13 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

October 12, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - రక్త సంబంధంలోనే దుఃఖముంది, మీరు ఆ సంబంధాలను త్యాగం చేసి పరస్పరంలో ఆత్మిక ప్రేమను ఉంచుకోవాలి, ఇదే సుఖానికి మరియు ఆనందానికి ఆధారము”

ప్రశ్న: -

విజయమాలలో వచ్చేందుకు విశేషంగా ఏ పురుషార్థం కావాలి?

జవాబు:-

విజయమాలలోకి రావాలి అంటే విశేషంగా హోలీ (పవిత్రం)గా అయ్యే పురుషార్థం చేయండి. ఎప్పుడైతే పక్కా సన్యాసులుగా అనగా నిర్వికారులుగా అవుతారో, అప్పుడు విజయమాలలోని మణులుగా అవుతారు. ఎలాంటి కర్మ బంధనాల లెక్కాచారాలున్నా వారసులుగా అవ్వలేరు, ప్రజల్లోకి వెళ్ళిపోతారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

దీపపు పురుగుల కోసం సభలో దీపం వెలిగింది….. (మెహ్ఫిల్ మే జల్ ఉఠీ షమా పర్వానోం కే లియే…..)

ఓంశాంతి. చూడండి, మనం మన తండ్రి మహిమను చేస్తాము. ఆత్మనైన నేను తప్పకుండా నా ఫాదర్ ను షో (ప్రత్యక్షం) చేస్తాను కదా. సన్ షోస్ ఫాదర్ (కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు). నేను ఆత్మను, మీరు కూడా అంటారు – మనం ఆత్మలము, మనందరి ఫాదర్ ఒక్క పరమాత్మ, వారు అందరికీ తండ్రి. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. ఆత్మలైన మనకు వేర్వేరు తండ్రులున్నారని అనరు. ఫాదర్ అందరికీ ఒక్కరే. ఇప్పుడు మనం వారి పిల్లలైన కారణంగా మనకు వారి కర్తవ్యాలు గురించి తెలుసు. మనం పరమాత్మను సర్వవ్యాపి అని అనలేము. అలాగైతే అందరిలోనూ పరమాత్మ ఉండాలి. ఫాదర్ ను స్మృతి చేసుకుంటూ పిల్లలు సంతోషిస్తారు ఎందుకంటే తండ్రి వద్ద ఏదైతే ఉంటుందో, అది పిల్లలకు వారసత్వంగా లభిస్తుంది. ఇప్పుడు మనం పరమాత్ముని వారసులము, వారి వద్ద ఏముంది? వారు ఆనంద సాగరుడు, జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు. ఈ విషయం మనకు తెలుసు, అందుకే మనం వారిని మహిమ చేస్తాము. ఇతరులు వారి గురించి ఇలా చెప్పరు. ఒకవేళ చెప్పినా, వారు ఎలా ఉంటారు అనేది తెలియనే తెలియదు. ఇకపోతే, పరమాత్మ సర్వవ్యాపి అని అందరూ అంటారు. కానీ మనం వారి పిల్లలము కనుక మన నిరాకార అవినాశీ తండ్రి మహిమను ఈ విధంగా వర్ణిస్తాము – వారు ఆనంద సాగరుడు, జ్ఞాన సాగరుడు, ప్రేమ భాండాగారము అని. కానీ కొందరు ఇలా ప్రశ్నిస్తారు – అక్కడ నిరాకారీ ప్రపంచంలో సుఖ దుఃఖాలకు అతీతమైన అవస్థ ఉంటుందని మీరు అంటారు, అలాంటప్పుడు స్వర్గంలో సుఖం లేక ఆనందం లేక ప్రేమ ఎక్కడ నుండి వచ్చాయి? ఇప్పుడివి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ ఆనందం, సుఖం మరియు ప్రేమ అని అంటూ ఉంటారు కదా, ఇవి సుఖమయ అవస్థకు గుర్తులు. కానీ అక్కడ శాంతిదేశంలో ఆనందం, ప్రేమ మరియు జ్ఞానం ఎక్కడ నుండి వచ్చాయి? ఆ సుఖ సాగరుడు ఈ సాకార సృష్టిలోకి వచ్చినప్పుడు సుఖాన్ని ఇస్తారు. అక్కడైతే (శాంతిధామంలో) సుఖ-దుఃఖాలకు అతీతమైన అవస్థలో ఉంటారు ఎందుకంటే మీకు అర్థం చేయించినది ఏమిటంటే – ఒకటి సుఖ-దుఃఖాలకు అతీతమైన ప్రపంచం, దానిని నిరాకారీ ప్రపంచమని అంటారు. రెండవది, సుఖమయ ప్రపంచం, అక్కడ సదా సుఖం, ఆనందం ఉంటాయి, దానిని స్వర్గమని అంటారు. మరియు ఇది దుఃఖమయ ప్రపంచం, దీనిని నరకం లేక ఇనుపయుగ ప్రపంచం అని అంటారు. ఇప్పుడు సుఖసాగరుడైన పరమపిత పరమాత్మ వచ్చి ఈ ఇనుపయుగ ప్రపంచాన్ని పరివర్తన చేసి ఆనందం, సుఖం, ప్రేమల భాండాగారం తయారుచేస్తారు, అక్కడ సుఖమే సుఖముంటుంది, ప్రేమయే ప్రేమ ఉంటుంది. అక్కడ జంతువులలో కూడా చాలా ప్రేమ ఉంటుంది. పులి, ఆవు కూడా కలిసి ఒకేచోట నీరు తాగుతాయి. వాటి మధ్యన పరస్పరంలో అంతటి ప్రేమ ఉంటుంది. కనుక పరమాత్మ వచ్చి స్థాపన చేసే రాజధానిలో సుఖం మరియు ఆనందం ఉంటాయి. ఇకపోతే, నిరాకారీ ప్రపంచంలో సుఖం మరియు ఆనందం యొక్క మాటే ఉండదు, ప్రేమ గురించిన మాటే ఉండదు. అది నిరాకారీ ఆత్మల నివాస స్థానము. అక్కడ అందరిదీ వానప్రస్థ జీవితం లేక నిర్వాణ అవస్థ వంటిది. అక్కడ సుఖ-దుఃఖాల ఫీలింగ్స్ ఏమీ ఉండవు. ఆ సుఖ-దుఃఖాల పాత్ర అయితే ఈ సాకార ప్రపంచంలో నడుస్తుంది. ఈ సృష్టిపై స్వర్గమున్నప్పుడు అవినాశీ ఆత్మిక ప్రేమ ఉంటుంది ఎందుకంటే దుఃఖమనేది రక్త సంబంధాలలో ఉంటుంది. సన్యాసులకు కూడా రక్త సంబంధాలు ఉండవు, అందుకే వారి విషయంలో కూడా దుఃఖమన్న మాట ఏమీ ఉండదు. వారు స్వయం విషయంలో – నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడను అని చెప్పుకుంటారు, ఎందుకంటే వారు రక్త సంబంధాలను త్యాగం చేస్తారు. అలాగే ఇక్కడ కూడా మీకు ఎటువంటి రక్త సంబంధాలు లేవు. ఇక్కడ మనందరికీ పరస్పరంలో ఆత్మిక ప్రేమ ఉంటుంది, దీనిని పరమాత్మ నేర్పిస్తారు.

తండ్రి అంటారు – మీరు నా ప్రియమైన పుత్రులు. నా ఆనందము, ప్రేమ, సుఖము అన్నీ మీవే, ఎందుకంటే మీరు ఆ ప్రపంచాన్ని వదిలి నా ఒడిలోకి వచ్చారు, అది కూడా మీరు ప్రాక్టికల్ జీవితంలో నా ఒడిలోకి వచ్చి కూర్చున్నారు. అంతేకానీ, వారందరి వలె గురువులకు దత్తతగా వెళ్ళి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం కాదు. వాళ్ళను ప్రియమైన పుత్రులని అనరు. వారు ఆ గురువులకు ప్రజల వంటివారు. ఇకపోతే, ఎవరైతే సన్యసించి గురువులకు దత్తతగా వెళ్తారో, వారే ప్రియమైన పుత్రులుగా అవుతారు ఎందుకంటే వారే గురువు తర్వాత గద్దెపై కూర్చుంటారు. పిల్లలకు మరియు ప్రజలకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. పుత్రులు వారసులుగా అయి వారసత్వాన్ని తీసుకుంటారు. అలాగే, మీరు కూడా రక్త సంబంధాలను తెంచి ఈ నిరాకార తండ్రి మరియు సాకార తండ్రి ఒడిలోకి వచ్చారు కనుక వారసులుగా అయ్యారు. ఇందులో కూడా మీరు ఎంతగా జ్ఞానాన్ని తీసుకుంటారో, అంతగా ఆనందాన్ని అనుభూతి చేస్తారు. ఎడ్యుకేషన్ (చదువు)ను ఆనందం అని అంటారు. కనుక ఎవరు ఎంతగా చదువుకుంటారో, అంతగా ఆ రాజధానిలో ప్రజలుగా సుఖం తీసుకుంటారు. ఈ ఈశ్వరీయ చదువు ఆనందదాయకమైనది కదా, దీనితో సుప్రీమ్ (పరమ) శాంతి మరియు సంతోషం లభిస్తాయి. ఈ స్థిరమైన, అఖండమైన, సుఖ-శాంతిమయమైన స్వరాజ్యం గాడ్ యొక్క ప్రాపర్టీ, అది పిల్లలకు లభిస్తుంది. ఇక ఎంతగా జ్ఞానాన్ని తీసుకుంటారో, అంతగా తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. మీ వద్దకు ఇంతమంది జిజ్ఞాసువులు వస్తారు, వారు మీ ప్రియమైన ప్రజలుగా అవుతారు, అంతేకానీ పిల్లలుగా కారు ఎందుకంటే వారు వస్తూ-వెళ్తూ ఉంటారు. వారు పిల్లలుగా కూడా అవ్వచ్చు ఎందుకంటే కొంతమంది ప్రజల నుండి తర్వాత వారసులుగా కూడా మారుతారు. వారు జ్ఞానం తీసుకుంటూ-తీసుకుంటూ ఇక్కడ అపారమైన సుఖం మరియు శాంతి ఉండడాన్ని చూస్తారు, అలానే ఆ ప్రపంచంలో దుఃఖం ఉండడాన్ని చూస్తారో, అప్పుడిక ఒడిలోకి వచ్చేస్తారు. వెంటనే ఎవ్వరూ పిల్లలుగా అవ్వరు. మీరు కూడా ముందు వస్తూ-వెళ్తూ ఉండేవారు, తర్వాత వింటూ-వింటూ ఉండిపోయారు మరియు వారసులుగా అయ్యారు. సన్యాసుల వద్ద కూడా ఇలాగే జరుగుతుంది. వారు వింటూ-వింటూ, సన్యాసంలో సుఖ-శాంతులున్నాయి అని ఎప్పుడైతే భావిస్తారో, అప్పుడు సన్యసిస్తారు. ఇక్కడ కూడా ఎప్పుడైతే అభిరుచి కలుగుతుందో, అప్పుడు ప్రియమైన పుత్రులుగా అవుతారు, ఇక జన్మ-జన్మల కోసం వారసత్వం లభిస్తుంది. వారు తర్వాత దైవీ వంశ వృక్షంలోకి వస్తూ ఉంటారు. ప్రజలైతే మీతో పాటు ఉండరు. వారు ఎక్కడెక్కడో కర్మ బంధనాలలోకి వెళ్ళిపోతారు.

పాటలో ఉంటుంది – సభలో దీపపు పురుగుల కోసం దీపం వెలిగింది. దీపపు పురుగులు కూడా దీపం చుట్టూ డ్యాన్స్ చేస్తూ-చేస్తూ మరణిస్తాయి. కొన్ని చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి. ఈ తనువు (బ్రహ్మా) కూడా ఒక దీపము, ఇందులో ఆల్మైటీ (సర్వ శక్తివంతుడైన) బాబా ప్రవేశించి ఉన్నారు. మీరు దీపపు పురుగులై వచ్చారు, అలా వస్తూ-వెళ్తూ ఎప్పుడైతే రహస్యాలను అర్థం చేసుకున్నారో, అప్పుడిక కూర్చుండిపోయారు. రావడమైతే వేలాది, లక్షలాది మంది వస్తారు. మీ ద్వారా కూడా వింటూ ఉంటారు. వారు ఎంతగా వింటారో, అంతగా శాంతి మరియు ఆనందం యొక్క వరదానాలను తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే అవినాశీ తండ్రి యొక్క ఈ శిక్షణలు వినాశనమవ్వవు. దీనినే అవినాశీ జ్ఞాన ధనము అని అంటారు. ఇది వినాశనమవ్వదు. అందుకే, కొద్దిగా విన్నా కూడా, వారు తప్పకుండా ప్రజల్లోకి వస్తారు. అక్కడైతే ప్రజలు కూడా చాలా సుఖమయంగా ఉంటారు. వారికి అవినాశీ ఆనందముంటుంది, ఎందుకంటే అక్కడ అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు. ఇక్కడ దేహాభిమానులుగా అయ్యారు కావుననే దుఃఖితులుగా ఉన్నారు. అక్కడ ఉన్నదే స్వర్గము, అక్కడ దుఃఖం యొక్క నామ రూపాలే ఉండవు. జంతువులే ఎంతో సుఖ-శాంతులతో ఉంటాయి అన్నప్పుడు ప్రజలలో ఎంత ప్రేమ మరియు సుఖం ఉంటాయి! అందరూ వారసులుగా అవ్వలేరు అనేది వాస్తవము. ఇక్కడ, 108 మంది పక్కా సన్యాసులు విజయమాలలోని మణులుగా అవుతారు. వారు ఇప్పటికీ ఇంకా తయారవ్వలేదు, తయారవుతూ ఉన్నారు. వారితో పాటు ప్రజలు కూడా తయారవుతున్నారు. వారు కూడా బయట ఉంటూ వింటూ ఉంటారు. ఇంట్లో కూర్చొని యోగం జోడిస్తున్నారు. యోగం జోడిస్తూ- జోడిస్తూ ఎవరైనా లోపలికి వస్తే, వారు ప్రజల నుండి వారసులుగా అవుతారు. ఎప్పటివరకైతే వారికి కర్మ బంధనాల లెక్కాచారాలుంటాయో, అప్పటివరకు బయటే ఉంటూ యోగం జోడిస్తారు, నిర్వికారులుగా అవుతూ ఉంటారు. ఎవరైతే ఇంట్లో ఉంటూ నిర్వికారులుగా ఉంటారో, వారికి తప్పకుండా ఇంట్లో గొడవలు జరుగుతాయి ఎందుకంటే కామేషు, క్రోధేషు… లాంటి వారుంటారు. ఎప్పుడైతే మీరు కామం మహాశత్రువుపై విజయం పొందుతారో, విషం ఇవ్వడం ఆపేస్తారో, అప్పుడు గొడవలు జరుగుతాయి.

తండ్రి అంటారు – పిల్లలూ, మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. మొత్తం ప్రపంచమంతా వినాశనమవ్వనున్నది. ఎలాగైతే వృద్ధులకు – మృత్యువు ఎదురుగా ఉంది, పరమాత్ముడిని స్మృతి చేయండి అని చెప్తారో, అలాగే తండ్రి కూడా అంటారు – పిల్లలూ, నిర్వికారులుగా అవ్వండి, పరమాత్మను స్మృతి చేయండి. తీర్థ యాత్రలకు వెళ్ళినప్పుడు కామ-క్రోధాలన్నింటినీ ఆపేస్తారు. దారిలో కామ చేష్టలు చేయరు. వారు దారి పొడవునా, అమరనాథునికి జయ జయకారాలు చేస్తూ వెళ్తారు. కానీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అవే వికారాలలో మునకలు వేస్తూ ఉంటారు. మీరైతే తిరిగి వచ్చేది లేదు. కామ క్రోధాలలోకి రాకూడదు. వికారాల్లోకి వెళ్ళినట్లయితే పద భ్రష్టులవుతారు. హోలినెస్ (పవిత్రం)గా అవ్వలేరు. ఎవరైతే హోలీ (పవిత్రం)గా అవుతారో, వారు విజయమాలలోకి వస్తారు. ఎవరైతే ఫెయిల్ అవుతారో, వారు చంద్ర వంశంలోకి వెళ్ళిపోతారు.

మీ అందరినీ పరమపిత పరమాత్మ కూర్చొని చదివిస్తారు. వారే జ్ఞానసాగరుడు కదా. ఆత్మలకు, అక్కడ నిరాకారీ ప్రపంచంలో జ్ఞానం వినిపించరు. ఇక్కడికి వచ్చి మీకు జ్ఞానం వినిపిస్తారు. వారంటారు – మీరు నా పిల్లలు, నేను ఎలాగైతే పవిత్రంగా ఉన్నానో, అలా మీరు కూడా పవిత్రంగా అవ్వండి. అప్పుడు మీరు సత్యయుగంలో సుఖమయమైన, ప్రేమమయమైన రాజ్యం చేస్తారు. దానిని వైకుంఠమని అంటారు. ఇప్పుడు ఈ ప్రపంచం మారుతుంది ఎందుకంటే ఇనుప యుగం నుండి బంగారు యుగంగా తయారవుతుంది, ఆ తర్వాత బంగారు యుగం నుండి వెండి యుగంగా మారుతుంది. వెండి యుగం నుండి రాగి యుగంగా, ఆ తర్వాత రాగి యుగం నుండి ఇనుప యుగంగా మారుతూ ఉంటుంది. ప్రపంచం ఈ విధంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచం మారుతుంది. దీనిని ఎవరు మారుస్తున్నారు? స్వయంగా భగవంతుడు మారుస్తున్నారు. మీరు వారికి ప్రియమైన పిల్లలుగా అయ్యారు. ప్రజలు కూడా తయారవుతున్నారు కానీ పిల్లలు పిల్లలే, ప్రజలు ప్రజలే. ఎవరైతే సన్యసిస్తారో, వారు వారసులుగా అవుతారు. వారు రాయల్ వంశంలోకి తప్పకుండా వెళ్తారు. కానీ ఒకవేళ జ్ఞానం అంతగా తీసుకోకపోతే, పదవిని పొందలేరు. ఎవరైతే చదువుకుంటారో, వారు నవాబులుగా అవుతారు. ఎవరైతే వస్తూ-వెళ్తూ ఉంటారో, వారు ప్రజల్లోకి వస్తారు. తర్వాత ఎంతగా పవిత్రంగా అవుతారో, అంతగా సుఖం లభిస్తుంది. వారు కూడా ప్రియమైనవారిగా అవుతారు కానీ పూర్తి ప్రియమైన వారిగా ఎప్పుడు అవుతారంటే, ఎప్పుడైతే పిల్లలుగా అవుతారో అప్పుడు. అర్థమయిందా?

సన్యాసులు కూడా చాలా రకాల వారు ఉంటారు. ఒక రకం వారు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్ళిపోతారు, మరొక రకం వారు గృహస్థంలో ఉంటూ వికారాల్లోకి వెళ్ళకుండా ఉంటారు. సన్యాసులు కూర్చుని ఫాలోవర్స్ కు శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తారు, ఆత్మ జ్ఞానాన్ని ఇస్తారు. వారికి కూడా శిష్యులుంటారు. కానీ వారి శిష్యులు వారికి ప్రియమైన పుత్రులుగా అవ్వలేరు ఎందుకంటే ఆ శిష్యులు ఇళ్ళు-వాకిళ్ళు మరియు పిల్లలు కలవారిగా ఉంటారు, కనుక ఆ శిష్యులను తమ వద్ద కూర్చోబెట్టుకోలేరు. అలాంటివారు స్వయం కూడా సన్యాసులుగా అవ్వరు, అలాగే ఇతరుల చేత కూడా సన్యాసం చేయించలేరు. వారి శిష్యులు కూడా గృహస్థంలోనే ఉంటారు. కేవలం సన్యాసి వద్దకు వస్తూ-వెళ్తూ ఉంటారు. ఆ సన్యాసులు కేవలం ఆ శిష్యులకు జ్ఞానం ఇస్తూ ఉంటారు లేక మంత్రం ఇస్తారు, అంతే. మరి ఆ సన్యాసులకు వారసులుగా కానప్పుడు వారి వృద్ధి ఎలా జరుగుతుంది? కేవలం జ్ఞానం ఇస్తూ-ఇస్తూ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు.

చూడండి, ఒకటేమో 108 మాల ఉంటుంది, రెండవది దానికంటే పెద్దది 16,108 మాల ఉంటుంది. ఇది చంద్రవంశపు రాయల్ రాకుమార-రాకుమారీల మాల. ఎవరైతే ఇక్కడ అంత జ్ఞానం తీసుకోలేరో, పవిత్రంగా అవ్వరో, వారు శిక్షలు అనుభవించి చంద్రవంశీయుల మాలలోకి వస్తారు. రాకుమారులు-రాకుమారీలైతే చాలామంది ఉంటారు.

ఈ రహస్యాలను కూడా మీరిప్పుడే వింటారు, తెలుసుకుంటారు. అక్కడ ఈ జ్ఞానం యొక్క విషయాలుండవు. ఈ జ్ఞానం ఇప్పుడు దైవీ ధర్మ స్థాపన జరిగే ఈ సంగమంలో మాత్రమే లభిస్తుంది. ఎవరైతే కర్మేంద్రియాలను పూర్తిగా జయించరో, వారు చంద్రవంశీయుల మాలలోకి వెళ్ళిపోతారని వినిపించాను. ఎవరైతే జయిస్తారో, వారు సూర్యవంశంలోకి వస్తారు. వారిలో కూడా తప్పకుండా నంబరువారుగా ఉంటారు. శరీరం కూడా అవస్థ అనుసారంగానే లభిస్తుంది. చూడండి, మమ్మా అందరికంటే చురుకుగా ముందుకు వెళ్ళారు కనుక వారికి స్కాలర్షిప్ లభించింది, లీడర్ గా అయ్యారు. వారికి మొత్తం జ్ఞాన కలశాన్ని ఇచ్చారు. నేను కూడా వారిని ‘తల్లి’ అని సంబోధిస్తాను ఎందుకంటే నేను కూడా మొత్తం నా తనువు, మనసు, ధనాన్ని వారి చరణాలలో స్వాహా చేసాను. లౌకిక పిల్లలకు ఇవ్వలేదు ఎందుకంటే వారు రక్త సంబంధీకులు. వీరు అవినాశీ పిల్లలుగా అవుతారు, అంతా సన్యసించి వస్తారు కనుక వీరిపై ఎక్కువ ప్రేమ ఉంటుంది. అవినాశీ ప్రేమ అన్నింటికంటే శక్తివంతమైనది. సన్యాసులైతే ఇళ్ళు-వాకిళ్ళను వదిలి ఒంటరిగా పారిపోతారు. ఇక్కడైతే అంతా తీసుకువచ్చి స్వాహా చేసారు. పరమాత్మ స్వయం ప్రాక్టికల్ గా అభినయించి చూపిస్తారు.

ఇక్కడ మీకు ఏ ప్రశ్నకైనా సమాధానం లభిస్తుంది. అది ఆ పరమాత్మ స్వయంగా వచ్చి తెలియజేయగలరు. వారు ఇంద్రజాలికుడు. వారి ఈ ఇంద్రజాలపు పాత్ర ఇప్పుడు నడుస్తుంది. మీరు చాలా ప్రియమైన పిల్లలు, బాబా మీపై ఎప్పుడూ కోపం చేయలేరు. కోపం చేస్తే పిల్లలు కూడా కోపం చేయడం నేర్చుకుంటారు. ఇక్కడైతే అందరికీ ఆంతరిక ప్రేమ ఉంటుంది. స్వర్గంలో కూడా ఎంత ప్రేమ ఉంటుంది. అక్కడ సతోప్రధానంగా ఉంటారు.

ఇక్కడికి వచ్చే విజిటర్స్ కు కూడా చాలా సేవ జరుగుతుంది ఎందుకంటే వారిపై కూడా శాంతి మరియు సంతోషాల వర్షం కురుస్తుంది. వారు ప్రియమైన ప్రజలుగా అయ్యేవారు. తల్లి-తండ్రి, పిల్లలు అందరూ వారి సేవలో నిమగ్నమవుతారు. దేవీ-దేవతలుగా అవుతున్నారు కానీ ఇక్కడ ఆ పదవిని గురించిన అహంకారముండదు. అందరూ విధేయులైన సేవకులుగా అయి సేవలో హాజరవుతారు. గాడ్ కూడా విధేయుడైన సేవకుడిగా అయి తన ప్రియమైన పిల్లల సేవను మరియు ప్రజల సేవను చేస్తారు. వారు పిల్లలపై ఆనందాన్ని కురిపిస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు, కంటి రత్నాలకు, కల్ప-కల్పం విడిపోయి మళ్ళీ కలుసుకున్నవారికి, అటువంటి పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బాప్ దాదా ఎలాగైతే పిల్లలపై ఎప్పుడూ కోపగించుకోరో, అలా పిల్లలైన మీరు కూడా ఎవరిపైనా కోపగించుకోకూడదు. పరస్పరంలో ఆంతరిక ప్రేమతో వ్యవహరించాలి. ఎప్పుడూ కోపం చేయకూడదు.

2. శాంతి మరియు ఆనందం యొక్క వరదానాన్ని తీసుకునేందుకు దీపంపై పూర్తిగా బలిహారమవ్వాలి. చదువుతో సుప్రీమ్ శాంతి మరియు సంతోషాల ఈశ్వరీయ అధికారాన్ని తీసుకోవాలి.

వరదానము:-

సంగఠనలో ఒకవేళ ప్రతి ఒక్కరు, పరస్పరంలో సహాయకులై, శుభచింతకులై ఉంటే, సహయోగ శక్తి యొక్క ముట్టడి చాలా అద్భుతం చేయగలదు. పరస్పరంలో ఒకరి పట్ల ఒకరు శుభచింతకులుగా, సహయోగులుగా అయి ఉన్నట్లయితే, మాయకు ఈ ముట్టడిలోకి రాగలిగే ధైర్యం ఉండదు. కానీ సంగఠనలో సహయోగ శక్తి ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే – ఎన్ని విషయాలను సహనం చేయవలసి వచ్చినా కానీ ఎదుర్కొని చూపిస్తాము, విజయులుగా అయి చూపిస్తాము అని ఈ దృఢ సంకల్పం చేస్తారో, అప్పుడే వస్తుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top