20 April 2021 TELUGU Murli Today – Brahma Kumaris

April 19, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీరు దేహాభిమానము యొక్క ద్వారాన్ని మూసివేసినట్లయితే మాయా తుఫానులు రావడం ఆగిపోతాయి”

ప్రశ్న: -

 ఏ పిల్లలకు విశాల బుద్ధి ఉంటుందో, వారి గుర్తులను వినిపించండి!

జవాబు:-

1. వారికి రోజంతా సేవ యొక్క ఆలోచనలే నడుస్తూ ఉంటాయి. 2. వారు సేవ లేకుండా ఉండలేరు. 3. విశ్వమంతటినీ చుట్టుముట్టి, అందరినీ పతితుల నుండి పావనులుగా ఎలా చేయాలి అని వారి బుద్ధిలో ఉంటుంది. వారు విశ్వాన్ని దుఃఖధామం నుండి సుఖధామంగా చేసే సేవ చేస్తూ ఉంటారు. 4. వారు చాలామందిని తమ సమానంగా తయారుచేస్తూ ఉంటారు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు – పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ సదా కోసం సమాప్తమైపోతాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అందరినీ సోదర దృష్టితో చూడండి, అప్పుడు దేహపు దృష్టి, వృత్తి మారిపోతాయి. తండ్రి కూడా అశరీరిగా ఉన్నారు, ఆత్మలైన మీరు కూడా అశరీరిగా ఉన్నారు. తండ్రి ఆత్మలనే చూస్తారు, అందరూ అకాల సింహాసనంపై విరాజమానమై ఉన్న ఆత్మలు. మీరు కూడా ఆత్మలను సోదర దృష్టితో చూడండి, ఇందులో చాలా శ్రమ ఉంది. దేహ భానములోకి రావడంతోనే మాయా తుఫానులు వస్తాయి. ఈ దేహాభిమానము యొక్క ద్వారాన్ని మూసివేసినట్లయితే మాయా తుఫానులు రావడం ఆగిపోతాయి. దేహీ-అభిమానులుగా అయ్యే ఈ శిక్షణను మొత్తం కల్పంలో ఈ పురుషోత్తమ సంగమయుగంలో, తండ్రి మాత్రమే పిల్లలైన మీకు ఇస్తారు.

మధురాతి మధురమైన, చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలూ, ఇప్పుడు మీరు నరకం యొక్క తీరాన్ని వదిలి ముందుకు వెళ్తున్నారు అని మీకు తెలుసు, మధ్యలో ఉన్న ఈ పురుషోత్తమ సంగమయుగం పూర్తిగా వేరు. మీ బోట్ (నావ) ఇప్పుడు సముద్రం మధ్యలో ఉంది. మీరు సత్యయుగం వారు కాదు, కలియుగం వారు కాదు. మీరు పురుషోత్తమ సంగమయుగీ, సర్వోత్తమమైన బ్రాహ్మణులు. సంగమయుగము బ్రాహ్మణుల కోసమే ఉన్నది. బ్రాహ్మణులు పిలక వంటి వారు. ఇది బ్రాహ్మణుల యొక్క చాలా చిన్న యుగము. ఇది ఒకే ఒక్క జన్మ కల యుగము. ఇది మీ సంతోషము యొక్క యుగము. ఏ విషయంలో సంతోషం ఉంది? భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు! ఇటువంటి విద్యార్థులకు ఎంత సంతోషముంటుంది! ఇప్పుడు మొత్తం చక్రమంతటి జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మనం బ్రాహ్మణులము, మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము. ముందు మన ఇంటికి, స్వీట్ హోమ్ కు వెళ్తాము, తర్వాత కొత్త ప్రపంచంలోకి వస్తాము. బ్రాహ్మణులైన మనమే స్వదర్శన చక్రధారులము. మనమే ఈ పిల్లిమొగ్గల ఆటను ఆడతాము. ఈ విరాట రూపం గురించి కూడా బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, రోజంతా బుద్ధిలో ఈ విషయాల స్మరణ జరగాలి.

మధురమైన పిల్లలూ, మీ ఈ పరివారం చాలా లవ్లీగా (ప్రియంగా) ఉన్నటువంటిది, కావున మీలోని ప్రతి ఒక్కరు చాలా-చాలా లవ్లీగా ఉండాలి. తండ్రి మధురమైనవారు కావున పిల్లలను కూడా అలా మధురంగా తయారుచేస్తారు. ఎప్పుడూ ఎవరి పైనా కోప్పడకూడదు. మనసా, వాచా, కర్మణా ఎవరికీ దుఃఖమును ఇవ్వకూడదు. తండ్రి ఎప్పుడూ ఎవరికీ దుఃఖమునివ్వరు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా మధురంగా అవుతూ ఉంటారు. కేవలం ఈ స్మృతి ద్వారానే నావ తీరానికి చేరుకుంటుంది – ఇది స్మృతి యాత్ర. స్మృతి చేస్తూ-చేస్తూ వయా శాంతిధామం సుఖధామానికి వెళ్ళాలి. పిల్లలను సదా సుఖవంతులుగా చేసేందుకే తండ్రి వచ్చారు. భూతాలను పారద్రోలే యుక్తిని తండ్రి తెలియజేస్తారు, నన్ను స్మృతి చేసినట్లయితే ఈ భూతాలు తొలగిపోతూ ఉంటాయి. ఏ భూతాన్నీ కూడా మీతో పాటు తీసుకువెళ్ళకండి. ఎవరిలోనైనా భూతముంటే, ఇక్కడే నా వద్ద వదిలి వెళ్ళండి. బాబా, మీరు వచ్చి మాలో ఉన్న భూతాలను తొలగించి పతితుల నుండి పావనులుగా చేయండి అని మీరు అంటారు. కావున తండ్రి ఎటువంటి పుష్పాలుగా తయారుచేస్తున్నారు. బాప్ మరియు దాదా, ఇరువురూ కలిసి పిల్లలైన మీ అలంకరణను చేస్తారు. తల్లిదండ్రులే పిల్లల అలంకరణ చేస్తారు కదా. వారు హద్దు తండ్రి – వీరు అనంతమైన తండ్రి. కావున పిల్లలు చాలా ప్రేమగా నడుచుకోవాలి మరియు నడిపించాలి. అన్ని వికారాలను దానం చేయాలి, దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది. ఇందులో సాకులు మొదలైనవాటి విషయమేమీ లేదు. ప్రేమతో మీరు ఎవరినైనా వశం చేసుకోవచ్చు. ప్రేమగా అర్థం చేయించండి. ప్రేమ చాలా మధురమైనది – సింహాలను, ఏనుగులను, జంతువులను కూడా మనుష్యులు ప్రేమతో వశం చేసుకుంటారు. ఇంకా, వారైతే ఆసురీ మనుష్యులు. మీరైతే ఇప్పుడు దేవతలుగా అవుతున్నారు. కావున దైవీ గుణాలను ధారణ చేసి చాలా-చాలా మధురంగా అవ్వాలి. ఒకరినొకరు సోదర దృష్టితో లేదా సోదరీ-సోదరుల దృష్టితో చూడండి. ఆత్మ, ఆత్మకు ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వలేదు. మధురమైన పిల్లలూ, నేను మీకు స్వర్గ రాజ్య భాగ్యాన్ని ఇచ్చేందుకు వచ్చాను అని తండ్రి అంటారు. ఇప్పుడు మీకు ఏమి కావాలంటే అది నా నుండి తీసుకోండి. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా, డబల్ కిరీటధారులుగా చేసేందుకు వచ్చాను. కానీ కృషి అనేది మీరు చేయాలి. నేను ఎవరిపైనా కిరీటాన్ని పెట్టను. మీరు మీ పురుషార్థం ద్వారానే స్వయానికి రాజ్య తిలకాన్ని ఇచ్చుకోవాలి. ఈ విధంగా మీరు స్వయాన్ని విశ్వానికి యజమానులుగా, డబల్ కిరీటధారులుగా చేసుకోవచ్చు అని తండ్రి పురుషార్థం చేసే యుక్తులను తెలియజేస్తారు. చదువు పట్ల పూర్తి శ్రద్ధ పెట్టండి. ఎప్పుడూ కూడా చదువును వదలకండి. ఏ కారణం చేతనైనా అలిగి, చదువును వదిలినట్లయితే చాలా-చాలా నష్టం కలుగుతుంది. లాభ-నష్టాలను చూసుకుంటూ ఉండండి. మీరు ఈశ్వరీయ యూనివర్సిటీ యొక్క విద్యార్థులు, ఈశ్వరుడైన తండ్రి ద్వారా చదువుకుంటున్నారు, మీరు చదువుకుని పూజ్య దేవతలుగా అవుతున్నారు. కావున మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ గా అవ్వాలి. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్ (విద్యార్థి జీవితం అన్నింటికన్నా ఉత్తమమైన జీవితం). ఎంతగా చదువుకుంటారో, చదివిస్తారో మరియు మ్యానర్స్ ను సరిదిద్దుకుంటారో, అంతగా ది బెస్ట్ గా అవుతారు.

మధురమైన పిల్లలూ, ఇప్పుడు మీది రిటర్న్ జర్నీ, ఎలాగైతే సత్యయుగం నుండి త్రేతా, ద్వాపర, కలియుగాల వరకు కిందకు దిగుతూ వచ్చారో, అలా ఇప్పుడు మీరు ఇనుప యుగం నుండి పైనున్న బంగారు యుగం వరకు వెళ్ళాలి. వెండి యుగం వరకు చేరుకున్నప్పుడు, ఇక ఈ కర్మేంద్రియాల చంచలత్వం సమాప్తమైపోతుంది, అందుకే ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా ఆత్మలైన మీ నుండి రజో, తమోల తుప్పు వదులుతూ ఉంటుంది, మరియు తుప్పు ఎంతగా వదులుతూ ఉంటుందో, అంతగా అయస్కాంతం అయిన తండ్రి వైపుకు ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఆకర్షణ కలగడం లేదంటే తప్పకుండా తుప్పు పట్టి ఉన్నట్లే – తుప్పు పూర్తిగా వదిలి స్వచ్ఛమైన బంగారంగా అవ్వాలి, అదే అంతిమ కర్మాతీత అవస్థ.

మీరు గృహస్థ వ్యవహారంలో, ప్రవృత్తిలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా తయారవ్వాలి. తండ్రి అంటారు – మధురమైన పిల్లలూ, మీ ఇళ్ళు వాకిళ్ళను కూడా సంభాళించండి, శరీర నిర్వహణార్థం కార్య వ్యవహారాలను కూడా చేయండి, వాటితో పాటు ఈ చదువును కూడా చదువుకుంటూ ఉండండి. చేతులు పని వైపు, మనసు ప్రియుని వైపు ఉండాలని గాయనం కూడా ఉంది. కార్య వ్యవహారాలు చేసుకుంటూ ప్రియుడైన ఆ తండ్రి ఒక్కరినే స్మృతి చేయండి. మీరు అర్ధకల్పపు ప్రేయసులు. నవ విధ భక్తిలో కూడా కృష్ణుడు మొదలైన వారిని ఎంత ప్రేమగా స్మృతి చేస్తారో చూడండి. అది నవ విధ భక్తి, అచంచల భక్తి. కృష్ణుని స్మృతి అచంచలముగా ఉంటుంది, కానీ దాని ద్వారా ఎవరికీ ముక్తి లభించదు. ఇక్కడ ఇది నిరంతర స్మృతికి సంబంధించిన జ్ఞానము. తండ్రి అంటారు – పతితపావనుడైన తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి, కానీ మాయ కూడా పెద్ద పహల్వాన్ (వస్తాదు). అది ఎవరినీ వదిలిపెట్టదు. మాయ చేతిలో పదే-పదే ఓడిపోయినట్లయితే, తల కిందకు దించుకొని పశ్చాత్తాపపడాలి. శ్రేష్ఠంగా తయారయ్యేందుకే తండ్రి మధురమైన పిల్లలకు శ్రేష్ఠ మతాన్ని ఇస్తారు. పిల్లలు అంతగా శ్రమ చేయడం లేదని బాబా చూస్తారు, అందుకే తండ్రికి దయ కలుగుతుంది. ఒకవేళ ఇప్పుడు ఈ అభ్యాసం చేయకపోతే, తర్వాత చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది మరియు కల్ప-కల్పము అతి చిన్న పదవిని పొందుతూ ఉంటారు.

దేహీ-అభిమానులుగా అవ్వండి అన్న ముఖ్యమైన విషయాన్ని, తండ్రి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. దేహ సహితంగా దేహపు సంబంధాలన్నింటినీ మరచి నన్నొక్కడినే స్మృతి చేయండి, పావనంగా కూడా తప్పకుండా అవ్వాలి. కుమారీ పవిత్రంగా ఉన్నప్పుడు అందరూ ఆమెకు తల వంచి నమస్కరిస్తారు. వివాహం చేసుకున్న తర్వాత పూజారిగా అయిపోతుంది. అందరి ముందు తల వంచవలసి వస్తుంది. కన్య ముందు పుట్టింటిలో ఉన్నప్పుడు, సంబంధాలు అంత ఎక్కువగా గుర్తుకు రావు. వివాహం తర్వాత దేహపు సంబంధాలు కూడా పెరుగుతూ ఉంటాయి, అప్పుడు పతి పట్ల, పిల్లల పట్ల మోహం పెరుగుతూ ఉంటుంది. అత్తమామలు మొదలైన వారంతా గుర్తుకొస్తూ ఉంటారు. ముందు కేవలం తల్లిదండ్రుల పట్ల మాత్రమే మోహముంటుంది. ఇక్కడైతే ఆ సంబంధాలన్నింటినీ మర్చిపోవలసి ఉంటుంది, ఎందుకంటే వీరొక్కరే మీకు సత్యాతి-సత్యమైన మాత-పిత కదా. ఇది ఈశ్వరీయ సంబంధము. త్వమేవ మాతాశ్చ, పితా త్వమేవ….. అని పాడుతారు కూడా. ఈ మాతా పితలు మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు, అందుకే అనంతమైన తండ్రినైన నన్ను నిరంతరం స్మృతి చేయండి మరియు ఏ దేహధారుల పట్ల మమకారాన్ని పెట్టుకోకండి అని తండ్రి అంటారు. స్త్రీకి తన కలియుగ పతి ఎంత బాగా గుర్తుంటారు, అతడు ఆమెను మురికి కాలువలో పడేస్తాడు. ఈ అనంతమైన తండ్రి అయితే మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకువెళ్తారు. ఇటువంటి మధురమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేస్తూ ఉండండి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. ఈ స్మృతి బలంతోనే మీ ఆత్మ బంగారంగా అయి స్వర్గానికి యజమానిగా అవుతుంది. స్వర్గం అన్న పేరు వింటూనే మనసు సంతోషపడుతుంది. ఎవరైతే నిరంతరం స్మృతి చేస్తూ ఉంటారో మరియు ఇతరులకు కూడా స్మృతిని కలిగిస్తూ ఉంటారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. ఈ పురుషార్థం చేస్తూ-చేస్తూ చివర్లో మీ అవస్థ అలా తయారవుతుంది. ఈ ప్రపంచం కూడా పాతదే, దేహం కూడా పాతదే, దేహ సహితంగా దేహపు సంబంధాలన్నీ పాతవే. వాటన్నింటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క తండ్రితోనే జోడించాలి, అంతిమ సమయంలో కూడా ఆ ఒక్క తండ్రి స్మృతియే ఉండాలి, వేరే సంబంధాలు ఏవైనా గుర్తుంటే, మళ్ళీ అంతిమంలో కూడా వారే గుర్తుకొస్తారు మరియు పదవి భ్రష్టమైపోతుంది. అంతిమ సమయంలో ఎవరైతే అనంతమైన తండ్రి స్మృతిలో ఉంటారో, వారే నరుని నుండి నారాయణునిగా అవుతారు. తండ్రి స్మృతి ఉన్నట్లయితే, శివాలయం ఎంతో దూరంగా ఉండదు.

మధురాతి మధురమైన, చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు, అనంతమైన తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకే వస్తారు, ఎందుకంటే అనంతమైన తండ్రి నుండి అనంతమైన విశ్వ రాజ్యాధికారం లభిస్తుందని పిల్లలకు తెలుసు. ఇదెప్పుడూ మర్చిపోకూడదు. ఈ విషయం సదా గుర్తున్నా సరే పిల్లలకు అపారమైన సంతోషముంటుంది. ఈ బ్యాడ్జిని నడుస్తూ-తిరుగుతూ పదే-పదే చూసుకుంటూ ఉండండి – పూర్తిగా హృదయానికి హత్తుకోండి. ఓహో! భగవంతుని శ్రీమతం ద్వారా మేమిలా తయారవుతున్నాము. అంతే, బ్యాడ్జిని చూస్తూ వారిని ప్రేమిస్తూ ఉండండి. బాబా, బాబా అని అంటూ ఉంటే, మేము బాబా ద్వారా ఇలా తయారవుతున్నాము అన్నది సదా గుర్తుంటుంది. తండ్రి శ్రీమతంపై నడుచుకోవాలి కదా. మధురమైన పిల్లలకు చాలా విశాల బుద్ధి ఉండాలి. రోజంతా సేవకు సంబంధించిన ఆలోచనలే నడుస్తూ ఉండాలి. తండ్రికి, సేవ లేకుండా ఉండలేరు అనేటువంటి పిల్లలు కావాలి. పిల్లలైన మీరు మొత్తం విశ్వాన్ని చుట్టుముట్టాలి అనగా పతిత ప్రపంచాన్ని పావనంగా తయారుచేయాలి. విశ్వమంతటినీ దుఃఖధామం నుండి సుఖధామంగా తయారుచెయ్యాలి. టీచరుకు కూడా చదివించడంలో మజా కలుగుతుంది కదా. ఇప్పుడు మీరు చాలా ఉన్నతమైన టీచరుగా అయ్యారు. టీచరు ఎంత బాగుంటే, అంతగా వారు అనేకులను తమ సమానంగా తయారుచేస్తారు, ఎప్పుడూ అలసిపోరు. ఈశ్వరీయ సేవలో చాలా సంతోషముంటుంది. తండ్రి సహాయం లభిస్తుంది. ఇది పెద్ద, అనంతమైన వ్యాపారం కూడా, వ్యాపారస్థులే ధనవంతులుగా అవుతారు. వారు ఈ జ్ఞాన మార్గంలో కూడా చాలా ఉత్సాహంతో ఉంటారు. తండ్రి కూడా అనంతమైన వ్యాపారి కదా. ఇది చాలా ఫస్ట్ క్లాస్ వ్యాపారము, కానీ ఇందులో ఎంతో సాహసాన్ని ధారణ చేయవలసి ఉంటుంది. పురుషార్థంలో కొత్త-కొత్త పిల్లలు, పాతవారి కన్నా ముందుకు వెళ్ళగలరు. ప్రతి ఒక్కరి భాగ్యం ఎవరిది వారిదే, కావున పురుషార్థం కూడా ఎవరికి వారే చేసుకోవాలి. స్వయాన్ని పూర్తిగా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకునేవారు రాత్రింబవళ్ళు పూర్తిగా పురుషార్థంలో నిమగ్నమైపోతారు, మా సమయాన్ని ఎందుకు వృథా చేసుకోవాలి అని అంటారు. ఎంత వీలైతే అంత, సమయాన్ని సఫలం చేసుకోవాలి. మేము తండ్రిని ఎప్పుడూ మర్చిపోము, తప్పకుండా స్కాలర్షిప్ తీసుకునే తీరుతాము అని స్వయానికి పక్కా ప్రతిజ్ఞ చేసుకుంటారు. ఇలాంటి పిల్లలకు సహాయం కూడా లభిస్తుంది. ఇటువంటి కొత్త-కొత్త పురుషార్థీ పిల్లలను కూడా మీరు చూస్తారు. సాక్షాత్కారాలు చేసుకుంటూ ఉంటారు. ఏదైతే మొదట్లో జరిగిందో, దానినే మళ్ళీ చివర్లో చూస్తారు. ఎంతగా సమీపంగా వస్తూ ఉంటారో, అంతగా సంతోషంలో నాట్యము చేస్తూ ఉంటారు. ఇంకొక వైపు, అనవసరపు రక్తసిక్తమైన ఆట కూడా జరుగుతూ ఉంటుంది.

పిల్లలైన మీ ఈశ్వరీయ రేస్ జరుగుతుంది, ఎంతగా ముందుకు పరుగెడుతూ ఉంటారో, అంతగా కొత్త ప్రపంచ దృశ్యాలు సమీపంగా వస్తూ ఉంటాయి, సంతోషం పెరుగుతూ ఉంటుంది. ఎవరికైతే ఆ దృశ్యాలు సమీపంగా కనిపించవో, వారికి సంతోషం కూడా ఉండదు. ఇప్పుడైతే కలియుగ ప్రపంచం పట్ల వైరాగ్యము మరియు సత్యయుగ కొత్త ప్రపంచం పట్ల చాలా ప్రేమ ఉండాలి. శివబాబా గుర్తుంటే, స్వర్గ వారసత్వం కూడా గుర్తుంటుంది. స్వర్గ వారసత్వం గుర్తుంటే శివబాబా కూడా గుర్తుంటారు. ఇప్పుడు మేము స్వర్గం వైపుకు వెళ్తున్నామని, కాళ్ళు నరకం వైపు ఉన్నాయి, ముఖం స్వర్గం వైపు ఉందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడైతే చిన్నా, పెద్దా అందరిదీ వానప్రస్థ అవస్థనే. ఓహో, నేను వెళ్ళి ఈ చిన్ని కృష్ణునిగా అవుతాను అనే నషా బాబాకు సదా ఉండేది, వారి కోసం అడ్వాన్స్ గా కానుకలను కూడా పంపిస్తూ ఉంటారు. ఎవరికైతే పూర్తి నిశ్చయముంటుందో, ఆ గోపికలే కానుకలను పంపిస్తారు, వారికి అతీంద్రియ సుఖపు అనుభూతి కలుగుతుంది. మనమే అమరలోకంలోని దేవతలుగా అవుతాము. కల్పక్రితం కూడా మనమే అలా అయ్యాము, తర్వాత మనం 84 పునర్జన్మలను తీసుకున్నాము. ఈ పిల్లిమొగ్గల ఆట గుర్తున్నా సరే, అహో సౌభాగ్యము – సదా అపారమైన సంతోషంలో ఉండండి, చాలా పెద్ద లాటరీ లభిస్తూ ఉంది. 5000 సంవత్సరాల క్రితం కూడా మనం రాజ్య భాగ్యాన్ని పొందాము, మళ్ళీ రేపు పొందుతాము. ఇది డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఎలాగైతే కల్పక్రితం జన్మ తీసుకున్నామో, అలాగే తీసుకుంటాము, అప్పటి తల్లిదండ్రులే మళ్ళీ ఉంటారు. ఎవరైతే కృష్ణుడికి తండ్రిగా ఉండేవారో, వారే మళ్ళీ కృష్ణుడికి తండ్రిగా అవుతారు. ఎవరైతే ఈ విధంగా రోజంతా ఆలోచిస్తూ ఉంటారో, వారు చాలా రమణీయకంగా ఉంటారు. విచార సాగర మథనం చేయకపోతే, వారు అనారోగ్యంగా ఉన్నారని అర్థము. ఆవు భోజనం చేసిన తర్వాత, దానిని రోజంతా నెమరువేస్తూ ఉంటుంది, నోరు కదులుతూనే ఉంటుంది. నోరు కదలడం లేదంటే అనారోగ్యంగా ఉందని అర్థమవుతుంది, ఇక్కడ కూడా అలానే ఉంటుంది.

అనంతమైన బాప్ మరియు దాదా, ఇరువురికీ మధురాతి మధురమైన పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంది, ఎంత ప్రేమగా చదివిస్తారు. నల్లగా ఉన్నవారిని తెల్లగా చేస్తారు. కావున పిల్లలకు కూడా సంతోషపు పాదరసం ఎక్కాలి. స్మృతియాత్రతో పాదరసం పైకి ఎక్కుతుంది. తండ్రి కల్ప-కల్పము చాలా ప్రేమతో లవ్లీ సేవను చేస్తారు. 5 తత్వాల సహితంగా అందరినీ పావనంగా చేస్తారు. ఇది ఎంత పెద్ద అనంతమైన సేవ. తండ్రి చాలా ప్రేమగా పిల్లలకు శిక్షణను కూడా ఇస్తూ ఉంటారు, ఎందుకంటే పిల్లలను సరిదిద్దడం తండ్రి మరియు టీచర్ యొక్క కర్తవ్యమే. శ్రీమతము తండ్రి ఇచ్చినది, దీని ద్వారానే శ్రేష్ఠంగా అవుతారు. ఎంత ప్రేమగా స్మృతి చేస్తే, అంత శ్రేష్ఠంగా అవుతారు. మేము శ్రీమతంపై నడుస్తున్నామా లేక స్వయం యొక్క మతంపై నడుస్తున్నామా అన్నది కూడా చార్టులో రాయాలి. శ్రీమతంపై నడిస్తేనే మీరు ఏక్యురేట్ గా అవుతారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి – మేము మా సమయాన్ని వృథా చేసుకోము, సంగమంలోని ప్రతి క్షణాన్ని సఫలం చేసుకుంటాము, మేము బాబాను ఎప్పుడూ మర్చిపోము, స్కాలర్షిప్ ను తప్పకుండా తీసుకుని తీరుతాము.

2. సదా స్మృతి ఉండాలి – ఇప్పుడు మాది వానప్రస్థ అవస్థ, కాళ్ళు నరకం వైపు ఉన్నాయి, ముఖం స్వర్గం వైపు ఉంది. పిల్లిమొగ్గల ఆటను గుర్తు చేసుకుంటూ అపారమైన సంతోషంలో ఉండాలి. దేహీ-అభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి.

ఎటువంటి వాయుమండలమైనా కానీ, స్వయం యొక్క శక్తిశాలి వృత్తి వాయుమండలాన్ని మార్చగలదు. వాయుమండలం వికారీగా ఉన్నా కానీ స్వయం యొక్క వృత్తి నిర్వికారీగా ఉండాలి. పతితులను పావనంగా చేసేవారు, పతిత వాయుమండలానికి వశీభూతులుగా అవ్వలేరు. మాస్టర్ పతిత పావనిగా అయి స్వయం యొక్క శక్తిశాలి వృత్తి ద్వారా అపవిత్రమైన లేక బలహీనమైన వాయుమండలాన్ని సమాప్తం చేయండి, దానిని వర్ణన చేసి వాయుమండలాన్ని తయారుచేయకండి. బలహీనమైన లేక పతితమైన వాయుమండలాన్ని వర్ణన చేయడం కూడా పాపమే.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top