19 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

May 18, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీరు తండ్రి వద్దకు తమ ఉన్నతమైన భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు వచ్చారు, శ్రీమతాన్ని ఎంతగా అనుసరిస్తారో, అంత ఉన్నతమైన భాగ్యం తయారవుతుంది”

ప్రశ్న: -

భక్తిలో ఉండే ఏ అలవాటు ఇప్పుడు పిల్లలైన మీలో ఉండకూడదు?

జవాబు:-

భక్తిలో కొద్దిగా దుఃఖం కలిగినా, అనారోగ్యం వచ్చినా, ఓ రామా, ఓ భగవంతుడా, అని అంటారు. అయ్యో-అయ్యో అని అంటూ ఆర్తనాదాలు చేసే అలవాటు భక్తిలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఇటువంటి మాటలను నోటి ద్వారా ఎప్పుడూ వెలువడనివ్వకూడదు. మీరు లోలోపలే మధురమైన తండ్రిని ప్రేమగా స్మృతి చేయాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

భాగ్యాన్ని మేల్కొలుపుకొని వచ్చాను….. (తక్దీర్ జగాకర్ ఆయీ హూ…..) 

ఓంశాంతి. సుఖం మరియు శాంతి యొక్క భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు, మనుష్యులు ప్రతి ఒక్కరూ పురుషార్థం చేస్తారు. సాధు-సత్పురుషులు, సన్యాసులు మొదలైనవారు మాకు శాంతి కావాలి అని అంటారు. దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని అంటారు. భగవంతుడే మనుష్యమాత్రులకు దుఃఖహర్త-సుఖకర్త అని భావిస్తారు. ఇప్పుడు భగవంతుని గురించైతే మనుష్యులకు తెలియనే తెలియదు. మీరైతే శివబాబా అని అంటారు. బ్రహ్మా-విష్ణు-శంకరులను బాబా అని అనరు. వారు దేవతలు. భగవంతుడినే బాబా అని అంటారు, వారు నిరాకారుడు, వారిని పూజిస్తారు. శివబాబా అందరివాడు అని తెలుసు. కానీ మేము ‘బాబా’ అని ఎందుకు అంటున్నాము అన్న ఆలోచన రాదు. బాబా అని లౌకిక తండ్రి కూడా ఒకరు ఉంటారు – మరి వీరు ఏ తండ్రి! వారు నిరాకార తండ్రి అని ఆత్మ అంటుంది. వారు కూడా నిరాకారుడే, ఆత్మనైన నేను కూడా నిరాకారియే. సాకార తండ్రి ఉన్నప్పటికీ, ఆత్మ ఆ తండ్రిని మర్చిపోదు. వారు గాడ్ ఫాదర్, మనం వారి సంతానము. ఇక్కడ వారిని పరమపిత అని అంటారు. ఇంగ్లీష్ లో గాడ్ ఫాదర్, సుప్రీమ్ సోల్, అందరికన్నా ఉన్నతమైనవారు అని అంటారు. లౌకిక తండ్రి అయితే శరీరానికి రచయిత మరియు వారు పారలౌకిక తండ్రి. తండ్రియే కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేస్తారు ఎందుకంటే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. మీరు వారసత్వం తీసుకునేందుకే తండ్రి వద్దకు వచ్చారు. దుఃఖహర్త, సుఖకర్త అయిన తండ్రియే వచ్చి, సుఖం యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. తర్వాత అక్కడ దుఃఖం యొక్క నామ రూపాలుండవు. ఇక్కడైతే చాలా దుఃఖముంది కదా, అందుకే అందరూ పిలుస్తారు. ఇప్పుడు ప్రపంచంలో చాలా దుఃఖం రానున్నది. ఎవరైనా మరణించినప్పుడు ఎంత దుఃఖితులుగా అవుతారు. ‘అయ్యో భగవంతుడా’, అని అంటూ ఏడుస్తారు. వారు మాత్రమే కళ్యాణకారీ తండ్రి. ఇలా పాడుతున్నారంటే తప్పకుండా దుఃఖాన్ని హరించారు, సుఖాన్నిచ్చారు అనే కదా. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు – పిల్లలూ, కల్ప-కల్పము ఎప్పుడైతే మీరు చాలా దుఃఖితులుగా, పతితులుగా అవుతారో, అప్పుడు ఓ బాబా రండి, అని పిలుస్తారు. నేను కల్ప-కల్పము సంగమంలోనే వస్తాను. పావన ప్రపంచం యొక్క ఆది మరియు పతిత ప్రపంచం యొక్క అంతిమాన్ని సంగమం అని అంటారు. ఈ సంగమయుగం ఒక్కటే గాయనం చేయబడుతుంది. తండ్రి అందరి జ్యోతులను వెలిగించి, దుఃఖాన్ని హరించి, సుఖాన్ని ఇవ్వడానికి వస్తారు. ఏ బాబా అయితే వీరిలో ప్రవేశించారో, మేము ఆ పారలౌకిక తండ్రి వద్దకు వచ్చామని మీకు తెలుసు. నేను వీరిలో ప్రవేశించి, వీరికి బ్రహ్మా అని పేరు పెడతానని తండ్రి స్వయంగా చెప్తారు. మీరంతా బ్రహ్మాకుమారులు మరియు కుమారీలు. మేము తండ్రి నుండి సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు బ్రహ్మా సంతానంగా అయ్యాము అనే నిశ్చయం మీకుంది. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేటప్పుడు, పిల్లలైన మీకే సుఖముండేది. ఇప్పుడిది కలియుగం, దుఃఖధామము. దీని తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. ప్రపంచ చరిత్ర-భూగోళాలు రిపీట్ అవుతాయి కదా. సత్యయుగంలో మళ్ళీ ఈ లక్ష్మీనారాయణుల రాజ్యమే ఉండాలి. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. మీరు నరకవాసులుగా అయ్యారని, ఇప్పుడు మళ్ళీ స్వర్గవాసులుగా అవ్వాలని తండ్రి అర్థం చేయించారు. దేవీ-దేవతలైన మీ వృక్షం చాలా చిన్నదిగా ఉండేది. మేమే 84 జన్మలను తీసుకున్నామని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. మనమే మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారము, మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మీది 84 జన్మల అంతిమంలో కూడా అంతిమ సమయము. ప్రపంచం కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. కొత్త ప్రపంచం పావనంగా ఉండేది, ఇప్పుడిది పాత, పతిత ప్రపంచము. ఎంత దుఃఖితులుగా, నిరుపేదలుగా ఉన్నారు. భారత్ చాలా షావుకారుగా ఉండేది, పవిత్ర గృహస్థాశ్రమం ఉండేది. పవిత్ర ప్రవృత్తి మార్గముండేది, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. సర్వగుణ సంపన్నులుగా, 16 కళా సంపూర్ణులుగా ఉండేవారు. ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. శాస్త్రాలు భక్తి మార్గం కోసం ఉన్నాయి. వాటిలో భక్తి యొక్క ఆచార-పద్ధతులే ఉన్నాయి. తండ్రిని కలిసే మార్గము శాస్త్రాలలో లభించదు. భగవంతుడు ఇక్కడికి రావాల్సి ఉంటుందని భావిస్తారు కూడా. కానీ తిరిగి అక్కడకు చేరుకునే విషయమేమీ లేదు. యజ్ఞ తపాదులు మొదలైనవాని చేయడం – ఇవేవీ మార్గాలు కావు. మీరు రండి, వచ్చి మార్గాన్ని తెలియజేయండి అని భగవంతుడినే పిలుస్తారు. మన ఆత్మ తమోప్రధానంగా అయిపోయింది, ఈ కారణంగా ఎగరలేదు అనగా తండ్రి వద్దకు వెళ్ళలేదు. నిజానికి ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అమెరికాకు కూడా వెళ్ళగలదు. ఎవరికి ఎవరితో సంబంధముంటుందో, ఆత్మ వెంటనే అక్కడికి ఒక్క సెకెండులో ఎగిరి వెళ్ళిపోతుంది. అంతేకానీ, ఎగురుతూ తన ఇంటికి తిరిగి వెళ్ళడమనేది జరగదు. పతితులు అక్కడికి వెళ్ళలేరు, అందుకే ఓ పతితపావనా రండి అని పిలుస్తారు. మొత్తం ప్రపంచం పతితంగా ఉన్నప్పుడు నేను వస్తానని తండ్రి వచ్చినప్పుడు అర్థం చేయిస్తారు. పతిత ప్రపంచంలో పావనమైనవారు ఒక్కరు కూడా లేరు. గంగను పతితపావనిగా భావిస్తారు, అందుకే స్నానం చేయడానికి వెళ్తారు. కానీ నీటి ద్వారా ఎవరూ పావనంగా అవ్వలేరు. పాత ప్రపంచం పతితంగా ఉంది, కొత్త ప్రపంచం పావనమైనది. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చారు. మీరు పుణ్యాత్ములుగా అవ్వాలి. మీ ఆత్మ సతోప్రధానంగా ఉండేది, ఇప్పుడది తమోప్రధానంగా ఉంది. గంగా స్నానంతో ఎవరూ సతోప్రధానంగా అవ్వరు. పతితులను పావనంగా చేయడము – ఇది తండ్రి పని మాత్రమే. ఇకపోతే ఆ నీటి నదులైతే అన్ని చోట్ల ఉంటాయి. మేఘాల నుండి నీరు వర్షిస్తుంది, ఆ నీరు అందరికీ లభిస్తుంది. ఒకవేళ నీటి నది పావనంగా చేసినట్లయితే, అందరినీ పావనంగా చేయాలి. పావనంగా అయ్యే యుక్తిని తండ్రియే వచ్చి, వీరి ద్వారా తెలియజేస్తారు. వీరికి తమ ఆత్మ అనేది ఉంది. నాకు నా శరీరమంటూ లేదని తండ్రి అంటారు. మీకు అర్థం చేయించేందుకు కల్ప-కల్పము వీరిలోనే వస్తాను. మీకు మీ జన్మల గురించి తెలియదు. కల్పం ఆయువును లక్షల సంవత్సరాలని అనేస్తారు.

ఇది 84 జన్మల చక్రమని తండ్రి అంటారు. 5 వేల సంవత్సరాలలో 84 లక్షల జన్మలు ఎవరూ తీసుకోలేరు. కనుక తండ్రి అర్థం చేయిస్తారు – స్వర్గంలో మీరు 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు, తర్వాత 2 కళలు తగ్గాయి, తర్వాత నెమ్మది-నెమ్మదిగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. కొత్త ప్రపంచమే మళ్ళీ పాతదిగా అవుతుంది. ద్వాపర-కలియుగాలను పతిత ప్రపంచమని అంటారు. ఈ విషయాలు శాస్త్రాలలోనేమీ లేవు. నన్నే జ్ఞానసాగరుడని అంటారు. నేను ఏమైనా శాస్త్రాలు చదువుతానా. నాకు ఈ సృష్టి ఆదిమధ్యాంతాలు తెలుసు. భక్తి మార్గం వారికి ఈ జ్ఞానం ఉండదు. అదంతా భక్తికి సంబంధించిన జ్ఞానము. మేము పాపులము, నీచులము, మాలో ఏ గుణాలూ లేవు, మీరే దయ చూపించండి….. అని పాడుతారు కూడా. వీరిపై దయ చూపించడం జరిగింది, అందుకే మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారు, దీనినే ఉన్నతాతి ఉన్నతమైన భాగ్యం అని అంటారు. భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు స్కూలుకు వెళ్తారు. కొందరు జడ్జిలుగా, కొందరు ఇంజనీర్లుగా అవుతారు. అది వికారీ భాగ్యం, ఇక్కడ మీకు ఈశ్వరుని ద్వారా భాగ్యం తయారవుతుంది. అందుకే దుఃఖహర్త-సుఖకర్త అని పిలుస్తారు. దేవతలుగా తయారుచేసేందుకు, తండ్రి తప్ప ఎవరూ చదివించలేరు. తండ్రి కూర్చొని ఆత్మలతో మాట్లాడుతున్నారు. ఇది నా శరీరమని ఆత్మ అంటుంది. శరీరము, ఇది నా ఆత్మ అని అనదు. శరీరంలో ఆత్మ ఉంది, ఇది నా శరీరమని ఆత్మ అంటుంది. నా ఆత్మను దుఃఖపెట్టకండి అని మనుష్యులంటారు. ఆత్మ శరీరంలో లేకపోతే మాట్లాడలేదు కూడా. నేను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటానని ఆత్మ అంటుంది. మనం తప్పకుండా 84 జన్మలను అనుభవించాము, ఇప్పుడు నరకవాసులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ మీరు స్వర్గవాసులుగా అయ్యే పురుషార్థాన్ని చేస్తున్నారు. స్వర్గవాసులుగా అయితే తండ్రే చేస్తారు. సత్యయుగాన్నే స్వర్గమని అంటారు. ఫలానావారు స్వర్గస్థులయ్యారని ఏదైతే అంటారో, అది అసత్యం చెప్తున్నారు. ఇది నరకము. ఎవరైనా మరణించినప్పుడు, స్వర్గానికి వెళ్ళారని అంటారు, మరి వచ్చి భోజనం చేయండి అని మళ్ళీ నరకంలోకి ఎందుకు పిలుస్తారు. స్వర్గంలోనైతే వారికి చాలా వైభవాలు లభిస్తాయి, మరి మీరు నరకంలోకి ఎందుకు పిలుస్తారు. మనుష్యులకు ఈ మాత్రం తెలివి కూడా లేదు. ఇప్పుడు ఈ కలియుగం సమాప్తమవ్వనున్నదని, దీనికి నిప్పు అంటుకోనున్నదని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. పిల్లలైన మీలో, ఎవరైతే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారో, వారు సత్యయుగంలోకి వచ్చి రాజ్యం చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులకు ఈ వారసత్వాన్ని ఎవరిచ్చారు. తండ్రి ఇచ్చారు. మీరిప్పుడు తండ్రి ద్వారా యోగ్యులుగా అవుతున్నారు. మేము నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నామని మీరు అంటారు. తండ్రి అంటారు – నేను స్వర్గవాసిగా అవ్వను, నేను పరంధామంలో ఉంటాను. నరకవాసులుగా, స్వర్గవాసులుగా మీరు అవుతారు. ఆత్మ నివాస స్థానం శాంతిధామము, తర్వాత మీరు సుఖధామంలోకి వస్తారు. ఇది దుఃఖధామము, ఇది ఇప్పుడు వినాశనమవ్వనున్నది. భగవంతుడు బ్రహ్మా తనువులోకి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారని ఎవరికీ తెలియదు. వారు కృష్ణుడు వచ్చారని భావిస్తారు, కృష్ణుని తనువులోకి వచ్చారని కూడా అనరు. కృష్ణుడిని భగవంతుడని అనలేము. వారు విశ్వానికి యజమాని. అందరి ముక్తిదాత ఒక్కరే, వారు సుప్రీమ్ ఆత్మ, పరమ ఆత్మ. మేము తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటామని భావించే సత్సంగం ప్రపంచంలో ఇంకేదీ ఉండదు. పతితుల నుండి పావనులుగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి అంటారు – నేను మీ సత్యమైన గురువును, మిమ్మల్ని పావనంగా చేస్తాను. ఇకపోతే, గంగా నీరు పావనంగా చేయలేదు. ఇది పాపాత్ముల ప్రపంచము. మనుష్యులు ఏమి చేసినా కానీ, మెట్లు కిందకు దిగాల్సిందే, సతోప్రధానం నుండి తమోప్రధానంగా అవ్వాల్సిందే. మీరు భక్తి చేయరు. అయ్యో రామా, అని కూడా అనరు. వారు మీ తండ్రి, మిమ్మల్ని చదివిస్తున్నారు. ఓ భగవంతుడా రండి, ఓ రామా, అని కూడా అనకూడదు. కానీ చాలా మందికి ఇది అలవాటైపోయింది కనుక ఈ పదాలు వెలువడుతాయి. నన్ను స్మృతి చేసినట్లయితే, వికర్మలు వినాశనమవుతాయని మరియు మీరు నా వద్దకు వచ్చేస్తారని మీకు తండ్రి చెప్తారు. స్మృతి ఒక్కరినే చేయాలి.

ఇది మీ అంతిమ జన్మ అని తండ్రి అంటారు. ఇప్పుడు వారసత్వాన్ని తీసుకుంటే తీసుకున్నట్లు, ఇక మళ్ళీ ఎప్పుడూ పొందలేరు. ఎవరైతే స్వయాన్ని హిందువులని పిలుచుకుంటారో, వారు వాస్తవానికి దేవీ దేవతా ధర్మానికి చెందినవారని తండ్రి అర్థం చేయించారు. క్రిస్టియన్ ధర్మం వారు ఎప్పుడూ పేరు మార్చుకోరు. తమోప్రధానంగా ఉన్నా సరే, క్రిస్టియన్ ధర్మంలోనే ఉన్నారు. మీరు దేవీ దేవతలు కానీ పతితులుగా ఉన్న కారణంగా తమను తాము హిందువులని చెప్పుకుంటారు. తమను తాము దేవతలుగా చెప్పుకోలేరు. నిజానికి మేము దేవీ-దేవతలుగా ఉండేవారమని మర్చిపోయారు. స్వయాన్ని ఎవరూ దేవతా ధర్మం వారని పిలుచుకోరు ఎందుకంటే వికారులుగా ఉన్నారు. ఇది దేహాభిమానము. పిల్లలకు చాలా బాగా అర్థం చేయించడం జరుగుతుంది, ఇక్కడ సాధు సన్యాసులు మొదలైనవారెవరూ లేరు. మేము వ్యాపారస్థులము, మేము ఫలానావారము, ఇదంతా దేహాభిమానము. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. దేహీ-అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలంటే, తండ్రిని స్మృతి చేయాలి. చేతులు పని వైపు, హృదయం తండ్రి వైపు….. మీరు ఒక్క ప్రియునికి ప్రేయసులు. ఆ ఒక్క ప్రియుడే అందరికీ సద్గతిదాత. ఎప్పుడైతే అందరికీ సద్గతి లభించవలసి ఉంటుందో మరియు స్వర్గ స్థాపన జరగవలసి ఉంటుందో, అప్పుడే వారు వస్తారు. అప్పుడు దుఃఖం యొక్క నామరూపాలు మాయమైపోతాయి. ఇప్పుడు పిల్లలైన మీరు, అనంతమైన తండ్రి నుండి స్వర్గం యొక్క వారసత్వాన్ని, 21 జన్మలకు సదా సుఖం యొక్క వారసత్వాన్ని పొందేందుకు ఇక్కడకు వచ్చారు. ఇతర మనుష్యమాత్రులెవరూ ఎవరినీ స్వర్గానికి యజమానులుగా చేయలేరు. శివబాబా భారత్ లోనే వచ్చి, భారత్ ను స్వర్గంగా చేస్తారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ తండ్రి నుండి మాకు స్వర్గ వారసత్వం లభిస్తుందని మర్చిపోయారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. చదువు ఆధారంగా తమ భాగ్యాన్ని ఉన్నతంగా తయారుచేసుకోవాలి, మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. పావనంగా అయి తిరిగి ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి రావాలి.

2. చేతులతో పని చేస్తూ – ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. ఎటువంటి వ్యతిరేకమైన మాటలను వినకూడదు, వినిపించకూడదు.

వరదానము:-

ప్రీతి బుద్ధి అనగా బుద్ధి యొక్క లగన్ (ప్రేమ) ఒక్క ప్రియతమునితోనే జోడించబడి ఉండాలి. ఎవరికైతే ఒక్కరితోనే ప్రీతి ఉంటుందో, వారికి వేరే ఏ వ్యక్తితో గాని, వైభవంతో గాని ప్రీతి జోడించబడదు. వారు బాప్ దాదాను సదా తమ సమ్ముఖంగా అనుభవం చేస్తారు. వారికి మనసులో కూడా శ్రీమతానికి విరుద్ధమైన వ్యర్థ సంకల్పాలు గాని, వికల్పాలు గాని రాలేవు. వారి నోటి నుండి మరియు హృదయం నుండి ఈ మాటలే వెలువడుతాయి – మీతోనే తింటాను, మీతోనే కూర్చుంటాను….. మీతోనే సర్వ సంబంధాలు నిర్వర్తిస్తాను….. ఇటువంటి సదా ప్రీతి బుద్ధి కలవారే విజయీ రత్నాలుగా అవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top