ఉంటారో, మొట్టమొదట వారికి అర్థం చేయించే పురుషార్థాన్ని చేయండి. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము వారే, పూర్తి 84 జన్మలను తీసుకున్నారు, వారే మంచి రీతిగా అర్థం చేసుకోగలరు. తర్వాత వచ్చేవారు 84 జన్మలను తీసుకోలేరు. దేవతల పూజారులుగా ఎవరైతే ఉంటారో మరియు గీతను చదివేవారు ఎవరైతే ఉంటారో వారే వింటారు. గీతలో కేవలం ఈ పొరపాటును చేసారు – భగవంతునికి బదులుగా కృష్ణుని పేరు రాసేసారు. కనుక గీతను చదివేవారికి అర్థం చేయించాలి. పరమపిత పరమాత్మ శివునితో మీకు ఏమి సంబంధం ఉంది అని అడగాలి. వారిని భగవంతుడు అని అంటారు. శ్రీకృష్ణుడైతే దైవీ గుణాలు కలిగినవారు, అతనికి దైవీ రాజధాని ఉండేది, అందులో అందరూ దైవీ గుణాలు కలిగిన వారే ఉండేవారు. వారే ఇప్పుడు పూజ్యుల నుండి పూజారులుగా అయిపోయారు. కనుక ప్రయత్నం చేసి, మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిని మేల్కొలపాలి. దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. ఎవరైతే శివుని పూజారులుగా ఉన్నారో, వారికి కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. శివుడు తప్పకుండా వస్తారు, అందుకే వారి జయంతిని జరుపుకుంటారు, వారు పరమపిత పరమాత్మ. వారు తప్పకుండా వచ్చి రాజయోగాన్ని నేర్పించి ఉంటారు, మనుష్యమాత్రులెవరూ దీనిని నేర్పించలేరు. కృష్ణుడిని గానీ, బ్రహ్మాను గానీ భగవంతుడు అని అనలేరు ఎందుకంటే సర్వుల సద్గతిదాత తండ్రి ఒక్కరే. వారు జ్ఞానసాగరుడు అయిన కారణంగా అందరికీ శిక్షకుడు కూడా. సృష్టి ఆదిమధ్యాంతాల చరిత్ర-భూగోళాలు ఇతురులెవరికీ తెలియదు. తండ్రి అంటారు – నన్ను జ్ఞాన సాగరుడు, చైతన్య బీజ రూపుడు అని కూడా అంటారు. తలక్రిందులుగా ఉన్న ఈ వృక్షం యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము, ఆ బీజము వద్దనే ఉంటుంది, అందుకే నన్ను జ్ఞానసాగరుడు, ఆల్మైటీ అథారిటీ అని అంటారు. దేనికి అథారిటీ. అన్ని వేద శాస్త్రాలు, గ్రంథాలు మొదలైనవాటన్నింటి గురించి తెలుసు. పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. కల్పం ఆయువు లక్షల సంవత్సరాలని ఆ శాస్త్రాలు వినిపించేవారు అంటారు. కానీ అలా ఉండజాలదు. ఇది వెరైటీ ధర్మాల మనుష్య సృష్టి రూపీ వృక్షము, భాగవతంలో దీని ఆయువును చాలా ఎక్కువగా రాసేసారు. భాగవతము అనేది ధర్మ శాస్త్రమేమీ కాదు. గీత ధర్మ శాస్త్రము, దీని ద్వారా దేవీ దేవతా ధర్మ స్థాపన జరిగింది. ఇకపోతే భాగవతము, మహాభారతము మొదలైనవాటి ద్వారా ధర్మ స్థాపనేమీ జరగదు. వారు శ్రీకృష్ణుని చరిత్రను రాసారు. తండ్రి అర్థం చేయిస్తారు – పిల్లలూ, మీరు 84 జన్మలను తీసుకున్నారు అని దేవీదేవతా ధర్మం వారికి అర్థం చేయించండి. సత్యయుగంలో కేవలం భారత్ యే ఉండేది, ఇంకే ధర్మము ఉండేది కాదు. భారత్ యే స్వర్గంగా ఉండేది. భారత్ యే ఉన్నతాతి ఉన్నతమైనదిగా గాయనం చేయడం జరుగుతుంది మరియు ఇది పరమపిత పరమాత్మ శివుని జన్మ స్థానము, వారు వచ్చి పతితులను పావనంగా చేస్తారు. శివుని పూజ కూడా ఇక్కడే జరుగుతుంది, జయంతి కూడా ఇక్కడే జరుపుకోబడుతుంది. వారు తప్పకుండా పతిత ప్రపంచంలోనే వచ్చి ఉంటారు. పతిత పావనా రండి అని అందరూ పిలుస్తారు కూడా. భారత్ పావనంగా ఉండేది, తర్వాత భారతవాసులు 84 జన్మల చక్రం తిరిగారు. ఎవరైతే పావనులుగా, స్వర్గవాసులుగా ఉండేవారో, వారే ఇప్పుడు నరకవాసులుగా, పతితులుగా అయ్యారు. శివబాబా పావనంగా చేసారు, రావణుడు పతితంగా చేశాడు. ఈ సమయంలో రావణ రాజ్యమే ఉంది. ప్రతి నరుడు-నారిలో 5 వికారాలున్నాయి. సత్యయుగంలో వికారాలుండేవే కావు, నిర్వికారులుగా ఉండేవారు. ఇప్పుడు పతితులుగా ఉన్నారు కావుననే – రండి, వచ్చి మమ్మల్ని మళ్ళీ పావనంగా చేయండి అని పిలుస్తారు. సత్యయుగంలో మనమే పావనంగా ఉండేవారము, 21 జన్మలు రామరాజ్యంలో ఉండేవారము. ఇప్పుడిది రావణ రాజ్యము, అందరూ వికారులుగా ఉన్నారు. తండ్రి అంటారు – కామము మహాశత్రువు, ఇది ఆదిమధ్యాంతాలు దుఃఖాన్నిస్తుంది, ఇప్పుడు దీనిపై విజయాన్ని పొంది పావనంగా అవ్వండి. మీరు జన్మ-జన్మలుగా పాపాలు చేసారు. అందరికన్నా ఎక్కువ తమోప్రధానంగా అయ్యారు, ఆత్మలో మాలిన్యం చేరుతూ వచ్చింది. ముందు స్వర్ణిమ యుగము వారిగా ఉండేవారు, తర్వాత వెండి యుగము వారిగా, తర్వాత రాగి యుగము వారిగా….. అలా మాలిన్యం చేరుకుంటూ-చేరుకుంటూ మెట్లు దిగుతూ వచ్చారు. ఇది భారత్ యొక్క విషయమే. సత్యయుగంలో 8 జన్మలు, తర్వాత త్రేతాలో 12 జన్మలు, తర్వాత ఆ భారతవాసులే చంద్రవంశీయులుగా, వైశ్య వంశీయులుగా….. అవుతారు. ఆత్మ అపవిత్రంగా అవుతుంది. తండ్రి అంటారు – నేను వచ్చి కల్ప-కల్పము భారత్ ను స్వర్గంగా చేస్తాను, మళ్ళీ రావణుడు నరకంగా చేస్తాడు. ఇది తయారైనటువంటి డ్రామా. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు – జ్ఞానసాగరుడు శివబాబాయే కదా. ఉన్నతాతి ఉన్నతమైన శివుడు అందరికీ పూజ్యుడు. మొట్టమొదట వారికి పూజ జరుగుతుంది. వారు అనంతమైన తండ్రి. తప్పకుండా వారి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. భారతవాసులు మర్చిపోయారు, భగవంతుడు అని ఒక్క నిరాకారుడినే అంటారు. వారిని మనుష్యులు స్మృతి చేస్తారు కూడా. అలాగని అందరూ భగవంతులే భగవంతులని కాదు. ఒకవైపు భగవంతుడిని స్మృతి చేస్తారు, ఇంకొకవైపు నిందిస్తారు కూడా. ఒకవైపు సర్వవ్యాపి అని అంటారు, మరోవైపు పతిత పావనా రండి, అని అంటారు. తండ్రి వచ్చి, బ్రహ్మా తనువు ద్వారా బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణులకే అర్థం చేయిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు పిలక వంటివారు. బ్రాహ్మణులకన్నా పైన శివుడు ఉన్నారు. విరాట రూపంలో దేవతలను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను చూపిస్తారు. అందులో బ్రాహ్మణుల పేరే లేదు ఎందుకంటే బ్రాహ్మణులు వికారులుగా ఉండడాన్ని చూస్తారు. అటువంటప్పుడు వారిని దేవతలకన్నా ఉత్తములు అని ఎలా అంటారు. బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని వారు కూడా పాడుతారని తండ్రి అర్థం చేయిస్తారు. వీరి రాజ్యం ఎప్పుడుండేది, స్వర్గం ఎక్కడ నుండి వచ్చింది అనేది ఏక్యురేట్ గా ఎవరికీ తెలియదు. తండ్రి వచ్చి బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపన చేస్తారని, శంకరుని ద్వారా నరకాన్ని వినాశనం చేయిస్తారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మహాభారత యుద్ధం కూడా జరిగింది కదా, దీని ద్వారా స్వర్గం యొక్క గేట్స్ తెరవబడతాయి అని పాడుతారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమయిందని కూడా చూపిస్తారు. ఇప్పుడు సరిగ్గా అదే పాత్ర నడుస్తుంది. 5 వేల సంవత్సరాల క్రితం కూడా యుద్ధం జరిగింది, అప్పుడు పతిత ప్రపంచం వినాశనమయింది. గీతా జ్ఞానాన్ని వినిపించేటప్పుడు మూడు సైన్యాలుండేవని అంటారు. యూరోప్ వాసులైన యాదవ సైన్యము సైన్స్ ద్వారా మిసైల్స్ ను కనుగొన్నారు. గీతను వినిపించి పూర్తి 5 వేల సంవత్సరాలయింది. ఈ మూడు సైన్యాలు ఇప్పుడు కూడా ఉన్నాయని తండ్రి అర్థం చేయిస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి అనగా పరమపిత పరమాత్మునితో విపరీత బుద్ధి కలిగి ఉండడము అని అంటారు. వారికేమీ తెలియదు. మీకు తప్ప ఇంకెవరికీ ప్రీతి లేదు. అందరిదీ వినాశకాలే విపరీత బుద్ధిగా ఉంది. ఇకపోతే పాండవులైన మీది ప్రీతి బుద్ధి. మీరు శివబాబానే స్మృతి చేస్తారు. శివబాబా మాకు 21 జన్మల వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారని మీకు తెలుసు. మీకు శివబాబా పట్ల ప్రీతి బుద్ధి ఉంది. ఇకపోతే ఎవరికీ తండ్రిని గురించి తెలియనే తెలియదు. కావున మూడు సైన్యాలు ఉన్నట్లు కదా. మీరు పాండవ సైన్యము. ఇప్పుడిది వినాశన కాలము. మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని మీకు తెలుసు. మీరు పవిత్రంగా అయినట్లయితే, కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారని శివబాబా అంటారు. సత్యయుగంలో ఒక్క దేవీ దేవతా ధర్మముండేది, ఇంకే ధర్మము ఉండేది కాదు. ఇప్పుడు అన్ని ధర్మాలున్నాయి కానీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము లేదు. తమను తాము దేవీ-దేవతలుగా భావించరు. మేమైతే పతితులుగా ఉన్నామని అంటారు. దేవతల ఎదురుగా – మీరు సర్వ గుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అని మహిమను పాడుతారు. మేము వికారులము, నిర్గుణుడినైన నాలో ఏ గుణము లేదని స్వయం గురించి అంటారు. తండ్రిని స్మృతి చేస్తారు. మీరు కూడా ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. తండ్రిని స్మృతి చేయకుండా పావనంగా అవ్వలేరు, అప్పుడు ఉన్నత పదవిని పొందలేరు. అపవిత్ర ప్రపంచం ఎప్పుడైతే వినాశనమవుతుందో, అప్పుడే ప్రపంచంలో శాంతి ఏర్పడుతుంది. భారత్ లో మరియు ప్రపంచంలో శాంతి ఏర్పడాలని మనుష్యులు ప్రయత్నం చేస్తారు. కానీ అది ఒక్క తండ్రి పని మాత్రమే. మనుష్యులైతే వికారులుగా ఉన్నారు. వారు శాంతిని ఎలా స్థాపన చేయగలరు. ప్రతి ఇంట్లోనూ గొడవలున్నాయి. తండ్రిని తెలుసుకోని కారణంగా పూర్తిగా అనాథలుగా అయిపోయారు. సత్యయుగంలో పూర్తి పవిత్రత, సుఖ-శాంతులుండేవి. ఇప్పుడు మళ్ళీ తండ్రి ఆ పవిత్రత, సుఖ-శాంతులను స్థాపన చేస్తున్నారు, ఇతరులెవ్వరూ చేయలేరు. భారతవాసులు ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు. స్వర్గంలో ఉండేటప్పుడు, పునర్జన్మలు కూడా స్వర్గంలోనే తీసుకునేవారు. ఇప్పుడు పతితులుగా ఉన్నారు, అందుకే పతితపావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు. పారలౌకిక తండ్రిని స్మృతి చేయడంతోనే వికర్మలు వినాశనమవుతాయని ఇప్పుడు పిల్లలకు తెలుసు. లౌకిక తండ్రి నుండి అయితే హద్దు వారసత్వం లభిస్తుంది. పారలౌకిక అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇది సత్సంగమేమీ కాదు. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము.

బాబా మమ్మల్ని స్వర్గవాసులుగా చేస్తారని మీకు సంతోషం ఉంటుంది. ఎవరైతే కల్ప క్రితం స్వర్గవాసులుగా అయ్యారో, వారే ఇప్పుడు అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎప్పుడూ అవ్వలేరు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. ఇప్పుడైతే భారత్ లో ఏ కళలూ లేవు. ఈ విషయాలు ఎవరికీ తెలియవు. కుంభకర్ణుని నిద్రలో నిదురిస్తున్నారు, ఇప్పుడు మిమ్మల్ని తండ్రి మేల్కొలిపారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. తండ్రి తప్ప ఇతురులెవరూ అలా తయారుచేయలేరు. సత్యయుగాన్ని స్వర్గమని, కలియుగాన్ని నరకమని అంటారు. యథా రాజా-రాణి తథా ప్రజ, ఇప్పుడందరూ వికారాల ద్వారా జన్మిస్తారు, దేవతలెప్పుడూ వికారాల ద్వారా పునర్జన్మలను తీసుకోరు. ఇప్పుడు పిల్లలు పవిత్రంగా ఉంటామని తండ్రితో ప్రతిజ్ఞను చేస్తారు కానీ నడుస్తూ-నడుస్తూ ఓడిపోతారు, అప్పుడు చేసుకున్న సంపాదనంతా సమాప్తమైపోతుంది. చాలా జోరుగా దెబ్బ తగులుతుంది. ఆశ్చర్యకరంగా వింటారు, వర్ణిస్తారు, మళ్ళీ పారిపోతారు. సాక్షాత్కారాలు కూడా కలుగుతాయి కానీ సాక్షాత్కారాలలో మాయ చాలా ప్రవేశిస్తుంది. ఏ విధంగా రేడియోలో ఒకరి మాటలు ఒకరు వినలేరు, అందుకే మధ్యలో గజిబిజి చేస్తారు. ఇది కూడా అటువంటిదే. యోగంలో మాయ విఘ్నాలను వేస్తుంది. శ్రమంతా యోగంలోనే ఉంది. భారత్ యొక్క ప్రాచీన యోగం గాయనం చేయబడింది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క తండ్రి పట్ల సత్యమైన ప్రీతిని ఉంచుకొని సత్యాతి-సత్యమైన పాండవులుగా అవ్వాలి. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది కనుక పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి.

2. కామము మహాశత్రువు, ఇది ఆదిమధ్యాంతాలు దుఃఖాన్నిస్తుంది, దానిపై విజయాన్ని ప్రాప్తి చేసుకొని పావనంగా అవ్వాలి, స్మృతితో వికారాల మాలిన్యాన్ని తొలగించుకొని, ఆత్మను స్వర్ణిమ యుగానికి చెందినదిగా తయారుచేసుకోవాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే మన్మనాభవ స్థితిలో స్థితులై ఉంటారో, వారు ఇతరుల మనసులలోని భావాలను తెలుసుకోగలరు. మాటలు ఏవైనా కానీ, వాటి భావమేమిటి అన్నదానిని తెలుసుకునే అభ్యాసాన్ని చేస్తూ వెళ్ళండి. ప్రతి ఒక్కరి మనసులోని భావాలను అర్థం చేసుకోవడంతో, వారి అవసరము లేదా ప్రాప్తి యొక్క కోరిక ఏదైతే ఉందో, దానిని పూర్తి చేయగలరు. దీనితో వారు అవినాశీ పురుషార్థులుగా అయిపోతారు, అప్పుడిక కొద్ది సమయంలోనే, సేవలో గొప్ప సఫలత కనిపిస్తుంది మరియు మీరు పురుషార్థీ స్వరూపులకు బదులుగా సఫలతా స్వరూపులుగా అయిపోతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

0 Comment

No Comment.

Scroll to Top