09 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

October 8, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మాతా-పితలను అనుసరిస్తూ సింహాసనాధికారులుగా అవ్వండి, ఇందులో కష్టమేమీ లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి”

ప్రశ్న: -

పేదల పెన్నిధి అయిన తండ్రి తన పిల్లల భాగ్యాన్ని తయారుచేసేందుకు ఏ సలహానిస్తారు?

జవాబు:-

పిల్లలూ, శివబాబాకు మీదేదీ అవసరం లేదు. మీరు తినండి, తాగండి, చదవండి – రిఫ్రెష్ అయి వెళ్ళండి కానీ పిడికెడు బియ్యానికి కూడా మహిమ ఉంది. 21 జన్మలకు షావుకార్లుగా అవ్వాలి కనుక పేదవారి ఒక్క పైసా కూడా షావుకార్ల వంద రూపాయలకు సమానము. అందుకే, తండ్రి డైరెక్టుగా వచ్చినప్పుడు తమదంతా సఫలం చేసుకోండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవే తల్లివి, తండ్రివి….. (తుమ్ హీ హో మాతా, పితా తుమ్ హీ హో…..)

ఓంశాంతి. పిల్లలు పాట అర్థాన్ని తెలుసుకున్నారు. మనుష్యులు వారిని పిలుస్తారు కానీ అర్థం చేసుకోరు. వారు మన తండ్రి అని మీకు తెలుసు. వాస్తవానికి వారు కేవలం మీకు మాత్రమే తండ్రి కాదు, వారు అందరికీ తండ్రి. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఎంతమంది ఆత్మలు ఉన్నారో, వారందరికీ తప్పకుండా పరమాత్మయే తండ్రి. బాబా-బాబా అని అంటూ ఉంటే వారసత్వం తప్పకుండా గుర్తుకొస్తుంది. తండ్రిని స్మృతి చేయడంతోనే వికర్మలు వినాశనమవుతాయి. మీ ఆత్మ పతితంగా అయిందని, ఇప్పుడు దానిని పావనంగా తయారుచేసుకోవాలని తండ్రి పిల్లలతో అంటారు. వారు అందరికీ తండ్రి కనుక పిల్లలు తప్పకుండా నిర్వికారులుగా ఉండాలి. ఒకానొక సమయంలో అందరూ నిర్వికారులుగా ఉండేవారు. తండ్రి స్వయంగా అర్థం చేయిస్తారు – శ్రీ లక్ష్మీనారాయణుల రాజ్యమున్నప్పుడు అందరూ నిర్వికారులుగా ఉండేవారు, అక్కడున్న మనుష్యాత్మలందరూ నిర్వికారులుగా ఉండేవారు ఎందుకంటే శరీరాలైతే వినాశనమైపోతాయి, ఆత్మలందరూ నిరాకారీ ప్రపంచానికి వెళ్ళి ఉంటాయి. ఆ నిరాకార ప్రపంచంలో వికారాల నామ రూపాలే ఉండవు. అక్కడ అసలు శరీరాలే ఉండవు. అక్కడి నుండే ఆత్మలందరూ పాత్రను అభినయించేందుకు ఈ ప్రపంచంలోకి వస్తారు. మొట్టమొదట భారతవాసులు వస్తారు. భారత్ లో మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది, ఆ సమయంలో మిగిలిన ధర్మాల వారందరూ నిరాకారీ ప్రపంచంలో ఉండేవారు. ఈ సమయంలో అందరూ సాకార ప్రపంచంలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని నిర్వికారీ దేవీ-దేవతలుగా తయారుచేసేందుకు నిర్వికారులుగా తయారుచేస్తారు. మీరు దేవీ-దేవతలుగా అయినప్పుడు మీ కోసం తప్పకుండా కొత్త ప్రపంచం కావాలి. పాత ప్రపంచం సమాప్తమవ్వాలి. శాస్త్రాలలో మహాభారత యుద్ధాన్ని కూడా చూపించారు. 5 మంది పాండవులు మిగిలారని, వారు కూడా పర్వతాలపై కరిగిపోయారని, ఎవ్వరూ మిగలలేదని చూపించారు. అచ్ఛా, మరి ఇంతమంది ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆత్మ వినాశనమవ్వదు కావున నిరాకారీ, నిర్వికారీ ప్రపంచంలోకి వెళ్ళారని అంటారు. తండ్రి వికారీ ప్రపంచం నుండి నిరాకారీ, నిర్వికారీ ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభించాలని మీకు తెలుసు. ఇప్పుడు దుఃఖం పెరిగిపోయింది. ఈ సమయంలో మనకు సుఖము, శాంతి రెండూ కావాలి. ఓ భగవంతుడా, మాకు సుఖమునివ్వండి, శాంతినివ్వండి అని అందరూ భగవంతుడిని వేడుకుంటారు. మనుష్యులు ప్రతి ఒక్కరు ధనం కోసం పురుషార్థం చేస్తారు. ధనముంటే సుఖముంటుంది. మీకు అనంతమైన తండ్రి చాలా ధనం ఇస్తారు. మీరు సత్యయుగంలో ఎంత ధనవంతులుగా ఉండేవారు, వజ్ర వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. మనం అనంతమైన తండ్రి నుండి అనంతమైన స్వర్గం యొక్క వారసత్వం తీసుకునేందుకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. మొత్తం ప్రపంచమంతా ఇక్కడకు రాదు. తండ్రి భారత్ లోనే వస్తారు. భారతవాసులే ఈ సమయంలో నరకవాసులుగా ఉన్నారు, మళ్ళీ వారిని స్వర్గవాసులుగా తండ్రి తయారుచేస్తారు. భక్తిలో దుఃఖం కారణంగా తండ్రిని – ఓ పరమపిత పరమాత్మ, ఓ కళ్యాణకారీ, దుఃఖహర్త-సుఖకర్త బాబా అని జన్మ-జన్మలుగా స్మృతి చేసారు. వారిని స్మృతి చేస్తున్నారంటే తప్పకుండా వారు ఎప్పుడో ఒకప్పుడు వస్తారు. ఊరికినే అలా స్మృతి చేయరు కదా. భగవంతుడైన తండ్రి వచ్చి భక్తులకు ఫలాన్ని ఇస్తారని భావిస్తారు. మరి వారు అందరికీ ఇస్తారు కదా. బాబా అందరివారు కదా.

మనం సుఖధామానికి వెళ్తామని మీకు తెలుసు. మిగిలినవారంతా శాంతిధామానికి వెళ్తారు. మీరు సుఖధామంలో ఉన్నప్పుడు మొత్తం సృష్టిలో సుఖ-శాంతులుంటాయి. తండ్రికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది కదా. అలాగే పిల్లలకు కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉంటుంది. నీవే తల్లివి-తండ్రివి….. అని కూడా పాడుతారు. దైహిక తల్లిదండ్రులున్నా కూడా, నీవే తల్లివి-తండ్రివి….. నీ కృపతో అపారమైన సుఖం లభిస్తుందని పాడుతారు. లౌకిక తల్లిదండ్రుల గురించి ఇలా పాడరు. వారు కూడా పిల్లలను సంభాళిస్తారు, శ్రమిస్తారు, వారసత్వాన్ని ఇస్తారు, నిశ్చితార్థం చేయిస్తారు. కానీ, అపారమైన సుఖాన్ని అయితే పారలౌకిక మాత-పిత మాత్రమే ఇస్తారు. ఇప్పుడు మీరు ఈశ్వరుని ద్వారా దత్తత తీసుకోబడిన పిల్లలు. వారంతా అసురుని ద్వారా దత్తత తీసుకోబడిన పిల్లలు. సత్యయుగంలో ఎప్పుడూ ఎవరూ పిల్లలను దత్తత తీసుకోరు. అక్కడైతే సుఖమే సుఖముంటుంది. దుఃఖం యొక్క నామ-రూపాలే ఉండవు. తండ్రి అంటారు – నేను 21 తరాల కొరకు మీకు స్వర్గం యొక్క అపారమైన సుఖాన్నిచ్చేందుకు వచ్చాను.

మనం అనంతమైన తండ్రి నుండి అపారమైన స్వర్గ సుఖాలను పొందుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఈ దుఃఖపు బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. సత్యయుగంలో సుఖమయ సంబంధాలుంటాయి, కలియుగంలో దుఃఖపు బంధనాలుంటాయి. తండ్రి సుఖమయ సంబంధాలలోకి తీసుకువెళ్తారు. వారిని దుఃఖహర్త-సుఖకర్త అని అంటారు. తండ్రి వచ్చి పిల్లలకు సేవ చేస్తారు. నేను మీ విధేయుడైన సేవకుడని అని తండ్రి అంటారు. ఓ బాబా, మీరు వచ్చి మాకు అపారమైన సుఖాన్ని ఇవ్వండి అని మీరు నన్ను అర్ధకల్పం స్మృతి చేసారు, ఇప్పుడు నేను ఇచ్చేందుకు వచ్చాను కనుక శ్రీమతాన్ని అనుసరించాలి. ఈ మృత్యులోకమంతా సమాప్తమవ్వనున్నది. అమరలోకం స్థాపనవుతుంది. మీరు అమరపురికి వెళ్ళేందుకు అమరనాథుడైన బాబా నుండి అమరకథను వింటారు. అక్కడ ఎవ్వరూ మరణించరు, నోటి ద్వారా ఎప్పుడూ ఫలానావారు మరణించారు అని అనరు. నేను శిథిలావస్థలో ఉన్న ఈ శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటానని ఆత్మ అంటుంది. అది మంచిదే కదా. అక్కడ అనారోగ్యాలు మొదలైనవేవీ ఉండవు. మృత్యులోకం పేరే ఉండదు. నేను మిమ్మల్ని అమరపురికి యజమానులుగా తయారుచేసేందుకు వచ్చాను. అక్కడ మీరు రాజ్యం చేసేటప్పుడు, ఈ మృత్యులోకానికి సంబంధించినదేదీ గుర్తుండదు. కిందకు దిగుతూ-దిగుతూ మనము ఎలా అవుతాము అనేది కూడా అక్కడ తెలియదు. ఒకవేళ తెలిస్తే, ఆ సుఖం దూరమైపోతుంది. ఇక్కడ మీరు పూర్తి చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. తప్పకుండా ఒకప్పుడు స్వర్గముండేది, ఇప్పుడు నరకముంది, అందుకే తండ్రిని పిలుస్తారు. ఆత్మలైన మీరు శాంతిధామ నివాసులు. ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తారు. ఇక్కడ నుండి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు సంస్కారాలను తీసుకువెళ్తారు. తర్వాత అక్కడ నుండి వచ్చి కొత్త శరీరాలను ధారణ చేసి రాజ్యం చేస్తారు. ఇప్పుడు మీకు నిరాకారీ, ఆకారీ మరియు సాకారీ ప్రపంచాల సమాచారాన్ని వినిపిస్తారు. సత్యయుగంలో ఇవేమీ తెలియదు. అక్కడ కేవలం రాజ్యం చేస్తారు. మీరు డ్రామా గురించి ఇప్పుడు తెలుసుకున్నారు. మనం సత్యయుగం కోసం పురుషార్థం చేస్తున్నామని మీ ఆత్మకు తెలుసు. మీరు తప్పకుండా స్వర్గంలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా అవుతారు. స్వకళ్యాణం మరియు ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు. అప్పుడు వారి ఆశీర్వాదాలు మీకు లభిస్తూ ఉంటాయి. మీ ప్లాను ఎలా ఉందో చూడండి. ఈ సమయంలో అందరికీ ఎవరి ప్లాన్లు వారికి ఉన్నాయి. తండ్రికి కూడా ప్లాను ఉంది. మనుష్యులు ఆనకట్టలు మొదలైనవి నిర్మించేటప్పుడు విద్యుత్తు మొదలైనవాటి కోసం ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారు. ఇప్పుడు అవన్నీ ఆసురీ ప్లాన్లు అని తండ్రి అర్థం చేయిస్తారు. మనది ఈశ్వరీయ ప్లాను. ఇప్పుడు ఎవరి ప్లాను విజయం పొందుతుంది? వారు పరస్పరంలో కొట్లాడుకుంటారు. అందరి ప్లాన్లు మట్టిలో కలిసిపోతాయి. వారెవ్వరూ స్వర్గ స్థాపన చేయరు. వారు ఏం చేసినా, అది దుఃఖం కోసమే చేస్తారు. స్వర్గం తయారుచేయడమనేది తండ్రి ప్లాను. నరకవాసులైన మనుష్యులు నరకంలో ఉండేందుకే ప్లాన్లు తయారుచేస్తారు. తండ్రి స్వర్గాన్ని తయారుచేసే ప్లాను చేస్తున్నారు. కనుక మీకు ఎంత సంతోషముండాలి. మీ కృపతో అపారమైన సుఖం లభిస్తుంది….. అని పాడుతారు కూడా. మరి అది పురుషార్థం చేసి తీసుకోవాలి కదా. తండ్రి అంటారు – మీకు ఏం కావాలంటే, అది తీసుకోండి. విశ్వానికి యజమానులైన రాజా-రాణులుగా అయినా అవ్వండి లేక దాస-దాసీలుగా అయినా అవ్వండి. ఎంత పురుషార్థం చేస్తే, అంత పొందుతారు. తండ్రి కేవలం – ఒకటి పవిత్రంగా అవ్వండి మరియు ప్రతి ఒక్కరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉండండి అని చెప్తారు. అల్ఫ్ (భగవంతుడు) ను స్మృతి చేసినట్లయితే బే (రాజ్యాధికారం) మీది అవుతుంది. తండ్రిని స్మృతి చేయడంలోనే మాయ చాలా విఘ్నాలను కలిగిస్తుంది. బుద్ధియోగాన్ని తెంచేస్తుంది. తండ్రి అంటారు – మీరు నన్ను ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా పాపాలు కూడా భస్మమవుతాయి మరియు ఉన్నత పదవిని కూడా పొందుతారు. అందుకే, భారత్ యొక్క ప్రాచీన యోగం ప్రసిద్ధమైనది. తండ్రిని లిబరేటర్ (ముక్తిదాత) అని కూడా అంటారు. తండ్రి 21 జన్మల కోసం మిమ్మల్ని దుఃఖం నుండి విముక్తులుగా చేస్తారు. భారతవాసులు సుఖధామంలో ఉంటారు, మిగిలినవారంతా శాంతిధామంలో ఉంటారు. నిరాకారీ ప్రపంచం మరియు సాకారీ ప్రపంచం యొక్క ప్లాను చూపించినప్పుడు – ఇతర ధర్మాలవారు స్వర్గంలోకి రాలేరని వెంటనే అర్థం చేసుకుంటారు. స్వర్గంలోనైతే కేవలం దేవీ-దేవతలే ఉంటారు. ఈ డ్రామా జ్ఞానాన్ని తండ్రి తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు. పిల్లలు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకే వస్తారు. సత్యయుగంలోనే అపారమైన సుఖముంటుంది, తర్వాత రావణ రాజ్యం ఉంటుంది, అందులో అపారమైన దుఃఖముంటుంది. తండ్రి మనకు సత్యాతి-సత్యమైన కథను వినిపించి అమరలోకంలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారుచేస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి కర్మలు చేస్తున్నారు కావుననే మీరు 21 జన్మలకు ధనవంతులుగా అవుతారు. ధనవాన్ భవ, పుత్రవాన్ భవ….. అని అంటారు కూడా. అక్కడ మీకు ఒక కుమారుడు, ఒక కుమార్తె తప్పకుండా ఉంటారు. ఆయుష్మాన్ భవ, మీ ఆయుష్షు కూడా 150 సంవత్సరాలుంటుంది. అకాల మృత్యువు ఎప్పుడూ సంభవించదు. ఈ విషయాన్ని తండ్రియే అర్థం చేయిస్తారు. మీరు అర్ధకల్పం నన్ను పిలుస్తూ వచ్చారు. సన్యాసులు ఇలా అంటారా? వారికేం తెలుసు! తండ్రి కూర్చుని ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారు – పిల్లలూ, ఒకవేళ ఈ ఒక్క జన్మ పావనంగా అయినట్లయితే 21 జన్మలకు పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పవిత్రతలో సుఖముంటుంది కదా. మీరు పవిత్రమైన దైవీ ధర్మానికి చెందినవారు. ఇప్పుడు అపవిత్రంగా అయి దుఃఖంలోకి వచ్చారు. స్వర్గంలో నిర్వికారులుగా ఉండేవారు, ఇప్పుడు వికారులుగా అవ్వడంతో నరకంలో దుఃఖితులు అయ్యారు. తండ్రి అయితే పురుషార్థం చేయిస్తారు కదా. స్వర్గం యొక్క మహారాజా-మహారాణులుగా అవ్వండి. మీ బాబా-మమ్మా అలా తయారవుతారు కదా. కనుక మీరు కూడా పురుషార్థం చేయండి. ఇందులో తికమకపడే విషయమేమీ లేదు. బాబా ఎవ్వరినీ కాళ్ళకు కూడా నమస్కారం చేయనివ్వరు.

తండ్రి అర్థం చేయిస్తారు – నేను మీకు బంగారం, వజ్రాల మహళ్ళను ఇచ్చాను, స్వర్గానికి యజమానులుగా తయారుచేసాను. తర్వాత అర్ధకల్పం మీరు భక్తి మార్గంలో నుదురు అరగదీసుకుంటూ వచ్చారు, ధనం కూడా ఇస్తూ వచ్చారు. ఆ బంగారం, వజ్రాల మహళ్ళన్నీ ఏమైపోయాయి? మీరు స్వర్గం నుండి దిగుతూ-దిగుతూ నరకంలోకి వచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ స్వర్గంలోకి తీసుకువెళ్తాను. నేను మీకు ఏ కష్టము ఇవ్వను. కేవలం నన్ను స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి. ఒక్క పైసా కూడా ఇవ్వకపోయినా పర్వాలేదు. తినండి, తాగండి, చదవండి, రిఫ్రెష్ అయ్యి వెళ్ళండి. తండ్రి అయితే కేవలం చదివిస్తారు. ఈ చదువుకు ధనం ఏమీ తీసుకోరు. పిల్లలు అంటారు – బాబా, మేము తప్పకుండా ఇస్తాము, లేదంటే అక్కడ మహళ్ళు మొదలైనవి ఎలా లభిస్తాయి? మీరు భక్తి మార్గంలో కూడా ఈశ్వరార్థం పేదలకు దానం చేసేవారు. దానికి ఫలం కూడా ఈశ్వరుడే ఇస్తారు, పేదలు ఇవ్వరు. కానీ అది ఒక్క జన్మకు మాత్రమే లభిస్తుంది. బాబా, ఇప్పుడైతే మీరు డైరెక్టుగా వచ్చారు, మేము ఈ కొంచెం ధనం ఇస్తాము, మీరు మాకు 21 జన్మలకు స్వర్గంలో ఇవ్వండి అని అంటారు. తండ్రి అందరినీ షావుకార్లుగా తయారుచేస్తారు. ధనమిస్తే మీరు ఉండేందుకే భవనాలు మొదలైనవి తయారుచేస్తారు. లేదంటే ఇవన్నీ ఎలా తయారవుతాయి? పిల్లలే ఈ భవనాలు మొదలైనవి తయారుచేస్తారు కదా. శివబాబా అంటారు – నేనేమీ ఈ భవనాలలో ఉండను. శివబాబా అయితే నిరాకార దాత కదా. మీరు ఇస్తే, దానికి మీకు 21 జన్మల కోసం ఫలం ఇస్తారు. నేనైతే మీ స్వర్గంలోకి కూడా రాను. మిమ్మల్ని నరకం నుండి బయటకు తీసుకువచ్చేందుకు నాకు నరకంలోకి రావాల్సి ఉంటుంది. మీ గురువులైతే మిమ్మల్ని ఇంకా ఊబిలో చిక్కుకునేలా చేస్తారు. వారెవ్వరూ సద్గతినివ్వరు. ఇప్పుడు తండ్రి పవిత్ర ప్రపంచంలోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. మరి అటువంటి తండ్రిని ఎందుకు స్మృతి చేయరు? తండ్రి అంటారు – మీరు ధనం ఏమీ ఇవ్వకండి, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు నశిస్తాయి మరియు మీరు నా వద్దకు వచ్చేస్తారు. ఈ భవనాలు మొదలైనవన్నీ పిల్లలైన మీరు మీ కోసమే తయారుచేయించుకున్నారు. ఇక్కడ పిడికెడు బియ్యానికి మహిమ ఉంది కదా. పేదవారు తమ ధైర్యం అనుసారంగా ఎంత ఇస్తే, అంత వారి భాగ్యం తయారవుతుంది. షావుకార్లకు ఎంత పదవి లభిస్తుందో, పేదవారికి కూడా అంతే పదవే లభిస్తుంది. ఇరువురిదీ సమానమైపోతుంది. పేదవారి వద్ద ఉన్నదే 100 రూపాయలు అన్నప్పుడు, అందులో నుండి ఒక్క రూపాయి ఇస్తే, అలాగే షావుకార్ల వద్ద చాలా ధనమున్నా కానీ వారు కూడా 100 రూపాయలే ఇస్తే, ఇరువురికీ ఒకే విధమైన ఫలముంటుంది. అందుకే తండ్రిని పేదల పెన్నిధి అని అంటారు. భారత్ అన్నింటికంటే పేదది. నేను వచ్చి దానినే షావుకారుగా తయారుచేస్తాను. పేదవారికే దానం ఇవ్వడం జరుగుతుంది కదా. తండ్రి ఎంత స్పష్టం చేసి అర్థం చేయిస్తారు! పిల్లలూ, ఇప్పుడు మృత్యువు ఎదురుగా ఉంది. ఇప్పుడు త్వరత్వరగా చేయండి. స్మృతి యొక్క వేగాన్ని పెంచండి. అతి మధురమైన తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా వారసత్వం లభిస్తుంది. మీరు చాలా ధనవంతులుగా తయారవుతారు. తండ్రి మిమ్మల్ని, తల వంచి నమస్కరించమని, మేళాలకు వెళ్ళమని చెప్పరు. ఇంట్లో కూర్చుని ఉండగానే తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. అంతే. తండ్రి ఒక బిందువు, వారిని పరమపిత పరమాత్మ అని అంటారు. సుప్రీమ్ సోల్ అందరికన్నా ఉన్నతాతి ఉన్నతమైనవారు. తండ్రి అంటారు – నేను కూడా బిందువును, మీరు కూడా బిందువులే. కేవలం భక్తి మార్గం కోసం నా రూపాన్ని పెద్దదిగా చేసి పెట్టుకున్నారు. లేదంటే బిందువును ఎలా పూజిస్తారు? వారిని శివబాబా అని కూడా అంటారు. ఈ మాట ఎవరన్నారు? శివబాబా మాకు వారసత్వాన్ని ఇస్తున్నారని ఇప్పుడు మీరంటారు. ఇది అద్భుతం కదా. 84 జన్మల చక్రం తిరుగుతూ ఉంటుంది. అనేక సార్లు మీరు వారసత్వాన్ని తీసుకున్నారు మరియు తీసుకుంటూనే ఉంటారు. తండ్రి కూర్చుని ఎంత బాగా అర్థం చేయిస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మృత్యువు ఎదురుగా ఉంది కనుక ఇప్పుడు స్మృతి యొక్క వేగాన్ని పెంచాలి. సత్యయుగీ ప్రపంచంలో ఉన్నత పదవిని పొందేందుకు పూర్తి పురుషార్థం చేయాలి.

2. స్వ కళ్యాణం మరియు ఇతరుల కళ్యాణం చేసి ఆశీర్వాదాలను పొందాలి. పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే పూర్తి మరజీవాగా అయ్యారో, వారికి కర్మేంద్రియాల ఆకర్షణ ఉండదు. మరజీవాగా అయ్యారు అనగా అన్ని వైపుల నుండి మరణించారు, పాత ఆయువు సమాప్తమయింది. కొత్త జన్మ జరిగినప్పుడు కొత్త జన్మలో, కొత్త జీవితంలో కర్మేంద్రియాలకు ఎలా వశమవ్వగలరు? బ్రహ్మాకుమార-కుమారీ కొత్త జీవితంలో – అసలు కర్మేంద్రియాలకు వశమవ్వడమంటే ఏమిటి అనే జ్ఞానానికి కూడా అతీతంగా ఉండాలి. కొద్దిగా కూడా శూద్రత్వపు శ్వాస అనగా సంస్కారం ఎక్కడా చిక్కుకొని ఉండకూడదు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top