15 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

May 14, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - సెల్ఫ్ ను (స్వయాన్ని) రియలైజ్ అయ్యేందుకు మీరు ఇక్కడకు వచ్చారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మ అయిన తండ్రి ద్వారా వినండి, దేహీ-అభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి”

ప్రశ్న: -

మీరు ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నారా అని పిల్లలను చాలా సార్లు కొంతమంది ప్రశ్నిస్తారు, అప్పుడు మీరు వారికి ఏమి సమాధానమివ్వాలి?

జవాబు:-

మీరు చెప్పండి – అవును, మేము ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నాము. ఆత్మ జ్యోతిర్బిందువు. ఆత్మలోనే మంచి మరియు చెడు సంస్కారాలుంటాయి. ఆత్మ గురించిన పూర్తి జ్ఞానము ఇప్పుడు మాకు లభించింది. ఆత్మ సాక్షాత్కారం చేసుకోనంత వరకు దేహాభిమానులుగా ఉండేవారము. ఇప్పుడు మాకు పరమాత్ముని ద్వారా గాడ్ రియలైజేషన్ మరియు సెల్ఫ్ రియలైజేషన్ కలిగింది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

వారు మా నుండి దూరమవ్వలేరు….. (న వహ్ హమ్ సే జుదా హోంగే…..) 

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మిక పిల్లలు శరీరం ద్వారా ఇలా అంటారు. మేము సాధు-సత్పురుషుల కోసం మరణిస్తామని ఎప్పుడూ ఎవరూ చెప్పరు. మేము వారితో పాటు వెళ్ళాలి, ఈ శరీరాన్ని వదిలేయాలి అని పిల్లలకు తెలుసు, అందుకే మేము ఈ శరీరాన్ని వదిలి తండ్రితో పాటు వెళ్తామని అంటారు. తండ్రి తమతో పాటు తీసుకువెళ్ళేందుకే వచ్చారు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయము. మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని పిల్లలు పిలుస్తారు, మరేమి చేయను. ఇక్కడే వదిలి వెళ్ళిపోను. ఈ ప్రపంచమంతా పతితంగా ఉంది, ఈ పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. ఆత్మలైన మనల్ని తమతో పాటు తీసుకువెళ్తారు. ఈ ప్రపంచమంతా వికారీగా ఉందని కూడా మీకు తెలుసు. మీరు ఎవరినైనా వికారులు, పతితులు అని అంటే వారు డిస్టర్బ్ అవుతారు. మనుష్యులకు చాలా యుక్తిగా అర్థం చేయించాలి. ఒక్క తండ్రి మహిమనే చేయాలి. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది, చాలా తెలివిగా మాట్లాడాలి. ఎక్కడైనా ఎక్కువగా ప్రశ్నించడం చూసారనుకోండి, వారికి – మేము ఇంకా కచ్చాగా ఉన్నాము, పెద్ద అక్కయ్య వచ్చి మీకు సమాధానం చెప్తారని చెప్పండి.

శివబాబా అర్థం చేయిస్తారని మీరు అంటారు, భగవానువాచ – మనుష్యులందరూ పతితులుగా ఉన్నారు. భగవంతుడు పతితంగా అవ్వరు. పతితంగా ఉన్న కారణంగా పతితపావనుడిని పిలుస్తారు. దేహధారులను భగవంతుడని అనలేరు. భగవంతుడని నిరాకారుడైన శివుడిని అంటారు, శివుని మందిరాలు కూడా చాలా ఉన్నాయి. మొట్టమొదటగా ఒక్క విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే నిలవగలరు. మొట్టమొదట, శివ భగవానువాచ – నన్నొక్కరినే స్మృతి చేయండి అని శివబాబా అంటారని వారికి చెప్పండి. వారికి తమ శరీరం లేదు. బ్రహ్మా-విష్ణు-శంకరులకు కూడా తమ-తమ సూక్ష్మ శరీరాలున్నాయి. వాళ్ళు కనిపిస్తారు. వీరైతే కనిపించరు. వీరిని పరమపిత పరమాత్మ అని అంటారు. నేను ఆత్మను, ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం తీసుకుంటానని మీరు కూడా అంటారు. మీరు మీ ఆత్మ సాక్షాత్కారాన్ని చేసుకున్నారు. భక్తి మార్గంలో సాక్షాత్కారం కోసం నవ విధ భక్తిని చేస్తారు. కానీ భక్తి చేసేవారు ఎప్పుడూ సాక్షాత్కారాన్ని పొందలేదు. భగవంతుడు ఎవరు అనేది వారికి అసలు తెలియదు. కేవలం వారు నిరాకారుడని అంటారు. ఆత్మనే మాట్లాడుతుంది. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. ఆత్మ వెళ్ళిపోతే, ఆత్మ గాని, శరీరం గాని మాట్లాడలేవు. ఆత్మ లేకుండా శరీరం ఏమీ చేయలేదు. ముందు ఆత్మను గుర్తించాలి మరియు తండ్రి ద్వారానే తండ్రిని గుర్తించగలరు. ఆత్మ స్వయాన్నే తెలుసుకోలేనప్పుడు, స్వయాన్నే చూడలేనప్పుడు, ఆత్మకు పరమపిత పరమాత్ముని సాక్షాత్కారం ఎలా జరుగుతుంది. ‘‘ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తుంది’’ అని అంటారు, కానీ ఆత్మలో 84 జన్మల పాత్ర ఇమిడి ఉందని ఎవరికీ తెలియదు. మనుష్యులు పూర్తిగా దేహాభిమానులుగా ఉంటారు. ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి అని తండ్రి అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి, అప్పుడు నా ద్వారా వినండి. వినేది ఆత్మ, ఆత్మకు వినిపించేందుకు పరమాత్మ కావాలి. మనుష్యులకు అర్థం చేయించేవారు మనుష్యులే అయ్యి ఉంటారు. ఈ ఆత్మ జ్ఞానం ఎవరికీ లేదు, అందుకే ముందు ఆత్మను తెలుసుకోండి, సెల్ఫ్ ను రియలైజ్ అవ్వండి అని అంటారు. నేను ఆత్మను ఎలా రియలైజ్ చేసుకోవాలి అని స్వయంగా ఆత్మనే అడుగుతుంది. మన ఆత్మలో మొత్తం పాత్ర అంతా ఎలా నిండి ఉంది అనేది ఎవరికీ తెలియదు. సాధువులు-సన్యాసులు మొదలైన వారెవరూ చెప్పలేరు. తండ్రియే వచ్చి పిల్లలను సెల్ఫ్ ను రియలైజ్ అయ్యేలా చేయవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నిరాకార పరమపిత పరమాత్మ అయిన నా ద్వారా వినండి అని తండ్రి అంటారు. ఆత్మ మరియు పరమాత్మ కలుసుకున్నప్పుడే ఈ సంభాషణ జరగగలదు. పరమపిత పరమాత్మ ఎప్పుడు వస్తారు, ఎలా వచ్చి అర్థం చేయిస్తారు అనేది ప్రపంచానికి తెలియదు. తెలియని కారణంగా అభిప్రాయ బేధాలలోకి వస్తారు. వారిదంతా శాస్త్రాలపై ఆధారపడి ఉంది. వాటి ద్వారా మీరు నన్ను రియలైజ్ అవ్వలేరు, అలానే తమను తాము రియలైజ్ అవ్వలేరు అని తండ్రి అంటారు. వారు ఆత్మనే పరమాత్మ అని అంటారు. అలా అనడంతో ఏమి జరుగుతుంది? మనల్ని పతితుల నుండి పావనంగా ఎవరు తయారుచేస్తారు? త్రికాలదర్శులుగా ఎవరు తయారుచేస్తారు? ఆత్మ మరియు పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఎవరూ ఇవ్వలేరు, కావుననే ఏ ఆత్మలకైతే తమ తండ్రి గురించి తెలియదో, వారు నాస్తికులని మీరంటారు. కానీ వారేమో, ఎవరైతే భక్తి చేయరో, వారిని నాస్తికులని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు భక్తి చేయరు. మీ వద్ద చాలా మంచి చిత్రాలున్నాయి. చిత్రాల ద్వారానే అర్థం చేయించడం జరుగుతుంది. ఎవరైతే ప్రపంచ పటాన్ని చూసి ఉండరో, వారికి లండన్ ఎక్కడ ఉంటుందో, అమెరికా ఎక్కడ ఉంటుందో ఎలా తెలుస్తుంది. ఎప్పటివరకైతే టీచరు కూర్చొని ఆ పటం చూపించి అర్థం చేయించరో, అప్పటివరకు తెలియదు, అందుకే మీరు ఈ చిత్రాలను తయారుచేసారు, కానీ డీటైల్ గా ఎవరూ అర్థం చేసుకోలేరు. సూర్యవంశీయులు ఈ రాజధానిని ఎక్కడ నుండి తీసుకున్నారు? తర్వాత చంద్రవంశీయులు ఎలా తీసుకున్నారు? వారు సూర్యవంశీయులతో యుద్ధమేమైనా చేసారా? అందరికీ ఒక్క తండ్రి నుండే వారసత్వం లభిస్తుందని మీరు అర్థం చేసుకుంటారు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు విశ్వానికి యజమానులు. వేరే ధర్మమేదీ ఉండదు కావున యుద్ధం యొక్క మాటే ఉండదు. మేము విశ్వానికి యజమానులుగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. సూర్యవంశీయులపై చంద్రవంశీయులు గెలుపొందారు లేదా యుద్ధం జరిగింది అని కాదు. అలా జరగదు, అవి వేరు-వేరు వంశాలు.

ఇప్పుడు మీ బుద్ధిలో ఈ చిత్రాలకు సంబంధించిన జ్ఞానమంతా ఉంది. స్కూల్లో కూడా స్టూడెంట్ చదువుకుంటున్నప్పుడు, వారి బుద్ధిలోకి జ్ఞానమంతా వచ్చేస్తుంది. చిన్న పిల్లలకు – ఇది ఏనుగు, ఇది ఫలానా అని పుస్తకంలో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ డ్రామాను తెలుసుకున్నారు. ఈ చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. ఇవన్నీ కొత్త విషయాలు మరియు ఈ విషయాలను బ్రాహ్మణ కులం వారే అర్థం చేసుకుంటారు. ఇతరులు కూర్చొని అనవసరమైన వాదన చేస్తారు. అలాగని, అందరికీ ఒకేసారి అర్థం చేయించవచ్చు అని కూడా కాదు. వేరు-వేరుగా అర్థం చేయించాల్సి ఉంటుంది. ముందు తండ్రిని, ఆత్మను అర్థం చేసుకొని, తర్వాత క్లాసులో కూర్చోవాలి అన్న నియమం ఉంది, అప్పుడే అర్థమవుతుంది లేకపోతే అసలేమీ అర్థం చేసుకోలేరు. సంశయాలు కలుగుతూనే ఉంటాయి. భగవంతుడు ఒక్కరే, వారు ఉన్నతోన్నతమైనవారు అని మీరు అర్థం చేయించాలి. దేవతలను కూడా భగవంతుడని అనలేరు. ఆత్మ జ్ఞానం కూడా ఇప్పుడు మీకు లభించింది. కర్మ ఫలాన్ని ఆత్మనే అనుభవిస్తుంది. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా వింటుంది. భగవంతుడైన తండ్రి ఒక్కరే, వారి నుండి వారసత్వం లభిస్తుంది. మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని, తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించండి అని బాబా అర్థం చేయించారు. జన్మ-జన్మలుగా భక్తి చేస్తూ వచ్చారు. హనుమంతుని పూజారులైతే హనుమంతుడిని స్మృతి చేస్తారు మరియు కృష్ణుని పూజారులైతే కృష్ణుడిని స్మృతి చేస్తారు. మీరు ఆత్మ, పరమాత్మ మీ పరమపిత, వారిని స్మృతి చేయడం ద్వారానే తండ్రి వారసత్వం లభిస్తుంది అని ఇప్పుడు మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఆ తండ్రి స్వర్గ రచయిత కావున తప్పకుండా మనం స్వర్గంలో ఉండాలి. భారత్ స్వర్గంగా ఉండేది. రాజ్యాధికారం ఉండడానికి ఇప్పుడు స్వర్గం లేదు. నరకంలోనైతే రావణుని రాజ్యముంది. మన రాజధాని ఎలా నడిచింది, తర్వాత ఎలా కిందకు దిగిపోయాము అనేది ఏమీ తెలియదు. పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ మనం కిందకు దిగాల్సిందేనని ఇప్పుడు మీకు తెలుసు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారని, స్వర్గ వారసత్వం లభిస్తుందని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. మనం తండ్రికి చెందినవారిగా అయినట్లయితే తండ్రి వారసత్వం లభిస్తుంది. కానీ ఎప్పటివరకైతే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వరో, యోగం ద్వారా పావనంగా అవ్వరో, అప్పటివరకు వారసత్వం లభించదు. నన్ను స్మృతి చేయడంతో మీ వికర్మలు వినాశనమవుతాయి, వికర్మాజీతులుగా అవుతారు, ఇది గ్యారెంటీ అని తండ్రి అంటారు. వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు తీక్షణ బుద్ధి కలవారు ఉంటే గొడవ చేయడం మొదలుపెడతారు. విఘ్నాలు వేసేవారు ఎవరో ఒకరు ఉంటారు. ఎవరైనా హంగామా చేసినట్లయితే, ఏకాంతంలో వచ్చి అర్థం చేసుకోండి అని చెప్పాలి. 7 రోజుల భట్టీలో ఉంటూ అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడి నియమము, ఎందుకంటే ఈ జ్ఞానం కొత్తది అయిన కారణంగా మనుష్యులు తికమకపడతారు. ఏదైనా కొత్త సెంటరు తెరిచినప్పుడు, అందరికీ అర్థం చేయించగలిగే చురుకైనవారు అక్కడ ఉండాలి. అందరికీ భగవంతుడు ఒక్కరే, ఆత్మలందరూ పరస్పరంలో సోదరులు. పరమాత్మ అందరికీ తండ్రి. పతితపావనా రండి, అని పిలుస్తున్నారంటే వారు తప్పకుండా పావనమైనవారు, వారు ఎప్పుడూ పతితంగా అవ్వరు. తండ్రియే వచ్చి పతితులను పావనంగా చేస్తారు. సత్యయుగంలో అందరూ పావనమైనవారు. కలియుగంలో అందరూ పతితమైనవారు. పతితులు చాలామంది ఉంటారు, పావనులు కొద్దిమందే ఉంటారు. సత్యయుగంలోకైతే అందరూ వెళ్ళరు. ఎవరైతే పతితుల నుండి పావనంగా అవుతారో, వారే పావన ప్రపంచంలోకి వెళ్తారు. మిగిలిన వారంతా నిర్వాణ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. మొత్తం ప్రపంచమంతా వచ్చి మతాన్ని తీసుకోరని కూడా తెలుసు. మీరు మొత్తం ప్రపంచానికి మతాన్ని ఇవ్వడమనేది కష్టము. ఇప్పుడిది అందరికీ వినాశన సమయము. అందరి వినాశనం జరగనున్నది. వారు శాంతిగా కూర్చొని వినాలి, డిస్టర్బెన్స్ చేయకూడదు అంటే ఇదంతా అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తి కావాలి. మొట్టమొదట తండ్రి పరిచయాన్నివ్వాలి. శివబాబాయే పతితపావనుడు, వారే అర్థం చేయిస్తారు. గీతలో కూడా ఈ మాట ప్రసిద్ధమైనది, అదేమిటంటే – నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని పతితపావనుడైన తండ్రియే చెప్తారు. ఈ పదాలు గీతతో సంబంధం కలిగినవి. శివబాబా అంటారు – నన్ను స్మృతి చేయండి, నేను సర్వశక్తివంతుడను, పతితపావనుడను, గీతా జ్ఞాన దాతను, జ్ఞానసాగరుడను. ఇవి గీతలోని పదాలు కదా. వారు కేవలం కృష్ణ భగవానువాచ అని అంటారు, మీరు శివ భగవానువాచ అని అంటారు. భగవంతుడు నిరాకారుడు, వారెప్పుడూ పునర్జన్మల్లోకి రారు, వారు అలౌకికమైన, దివ్యమైన జన్మను తీసుకుంటారు. నేను సాధారణ వృద్ధ తనువులోకి వస్తాను, అతడిని భగీరథుడు అని అంటారని బాబా స్వయంగా అర్థం చేయిస్తారు. బ్రహ్మా ద్వారానే రచనను రచిస్తారు. కావున మనిషి పేరును బ్రహ్మా అని పెట్టడం జరుగుతుంది. వ్యక్త బ్రహ్మా నుండి తర్వాత పావనమైన అవ్యక్త ఫరిస్తాగా తయారవుతారు. పతితులను పావనంగా చేసేందుకే తండ్రి వస్తారు. కావున తప్పకుండా పతిత ప్రపంచంలో, పతిత శరీరంలోనే వస్తారు. ఇది విస్తారమైన వివరణ. నన్ను కల్ప క్రితం వలె స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని భగవంతుడు అంటున్నారని మొట్టమొదట అర్థం చేయించాలి. పతితుల నుండి పావనంగా అవ్వండి. హే పతితపావనా రండి, అని పాడుతారు కూడా. గంగ అయితే ఎలాగూ ఉంది. మీరు పిలుస్తున్నారంటే తప్పకుండా ఎక్కడో ఒకచోట నుండి వస్తారు. పతితులను పావనంగా తయారుచేసే పాత్రను అభినయించేందుకు పతితపావనుడు వస్తారు. తండ్రి అంటారు – మీరు పావనంగా ఉండేవారు, తర్వాత మీలో మాలిన్యం చేరుకుంది, అది యోగబలం ద్వారానే తొలగుతుంది. మీరు పవిత్రంగా అయితే పావన ప్రపంచంలోకే వస్తారు. పతిత ప్రపంచం వినాశనమైపోతుంది. ఏదైతే అర్థం చేయించడం జరుగుతుందో, దానిని మంచి రీతిలో ధారణ చేయాలి. మనం కేవలం ఉన్నతోన్నతుడైన తండ్రి మహిమను చేస్తాము. అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు – మీరు 84 జన్మల పాత్రను అభినయిస్తూ- అభినయిస్తూ ఎంత పతితులుగా అయ్యారు. ముందు పావనంగా ఉండేవారు, ఇప్పుడు పతితులుగా అయ్యారు. స్మృతియాత్రలో ఉండడం ద్వారా మీరు పావనంగా అవుతారు. భక్తి మార్గం నుండి మీరు మెట్లు దిగుతూనే వచ్చారు. ఇది చాలా సహజమైన విషయము. ఇది పిల్లల బుద్ధిలో కూర్చోవాలి. ఉదయాన్నే లేచి విచార సాగర మథనం చేయాలి, తర్వాత ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించాలి. మురళీలోని ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకుని, మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. అప్పుడు మనసులో పక్కాగా నిలిచిపోతాయి.

మొట్టమొదటి ముఖ్యమైన విషయము – తండ్రిని స్మృతి చేయడము. మన్మనాభవ, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని తండ్రియే అంటారు. ఇప్పుడు చేస్తారో, చేయరో ఇక మీ ఇష్టం. తండ్రి ఆజ్ఞ అయితే లభించింది. పావన ప్రపంచంలోకి వెళ్ళాలంటే ఇక పతిత ప్రపంచం వైపు మీ బుద్ధియోగం వెళ్ళకూడదు. వికారాల్లోకి వెళ్ళకూడదు. చాలా వివరణలు లభిస్తూ ఉంటాయి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఉదయాన్నే లేచి విచార సాగర మథనం చేయాలి. తండ్రి ఏదైతే వినిపిస్తారో, దానిని నోట్ చేసుకొని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి, ఇతరులకు వినిపించాలి. అందరికీ మొట్టమొదటగా తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి.

2. పావన ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఈ పతిత ప్రపంచం నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే మనసు ద్వారా శక్తులను దానం చేస్తారో, వారికి మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క వరదానం ప్రాప్తిస్తుంది, ఎందుకంటే మనసు ద్వారా శక్తులను దానం చేయడంతో, సంకల్పంలో ఎంత శక్తి జమ అవుతుందంటే, వారికి ప్రతి సంకల్పంలోనూ సిద్ధి ప్రాప్తిస్తుంది. వారు వారి సంకల్పాలను ఎక్కడ కావాలంటే అక్కడ ఒక్క క్షణంలో స్థిర పరచగలరు, సంకల్పాలు వారి వశంలో ఉంటాయి. వారు వారి సంకల్పాలపై విజయులుగా ఉన్న కారణంగా చంచల సంకల్పాలు కలిగినవారిని కూడా కొంత సమయం కోసం అచలంగా మరియు శాంతిగా చేయగలరు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top