13 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

May 12, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీరు బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులు, మీకు మాత్రమే తండ్రి ద్వారా జ్ఞానమనే మూడవ నేత్రం లభించింది, మీరు ఇప్పుడు ఈశ్వరీయ ఒడిలో ఉన్నారు”

ప్రశ్న: -

రెండవ ధర్మమేదీ ఉండని, ఆ అద్వైత రాజ్య స్థాపనకు ఆధారమేమిటి?

జవాబు:-

యోగబలము. బాహుబలంతో ఎప్పుడూ అద్వైత రాజ్య స్థాపన జరగదు. నిజానికి క్రిస్టియన్ల వద్ద ఎంతటి శక్తి ఉందంటే, ఒకవేళ వారు పరస్పరంలో ఒకటైతే, మొత్తం విశ్వంపై రాజ్యం చేయగలరు, కానీ లా ఆ విధంగా లేదు. విశ్వంలో ఏక రాజ్య స్థాపన చేయడమనేది తండ్రి పని మాత్రమే.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఆకాశ సింహాసనాన్ని వదిలి రా….. (ఛోడ్ భీ దే ఆకాశ్ సింహాసన్…..)

ఓంశాంతి. పిల్లలకు ఓం శాంతి అర్థాన్ని అయితే చాలా సార్లు అర్థం చేయించారు. ఓం అనగా నేను ఎవరు, నేను ఒక ఆత్మను. ఈ శరీరము నా ఇంద్రియాలు. ఆత్మనైన నేను పరంధామ నివాసిని. ఓ దూరదేశ నివాసీ రండి, ఎందుకంటే ఇప్పుడు భారత్ లో చాలా ధర్మ గ్లాని, దుఃఖము ఉంది, మీరు మళ్ళీ వచ్చి గీతోపదేశాన్ని వినిపించండి అని భారతవాసులు పిలుస్తారు. శివబాబా రండి, అని గీతలోనే అంటారు ఎందుకంటే వారు అందరికీ తండ్రి. భారతవాసులపై మళ్ళీ మాయ రూపీ రావణుని నీడ పడింది, అందుకే అందరూ దుఃఖితులుగా, పతితులుగా అయ్యారని అంటారు. రూపాన్ని మార్చుకొని రండి అనగా మనిషి రూపంలో రండి అని పిలుస్తారు. కనుక మనిషి రూపంలో వస్తాను, నేను రావడమనేది దివ్యంగా మరియు అలౌకికంగా ఉంటుంది. నేను గర్భంలోకి రాను, నేను సాధారణ వృద్ధ తనువులోకే వస్తాను.

నేను కల్ప-కల్పము నా నిరాకారీ రూపాన్ని మార్చుకొని వస్తానని పిల్లలైన మీకు తెలుసు. జ్ఞానసాగరుడు పరమపిత పరమాత్మ మాత్రమే, కృష్ణుడిని ఎప్పుడూ ఇలా అనరు. తండ్రి అంటారు – నేను ఈ సాధారణ తనువులోకి వచ్చి, మీకు మళ్ళీ సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. ఎప్పుడైతే ప్రపంచం పతితంగా అయిపోతుందో, అప్పుడు నేను రావలసి ఉంటుంది, కలియుగాన్ని సత్యయుగముగా తయారుచేయడానికి నేను వస్తాను. బ్రహ్మా, విష్ణు, శంకరుల చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మా ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము మరియు విష్ణువు ద్వారా పాలన జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణులు విష్ణువు యొక్క రెండు రూపాలు. ఈ విషయం పిల్లలైన మీకు తెలుసు. బాబా మళ్ళీ రూపాన్ని మార్చుకొని వచ్చారు. వారు మన సుప్రీమ్ తండ్రి కూడా, సుప్రీమ్ టీచర్ కూడా, సుప్రీమ్ గురువు కూడా. వేరే గురువులను సుప్రీమ్ అని అనరు. వీరు తండ్రి, టీచర్, గురువు ముగ్గురూ అయ్యారు. లౌకిక తండ్రి అయితే పిల్లలను పాలన చేసి వారిని స్కూలుకు పంపిస్తారు. తండ్రియే టీచరుగా కూడా ఉండడమనేది ఎక్కడో అరుదుగా జరుగుతుంది. ఈ మాట ఎవరూ చెప్పలేరు. ఆత్మలందరూ నన్ను పిలుస్తారు, గాడ్ ఫాదర్ అని అంటారు కనుక వారు ఆత్మలకు ఫాదర్ అయినట్లు. ఈ పాట కూడా భక్తి మార్గానికి చెందినది. సత్యయుగంలో భగవంతుడిని పిలిచే అవసరం రావడానికి, అక్కడ మాయ అనేది ఉండనే ఉండదు. అక్కడ సుఖమే సుఖముంటుంది. ఇది 5 వేల సంవత్సరాల చక్రమని మీకు తెలుసు. అర్ధకల్పం సత్య-త్రేతా యుగాలు పగలు, అర్ధకల్పం ద్వాపర-కలియుగాలు రాత్రి. మీరు బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులు. బ్రహ్మా మరియు బ్రాహ్మణులైన మీ యొక్క రాత్రి-పగలు మాత్రమే గాయనం చేయడం జరుగుతుంది. పిల్లలైన మీకు రాత్రి మరియు పగలు యొక్క జ్ఞానం కూడా ఉంది, లక్ష్మీనారాయణులకు ఈ జ్ఞానం లేదు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు, ఇప్పుడు భక్తి మార్గం పూర్తయ్యి పగలు ఉదయిస్తుందని మీకు తెలుసు. ఈ జ్ఞానం ఇప్పుడు మీకు తండ్రి ద్వారా లభించింది. కలియుగంలో గాని, సత్యయుగంలో గాని ఈ జ్ఞానం ఎవరికీ ఉండదు. అందుకే బ్రహ్మా రాత్రి, బ్రహ్మా పగలు అని గాయనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు సూర్యవంశీ-చంద్రవంశీ రాజ్యాన్ని పొందే పురుషార్థం చేస్తున్నారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత మీరు రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఈ జ్ఞానం బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవరికీ లేదు. మీరు దేవతలుగా అయిపోతారు, అప్పుడిక ఈ జ్ఞానముండదు. ఇప్పుడిది రాత్రి. శివరాత్రి కూడా గాయనం చేయబడుతుంది. కృష్ణుని రాత్రి అని కూడా అంటారు కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. శివజయంతి అనగా శివుని పునః అవతరణ జరుగుతుంది. ఇటువంటి తండ్రి అవతరణ రోజును తక్కువలో తక్కువ ఒక మాసమైనా జరుపుకోవాలి. ఎవరైతే మొత్తం సృష్టిని పతితం నుండి పావనంగా చేస్తారో, వారి జన్మదినాన్ని సెలవుగా జరుపుకోరు. నేను అందరి ముక్తిదాతను, మార్గదర్శకుడినై అందరినీ తీసుకువెళ్తానని తండ్రి అంటారు.

ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకునే పురుషార్థం చేస్తారు. తండ్రి మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇస్తున్నారు. ఆత్మ రూపం ఏమిటి అనేది కూడా ఎవరికీ తెలియదు. తండ్రి అంటారు – ఆత్మలైన మీరు అంగుష్టం వలె ఉండరు, అఖండ జ్యోతి వలె కూడా ఉండరు. మీరు ఒక నక్షత్రంలా, బిందువులా ఉంటారు. ఆత్మనైన నేను కూడా బిందువునే, కానీ నేను పునర్జన్మల్లోకి రాను. నా మహిమయే వేరు, నేను సుప్రీమ్ అయిన కారణంగా జనన-మరణ చక్రంలోకి రాను. ఆత్మలైన మీరు శరీరంలోకి వస్తారు కనుక 84 జన్మలను తీసుకుంటారు. నేను ఈ శరీరంలో ప్రవేశిస్తాను, ఇది లోన్ గా తీసుకున్నటువంటిది. తండ్రి అర్థం చేయిస్తారు – మీరు కూడా ఆత్మలే, కానీ నేను ఒక ఆత్మను అని మీరు రియలైజ్ అవ్వరు. ఆత్మయే తండ్రిని స్మృతి చేస్తుంది. దుఃఖంలో, ఓ భగవంతుడా, ఓ దయాహృదయుడైన బాబా, దయ చూపించండి అని ఎల్లప్పుడూ స్మృతి చేస్తారు. దయను కోరుకుంటారు ఎందుకంటే ఆ తండ్రియే నాలెడ్జ్ ఫుల్, బ్లిస్ ఫుల్ (ఆనంద స్వరూపులు), ప్యూరిటీ ఫుల్ (పవిత్రతా స్వరూపులు). జ్ఞానంలో కూడా ఫుల్ అనగా జ్ఞానసాగరుడు. మనుష్యులకు ఇటువంటి మహిమను ఇవ్వలేము. మొత్తం ప్రపంచమంతటికీ ఆనందాన్నివ్వడం అనేది తండ్రి పని మాత్రమే. వారు రచయిత, మిగిలిన వారంతా రచన. రచయిత రచనను రచిస్తారు. ముందు స్త్రీని (పత్నిని) దత్తత తీసుకుంటారు, తర్వాత ఆమె ద్వారా రచనను రచిస్తారు, తర్వాత వారి పాలనను కూడా చేస్తారు, కానీ వినాశనం చేయరు. ఈ అనంతమైన తండ్రి వచ్చి స్థాపన-పాలన-వినాశనం చేయిస్తారు, ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని పాలన చేయిస్తారు. సత్యయుగం ఆదిలో రాజధాని వెంటనే స్థాపన అవుతుంది. ఇతర ధర్మాల వారైతే కేవలం తమ-తమ ధర్మాలను స్థాపన చేస్తారు, తర్వాత ఎప్పుడైతే లక్షల, కోట్ల సంఖ్యలో వారి వృద్ధి జరుగుతుందో, అప్పుడు రాజ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు రాజధానిని స్థాపన చేస్తున్నారు. యోగబలంతో మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు, బాహుబలంతో ఎప్పుడూ ఎవరూ విశ్వంపై రాజ్యం చేయలేరు. తండ్రి అర్థం చేయించారు – క్రిస్టియన్లలో ఎంతటి శక్తి ఉందంటే, వారు పరస్పరంలో ఒకటైతే, మొత్తం విశ్వమంతటిపై రాజ్యం చేయగలరు. కానీ బాహుబలంతో విశ్వ రాజ్యాన్ని పొందడము అనేటువంటి లా లేదు. బాహుబలం కలవారు విశ్వానికి యజమానులుగా అవ్వడము అనే నియమము డ్రామాలో లేదు.

విశ్వ రాజ్యాధికారమనేది యోగబలంతో నా ద్వారానే లభించగలదు అని తండ్రి అర్థం చేయిస్తారు. అక్కడ ఎటువంటి విభజనలు ఉండవు. భూమి, ఆకాశము అన్నీ మీవిగా ఉంటాయి. మిమ్మల్ని ఎవ్వరూ ముట్టుకోలేరు. దానిని అద్వైత రాజ్యమని అంటారు. ఇక్కడ అనేక రాజ్యాలున్నాయి. 5 వేల సంవత్సరాల తర్వాత, పిల్లలైన మీకు ఈ రాజయోగాన్ని నేర్పిస్తానని తండ్రి అర్థం చేయిస్తారు. కృష్ణుని ఆత్మ ఇప్పుడు నేర్చుకుంటుంది. కృష్ణుడు మొదటి నంబరు రాకుమారుడిగా ఉండేవారు, ఈ సమయంలో వారు 84 జన్మల అంతిమంలోకి వచ్చి బ్రహ్మాగా అయ్యారు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. తండ్రి మళ్ళీ స్వర్గ స్థాపనను చేస్తున్నారు. తప్పకుండా అనేక ధర్మాల వినాశనం జరగనున్నది, ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. భారత్ యే 100 శాతం సంపన్నంగా, ధర్మ శ్రేష్ఠంగా ఉండేది. దేవతల కర్మలు కూడా శ్రేష్ఠంగా ఉండేవి. సర్వగుణ సంపన్నులు….. అని వారి మహిమయే గాయనం చేయబడింది. మొట్టమొదట పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు పతితంగా అయ్యారు, మళ్ళీ తండ్రి వచ్చి స్త్రీ-పురుషులు ఇరువురినీ పవిత్రంగా చేస్తారు. రక్షాబంధనం ఉత్సవాన్ని ఇంతగా ఎందుకు జరుపుకుంటారు అనేది ఎవరికీ తెలియదు. అంతిమ జన్మలో మీరిరువురూ పవిత్రంగా ఉండండి అని తండ్రియే వచ్చి ప్రతిజ్ఞను తీసుకున్నారు. సన్యాసుల విషయంలో వారి ధర్మమే వేరు. జ్ఞానం, భక్తి మరియు వైరాగ్యం – ఇవి మీ కోసము ఉన్నాయి. క్రిస్టియన్ ఫాదర్లు నడిచేటప్పుడు, వారి కళ్ళు ఒకవైపే ఉంటాయి, ఇంకెవరి వైపు చూడరు, ఇది మీరు గమనించి ఉంటారు. నన్స్ ఉంటారు కదా, వారైతే క్రీస్తును స్మృతి చేస్తారు. క్రీస్తు భగవంతుని సంతానమని అంటారు. మీకు శ్వేత వస్త్రాలు మొదలైనవాటితో కనెక్షన్ ఏమీ లేదు. మీరు ఆత్మలు, నన్ బట్ వన్ (ఒక్కరు తప్ప ఎవరూ లేరు), ఒక్కరినే స్మృతి చేయాలి. సత్యమైన నన్స్ అయితే మీరు. మీకు ఆ తండ్రి నుండి వారసత్వం లభించనున్నది, వారిని స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. అందుకే నన్నొక్కడినే స్మృతి చేయండి అన్నది తండ్రి ఆజ్ఞ. ఆత్మలము అన్న నిశ్చయం లేని కారణంగా నన్స్ క్రీస్తును గుర్తు చేస్తారు. గాడ్ ఎవరు అనేది వారికి తెలియదు. మొట్టమొదట ఏ భారతవాసులైతే వస్తారో, వారికే తెలియదు. లక్ష్మీనారాయణులకు ఈ సృష్టి యొక్క జ్ఞానం లేదు, వారు త్రికాలదర్శులు కూడా కాదు. బ్రాహ్మణులైన మీరు త్రికాలదర్శులుగా అవుతారు. తండ్రి మిమ్మల్ని గవ్వ నుండి మార్చి వజ్రం వలె తయారుచేస్తారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ ఒడిలో ఉన్నారు. మీ ఈ అంతిమ జన్మ చాలా అమూల్యమైనది. మొత్తం ప్రపంచమంతటికీ, ముఖ్యంగా భారత్ కు మీరు ఆత్మిక సేవను చేస్తారు. మిగిలినవారు దైహిక సమాజ సేవకులు, మీరు ఆత్మిక సేవకులు. మీకు నేర్పించేవారు సుప్రీమ్ ఆత్మ. తండ్రిని స్మృతి చేయండి అని ప్రతి ఒక్క ఆత్మకు చెప్పండి. తండ్రినే పతితపావనుడు అని మహిమ చేయడం జరుగుతుంది. మీకు పడిపోవడానికి 84 జన్మలు పడుతుంది, మళ్ళీ ఎక్కడానికి ఒక్క సెకండు పడుతుంది. ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ. మృత్యులోకం ముర్దాబాద్ (నశించడము) అవ్వనున్నది, అమరలోకం జిందాబాద్ (వర్ధిల్లడము) అవ్వనున్నది. దీనిని అమరకథ అని అంటారు. అమర బాబా వచ్చి, అమర ఆత్మలైన మిమ్మల్ని, అమర యుగంలోకి తీసుకువెళ్ళేందుకు, అమర కథను వినిపిస్తారు. తండ్రి అంటారు – అచ్ఛా, వేరే విషయాలను మర్చిపోతున్నట్లయితే, కేవలం స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని, తండ్రినైన నన్నొక్కడినే స్మృతి చేయండి. బుద్ధి యోగాన్ని నాతో జోడించినట్లయితే, మీ పాపాలు భస్మమై, మీరు పుణ్యాత్ములుగా అయిపోతారు. మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు, ఇది కొత్త విషయం కాదు. తండ్రి 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి, మీకు వారసత్వాన్ని ఇస్తారు, రావణుడు మళ్ళీ శాపాన్ని ఇస్తాడు – ఇది ఆట. ఈ కథ భారత్ కు చెందినదే. ఈ విషయాలను తండ్రియే అర్థం చేయిస్తారు, ఇవి వేద-శాస్త్రాలు మొదలైనవాటిలో ఏమీ లేవు. అందుకే గాడ్ ఫాదర్ ను నాలెడ్జ్ ఫుల్, పీస్ ఫుల్ (శాంతి స్వరూపులు), బ్లిస్ ఫుల్ (ఆనంద స్వరూపులు) అని అంటారు. మిమ్మల్ని కూడా తమ సమానంగా తయారుచేస్తారు. మీరు కూడా పూజ్యులుగా ఉండేవారు, తర్వాత పూజారులుగా అవుతారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు అనే ఈ మాట భగవంతునికి సంబంధించినది కాదు. ఇది భారతవాసులైన మీకు సంబంధించిన విషయము. ముందు మీరు, కేవలం శివుని భక్తిని మాత్రమే చేసేవారు, అవ్యభిచారి భక్తిని చేసారు. తర్వాత దేవతల భక్తిని ప్రారంభించారు, తర్వాత కిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు దేవీ-దేవతలుగా అవుతున్నారు. ఎవరైతే కొద్దిగా చదువుకుంటారో, వారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటారో-చదివిస్తారో, వారు రాజ్యంలోకి వస్తారు. ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు. ఒక్క మహారాజుకు లక్షలు, కోట్ల సంఖ్యలో ప్రజలుంటారు. మీరు కల్పక్రితం లానె పురుషార్థం చేస్తారు. మాలలోకి ఎవరెవరు వచ్చేది ఉంది అనేది పురుషార్థం ద్వారా తెలిసిపోతుంది. ప్రజల్లో కూడా కొందరు పేదవారిగా, కొందరు షావుకారులుగా అవుతారు. భక్తి మార్గంలో ఈశ్వరార్థం దానం చేస్తారు. ఎందుకు చేస్తారు, ఈశ్వరుని వద్ద లేదా ఏమిటి, లేదా కృష్ణార్పణం అని అంటారు. కానీ వాస్తవానికి ఈశ్వరార్పణం జరుగుతుంది. మనుష్యులు ఏదైతే చేస్తారో, దాని ఫలం మరుసటి జన్మలో లభిస్తుంది, ఒక్క జన్మ కోసం లభిస్తుంది. ఇప్పుడు తండ్రి అంటారు – నేను మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను. నా పేరు మీద డైరెక్టుగా ఏమి చేసినా సరే, దానికి మీకు 21 జన్మల కోసం ప్రాప్తి లభిస్తుంది. ఇన్ డైరెక్టుగా చేసినా సరే, ఒక్క జన్మ కోసం అల్పకాలిక సుఖం లభిస్తుంది. మీదంతా మట్టిలో కలిసిపోనున్నది కనుక దానిని సఫలం చేసుకోండి అని తండ్రి అర్థం చేయిస్తారు. మీరు ఈ ఆత్మిక హాస్పిటల్ మరియు యూనివర్సిటీని తెరుస్తూ వెళ్ళండి. ఇక్కడ అందరూ సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అవుతారు. దీనితో చాలా సంపాదన జరుగుతుంది. యోగంతో ఆరోగ్యం మరియు చక్రాన్ని తెలుసుకోవడంతో ఐశ్వర్యం లభిస్తుంది. కనుక ప్రతి ఇంట్లో ఇటువంటి యూనివర్సిటీ మరియు హాస్పిటల్ ను తెరుస్తూ వెళ్ళండి. పెద్ద వ్యక్తులు ఉంటే, అనేకమంది రాగలిగేలా పెద్దది తెరవండి. బోర్డుపై నేచర్ క్యూర్ వారు ఏ విధంగా రాస్తారో, అలా రాయండి. తండ్రి మొత్తం ప్రపంచం యొక్క నేచర్ ను మార్చి, పవిత్రంగా చేస్తారు. ఈ సమయంలో అందరూ అపవిత్రంగా ఉన్నారు. మొత్తం ప్రపంచాన్ని సదా ఆరోగ్యవంతంగా, సదా ఐశ్వర్యవంతంగా తయారుచేసేవారు తండ్రి, ఇప్పుడు వారు పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు అత్యంత మధురమైన పిల్లలు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీ ఈ అమూల్యమైన జీవితాన్ని ఆత్మిక సేవలో నిమగ్నం చేయాలి. మొత్తం ప్రపంచమంతటికీ, ముఖ్యంగా భారత్ కు సేవ చేయాలి.

2. తమదంతా సఫలం చేసుకునేందుకు, డైరెక్టుగా ఈశ్వరార్థం అర్పణ చేయాలి. ఆత్మిక హాస్పిటల్ మరియు యూనివర్సిటీని తెరవాలి.

వరదానము:-

ఎవరికైతే సంకల్పంలో కూడా దేహాభిమానం ఉండదో, వారిని సంపూర్ణ సమర్పణ అని అంటారు. నేను ఫలానా అనే దేహ భానాన్ని కూడా అర్పణ చేయాలి – ఈ సంకల్పాన్ని కూడా అర్పణ చేసి, సంపూర్ణ సమర్పణ అయ్యేవారు సర్వగుణాలలో సంపన్నంగా అవుతారు. వారిలో ఏ గుణము లోపించి ఉండదు. ఎవరైతే సర్వం సమర్పణ చేసి, సర్వగుణ సంపన్నులుగా మరియు సంపూర్ణులుగా అయ్యే లక్ష్యం పెట్టుకుంటారో, అటువంటి పురుషార్థులకు బాప్ దాదా సదా విజయీ భవ అనే వరదానాన్ని ఇస్తారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top