11 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

May 10, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - సుఖ-శాంతుల వరదానము ఒక్క తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది, ఏ దేహధారుల నుండి లభించదు, మీకు ముక్తి-జీవన్ముక్తుల మార్గాన్ని చూపించేందుకు బాబా వచ్చారు”

ప్రశ్న: -

తండ్రితో పాటు వెళ్ళేందుకు మరియు సత్యయుగ ఆదిలో వచ్చేందుకు పురుషార్థం ఏమిటి?

జవాబు:-

బాబాతో పాటు వెళ్ళాలంటే పూర్తిగా పవిత్రంగా అవ్వాలి. సత్యయుగ ఆదిలో వచ్చేందుకు ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తెంచి, ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. ఆత్మాభిమానిగా తప్పకుండా అవ్వాలి. ఒక్క తండ్రి మతంపై నడుచుకున్నట్లయితే ఉన్నత పదవి యొక్క అధికారం లభిస్తుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నయన హీనులకు మార్గాన్ని చూపించండి….. (నయన్ హీన్ కో రాహ్ దిఖావో…..)

ఓంశాంతి. ఈ పాటను ఎవరు పాడారు? పిల్లలు పాడారు, ఎందుకంటే తండ్రి ఒక్కరే, వారినే రచయిత అని అనడం జరుగుతుంది. రచన, రచయితను పిలుస్తుంది. భక్తి మార్గంలో మీకు ఇద్దరు తండ్రులున్నారని బాబా అర్థం చేయించారు. ఒకరు లౌకికము, మరొకరు పారలౌకికము. ఆత్మలందరి తండ్రి ఒక్కరే. తండ్రి ఒక్కరే అయిన కారణంగా ఆత్మలందరూ పరస్పరంలో తమను తాము సోదరులము అని పిలుచుకుంటారు. ఓ గాడ్ ఫాదర్, ఓ పరమపిత దయ చూపించండి, క్షమించండి అని ఆ తండ్రిని పిలుస్తారు. భక్తుల రక్షకుడు భగవంతుడు ఒక్కరే. మొట్టమొదట మనకు ఇద్దరు తండ్రులున్నారు అన్న విషయాన్ని అర్థం చేయించాలి. పారలౌకిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే. ఇకపోతే లౌకిక తండ్రి ప్రతి ఒక్కరికి వేరు-వేరుగా ఉంటారు. ఇప్పుడు లౌకిక తండ్రి గొప్పవారా లేదా పారలౌకిక తండ్రి గొప్పవారా? లౌకిక తండ్రిని ఎప్పుడూ భగవంతుడు అని లేదా పరమపిత అని అనరు. ఆత్మల తండ్రి ఒక్క పరమపిత పరమాత్మయే. ఆత్మ పేరు ఎప్పుడూ మారదు. శరీరం పేరు మారుతుంది. ఆత్మ రకరకాల శరీరాలను ధరించి పాత్రను అభినయిస్తుంది అనగా పునర్జన్మలను తీసుకుంటుంది. చివరికి ఎన్ని జన్మలు ఉంటాయి అనేది కూడా తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. పిల్లలూ, మీకు మీ జన్మల గురించి తెలియదు. తండ్రి భారత్ లోనే వస్తారు, వారి పేరు శివ. శివుడు పరమాత్మ అని కూడా అర్థం చేసుకుంటారు. శివజయంతి లేక శివరాత్రిని కూడా జరుపుకుంటారు. ఎలాగైతే ఆత్మ కూడా నిరాకారియో, అలా వారు నిరాకారుడు. వారు నిరాకారం నుండి పాత్రను అభినయించేందుకు సాకారంలోకి వస్తారు. ఇప్పుడు నిరాకార శివుడు శరీరం లేకుండా పాత్రను అభినయించలేరు. మనుష్యులు ఈ విషయాలను ఏమీ అర్థం చేసుకోరు, నయనహీనులుగా ఉన్నారు. శరీరం యొక్క రెండు నేత్రాలైతే అందరికీ ఉంటాయి. కానీ, ఆత్మకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లేదు, దీనిని దివ్య చక్షువు అని కూడా అంటారు. ఆత్మ తన తండ్రిని మర్చిపోయింది, అందుకే నయనహీనులకు మార్గం చూపించండి అని పిలుస్తారు. ఎక్కడికి మార్గము? శాంతిధామము మరియు సుఖధామానికి మార్గము. సర్వుల సద్గతిదాత, సద్గురువు ఒక్కరే. మనుష్యులు, మనుష్యులకు గురువులుగా అయి సద్గతినివ్వలేరు. వారు స్వయము సద్గతిని పొందరు, ఇతరులకు కూడా ఇవ్వరు. ఒక్క తండ్రి మాత్రమే సర్వులకు సద్గతిని ఇస్తారు. ఆ అల్ఫ్ అయిన తండ్రినే స్మృతి చేయాలి. మనుష్యమాత్రులు ఎవరూ ముక్తి-జీవన్ముక్తిని, శాంతి మరియు సుఖాన్ని సదా కాలం కోసం ఇవ్వలేరు అని తండ్రి అర్థం చేయిస్తారు. సుఖ-శాంతుల వరదానాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు. మనుష్యులు, మనుష్యులకు ఇవ్వలేరు. భారతవాసులు సతోప్రధానంగా ఉన్నప్పుడు, సత్యయుగ స్వర్గవాసులుగా ఉండేవారు. ఆత్మ పవిత్రంగా ఉండేది. ఆత్మలు పవిత్రంగా, సతోప్రధానంగా ఉన్నప్పుడు భారత్ ను స్వర్గము అని అనడం జరుగుతుంది.

తప్పకుండా నేటికి 5 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా, సతోప్రధానంగా ఉండేదని, ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేదని మీకు తెలుసు. ఇప్పుడిది కలియుగంలో కూడా అంతిమము, దీనిని నరకం అని అనడం జరుగుతుంది. ఇదే భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు చాలా సంపన్నంగా ఉండేది. వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. తండ్రి పిల్లలకు స్మృతిని ఇప్పిస్తున్నారు. సత్యయుగ ఆదిలో ఈ లక్ష్మీనారాయణుల రాజధాని ఉండేది. దానిని స్వర్గము, వైకుంఠము అని అంటారు. ఇప్పుడు స్వర్గం లేదు, ఇది తండ్రి అర్థం చేయిస్తారు. బాబా భారత్ లోనే వస్తారు. నిరాకారుడైన శివుని జయంతిని కూడా జరుపుకుంటారు, కానీ వారు ఏమి చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. ఆత్మలైన మన తండ్రి శివుడు, వారి జయంతిని మనం జరుపుకుంటాము. తండ్రి బయోగ్రఫీ గురించి కూడా తెలియదు. దుఃఖంలో అందరూ స్మరిస్తారు అని అంటూ ఉంటారు కూడా. ఓ గాడ్ ఫాదర్, దయ చూపించండి, మేము చాలా దుఃఖంలో ఉన్నాము ఎందుకంటే ఇది రావణ రాజ్యము అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం రావణుడిని కాలుస్తారు కదా. కానీ, 10 తలల రావణుడు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. మనం రావణుడిని ఎందుకు కాలుస్తాము, రావణుడు ఎలాంటి శత్రువు అయిన కారణంగా అతడి దిష్టి బొమ్మను తయారుచేసి కాలుస్తామనేది ఎవరికీ తెలియదు. భారతవాసులకు అసలు తెలియదు, ఎందుకంటే జ్ఞానం యొక్క మూడవ నేత్రం లేదు, అందుకే రామ రాజ్యం కావాలని కోరుకుంటారు. స్త్రీలో 5 వికారాలు, పురుషుడిలో 5 వికారాలు ఉన్నాయి, అందుకే దీనిని రావణ సంప్రదాయమని అంటారు. ఈ రావణుని 5 వికారాలే అతి పెద్ద శత్రువు, అతడి దిష్టి బొమ్మను తయారుచేసి కాలుస్తారు. మేము కాలుస్తున్న ఆ రావణుడు ఎవరు అనేది భారతవాసులకు తెలియదు. రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది అనేది కూడా ఎవరికీ తెలియదు. సత్య-త్రేతాయుగాలు రామ రాజ్యమని, ద్వాపర-కలియుగాలు రావణ రాజ్యమని తండ్రి అర్థం చేయిస్తారు. సత్యయుగంలో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది, వారికి ఈ రాజ్యం ఎక్కడ నుండి లభించింది, ఎలా లభించింది అని ఎవరికీ తెలియదు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ విషయాల పట్ల అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. తండ్రి అత్యంత ప్రియమైనవారు, అందుకే వారిని భక్తి మార్గంలో కూడా పిలుస్తారు. భారత్ లో వీరి (లక్ష్మీనారాయణుల) రాజ్యమున్నప్పుడు దుఃఖమన్న మాటే ఉండేది కాదు. ఇప్పుడిది దుఃఖధామము, అనేక ధర్మాలు ఎన్ని ఉన్నాయి. సత్యయుగంలో ఒకే ధర్మముండేది, మిగిలిన ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి, ఇది కూడా ఎవరికీ తెలియదు ఎందుకంటే నయనహీనులుగా ఉన్నారు. శాస్త్రాల ద్వారా జ్ఞానం యొక్క మూడవ నేత్రం ఎవరికీ లభించదు. జ్ఞాన నేత్రాన్ని జ్ఞానసాగరుడైన పరమపిత పరమాత్మనే ఇస్తారు. ఆత్మకు మూడవ నేత్రం లభిస్తుంది. ఎన్ని జన్మలు తీసుకున్నాను అనేది ఆత్మ మర్చిపోయింది. సత్యయుగంలో ఏదైతే దేవీ-దేవతల రాజ్యముండేదో, అది ఎక్కడికి వెళ్ళిపోయింది? మనుష్యులు 84 జన్మలు తీసుకుంటారని పాడుతారు కూడా. 84 జన్మల చక్రమని అంటారు. కానీ ఏ ఆత్మ 84 జన్మలను తీసుకుంటుంది? ఎవరైతే మొట్టమొదట భారత్ లోకి వస్తారో, వారు దేవీ-దేవతలు. తర్వాత 84 జన్మలను అనుభవించి చివర్లో పతితులుగా అయిపోతారు. హే పతితపావనా అని పాడుతారు కూడా, అంటే స్వయం పతితులమని వారే నిరూపించుకుంటారు, అందుకే – హే పతితపావనా, మమ్మల్ని పావనంగా చేయడానికి రండి అని పిలుస్తారు. ఎవరైతే స్వయమే పతితులుగా ఉన్నారో, వారు ఇతరులను ఎలా పావనంగా చేయగలరు. బాబా అర్థం చేయిస్తారు – అర్ధకల్పం భక్తి మార్గంలో రావణ రాజ్యము, 5 వికారాలున్న కారణంగా భారత్ ఇంతటి దుఃఖాన్ని పొందింది. 84 జన్మలనైతే తప్పకుండా తీసుకుంటారు. ఆ లెక్కను కూడా అర్థం చేయించాలి. మొట్టమొదట సత్యయుగంలో సతోప్రధానంగా ఉంటారు, తర్వాత త్రేతాలో సతో….. అలా ఆత్మలో మాలిన్యం చేరుకుంటుంది. తండ్రి భారత్ లోనే వస్తారు. శివజయంతి ఉంది కదా. మిగిలిన ఆత్మలన్నీ గర్భం ద్వారా జన్మ తీసుకుంటాయి. నేను సాధారణ వృద్ధ తనువులో ప్రవేశిస్తానని తండ్రి అంటారు. ఇది వీరి అనేక జన్మల అంతిమ జన్మ. ఇది ఎవరో ఒక్కరికే అర్థం చేయించరు. ఇది గీతా పాఠశాల. మనుష్యులను దేవతలుగా తయారుచేసేందుకు ఈ రాజయోగాన్ని నేర్పించడం జరుగుతుంది. స్వర్గ రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు మీరు ఇక్కడకు వచ్చారు, దీనిని తండ్రి మాత్రమే ఇవ్వగలరు. గీతను చదవడం ద్వారా ఎవరూ రాజులుగా అవ్వరు, ఇంకా పేదవారిగా అవుతూ ఉంటారు. తండ్రి గీతా జ్ఞానాన్ని వినిపించి రాజుగా తయారుచేస్తారు, ఇతరుల ద్వారా గీతను వినడంతో నిరుపేదలుగా అయిపోయారు. భారత్ లో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యమున్నప్పుడు, పవిత్రత-శాంతి-సంపదలుండేవి, పవిత్ర గృహస్థ ఆశ్రమముండేది. అక్కడ హింస అన్న మాటే లేదు, తర్వాత ద్వాపరం నుండి మొదలుకొని హింస ప్రారంభమయ్యింది. కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తూ-ఉపయోగిస్తూ, మీ గతి ఇలా తయారయ్యింది. సత్యయుగంలో 100 శాతం సంపన్నులుగా, సతోప్రధానంగా ఉండేవారు. ఈ రహస్యం గురించి మనుష్యులెవరికీ మరియు సాధువు-సత్పురుషులు మొదలైనవారెవరికీ తెలియదు. జ్ఞానసాగరుడు, పతితపావనుడైన తండ్రియే వచ్చి సతోప్రధానంగా అయ్యే యుక్తిని తెలియజేస్తారు. రావణుని మతంపై మనుష్యుల పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. ఎవరైతే పవిత్ర రాజులు ఉండి వెళ్ళారో, ఇక్కడి రాజులు వారి చరణాలపై పడతారు, మరియు – మీరు సర్వగుణ సంపన్నులు, మేము నీచులము, పాపులము, మాలో ఏ గుణాలు లేవు అని అంటారు. తర్వాత మళ్ళీ, మాపై దయ చూపించండి, మీరు వచ్చి మమ్మల్ని మందిర యోగ్యంగా తయారు చేయండి అని వారి మహిమను పాడుతారు. తండ్రి వచ్చి దేవీ-దేవతా ధర్మాన్ని మళ్ళీ ఎలా స్థాపన చేయిస్తారు అనేది ఎవరికీ అర్థం కాదు. మేమే దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారము, మేమే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యాము, ఇన్ని జన్మలు తీసుకున్న తర్వాత ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయని మీరు అర్థం చేసుకుంటారు. మళ్ళీ ప్రపంచ చక్రం తిరగవలసి ఉంటుంది కావున మీరు ఇక్కడే పావనంగా అవ్వాలి. పతితులు సుఖధామంలోకి, శాంతిధామంలోకి వెళ్ళలేరు. సతోప్రధానంగా ఉన్న మీరు తమోప్రధానంగా అయ్యారని తండ్రి అర్థం చేయిస్తారు. బంగారు యుగం నుండి ఇనుప యుగంలోకి వచ్చారు, తర్వాత బంగారు యుగము వారిగా అవ్వాలి, అప్పుడే ముక్తిధామంలోకి, సుఖధామంలోకి వెళ్ళగలరు. భారత్ సుఖధామంగా ఉండేది. ఇప్పుడు దుఃఖధామంగా ఉంది. నయనహీనులైన మాకు మార్గాన్ని చూపించండి….. అని పాటలో కూడా విన్నారు. మనం మన శాంతిధామానికి ఎలా వెళ్ళగలము. వారు పరమాత్మ సర్వవ్యాపి, వారు ఫలానా అవతారము, పరశురామ అవతారమని అనేస్తారు. ఇప్పుడు తండ్రి పరశురామునిగా అయి ఎవరినైనా హతమారుస్తారా ఏమిటి? ఇది అసంభవము. మీరు ఈ చక్రంలో 84 జన్మలను ఎలా తీసుకున్నారు అనేది తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు అల్ఫ్ అయిన నన్ను స్మృతి చేయండి. హే ఆత్మలు, దేహీ-అభిమానులుగా అవ్వండి. దేహాభిమానులుగా అయి మీరు పూర్తిగా దుఃఖమయంగా, నిరుపేదగా, నరకవాసులుగా అయిపోయారు. ఒకవేళ స్వర్గవాసులుగా అవ్వాలనుకుంటే, తప్పకుండా ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి, తర్వాత సత్యయుగ ఆదిలోకి వెళ్ళాలి. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తెంచండి. గృహస్థ వ్యవహారంలో ఉండండి కానీ స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వాలి, నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యమంతా కాలిపోతుంది. మీరు పవిత్రంగా అయినట్లయితే నేను పిల్లలందరినీ తీసుకువెళ్తాను. ఒకవేళ నా మతంపై నడవకపోతే, అంతటి ఉన్నత పదవిని పొందరు. ఈ లక్ష్మీనారాయణులది ఉన్నత పదవి. వీరి రాజ్యమున్నప్పుడు వేరే ధర్మము ఏదీ లేదు. ద్వాపరం నుండి ఇతర ధర్మాలు వస్తాయి. సత్యయుగంలో మనుష్యులు కూడా కొద్దిమందే ఉంటారు. ఇప్పుడు అనేక ధర్మాలున్న కారణంగా ఎంత దుఃఖితులుగా అయిపోయారు. ఆ దేవతా ధర్మం వారు ఇప్పుడు పతితులుగా అయిన కారణంగా స్వయాన్ని దేవతలుగా చెప్పుకోరు. హిందూ అన్న పేరును పెట్టారు. హిందూ అనే ధర్మమేదీ లేదు. రావణుడు మిమ్మల్ని ఇలా తయారుచేసాడని తండ్రి అర్థం చేయిస్తారు. మీరు యోగ్యమైన దేవీ దేవతలుగా ఉన్నప్పుడు మొత్తం విశ్వంపై మీ రాజ్యముండేది, అందరూ సుఖమయంగా ఉండేవారు. ఇప్పుడు దుఃఖమయంగా అయిపోయారు. భారత్ స్వర్గంగా ఉండేది, అది ఇప్పుడు నరకంగా అయిపోయింది, మళ్ళీ నరకాన్ని స్వర్గంగా తండ్రి తప్ప మరెవ్వరూ చేయలేరు. దేవతలను సంపూర్ణ నిర్వికారులని అంటారు. ఇక్కడి మనుష్యులు సంపూర్ణ వికారులు, వీరిని పతితులని అంటారు. భారత్ శివాలయంగా ఉండేది, శివబాబా స్థాపన చేసారు. తండ్రి స్వర్గాన్ని తయారుచేస్తారు, రావణుడు మళ్ళీ నరకంగా చేస్తాడు. రావణుడు శాపాన్ని ఇస్తాడు, తండ్రి 21 జన్మల కోసం వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు తండ్రినే స్మృతి చేయండి, ఏ దేహధారిని స్మృతి చేయకండి. దేహధారిని భగవంతుడని అనరు. భగవంతుడు ఒక్కరే. తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు, తర్వాత రావణుడు శాపగ్రస్థులుగా చేస్తాడు. ఈ సమయంలో భారత్ శాపగ్రస్థమై ఉంది, చాలా దుఃఖంలో ఉంది. ఇప్పుడు ఈ రావణునిపై విజయాన్ని పొందాలి. దానమిస్తే గ్రహణం తొలగుతుందని పాడుతారు కూడా. ఆ గ్రహణమైతే భూమిపై ఏర్పడే నీడ. ఇప్పుడు మీ పై 5 వికారాల రూపీ రావణుని గ్రహణముందని తండ్రి అంటారు. ఈ 5 వికారాలను దానంగా ఇచ్చేయాలి. ముందుగా మేమెప్పుడూ వికారాలలోకి వెళ్ళమని దానమివ్వండి. ఈ కామ ఖడ్గమే మనుష్యులను పతితులుగా చేస్తుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఏదైతే జ్ఞానాన్ని ఇస్తారో, దాని పట్ల పూర్తి అటెన్షన్ పెట్టి చదువుకోవాలి. జ్ఞానం యొక్క మూడవ నేత్రం ద్వారా మీ 84 జన్మలను తెలుసుకొని, ఇప్పుడు ఈ అంతిమ జన్మలో పావనంగా అవ్వాలి.

2. రావణుని శాపం నుండి రక్షించుకునేందుకు, ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. 5 వికారాలను దానమివ్వాలి, ఒక్క తండ్రి మతమునే అనుసరించాలి.

వరదానము:-

‘‘ఎటువంటి సంకల్పమో, అటువంటి సృష్టి’’ అని అంటూ ఉంటారు, ఎవరైతే కొత్త సృష్టిని రచించేందుకు నిమిత్త ఆత్మలుగా ఉంటారో, వారి ఒక్కొక్క సంకల్పము శ్రేష్ఠంగా అనగా అలౌకికంగా ఉండాలి. ఎప్పుడైతే స్మృతి, వృత్తి మరియు దృష్టి అన్నీ అలౌకికంగా అవుతాయో, అప్పుడు ఈ లోకంలోని ఏ వ్యక్తి అయినా, ఏ వస్తువు అయినా తమ వైపుకు ఆకర్షించలేవు. ఒకవేళ ఆకర్షిస్తున్నాయంటే, తప్పకుండా అలౌకికతలో లోపమున్నట్లు. అలౌకిక ఆత్మలు సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా ఉంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top