18 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

May 17, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - కాలుడిపై విజయం పొందేలా చేసేందుకు, కాలుడికే కాలుడైన బాబా వచ్చారు, మన్మనాభవ మంత్రంతోనే మీరు కాలుడిపై విజయం పొందుతారు”

ప్రశ్న: -

ఆత్మిక తండ్రి ఆత్మిక యాత్రికులైన మీకు ఏ విశేషమైన శిక్షణనిస్తారు?

జవాబు:-

ఓ ఆత్మిక యాత్రికులారా, మీరు దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవ్వండి. రావణుడు అర్ధకల్పం నుండి మిమ్మల్ని దేహాభిమానులుగా చేసాడు, ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వండి. ఈ ఆత్మిక జ్ఞానాన్ని సుప్రీమ్ ఆత్మయే మీకు ఇస్తారు, ఇతరులెవ్వరూ ఇవ్వలేరు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఓం నమః శివాయ…..

ఓంశాంతి. పిల్లలు తమ తండ్రి మహిమను విన్నారు. భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైనవారని కూడా గాయనం చేయడం జరుగుతుంది. వారు పిల్లలందరికీ తండ్రి. మిగిలిన వారెవరైతే ఉన్నారో, వారందరూ పరస్పరంలో సోదరులు మరియు అందరికీ తండ్రి ఒక్కరే. వారు శివబాబా. తండ్రి అర్థం చేయించారు – ఓ పిల్లలూ, భక్తి మార్గంలో మీకు ఇద్దరు తండ్రులున్నారు – లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి. రచయిత నుండి రచనకు వారసత్వం లభిస్తుంది, అది హద్దు వారసత్వం, ఇది అనంతమైన వారసత్వం. అనంతమైన తండ్రి అయితే ఒక్కరే, వారి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. వారు నిరాకారుడు, వారి పేరు పరమపిత పరమాత్మ శివ. శివ పరమాత్మాయ నమః అని కూడా అంటారు, వారు ఉన్నతాతి ఉన్నతమైనవారు. మీ బుద్ధి నిరాకార తండ్రి వైపుకు వెళ్తుంది. వారు పరంధామంలో ఉంటారు, ఆత్మలైన మీరు అక్కడి నుండే వస్తారు, తండ్రి కూడా అక్కడే ఉంటారు. వారు సర్వులకు సద్గతినిచ్చేవారు. అందులోనూ భారత్ పరమపిత పరమాత్ముని జన్మ స్థలము, శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. ఆ ఆత్మిక తండ్రినే జ్ఞానసాగరుడు, పతితపావనుడు, ముక్తిదాత, మార్గదర్శకుడు అని అంటారు. వారే దుఃఖహర్త-సుఖకర్త అని భారతవాసులకు తెలుసు. ఇది దుఃఖధామం, భారత్ యే సుఖధామంగా ఉండేది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు – ఓ భారతవాసులారా, మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, అప్పుడు మీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముండేది. దేవీ-దేవతలు ధర్మ-శ్రేష్ఠులుగా, కర్మ-శ్రేష్ఠులుగా ఉండేవారు. ఇప్పుడు వారు ధర్మ-భ్రష్టులుగా, కర్మ-భ్రష్టులుగా అయిపోయారు. స్వయాన్ని పావన దేవతలుగా పిలుచుకోలేరు. కలియుగాంతం వరకు భక్తి మార్గం నడుస్తుంది, అందులో జ్ఞానముండదు. జ్ఞానంతో సద్గతి కలుగుతుంది. ఎప్పటి వరకైతే సర్వుల సద్గతిదాత అయిన తండ్రి రారో, అప్పటి వరకు సద్గతి లభించదు. నేను కల్పం యొక్క సంగమయుగంలో వస్తానని తండ్రి అంటారు. ఈ సమయంలో పతిత ప్రపంచంలా ఉంది. పావనులు ఒక్కరు కూడా లేరు. సన్యాసులు పవిత్రంగా అవుతారు కానీ వారు పునర్జన్మలను ఇక్కడే తీసుకోవాల్సి ఉంటుంది. విషం ద్వారా జన్మ తీసుకోవాల్సి ఉంటుంది, తిరిగి వెళ్ళలేరు. ఎప్పుడైతే చక్రం పూర్తవుతుందో, అప్పుడే తండ్రి వచ్చి తీసుకువెళ్తారు. దీనిని ఆత్మిక జ్ఞానమని అంటారు. సూప్రీమ్ ఆత్మ, ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. సూప్రీమ్ ఆత్మయే జ్ఞానసాగరుడు, పతితపావనుడు. ఇకపోతే, శాస్త్రాల జ్ఞానం భక్తి మార్గానికి చెందినది. యజ్ఞ తపాదులు, తీర్థయాత్రలు మొదలైనవి చేస్తూ ఇంకా కిందకు దిగుతూ వచ్చారు అని తండ్రి అంటారు. మీరు ముందు సతోప్రధానంగా ఉండేవారు. భారత్ లో పవిత్రత ఉన్నప్పుడు శాంతి, సంపదలు కూడా ఉండేవి. ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ ఉండేవి. నేటికి 5 వేల సంవత్సరాల కిందటి విషయము, ఈ భారత్ స్వర్గంగా ఉండేది. ఆ సమయంలో వేరే ధర్మమేదీ ఉండేది కాదు. కేవలం పరమపిత పరమాత్మ స్థాపించిన ఆది సనాతన దేవీదేవతా ధర్మం ఒక్కటే ఉండేది. స్వర్గ స్థాపనను వారే చేస్తారు, మనుష్యులు చేయలేరు. కృష్ణుడిని రచయిత అని అనరు. రచయిత ఒక్క నిరాకార శివుడు మాత్రమే. మిగిలినవారంతా వారి రచన. రచయిత నుండే రచనకు వారసత్వం లభిస్తుంది.

తండ్రి అర్థం చేయిస్తారు – నేను మీ అనంతమైన తండ్రిని, 21 జన్మల కోసం మీకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తాను, సూర్యవంశీయుల, చంద్రవంశీయుల పవిత్ర ధర్మాలను స్థాపన చేస్తాను. బ్రాహ్మణ ధర్మం పిలక వంటిది. అందరికన్నా ఉన్నతమైనవారు ఆత్మిక తండ్రి, వారు ఆత్మలను తమ సమానంగా చేస్తారు. తండ్రి జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు కనుక మిమ్మల్ని కూడా అలా తయారుచేస్తారు. భారత్ యే సుఖధామంగా ఉండేది, ఇప్పుడు దుఃఖధామంగా ఉంది. తండ్రి ఎలా వస్తారు అనేది ఎవరికీ తెలియదు. సత్యయుగం ఆది నుండి కలియుగాంతం వరకు, ఈ పూర్తి చరిత్ర-భూగోళమంతా భారత్ కు చెందినది. ఈ లక్ష్మీనారాయణులు ఎంత ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉండేవారు. ఎప్పుడూ అనారోగ్యంపాలు అయ్యేవారు కాదు. ఇప్పుడు కాలుడిపై విజయాన్ని పొందే శిక్షణను తీసుకుంటున్నారు. ఎవరినైతే కాలుడికే కాలుడు, మహాకాలుడు అని అంటారో, వారు మిమ్మల్ని కాలుడిపై విజయం పొందేలా చేస్తున్నారు. శివాయ నమః అన్న పేరును కూడా విన్నారు. పరమాత్మను సర్వవ్యాపి అని, కుక్కలో, పిల్లిలో ఉన్నారని మీరు ఇలా అనరు. దీనిని ధర్మ గ్లాని అని అంటారు. తండ్రిని గ్లాని చేస్తారు. ఇప్పుడిది కల్పం యొక్క సంగమ సమయము. ఈ సమయంలోనే వినాశ కాలే విపరీత బుద్ధి కలవారు అని అంటారు. ఇప్పుడు వినాశనమైతే ఎదురుగా నిలబడి ఉంది. యాదవులు, కౌరవులు, పాండవులు ఏమి చేసి వెళ్ళారు అనేది గీతలో కూడా రాసి ఉంది. సర్వ శాస్త్రమయీ శిరోమణి శ్రీమత్ భగవద్గీత, దాని నుండే ఇతర శాస్త్రాలు కూడా వెలువడ్డాయి. గీత దేవతా ధర్మ శాస్త్రమని మీకు తెలుసు. తండ్రి అంటారు – నేను వచ్చి, మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తాను, తర్వాత దేవీ-దేవతలుగా చేస్తాను. తర్వాత మీరు క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. మీరు 84 జన్మలను ఎలా తీసుకుంటారు అనేది తండ్రి అర్థం చేయిస్తారు. ఎవరైతే మొట్టమొదట సత్యయుగంలోకి వస్తారో, తప్పకుండా వారు అందరికన్నా ఎక్కువ జన్మలు తీసుకుంటారు. భారతవాసులైన మీరు మేక్సిమమ్ 84 జన్మలు తీసుకుంటారు, మినిమమ్ ఒక్క జన్మ తీసుకుంటారు. ఇది కూడా తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రిని తప్ప ఇతరులెవరినీ జ్ఞానసాగరుడని అనరు. పతితపావనుడు, జ్ఞానసాగరుడు అని అంటూనే బుద్ధి పైకి వెళ్తుంది. తండ్రియే అందరినీ ముక్తులుగా చేసి తిరిగి తీసుకువెళ్తారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. అచ్ఛా, మరి సర్వుల దుర్గతి ఎలా జరుగుతుంది. ఎవరు చేస్తారు. సత్యయుగాన్ని సద్గతి అని, కలియుగాన్ని దుర్గతి అని అంటారు. నేను కల్ప-కల్పము వచ్చి, పిల్లలైన మీకు సద్గతినిస్తాను అని తండ్రి అంటారు. పిల్లలైన మీరు మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర-భూగోళాలను తెలుసుకున్నారు. స్కూళ్ళలోనైతే చరిత్ర-భూగోళాలను సగమే నేర్పిస్తారు. సత్య-త్రేతా యుగాలలో ఎవరు రాజ్యం చేసేవారు అనేది ఎవరికీ తెలియదు. చిత్రాలైతే సరిగ్గానే ఉన్నాయి – ఈ లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. ఆ రాజధాని ఎంత సమయం నడిచింది అనేది మీరు చెప్పగలరు. క్రిస్టియన్ వంశం 2 వేల సంవత్సరాలు నడిచింది. బౌద్ధ వంశం ఇంత సమయం నడిచింది. తర్వాత ఇస్లాములు….. వారికన్నా ముందు చంద్రవంశీయులు ఉండేవారు, అది 1250 సంవత్సరాలు నడిచింది. సత్య-త్రేతా యుగాలలో సూర్యవంశీయులు, చంద్రవంశీయులు మాత్రమే ఉండేవారు, ఇంకే ధర్మము ఉండేది కాదు. మీరే సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు. ఈ నాటకమంతా భారత్ పైనే రచించబడింది. భారత్ యే హెల్ మరియు హెవెన్ గా అవుతుంది. ఇతర ధర్మాల వారి కోసం ఇలా చెప్పరు. వారు హెవెన్ లో ఉండనే ఉండరు. ఎవరైనా మరణించినప్పుడు, స్వర్గస్థులయ్యారని అంటారు కానీ అర్థం చేసుకోరు. నరకవాసులు నరకంలోనే జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. స్వర్గవాసులు స్వర్గంలోనే పునర్జన్మలు తీసుకుంటారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గవాసులుగా ఉండేవారు, వారు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు అనేది పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. లక్షల సంవత్సరాల విషయమైతే గుర్తుండదు. సత్యయుగంలో ఈ శాస్త్రాలు మొదలైనవి ఉండవు. ఇదంతా భక్తి యొక్క సామాగ్రి. మెట్లు కిందకు దిగాల్సిందే. సతోప్రధానం నుండి సతో, రజో, తమోలలోకి వస్తారు. ఈ మెట్లు దిగడానికి 5 వేల సంవత్సరాలు పడుతుంది. సత్యయుగంలో 16 కళా సంపూర్ణులుగా ఉంటారు, తర్వాత త్రేతాలో 2 కళలు తగ్గుతాయి. ఆత్మలో వెండి అనే లోహం కలుస్తుంది. రాగియుగంలోకి వచ్చినప్పుడు, రాగి అనే లోహం కలుస్తుంది. ఈ సమయంలో పూర్తిగా తమోప్రధానంగా ఉన్నారు. ఆత్మలోనే లోహం కలుస్తుంది. మీరే పూర్తి 84 జన్మలను తీసుకుంటారు. ఆత్మిక తండ్రి అయిన ఈ శివబాబా వచ్చి, ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. రావణుడు ప్రవేశించడంతో అందరూ దేహాభిమానులుగా అయిపోతారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించాలి. మనమే 84 జన్మలు తీసుకొని, రకరకాల పాత్రలను అభినయిస్తూ వచ్చాము. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తయ్యింది. ఇప్పుడైతే శరీరం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ద్వాపరం నుండి రావణ రాజ్యం ఉంటుంది. సత్యయుగంలో రామ రాజ్యముంటుంది. సత్యయుగంలో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు. ద్వాపర-కలియుగాలలో మీరు దేహాభిమానులుగా అయిపోతారు. ఆత్మను గురించి గాని, పరమాత్మను గురించి గాని తెలియదు.

తండ్రి అర్థం చేయిస్తారు – ఆత్మ ఒక నక్షత్రము. భృకుటి మధ్యలో ప్రకాశించే అద్భుతమైన నక్షత్రము….. దానిని దివ్యదృష్టితో తప్ప ఇంకే విధంగానూ చూడలేరు. అది చాలా సూక్ష్మమైనది. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మలైన మనం 84 జన్మలు తీసుకున్నాము. పరమపిత పరమాత్మ కూడా బిందువు, వారినే జ్ఞానసాగరుడని, పతితపావనుడని, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. పరమపిత పరమాత్మలో సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. బీజరూపుడైన కారణంగా వారిని సత్-చిత్-ఆనంద స్వరూపుడని అంటారు. తండ్రిలో ఏ జ్ఞానమైతే ఉందో, దానిని తప్పకుండా వినిపించవలసి ఉంటుంది. ఇది స్పిరిచ్యుల్ నాలెడ్జ్. సర్వాత్మల తండ్రి వచ్చి, ఆత్మలను చదివిస్తారు. మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. మనల్ని శివబాబా చదివిస్తారు, వారే నాలెడ్జ్ ఫుల్. తండ్రియే వచ్చి, స్వర్గ రచనను రచిస్తారు. మిమ్మల్ని స్వర్గానికి యోగ్యులుగా చేస్తారు. ఈ సృష్టి చక్ర రహస్యం మనుష్యులెవరికీ తెలియదు. తండ్రినే తెలుసుకోని కారణంగా, భారత్ కు ఈ పరిస్థితి ఏర్పడింది. భారత్ లో పవిత్రత ఉండేటప్పుడు, శాంతి-సంపదలు కూడా ఉండేవి. ఇప్పుడు ఇది నరకము, మరి ఎవరైనా స్వర్గానికి ఎలా వెళ్ళగలరు! పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు.

తండ్రి అంటారు – నేను పిల్లల కోసం ఏదో ఒక కానుకను తీసుకువస్తాను. మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాను. ఎవరైతే కల్పక్రితం వారసత్వం తీసుకున్నారో, వారే ఇప్పుడు తీసుకుంటారు, మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. వాస్తవానికి ప్రజాపిత బ్రహ్మాకు అందరూ సంతానమే. ఇప్పుడు బ్రహ్మా ద్వారా, శివబాబా రచనను రచిస్తున్నారు. బ్రహ్మాకుమార-కుమారీలుగా తయారవుతూ ఉంటారు. శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేయాలి, తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి అంటారు – పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే, మీ వికర్మలన్నీ వినాశనమవుతాయి. ఈ స్పిరిచ్యుల్ నాలెడ్జ్ ను తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఆత్మిక తండ్రియే ఆత్మలకు నాలెడ్జ్ ఇస్తారు. మీరు ఆత్మిక యాత్రను చేస్తారు. దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవుతారు. ఆత్మ అవినాశి. ఆత్మలోనే పాత్ర నిండి ఉంది. ఆత్మ 84 జన్మల పాత్రను ఎలా అభినయిస్తుంది అనేది ఇప్పుడు తెలిసింది. మనం సూర్యవంశీయులుగా ఉండేవారము, తర్వాత చంద్రవంశీయులుగా అయ్యాము, మళ్ళీ మనం సూర్యవంశీయులుగా అవ్వాలి. నన్నొక్కడినే స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి సతోప్రధానంగా అయ్యే శిక్షణనిస్తారు. భగవానువాచ – గీతా భగవంతుడు శివబాబా, శ్రీకృష్ణుడు కాదు. కృష్ణుని ఆత్మ కూడా ఇప్పుడు నేర్చుకుంటుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మిక యాత్రను చేయాలి మరియు చేయించాలి. స్వయాన్ని సతోప్రధానంగా తయారుచేసుకునేందుకు ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థాన్ని పూర్తిగా చేయాలి.

2. కాలుడిపై విజయాన్ని పొందేందుకు తండ్రి శిక్షణల పట్ల అటెన్షన్ పెట్టాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మలకు జ్ఞానాన్ని ఇవ్వాలి.

వరదానము:-

ఎలాగైతే బీజంలో మొత్తం వృక్షమంతా ఇమిడి ఉంటుందో, అదే విధంగా శబ్దానికి అతీతమైన స్థితిలో, సంగమయుగంలోని సర్వ విశేష గుణాలు అనుభవంలోకి వస్తాయి. మాస్టర్ బీజరూపులుగా అవ్వడమనగా కేవలం శాంతి మాత్రమే కాదు, శాంతితో పాటు జ్ఞానం, అతీంద్రియ సుఖం, ప్రేమ, ఆనందం, శక్తి మొదలైన ముఖ్యమైన సర్వ గుణాలను అనుభవం చేయడము. ఈ అనుభవం కేవలం స్వయానికి మాత్రమే కాదు, ఇతర ఆత్మలు కూడా వారి ముఖం ద్వారా సర్వ గుణాలను అనుభవం చేస్తారు. ఒక్క గుణంలో సర్వ గుణాలు ఇమిడి ఉంటాయి.

స్లోగన్:-

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

‘‘భగవంతుడు ఎవరికైతే తోడుగా టారో, వారిని గాలివానలు మరియు తుఫానులు మి ఆపుతాయి’’

భగవంతుడు ఎవరికైతే తోడుగా ఉంటారో, వారిని గాలివానలు మరియు తుఫానులు ఏమి ఆపుతాయి….. చూడండి, ఈ పాట ఆత్మ మరియు పరమాత్మ ఇరువురు వేర్వేరు అనేది ఋజువు చేస్తుంది. అలానే, ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనేది ఋజువు చేస్తుంది ఎందుకంటే ఈశ్వరుడు ఎవరికైనా తోడుగా ఉన్నట్లయితే, వారు హాజరై ఉన్నట్లయితే, సృష్టిలో ఇంత దుఃఖం ఎందుకు ఉంది, మనుష్యులు ఇంతటి నిరుపేదలుగా, బానిసలుగా ఎందుకు ఉన్నారు? పరమాత్మ సుఖస్వరూపుడు కావున పరమాత్మను సర్వవ్యాపి అనడమంటే పరమాత్మను అవమానపర్చడము. భగవంతుడు హాజరై ఉన్నప్పుడు, ఈ ప్రపంచము సుఖ స్వరూపంగా ఉంటుందా లేదా దుఃఖ రూపంగా ఉంటుందా? ఇక అటువంటప్పుడు పరమాత్మను పిలవాల్సిన అవసరమేముంది? కనుక ఈ సమయంలో మాయ సర్వవ్యాపిగా ఉంది, అంతేకానీ పరమాత్మ అంతటా హాజరై ఉన్నారని కాదు. పరమాత్మ కేవలం ఒక్కసారి మాత్రమే సంగమంలో వస్తారు, అప్పుడు వారిని హాజిర్-నాజిర్ (అంతటా ఉన్నారు) అని చెప్పవచ్చు. ఇకపోతే వారి స్మృతి అనేది తప్పకుండా అందరి హృదయాలలో వ్యాపించి ఉంది. ప్రతి ఒక్కరిలోనూ శరీరాన్ని నడిపించే శక్తి అనేది, రకరకాల సంస్కారాలు గల ఆత్మ, అంతేగాని పరమాత్మ కాదు. ఇప్పుడు ఇంతకీ మీరు పరమాత్మను ఎందుకు తోడుగా పెట్టుకుంటారు అనేది ఆలోచించాలి. ఈ మాయ యొక్క గాలివానలు మరియు తుఫానులను దాటేందుకు తోడుగా పెట్టుకుంటారు. అంటే, తప్పకుండా ఏవో మాయ తుఫానులు ఉన్నాయి మరియు వాటిని దాటేందుకు, ఆత్మలైన మనం ఆ పరమాత్ముని తోడును అడుగుతాము. ఒకవేళ వారు హాజరై ఉన్నట్లయితే, మాయ అలజడులు ఉండవు, అంతేకాక వారి తోడును పొందేందుకు స్మృతి చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కనుక ఆత్మలైన మనకు మరియు పరమాత్మకు, ఇరువురికీ ఈ ఆటలో పాత్ర ఉంది. పరమాత్మ వచ్చినప్పుడు, వారిని పూర్తిగా తోడు పెట్టుకొని, వారికి చెందినవారిగా అయిపోవాలి, అప్పుడే మాయ తుఫాన్ల నుండి విముక్తులవ్వగలము. వారు అందరికీ సుఖదాతనే కానీ ప్రాక్టికల్ గా ఎవరైతే వారి ఆధారాన్ని తీసుకుంటారో, వారికే ఆ తోడు లభిస్తుంది. అటువంటి పిల్లలకు అదనపు ప్రాప్తి లభిస్తుంది. వారు ప్రపంచంలోకి వచ్చి, ఉపస్థితులై ఉన్నారు కానీ ఓహో! ఆశ్చర్యకరము! ప్రపంచానికి వారి గురించి తెలియని కారణంగా, వారి తోడును అందుకోరు. ఒకవేళ వారిని పూర్తిగా తోడుగా పెట్టుకున్నట్లయితే, వారు సహాయం చేయడంలో ప్రసిద్ధమైనవారు. మీరు ఒక్క అడుగు ముందుకు వేసినట్లయితే నేను పది అడుగులు ముందుకు వేస్తానని అంటారు. కనుక వారు సంపూర్ణ వారసత్వాన్ని ఇస్తారు, ఇందులో ఎటువంటి అసంపూర్ణత ఉండదు. అచ్ఛా.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top