10 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

October 9, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘సఫలతకు అయస్కాంతం - కలుసుకోవడం మరియు మల్చుకోవడం’’

♫ వినండి ఆడియో (audio)➤

అందరి స్నేహం స్నేహ సాగరునిలో ఇమిడిపోయింది. ఇలాగే సదా స్నేహంలో లీనమై ఉంటూ ఇతరులకు కూడా స్నేహాన్ని అనుభవం చేయిస్తూ వెళ్ళండి. బాప్ దాదా పిల్లలందరి ఆలోచనలు సమానంగా కలిసిన సమ్మేళనాన్ని చూసి హర్షిస్తున్నారు. ఎగురుతూ వచ్చేవారికి సదా ఎగిరే కళ యొక్క వరదానాలు స్వతహాగా ప్రాప్తిస్తూ ఉంటాయి. బాప్ దాదా ఇక్కడికి వచ్చిన పిల్లలందరి ఉల్లాస-ఉత్సాహాలను చూసి పిల్లలందరిపై స్నేహ పుష్పాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏ మిలనంలోనైతే సంకల్పాలు సమానంగా ఉంటాయో, ఆ తర్వాత సంస్కారాలు బాబా సమానంగా ఉంటాయో – ఈ మిలనమే తండ్రితో మిలనము. ఇదే తండ్రి సమానంగా అవ్వడము. సంకల్పాల మిలనము, సంస్కారాల మిలనము – ఈ మిలనమే నిర్మానంగా అయి నిమిత్తంగా అవ్వడము. సమీపంగా వస్తున్నారు, తప్పకుండా వచ్చేస్తారు. సేవలో సఫలత యొక్క గుర్తులు చూసి హర్షిస్తున్నారు. స్నేహీలుగా అయి స్నేహ అలలను విశ్వంలో వ్యాపింపజేసేందుకే స్నేహ మిలనంలోకి వచ్చారు. కానీ ప్రతి విషయంలోనూ చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ (దానం ఇంటి నుండే మొదలవుతుంది). మొట్టమొదటగా మీకు అన్నింటికంటే ప్రియమైన ఇల్లు – ‘స్వయము’. కనుక మొదట స్వయంతో మొదలుపెట్టాలి, ఆ తర్వాత బ్రాహ్మణ పరివారంతో, ఆ తర్వాత విశ్వంతో. ప్రతి సంకల్పంలోనూ స్నేహం ఉండాలి – సత్యమైన నిస్వార్థ స్నేహం, హృదయపూర్వకమైన స్నేహం, ప్రతి సంకల్పంలోనూ సహానుభూతి, ప్రతి సంకల్పంలోనూ దయాహృదయం ఉండాలి, దాతృత్వ భావన సహజ స్వభావంగా అవ్వాలి – ఇదే స్నేహ మిలనం, సంకల్పాల మిలనం, ఆలోచనల మిలనం, సంస్కారాల మిలనం. సర్వుల సహయోగం యొక్క కార్యానికి ముందు, సదా సర్వ శ్రేష్ఠ బ్రాహ్మణాత్మల సహయోగము విశ్వాన్ని సహజంగానే మరియు స్వతహాగానే సహయోగిగా చేస్తుంది, అందుకే సఫలత సమీపంగా వస్తుంది. కలవడం మరియు మల్చుకోవడం అనగా పరివర్తన అవ్వడం – ఇదే సఫలతకు అయస్కాంతము. ఈ అయస్కాంతానికి సర్వాత్మలు తప్పకుండా చాలా సహజంగా ఆకర్షించబడి వస్తారు.

మీటింగుకు వచ్చిన పిల్లలకు కూడా బాప్ దాదా స్నేహపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పుడు సమీపంగా ఉన్నారు మరియు సదా సమీపంగానే ఉంటారు. కేవలం బాబాకు మాత్రమే కాదు, కానీ పరస్పరంలో కూడా సమీపత యొక్క దృశ్యాన్ని బాప్ దాదాకు చూపించారు. ఈ దృశ్యాన్ని విశ్వానికి చూపించేకన్నా ముందు బాప్ దాదా చూసారు. రాబోయే వారు, పిల్లలైన మీ అందరి యాక్షన్లు (కర్మలు) చూసి – ఏ కర్మలు చేయాలి, ఏం జరగాలి అనేది సహజంగా అర్థం చేసుకుంటారు. మీ యాక్షన్లే (కర్మలే) వారి కోసం యాక్షన్ ప్లాను (కర్మల-ప్రణాళిక). అచ్ఛా.

అందరూ ప్లాన్లు బాగా తయారుచేసారు. ఎలాగైతే ఈ కార్యం ప్రారంభమవుతూనే బాప్ దాదా విశేషంగా వర్గీకరణ సేవ చేసేందుకు సూచన ఇచ్చారో, అదే సూచనను ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఈ మహాన్ కార్యంలో ఏ వర్గము మిగిలిపోకూడదు అనే లక్ష్యం పెట్టుకోండి. సమయ ప్రమాణంగా ఎక్కువ చేయలేకపోయినా కనీసం శ్యాంపుల్ తప్పకుండా తయారవ్వాలనే ప్రయత్నం లేక లక్ష్యాన్ని తప్పకుండా పెట్టుకోండి. ఇక ముందు ఇదే కార్యాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. కనుక సమయ ప్రమాణంగా చేస్తూ ఉండండి. కానీ సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేందుకు సర్వుల సహయోగం కావాలి. కానీ ఇంత పెద్ద ప్రపంచంలోని ఆత్మలందరినీ ఒకే సమయంలో సంపర్కంలోకి తీసుకురాలేరు. అందుకే ‘మేము సర్వాత్మలను సర్వ వర్గాల ఆధారంగా సహయోగులుగా చేసాము’ అని మీరు నషాతో చెప్పవచ్చు. ఈ లక్ష్యము సర్వుల కారణాలను పూర్తి చేస్తుంది. మీరేం చేస్తున్నారో మాకు తెలియనే తెలియదు అనే ఫిర్యాదు ఏ వర్గం వారికి ఉండిపోకూడదు. బీజం వేయండి. ఇక తర్వాత వృద్ధి అనేది సమయం లభించినదాని బట్టి, ఎలా చేయగలరో అలా చేయండి. ఎలా చేయాలి? ఎంత చేయాలి? అని అనుకుంటూ భారీగా అవ్వకండి. ఎంత జరగాలని ఉంటే, అంత తప్పకుండా జరుగుతుంది. ఎంతైతే చేసారో, అంత సఫలతకు సమీపంగా వచ్చారు. శ్యాంపుల్ ను అయితే తయారుచేయగలరు కదా?

భారత ప్రభుత్వాన్ని సమీపంగా తీసుకురావాలనే శ్రేష్ఠ సంకల్పం చేసారు కదా, ఇప్పుడు ఆ సమయం సర్వుల బుద్ధిని సమీపంగా తీసుకొస్తుంది. కనుక బ్రాహ్మణ ఆత్మలందరూ ఈ విశేషమైన కార్యార్థం ప్రారంభం నుండి చివరి వరకు విశేషంగా ‘సఫలత లభించే తీరుతుంది’ అనే శుద్ధ సంకల్పం ద్వారా మరియు బాబా సమానమైన వైబ్రేషన్లను తయారుచేయడం ద్వారా, విజయం నిశ్చితము అనే దృఢత్వంతో ముందుకు సాగండి. కానీ ఎప్పుడైనా ఏదైనా పెద్ద కార్యం చేయాల్సి ఉన్నప్పుడు, ఎలాగైతే స్థూలంగా కూడా ఏదైనా బరువును ఎత్తేటప్పుడు ఏం చేస్తారు? అందరూ కలిసి తమ వేలును అందిస్తారు మరియు అందరి ధైర్యం-ఉత్సాహాలను పెంచే మాటలు మాట్లాడుతారు. చూసారు కదా! అలాగే నిమిత్తంగా ఎవరు ఉన్నా సరే, సదా ఈ విశేషమైన కార్యం కోసం సర్వుల స్నేహం, సర్వుల సహయోగం, సర్వుల శక్తితో కూడిన ఉల్లాస-ఉత్సాహాల వైబ్రేషన్లు కుంభకర్ణులను నిద్ర నుండి మేల్కొల్పుతాయి. ఈ విశేషమైన కార్యం కోసం ఈ అటెన్షన్ తప్పనిసరి. విశేషంగా స్వ, సర్వ బ్రాహ్మణాత్మలు మరియు విశ్వాత్మలు, ఇలా అందరి సహయోగం తీసుకోవడమే సఫలతకు సాధనము. ఒకవేళ ఇందులో కొద్దిగా తేడా వచ్చినా సరే, సఫలతలో తేడాను తీసుకొచ్చేందుకు నిమిత్తులవుతారు, అందుకే బాప్ దాదా పిల్లలందరి ధైర్యంతో కూడిన మాటలను విని అదే సమయంలో హర్షిస్తున్నారు, అంతేకాక, ప్రత్యేకంగా సంగఠన యొక్క స్నేహం కారణంగా స్నేహానికి రిటర్న్ ఇచ్చేందుకు వచ్చారు. చాలా బాగున్నారు మరియు అనేక సార్లు చాలా బాగా అయ్యారు మరియు అయ్యే ఉన్నారు. అందుకే, డబల్ విదేశీ పిల్లలు దూరంగా ఉంటున్నా ఎవర్రెడీగా అయి ఎగురుతున్నందుకు బాప్ దాదా విశేషంగా పిల్లలను తమ హృదయంలోని హారంగా చేసుకొని హృదయంలో ఇముడ్చుకుంటారు. అచ్ఛా.

కుమారీలు కన్నయ్యకు (బాబాకు) చెందినవారిగా ఉండనే ఉన్నారు. కేవలం ఒక పదం గుర్తుంచుకోండి – అన్నింటిలోనూ ఏక్ (ఒకటి), ఏక్ మత్, ఏక్ రస్, ఏక్ బాబా. భారత్ పిల్లలకు కూడా బాప్ దాదా హృదయపూర్వకంగా శుభాకాంక్షలను తెలుపుతున్నారు. ఎలాంటి లక్ష్యం పెట్టుకున్నారో, అలాంటి లక్షణాలను ప్రాక్టికల్ లోకి తీసుకొచ్చారు. అర్థమయిందా? ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు – అందరికి చెప్తున్నారు! నిమిత్తంగా ఉన్నవారికి (దాదీజీకి) ఆలోచన ఉంటుంది కదా. ఇదే సహానుభూతికి గుర్తు. అచ్ఛా.

మీటింగ్ కు వచ్చిన సోదరసోదరలను బాప్ దాదా స్టేజ పైకి పిలిచారు

అందరు బుద్ధిని బాగా నడిపించారు. బాప్ దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరికి సేవ పట్ల ఉన్న స్నేహం గురించి తెలుసు. సేవలో ముందుకు వెళ్ళడంతో నలువైపులా ఎంతవరకు సఫలత ఉంది – దీని గురించి కేవలం కాస్త ఆలోచించండి మరియు గమనించండి. ఇకపోతే, సేవ పట్ల తపన బాగుంది. రాత్రి-పగలును ఒకటిగా చేసి సేవ కోసం పరుగుపెడతారు. బాప్ దాదా శ్రమను కూడా ప్రేమ రూపంలో చూస్తారు. మీరు శ్రమించలేదు, ప్రేమను చూపించారు. అచ్ఛా! మంచి ఉల్లాస-ఉత్సాహాలు గల సాథీలు (సహచరులు) లభించారు. కార్యము విశాలమైనది మరియు హృదయం కూడా విశాలమైనది. కనుక ఎక్కడైతే విశాలత ఉంటుందో, అక్కడ సఫలత తప్పకుండా ఉంటుంది. పిల్లలందరికీ సేవ పట్ల ఉన్న తపనను చూసి బాప్ దాదా ప్రతి రోజు సంతోషంతో పాటలను పాడుతారు. చాలా సార్లు ఒక పాటను వినిపించారు – ‘వాహ్ పిల్లలూ వాహ్!’ అచ్ఛా! రావడంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయి! రహస్యాలను అర్థం చేసుకునేవారే కదా! ఆ రహస్యాలకు తెలుసు, ఆ బాబాకు తెలుసు. (దాదీజీ బాప్ దాదాకు భోగ్ స్వీకరింపజేయాలని అనుకున్నారు). ఈ రోజు దృష్టి ద్వారానే స్వీకరిస్తాము. అచ్ఛా!

అందరి బుద్ధి చాలా బాగా నడుస్తుంది. అంతేకాక, ఒకరికొకరు సమీపంగా కూడా వస్తున్నారు కదా! అందుకే సఫలత అతి సమీపంగా ఉంది. మీ సమీపత సఫలతను సమీపంగా తీసుకొస్తుంది. అలసిపోలేదు కదా? చాలా పని చేయాల్సి వచ్చిందా? కానీ సగం పని బాబాయే చేస్తారు. అందరిలో మంచి ఉల్లాసం ఉంది. దృఢత కూడా ఉంది కదా! సమీపత ఎంత సమీపంగా ఉంది? అయస్కాంతం పెడితే సమీపత అందరి మెడలో మాల వేస్తుంది, ఇలా అనుభవమవుతుందా? అచ్ఛా! అందరు చాలా-చాలా బాగున్నారు.

దాదీల కోసం చ్చరింబడిన అవ్యక్త మహావాక్యాలు (31-3-1988)

బాబా పిల్లలకు ధన్యవాదాలు తెలుపుతారు, పిల్లలు బాబాకు ధన్యవాదాలు తెలుపుతారు. ఒకరికొకరు ధన్యవాదాలు తెలుపుతూ-తెలుపుతూ ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళేందుకు విధానం ఇదే. ఈ విధి వల్లే మీ సంగఠన బాగుంది. ఒకరికొకరు ‘హాజీ’ చెప్పుకున్నారు, ‘ధన్యవాదాలు’ తెలిపారు, తద్వారా ముందుకు వెళ్ళారు. ఇదే విధిని అందరూ అనుసరిస్తే ఫరిశ్తాలుగా అవుతారు. బాప్ దాదా చిన్న మాలను చూసి సంతోషిస్తారు. ఇప్పుడింకా కంకణము తయారయింది, మెడలోని మాల తయారవుతూ ఉంది. మెడలోని మాలను తయారుచేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు అటెన్షన్ కావాలి. ఎక్కువ సేవలోకి వెళ్ళినప్పుడు అక్కడక్కడ స్వయం పట్ల అటెన్షన్ తగ్గిపోతుంది. అప్పుడప్పుడు ‘విస్తారం’లో ‘సారం’ మర్జ్ (గుప్తంగా) అయిపోతుంది, ఇమర్జ్ (ప్రత్యక్ష) రూపంలో ఉండదు. ఇప్పుడిలా జరగాలి అని మీరే అంటారు. కానీ ‘ఏది జరగాలో అదే జరుగుతుంది’ అని చెప్పే రోజు కూడా తప్పకుండా వస్తుంది. దీపాల మాల ముందు ఇక్కడే తయారవుతుంది. బాప్ దాదా మిమ్మల్ని ‘ప్రతి ఒక్కరి ఉల్లాస-ఉత్సాహాలను పెంచే ఉదాహరణ’గా భావిస్తారు. మీ ఐకమత్యమే యజ్ఞానికి కోట వంటిది. 10 మంది ఉన్నా, 12 మంది ఉన్నా మీరంతా కోటకు గోడల వంటివారు. మరి బాప్ దాదా ఎంత సంతోషిస్తారు! బాప్ దాదా అయితే ఉండనే ఉన్నారు కానీ మీరు నిమిత్తంగా ఉన్నారు. ఇలాంటి సంగఠన వలె రెండవ గ్రూపు, మూడవ గ్రూపు తయారైతే అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి గ్రూపును తయారుచేయండి. మొదటి గ్రూపు వారికి పరస్పరంలో స్నేహముంది అని అందరు అంటారు కదా. స్వభావాలు వేర్వేరుగా ఉన్నాయి, అవి అలానే ఉంటాయి, కానీ ‘గౌరవం’ ఉంది, ‘ప్రేమ’ ఉంది, ‘హాజీ’ ఉంది, సమయానికి స్వయాన్ని మల్చుకుంటారు, అందుకే ఈ కోట గోడలు దృఢంగా ఉన్నాయి, అందుకే ముందుకు వెళ్తున్నారు. పునాదిని చూసి సంతోషమనిపిస్తుంది కదా. ఈ మొదటి గ్రూపు ఎలా కనిపిస్తుందో, అలాంటి శక్తిశాలి గ్రూపు తయారైతే సేవ వెనుక-వెనుకే వస్తుంది. డ్రామాలో విజయమాల నిశ్చయించబడి ఉంది కనుక తప్పకుండా ఒకరికొకరు సమీపంగా వచ్చినప్పుడే మాల తయారవుతుంది. ఒక పూస ఒక వైపు ఉండి, రెండవ పూస మొదటి పూసకు దూరంగా ఉంటే మాల తయారవ్వదు. పూసలు కలిసినప్పుడే, ఒకదానికి ఒకటి సమీపంగా వచ్చినప్పుడే మాల తయారవుతుంది. మీరు మంచి ఉదాహరణగా ఉన్నారు. అచ్ఛా!

ఇప్పుడు మిలనం జరుపుకునేవారి కోటాను పూర్తి చేయాలి. రథానికి ఎక్స్ ట్రా సకాష్ ఇచ్చి నడిపిస్తున్నామని వినిపించాను కదా. లేదంటే ఇది సాధారణ విషయం కాదు. అన్నీ చూడాల్సి ఉంటుంది కదా. అయినా అన్ని శక్తుల ఎనర్జీ జమ అయి ఉంది కనుక రథం కూడా ఇంత సహయోగం ఇస్తోంది. శక్తుల జమ అయి లేకుంటే ఇంత సేవ చేయడం కష్టమవుతుంది. డ్రామాలో ప్రతి ఆత్మకు పాత్ర ఉంది. ఏదైతే శ్రేష్ఠ కర్మల శక్తి జమ అవుతుందో, అది సమయానికి పనికొస్తుంది. ఎంతోమంది ఆత్మల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి, అవి కూడా జమ అవుతాయి. ఏదో ఒక విశేషమైన పుణ్యం జమ అయిన కారణంగా విశేషమైన పాత్ర ఉంది. రథం నిర్విఘ్నంగా నడవాలి, ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది. 6 మాసాలు తక్కువ సమయమేమీ కాదు. అచ్ఛా! అందరిని సంతుష్ట పరుస్తాము.

అవ్యక్త మురళీల నుండి ఎన్నుకోబడిన కొన్ని అమూల్యమైన మహావాక్యాలు (ప్రశ్న-జవాబులు)

ప్రశ్న:- ఏ పదం యొక్క అర్థ స్వరూపంలో స్థితులవ్వడంతోనే అన్ని బలహీనతలు సమాప్తమైపోతాయి?

జవాబు:- కేవలం ‘పురుషార్థీ’ అనే పదం యొక్క అర్థ స్వరూపంలో స్థితులవ్వండి. పురుష్ అనగా ఈ రథానికి సారథి, ప్రకృతికి యజమాని. ఈ ఒక్క పదం యొక్క అర్థ స్వరూపంలో స్థితులవ్వడంతో అన్ని బలహీనతలు సమాప్తమైపోతాయి. పురుష్ ప్రకృతికి అధికారి కదా, ఆధీనుడు కాదు. సారథి రథాన్ని నడిపించేవారు, రథానికి ఆధీనులయ్యేవారు కాదు.

ప్రశ్న:- ఆదికాలంలో రాజ్య అధికారిగా అయ్యేందుకు ఏ సంస్కారాలను ఇప్పటి నుండి ధారణ చేయాలి?

జవాబు:- మీ ఆది, అవినాశీ సంస్కారాలను ఇప్పటి నుండి ధారణ చేయండి. ఒకవేళ చాలాకాలం యుద్ధం చేసే సంస్కారాలు ఉంటే అనగా యుద్ధం చేస్తూ-చేస్తూ సమయం గడిపితే, ఈ రోజు గెలుపు, రేపు ఓటమి ఉంటే, ఇప్పుడిప్పుడే గెలుపు, ఇప్పుడిప్పుడే ఓటమి ఉంటే, సదాకాలానికి విజయులుగా అయ్యే సంస్కారాలు తయారవ్వలేదంటే, క్షత్రియులుగా పిలవబడతారు, బ్రాహ్మణులుగా కాదు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు, క్షత్రియులు క్షత్రియులలోకి వెళ్ళిపోతారు.

ప్రశ్న:- విశ్వపరివర్తకులుగా అయ్యే ముందు ఎలాంటి పరివర్తన చేసుకునే శక్తి కావాలి?

జవాబు:- విశ్వపరివర్తకులుగా అయ్యే ముందు తమ సంస్కారాలను పరివర్తన చేసుకునే శక్తి కావాలి. దృష్టి మరియు వృత్తుల పరివర్తన అవ్వాలి. మీరు దృష్టి ద్వారా చూసే దృష్టా (చూసేవారు). దివ్య నేత్రంతో చూడండి, అంతేకానీ చర్మచక్షువులతో కాదు. దివ్య నేత్రంతో చూస్తే స్వతహాగానే దివ్య రూపము కనిపిస్తుంది. చర్మచక్షువులు చర్మాన్నే చూస్తాయి. చర్మం కోసమే ఆలోచిస్తాయి – ఇది ఫరిశ్తాలు లేక బ్రాహ్మణుల పని కాదు.

ప్రశ్న:- పరస్పరంలో సోదరీ-సోదరుల సంబంధంలో ఉన్నా కానీ ఏ దివ్య నేత్రంతో చూసినట్లయితే దృష్టి మరియు వృత్తి ఎప్పుడూ చంచలమవ్వవు?

జవాబు:- శరీరధారి అయిన ప్రతి నారి యొక్క ఆత్మను శక్తి రూపంలో, జగన్మాత రూపంలో, దేవి రూపంలో చూడండి – ఇదే దివ్య నేత్రంతో చూడడము. శక్తి ముందుకు ఎవరైనా ఆసురీ వృత్తితో వస్తే భస్మమైపోతారు, అందుకే మా సోదరి లేక మా టీచరు అని చూడకండి, వీరు శివశక్తి. మాతలు, సోదరీలు కూడా సదా తమ శివశక్తి స్వరూపంలో స్థితులై ఉండాలి. నా విశేషమైన సోదరుడు, నా విద్యార్థి అని భావించకూడదు. వారు మహావీరులు, వీరు శివశక్తులు.

ప్రశ్న:- మహావీరుల విశేషతను ఏం చూపిస్తారు?

జవాబు:- వారి మనసులో సదా ఒక్క రాముడు ఉంటారు. మహావీరులు రామునికి చెందినవారైతే, శక్తులు శివునికి చెందినవారు. ఏ దేహధారిని చూసినా కానీ, మస్తకంలో ఉన్న ఆత్మను చూడండి. ఆత్మతో మాట్లాడాలి, శరీరంతో కాదు. దృష్టి కూడా మస్తకమణి పైకే వెళ్ళాలి.

ప్రశ్న:- ఏ పదాన్ని నిర్లక్ష్య రూపంలో ఉపయోగించకుండా ఒక్క అటెన్షన్ పెట్టాలి? అది ఏమిటి?

జవాబు:- ‘పురుషార్థి’ అనే పదాన్ని నిర్లక్ష్య రూపంలో ఉపయోగించకుండా కేవలం ప్రతి విషయంలోనూ దృఢ సంకల్పం కలవారిగా అయ్యే అటెన్షన్ పెట్టాలి. మీరు ఏం చేసినా శ్రేష్ఠ కర్మలే చేయాలి, శ్రేష్ఠంగానే అవ్వాలి. ఓం శాంతి.

వరదానము:-

ఎవరైతే సమయానికి పనికొస్తుందని పాత సంస్కారాల ఆస్తిని కొంత దాచి పెట్టుకుంటారో, వారిని మాయ ఏదో ఒక విధంగా పట్టుకుంటుంది. పాత రిజిస్టరులోని ఒక చిన్న ముక్క ఉన్నా పట్టుబడతారు. మాయ చాలా తీక్షణమైనది, దాని క్యాచింగ్ పవర్ తక్కువేమీ కాదు, అందుకే వికారాల వంశం యొక్క అంశాన్ని కూడా సమాప్తం చేయండి. కొద్దిగా కూడా ఏ మూలలోనూ పాత ఖజానా యొక్క గుర్తు కూడా ఉండకూడదు – అటువంటి వారినే సర్వ సమర్పణులు, ట్రస్టీలు లేక యజ్ఞ స్నేహీలు, సహయోగులని అంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top