08 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

October 7, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఇప్పుడు విదేహీగా అయ్యే అభ్యాసం చేయండి, మీ ఈ వినాశీ దేహం పట్ల ఉన్న ప్రేమను తొలగించి ఒక్క శివబాబాను ప్రేమించండి”

ప్రశ్న: -

ఈ అనంతమైన పాత ప్రపంచం పట్ల ఎవరికైతే వైరాగ్యం కలిగిందో, వారి గుర్తులు ఏమిటి?

 

జవాబు:-

వారు ఈ కనులతో ఏదైతే చూస్తారో – అది చూస్తూ కూడా చూడనట్లుగా ఉంటారు. వారి బుద్ధిలో ఏముంటుందంటే – ఇదంతా సమాప్తమవ్వనున్నది, వీరంతా మరణించి ఉన్నారు, మేమైతే శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళాలి అని. వారి మమకారం తొలగిపోతూ ఉంటుంది. యోగంలో ఉంటూ ఎవరితోనైనా మాట్లాడితే, ఎదుటివారికి కూడా ఆకర్షణ కలుగుతుంది. జ్ఞానం యొక్క నషా ఎక్కి ఉంటుంది.

ఓం నమః శివాయ.....

గీతము:-

ఓం నమః శివాయ..

ఓంశాంతి. తండ్రి అంటారు – మధురమైన పిల్లలూ, మీరు శివబాబాను తెలుసుకున్నారు. కావున ఈ పాటలు పాడడం అనేది భక్తి మార్గానికి సంబంధించినదిగా అనిపిస్తుంది. భక్తి మార్గం వారు శివాయ నమః అని కూడా అంటారు, మాత-పితలు అని కూడా అంటారు, కానీ వారి గురించి తెలియదు. శివబాబా నుండి స్వర్గ వారసత్వం లభించాలి. పిల్లలైన మీకైతే తండ్రి లభించారు, వారి నుండి వారసత్వం లభిస్తుంది, అందుకే తండ్రిని స్మృతి చేస్తారు. శివబాబా మీకు లభించారు, ప్రపంచానికి లభించలేదు. ఎవరికైతే లభించారో, వారు కూడా మంచి రీతిలో నడుచుకోలేకపోతున్నారు. బాబా డైరెక్షన్లు చాలా మధురమైనవి – ఆత్మ-అభిమాని భవ, దేహీ-అభిమాని భవ. వారు ఆత్మలతోనే మాట్లాడుతారు. దేహీ-అభిమాని అయిన తండ్రి దేహీ-అభిమానులైన పిల్లలతో మాట్లాడుతారు. వారు ఒక్కరే. ఇప్పుడు వారు మధుబన్ లో పిల్లలైన మీతో పాటు కూర్చొన్నారు. తండ్రి తప్పకుండా చదివించేందుకే వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. ఈ చదువును శివబాబా తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు. బ్రహ్మా చదివించలేరు, విష్ణువు చదివించలేరు. తండ్రియే వచ్చి పతితులను పావనంగా తయారుచేస్తారు, అమరకథను వినిపిస్తారు. అది కూడా ఇక్కడే వినిపిస్తారు కదా. అమరనాథ్ లో వినిపించరు కదా. ఇదే అమర కథ, సత్యనారాయణ కథ. తండ్రి అంటారు – నేను మీకు ఇక్కడే వినిపిస్తాను. మిగిలినవన్నీ భక్తి మార్గం యొక్క ఎదురుదెబ్బలు. సర్వుల సద్గతిదాత అయిన రాముడు నిరాకారుడు ఒక్కరే. వారే పతితపావనుడు, జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు. వినాశన సమయం వచ్చినప్పుడే వారు వస్తారు. మొత్తం జగత్తుకు గురువుగా ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే అవ్వగలరు. వారు నిరాకారుడు కదా. దేవతలను కూడా మనుష్యులనే అంటారు. కానీ వారు దైవీ గుణాల కల మనుష్యులు కనుక వారిని దేవతలని అంటారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. జ్ఞాన మార్గంలో అవస్థను చాలా దృఢంగా ఉంచుకోవాలి. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయాలి. విదేహీగా అవ్వాలి. అటువంటప్పుడు అసలు దేహాన్ని ఎందుకు ప్రేమించాలి! బాబా మీకు చెప్తారు – శివబాబాను స్మృతి చేయండి, తర్వాత వీరి (బ్రహ్మా) వద్దకు రండి. వీళ్ళు దాదాను కలుసుకునేందుకు వెళ్తున్నారని మనుష్యులు భావిస్తారు. మనం శివబాబాను స్మృతి చేసుకుంటూ వీరిని (బ్రహ్మా) కలుస్తామని మీకు తెలుసు. అక్కడ ఉండేదే నిరాకార ఆత్మలు, బిందువులు. బిందువునైతే మీరు కలుసుకోలేరు. అటువంటప్పుడు శివబాబాను ఎలా కలుసుకుంటారు, అందుకే ఇక్కడ ఏమని అర్థం చేయించడం జరుగుతుందంటే – హే ఆత్మలూ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ, మేము శివబాబాను కలుసుకుంటున్నామని బుద్ధిలో ఉంచుకోండి. ఇది చాలా గుహ్యమైన రహస్యం కదా. చాలా మందికి శివబాబా స్మృతి ఉండదు. బాబా అర్థం చేయిస్తారు – సదా శివబాబాను స్మృతి చేయండి. శివబాబా మిమ్మల్ని కలుసుకునేందుకు వస్తారు. బాబా, ఇప్పుడు నేను మీకు చెందినవానిగా అయ్యాను. శివబాబా వీరిలోకి వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు. వారు (శివబాబా) కూడా నిరాకార ఆత్మ, మీరు కూడా ఒక ఆత్మ. ఒక్క తండ్రి మాత్రమే పిల్లలకు – నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్తారు. అది కూడా బుద్ధితో స్మృతి చేయాలి. మనం తండ్రి వద్దకు వచ్చాము. బాబా ఈ పతిత శరీరంలోకి వచ్చారు. మనం వారి ముందుకు వస్తూనే – శివబాబా, మేము మీ వారిగా అయ్యామని నిశ్చయం ఏర్పర్చుకుంటాము. మురళీలలో కూడా – నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి అని మీరు వింటూ ఉంటారు.

వీరు ఆ పతితపావనుడైన తండ్రియే అని మీకు తెలుసు. వారు సత్యాతి-సత్యమైన సద్గురువు. ఇప్పుడు పాండవులైన మీకు పరమపిత పరమాత్మతో ప్రీతి బుద్ధి ఉంది. మిగిలినవారందరికీ ఎవరో ఒకరితో విపరీత బుద్ధి ఉంది. శివబాబాకు చెందినవారిగా అయినవారికైతే సంతోషపు పాదరసం చాలా జోరుగా ఎక్కి ఉండాలి. సమయం ఎంత సమీపంగా వస్తూ ఉంటుందో, అంత సంతోషముంటుంది – ఇప్పుడు మా 84 జన్మలు పూర్తయ్యాయి, ఇప్పుడిది అంతిమ జన్మ, మేము మా ఇంటికి వెళ్తాము. ఈ మెట్ల చిత్రం చాలా బాగుంది, ఇందులో స్పష్టంగా ఉంది. కనుక పిల్లలు రోజంతా బుద్ధిని ఉపయోగించాలి. చిత్రాలను తయారుచేసేవారైతే చాలా విచార సాగర మథనం చేయాలి, హెడ్స్ ఎవరైతే ఉన్నారో, వారికి ఆలోచన నడవాలి. సత్యయుగ శేష్ఠాచారీ దైవీ రాజ్యంలో 9 లక్షల మంది ఉంటారని మీరు ఛాలెంజ్ చేస్తారు. దీనికి ఋజువేమిటి అని ఎవరైనా అడిగితే, ఇది అర్థం చేసుకునే విషయం కదా అని వారికి చెప్పండి. సత్యయుగంలో వృక్షం చిన్నగా ఉంటుంది. ధర్మం కూడా ఒక్కటే ఉంటుంది కావున తప్పకుండా మనుష్యులు కూడా కొంతమందే ఉంటారు. మెట్ల చిత్రంలో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. ఉదాహరణకు ఈ కుంభకర్ణుని చిత్రముంది. ఈ చిత్రాన్ని ఎలా తయారుచేయాలంటే – బి.కె.లు జ్ఞానామృతాన్ని తాగిస్తున్నట్లుగా, వారేమో విషాన్ని (వికారాలను) అడుగుతున్నట్లుగా చూపించాలి. బాబా మురళీలో అన్ని డైరెక్షన్లను ఇస్తూ ఉంటారు. ప్రతి చిత్రంలోనూ వివరణ చాలా బాగుంది. లక్ష్మీనారాయణుల చిత్రం చూపించి ఈ విధంగా చెప్పండి – ఈ భారత్ ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, అక్కడ ఒకే ధర్మముండేది కావున ఎంతమంది మనుష్యులుంటారు. ఇప్పుడు ఎంత పెద్ద వృక్షంగా అయిపోయింది. ఇప్పుడు వినాశనం జరగనున్నది. పాత సృష్టిని పరివర్తన చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. 4-5 చిత్రాలు ముఖ్యమైనవి – వీటి ద్వారా ఎవరికైనా వెంటనే బాణం తగులుతుంది. డ్రామానుసారంగా రోజు-రోజుకు జ్ఞానం యొక్క పాయింట్లు గుహ్యమవుతూ ఉంటాయి. కావున చిత్రాలలో కూడా మార్పులు జరుగుతాయి. పిల్లల బుద్ధిలో కూడా మార్పు జరుగుతుంది. ఇంతకుముందు, శివబాబా బిందువని అర్థం చేసుకునేవారు కాదు. ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదని అనడానికి లేదు. తండ్రి అంటారు – అన్ని విషయాలను ముందే అర్థం చేయించడం జరగదు. తండ్రి జ్ఞానసాగరుడు కనుక జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటారు. కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. ముందు నుండే అన్నీ చెప్పరు. అలా చెప్తే, అది ఆర్టిఫీషియల్ (కృత్రిమం) అయిపోతుంది. ఏవైనా సంఘటనలు అకస్మాత్తుగా జరిగితే, దానిని డ్రామా అని అంటారు. మమ్మా అయితే అసలు చివరి వరకు ఉండాలి, మరి మమ్మా ఎందుకు వెళ్ళిపోయారు, ఇది జరగకూడదు అని అనకూడదు. డ్రామాలో ఏది జరిగితే అది రైట్. బాబా కూడా ఏదైతే చెప్పారో, అదంతా డ్రామానుసారంగా చెప్పారు. డ్రామాలో నా పాత్ర ఇలా ఉంది. బాబా కూడా డ్రామాపై వదిలేస్తారు. మనుష్యులేమో ఈశ్వరుని రాత అని అంటారు. ఈశ్వరుడేమో డ్రామా రాత అని అంటారు. ఈశ్వరుడు చెప్పినా లేక వీరు (బ్రహ్మా) చెప్పినా, అది డ్రామాలో ఉంది. ఏదైనా తప్పుడు కర్మ జరిగినా, అది కూడా డ్రామాలో ఉంది, తర్వాత అది సరైపోతుంది. తప్పకుండా ఎక్కే కళ జరుగుతుంది. బాగా పైకి ఎక్కేటప్పుడు, కొన్ని సార్లు ఊగిసలాడతారు. ఇవన్నీ మాయా తుఫానులు. మాయ ఉన్నంతవరకు వికల్పాలు తప్పకుండా వస్తాయి. సత్యయుగంలో మాయే ఉండదు కనుక వికల్పాల విషయమే ఉండదు. సత్యయుగంలో ఎప్పుడూ కర్మలు వికర్మలుగా అవ్వవు. ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. ఇది మా అంతిమ జన్మ అని మీకు సంతోషముంటుంది. ఇప్పుడు అమరలోకానికి వెళ్ళేందుకు శివబాబా నుండి అమరకథను వింటారు. ఈ విషయాలను మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడో అమర్ నాథ్ కు వెళ్ళి ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు కానీ పార్వతికి కథను ఎవరు వినిపించారు అనేది వారికి తెలియదు. అక్కడ శివుని చిత్రాన్ని చూపిస్తారు. అచ్ఛా, శివుడు ఎవరిలో కూర్చొన్నారు? శివుడు మరియు శంకరుడిని చూపిస్తారు. అంటే శివుడు, శంకరునిలో కూర్చొని కథను వినిపించారా? ఏమీ అర్థం చేసుకోరు, భక్తి మార్గంలోని వారు ఇప్పటివరకు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. వాస్తవానికి ఈ కథ కూడా పెద్దదేమీ కాదు. అసలైనది – మన్మనాభవ. కేవలం బీజాన్ని స్మృతి చేయండి. డ్రామా చక్రాన్ని స్మృతి చేయండి. తండ్రి వద్ద ఏ జ్ఞానమైతే ఉందో, ఆ జ్ఞానం ఆత్మలైన మనలో కూడా ఉంది. వారు కూడా జ్ఞానసాగరుడు, అలాగే ఆత్మలైన మనం కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతాము. నషా ఎక్కాలి కదా. వారు సోదరులైన మనకు (ఆత్మలకు) వినిపిస్తారు. శరీరం ద్వారానే వినిపిస్తారు కదా. ఇందులో సంశయం రాకూడదు. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి, మమకారం తొలగుతూ ఉంటుంది. కొందరికి నామమాత్రంగా ప్రేమ ఉంటుంది. మనది కూడా అలాంటిదే. ఇప్పుడు మనం సుఖధామానికి వెళ్తాము. ఇక్కడ అందరూ మరణించి ఉన్నట్లుగా ఉన్నారు, వీరి పట్ల ఏం మనసు పెట్టుకోవాలి. శాంతిధామానికి వెళ్ళి, తర్వాత సుఖధామంలోకి వచ్చి రాజ్యం చేస్తాము. దీనినే పాత ప్రపంచం పట్ల వైరాగ్యం అని అంటారు. తండ్రి అంటారు – ఈ కళ్ళతో ఏదైతే చూస్తారో, అదంతా సమాప్తమవ్వనున్నది. వినాశనం తర్వాత స్వర్గాన్ని చూస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు చాలా మధురంగా తయారవ్వాలి. ఎవరైనా యోగంలో ఉంటూ మాట్లాడితే, ఎదుటివారికి చాలా ఆకర్షణ కలుగుతుంది. ఈ జ్ఞానం ఎటువంటిదంటే, ఇక మిగిలిందంతా మర్చిపోతారు. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞాన మార్గంలో తమ అవస్థను చాలా దృఢంగా తయారుచేసుకోవాలి. విదేహీగా అవ్వాలి. ఒక్క తండ్రి పట్ల మాత్రమే సత్యాతి-సత్యమైన ప్రీతిని పెట్టుకోవాలి.

2. డ్రామా రాతపై అచలంగా ఉండాలి. డ్రామాలో ఏది జరిగితే, అది రైట్. ఎప్పుడూ అలజడి చెందకూడదు, ఏ విషయంలోనూ సంశయం కలగకూడదు.

వరదానము:-

దాత పిల్లలైన మీరు తీసుకునేవారు కాదు, ఇచ్చేవారు. ప్రతి సెకండు, ప్రతి సంకల్పంలో ఇవ్వాలి, ఎప్పుడైతే ఇలాంటి దాతలుగా అవుతారో అప్పుడు ఉదారచిత్తులు, మహాదానులని అంటారు. ఇలా మహాదానులుగా అయినట్లయితే స్వతహాగా మహాన్ శక్తి యొక్క ప్రాప్తి కలుగుతుంది. కానీ, ఇచ్చేందుకు స్వయం యొక్క భండారా నిండుగా ఉండాలి. ఏదైతే తీసుకోవాలో, అదంతా తీసేసుకున్నారు, ఇక ఇవ్వడమే మిగిలి ఉంది. కనుక ఇస్తూ ఉండండి, ఇవ్వడంతో భండారా ఇంకా నిండుతూ ఉంటుంది.

స్లోగన్:-

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

1. ‘‘నిరాకార పరమాత్ముని రిజర్వు తనువు – బ్రహ్మ తనువు’’

పరమాత్మ తమ సాకార బ్రహ్మా తనువు ద్వారా వచ్చి చదివిస్తున్నారని మీకు పూర్తిగా నిశ్చయముంది. ఈ పాయింటుపై చాలా మంది జిజ్ఞాసువులు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు – అమృతవేళ సమయంలో నిరాకార పరమాత్మ తమ సాకార తనువులోకి ప్రవేశించినప్పుడు, ఆ సమయంలో శరీరంలో ఏ మార్పు జరుగుతుంది? ఆ సమయంలో మీరు పరమాత్మ ఎలా వస్తారు అనేది కూర్చుని చూస్తూ ఉంటారా అని అడుగుతారు. ఇప్పుడు, దీని గురించి అర్థం చేయించడం జరుగుతుంది – పరమాత్మ ప్రవేశించే సమయంలో, ఆ శరీరం యొక్క నయనాలు, ముఖము మారిపోతాయని కాదు. కానీ, మనం ధ్యానంలోకి వెళ్ళినప్పుడు నయనాలు, ముఖము మారిపోతాయి. ఈ సాకార బ్రహ్మా యొక్క పాత్రయే గుప్తమైనది. పరమాత్మ వీరి తనువులో వచ్చినప్పుడు, వారికి ఈ తనువు రిజర్వు చేయబడిందని ఎవరికీ తెలియదు. అందుకే, సెకండులో వస్తారు, సెకండులో వెళ్ళిపోతారు, ఇప్పుడు ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకానీ, ఏదైనా పాయింటు అర్థం కాకపోతే, ఈ చదువు యొక్క కోర్సును వదిలి వెళ్ళిపోకూడదు. ఈ చదువు రోజు-రోజుకు గుహ్యంగా మరియు స్పష్టంగా అవుతూ ఉంది. మొత్తం కోర్సు అంతా ఒకేసారి చదువుకోలేరు కదా. అలా మీకు అర్థం చేయించడం జరుగుతుంది. మిగిలిన ధర్మ పితలు ఎవరైతే వస్తారో, వారిలోకి కూడా, తమ-తమ పవిత్ర ఆత్మ వచ్చి తమ పాత్రను అభినయిస్తారు. తర్వాత, ఆ ఆత్మలు సుఖ-దుఃఖాల ఆటలోకి రావాల్సి ఉంటుంది. వారు తిరిగి వెళ్ళరు. కానీ, ఆ నిరాకార పరమాత్మ వచ్చినప్పుడు, పరమాత్మ సుఖ-దుఃఖాలకు అతీతంగా ఉంటారు కనుక వారు కేవలం తమ పాత్రను అభినయించి వెళ్ళిపోతారు. కనుక, ఈ పాయింటునే మనం బుద్ధితో అర్థం చేసుకోవాలి.

2. ‘‘ఆత్మ మరియు పరమాత్మకు మధ్య గుణాలు మరియు శక్తిలో వ్యత్యాసం’’

ఆత్మ మరియు పరమాత్మకు మధ్యన వ్యత్యాసం ఈ విధంగా అర్థం చేయించడం జరుగుతుంది – ఆత్మ మరియు పరమాత్మ యొక్క రూపం ఒకేలాంటి జ్యోతి రూపము. ఆత్మ మరియు పరమాత్మ యొక్క ఆత్మ, వీరి సైజు కూడా ఒకేలా ఉంటుంది, ఆత్మ మరియు పరమాత్మల మధ్యన తప్పకుండా గుణాలు మరియు శక్తులలో వ్యత్యాసం ఉంది. ఇప్పుడున్న ఈ గుణాలన్నింటి మహిమ పరమాత్మదే. పరమాత్మ సుఖ-దుఃఖాలకు అతీతమైనవారు, సర్వశక్తివంతుడు, సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపూర్ణుడు, వారి శక్తినే మొత్తం పని అంతా చేస్తుంది. ఇకపోతే, మనుష్యాత్మల శక్తులేవీ పని చేయవు. మొత్తం పాత్ర అంతా పరమాత్మదే నడుస్తుంది. పరమాత్మ పాత్రలోకి వచ్చినా కూడా వారు స్వయం అతీతంగా ఉంటారు కానీ, ఆత్మ పాత్రలోకి వచ్చినప్పుడు పాత్రధారి రూపంలో వస్తుంది. పరమాత్మ పాత్రలోకి వచ్చినా కర్మ బంధనం నుండి అతీతంగా ఉంటారు. ఆత్మ పాత్రలోకి వచ్చినప్పుడు, కర్మ బంధనానికి వశమవుతుంది. ఇది ఆత్మ మరియు పరమాత్మలకు మధ్యన వ్యత్యాసము, బేధము. అచ్ఛా. ఓంశాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top