20 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

November 19, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - అందరికీ ఒక్క తండ్రి పరిచయాన్నే ఇవ్వండి, ఒక్క తండ్రితోనే ఇచ్చి-పుచ్చుకోవడాలను ఉంచండి, తండ్రికి మాత్రమే మీ సత్యమైన లెక్కాపత్రాన్ని ఇవ్వండి”

ప్రశ్న: -

పిల్లల ద్వారా ఇప్పటికీ అనేక రకాల తప్పులు జరుగుతూ ఉంటాయి, దీనికి కారణమేమిటి?

జవాబు:-

ముఖ్యమైన కారణము – యోగంలో చాలా కచ్చాగా ఉన్నారు. తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే ఎప్పుడూ ఎలాంటి చెడు పని జరగదు. నామ-రూపాలలో చిక్కుకున్నట్లయితే యోగం కుదరదు. మీరు పతితం నుండి పావనంగా అవ్వాలి అన్న తపనలో ఉండండి. నిరంతరం శివబాబా స్మృతిలో ఉండండి, మీకు పరస్పరంలో దైహిక ప్రేమ ఉండకూడదు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

దీపపు పురుగులు ఎందుకు కాలిపోలేదు..

ఓంశాంతి. భక్తి మార్గంలో ఈ పాటలను పాడారు. చివరికి ఇవన్నీ ఆగిపోతాయి, వీటి అవసరముండదు. ఒక్క సెకెండులో తండ్రి నుండి వారసత్వం లభిస్తుందని మహిమ కూడా ఉంది. అనంతమైన తండ్రి నుండి జీవన్ముక్తి వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు. జీవన్ముక్తి అనగా ఈ దుఃఖధామం నుండి ముక్తి, భ్రష్టాచారం నుండి ముక్తి. తర్వాత ఏమవుతారు? దీని కోసం లక్ష్యాన్ని-ఉద్దేశ్యాన్ని చాలా బాగా అర్థం చేయించాలి. బాబా రాత్రి కూడా అర్థం చేయించారు – ఎవరైనా వస్తే ముందుగా వారికి, ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుని పరిచయాన్ని ఇవ్వండి. ఇక్కడి ఉద్దేశ్యం ఏమిటి అని వారు అడుగుతారు. కనుక మొట్టమొదట అనంతమైన తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇప్పుడు వారంటారు – నన్ను స్మృతి చేసినట్లయితే, మీరు పావనంగా అవుతారు. ఓ పతిత పావనా రండి, అని పాడుతారు కూడా. అంటే తండ్రికి తప్పకుండా ఏదో ఒక అథారిటీ ఉంటుంది కదా. ఏదో ఒక పాత్ర లభించి ఉంటుంది. వారిని ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి అని అంటారు. వారు భారత్ లోనే వస్తారు. వారు వచ్చి భారత్ నే ఉన్నతాతి ఉన్నతంగా తయారుచేస్తారు. వైకుంఠం యొక్క కానుకను తీసుకొస్తారు. మనుష్య సృష్టిలో ఉన్నతాతి ఉన్నతమైనవారు దేవీ-దేవతలు, సూర్యవంశీయులు. వారు సత్యయుగంలో రాజ్యం చేసేవారు. సత్యయుగాన్ని స్థాపన చేసేవారు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడే. వారిని స్వర్గ స్థాపన చేసేవారు, హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు కూడా. వారు తండ్రి, వారి గురించి ఎప్పుడూ – తండ్రి సర్వవ్యాపి అని అనలేరు. సర్వవ్యాపి అని అనడంతో తండ్రి వారసత్వం మాయమైపోతుంది. ఇవి ఎంత మధురమైన విషయాలు. తండ్రి అనగా వారసత్వము. తప్పకుండా తమ పిల్లలకే వారసత్వాన్ని ఇస్తారు. పిల్లలందరి తండ్రి ఒక్కరే. వారు వచ్చి సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇస్తారు. రాజయోగాన్ని నేర్పిస్తారు. మిగిలిన ఆత్మలన్నీ లెక్కాచారాలను తీర్చుకుని తిరిగి వెళ్ళిపోతాయి. ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. దాని కోసమే ఈ మహాభారత యుద్ధము ఉంది. అనేక ధర్మాల వినాశనం, ఏక ధర్మ స్థాపన జరగనున్నది. కలియుగం తర్వాత తప్పకుండా సత్యయుగం రావాలని బుద్ధి కూడా చెప్తుంది. దేవీ-దేవతల చరిత్ర రిపీట్ అవుతుంది. బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారని అంటూ ఉంటారు కూడా. ఉన్నతాతి ఉన్నతమైన పదవిని ప్రాప్తింపజేస్తారు.

తండ్రి అంటారు – పిల్లలూ, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి. ఇప్పుడు మృత్యులోకం ముర్దాబాద్ (నశించడం) మరియు అమరలోకం జిందాబాద్ అవ్వనున్నది. మీరందరూ పార్వతులు, అమరకథను వింటున్నారు. కుమారులు మరియు కుమార్తెలు, ఇరువురూ అమరులుగా అవుతారు కదా. దీనిని అమరకథ అని అయినా అనండి, మూడవ నేత్రం కథ అని అయినా అనండి. చాలా వరకు మాతలే కథలు వింటారు. అమరపురిలో పురుషులు ఉండరా? ఇద్దరూ ఉంటారు. భక్తి మార్గంలోని శాస్త్రాలు ఏం చెప్తున్నాయో మరియు తండ్రి ఏం చెప్తున్నారో తండ్రియే అర్థం చేయిస్తారు. భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు భగవంతుడు వస్తారని కూడా అంటారు. తప్పకుండా సత్యయుగంలో విశ్వంపై ఈ దేవీ-దేవతల రాజ్యమే ఉండేది. వారికి ఆ ఫలాన్ని ఎవరిచ్చారు? సాధు-సన్యాసులు మొదలైనవారెవ్వరూ ఇవ్వలేరు. భక్తిని అందరూ ఒకేలా చేయరని కూడా మీకు తెలుసు. ఎవరైతే చాలా భక్తి చేస్తారో, వారికి ఫలం కూడా తప్పకుండా అలాగే లభిస్తుంది. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో, వారే పూజారులుగా అయ్యారు, మళ్ళీ పూజ్యులుగా అవుతారు. భక్తి ఫలమైతే లభిస్తుంది కదా. ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. మొట్టమొదట త్రిమూర్తి చిత్రంపై అర్థం చేయించాలి. అంతేకానీ, ముందు మెట్ల చిత్రం వద్దకు తీసుకువెళ్ళకూడదు. ఇవి విస్తారమైన విషయాలు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి – వారు ఉన్నతాతి ఉన్నతమైనవారు. తర్వాత బ్రహ్మా-విష్ణు-శంకరుల పరిచయం, తర్వాత లక్ష్మీనారాయణుల పరిచయం ఇవ్వాలి. ఇకపోతే, భక్తి మార్గపు చిత్రాలైతే ఎన్నో ఉన్నాయి. మొట్టమొదట ఇలా చెప్పండి – వారు అనంతమైన తండ్రి, వారి నుండి మనం అనంతమైన స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటాము. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు వారసత్వాన్ని కూడా ఉన్నతాతి ఉన్నతమైనదే ఇస్తారు. భారత్ లో శివజయంతిని కూడా జరుపుకుంటారు. తప్పకుండా హెవెన్లీ గాడ్ ఫాదర్ వచ్చి స్వర్గాన్ని స్థాపన చేసి ఉంటారు. తండ్రియే స్వర్గ స్థాపన చేస్తారు, మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత నరకంగా అవుతుంది. రాముడు కూడా రావాల్సి ఉంటుంది, అలానే సమయమనుసారంగా రావణుడు కూడా రావాల్సి ఉంటుంది. రాముడు వారసత్వాన్ని ఇస్తారు, రావణుడు శాపాన్ని ఇస్తాడు. జ్ఞానం అనగా పగలు పూర్తయి రాత్రిగా అవుతుంది. పగలులో కేవలం సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉంటారు. ఈ విషయాలను సారంలో అర్థం చేయించడం చాలా సులభము. మొట్టమొదట ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి పరిచయాన్ని ఇచ్చి పక్కా చేయించాలి. ఇదే ముఖ్యమైన విషయము. సత్యయుగంలో దేవీ-దేవతల వంశముండేది. సతోప్రధానంగా ఉండేవారు, తర్వాత సతో, రజో, తమోలలోకి వచ్చారు. ఇది చక్రము. ఏదీ ఎప్పటికీ ఒకేలా ఉండదు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయమే గుర్తుండాలి – ఉన్నతాతి ఉన్నతమైన తండ్రిని స్మృతి చేయాలి అని. ఈ స్మృతిలో చాలా మంది కచ్చాగా ఉన్నారు. స్మృతిని పదే-పదే మర్చిపోతానని బాబా కూడా తమ అనుభవాన్ని చెప్తారు ఎందుకంటే వీరికి చాలా ఆలోచనలుంటాయి. అందుకే అంటారు, ఎవరికైతే చాలా బాధ్యతలుంటాయో, వారు స్మృతిలో ఎలా ఉండగలరు అని. బాబాకు రోజంతా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఎన్ని విషయాలు ఎదురుగా వస్తాయి. బాబాకు ఉదయాన్నే లేచి కూర్చోవడంలో చాలా మజా వస్తుంది. నషా కూడా ఉంటుంది – ఇప్పుడిక స్థాపన జరిగిన తర్వాత నేను మళ్ళీ విశ్వ మహారాజుగా అవుతాను అని. బాబా తమ అనుభవంతో ఇలా చెప్తారు – తండ్రి పరిచయమే మొట్టమొదటి ముఖ్యమైన విషయము అని. ఇక మిగతా ఎవరు ఏ విషయాలు మాట్లాడినా, వాటి వలన లాభమేమీ లేదని చెప్పండి. మేము మీకు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి పరిచయాన్ని ఇస్తాము. వారే విశ్వానికి యజమానులుగా తయారయ్యే ఉన్నతాతి ఉన్నతమైన వారసత్వాన్ని ఇస్తారు. ఆర్య సమాజం వారు దేవతల చిత్రాలను నమ్మరు. మీ వద్ద చిత్రాలను చూసినప్పుడు డిస్టర్బ్ అవుతారు. ఎవరైతే వారసత్వం తీసుకునేది ఉంటుందో, వారు శాంతిగా వచ్చి వింటూ ఉంటారు. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుని గురించిన విషయమే ముఖ్యమైనది. ఉన్నతాతి ఉన్నతమైనవారు అని బ్రహ్మా, విష్ణు, శంకరులను అనరు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి నుండి మాత్రమే వారసత్వం లభిస్తుంది. వారే పతితపావనుడు. ఈ విషయాన్ని పక్కా చేసుకోండి. భగవంతుడు ఒక్కరే. తండ్రి అనగా వారసత్వము. భారత్ లోకి వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచ స్థాపన, శంకరుని ద్వారా వినాశనం జరుగుతుంది. ఈ మహాభారత యుద్ధంతోనే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. పతితం నుండి పావనంగా అవుతారు. అనంతమైన తండ్రి నుండి మాత్రమే భారత్ కు వారసత్వం లభిస్తుంది. ఇక వేరే విషయమేమీ లేదు. ఇక్కడున్నది ఒకే విషయము. తండ్రి అంటారు – నన్ను స్మృతి చేసినట్లయితే మీ మాలిన్యం తొలగిపోతుంది. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే మిగిలినవేవైనా అర్థం చేయించాలి. ఇన్ని చిత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇవి విస్తారాన్ని తెలిపేవి. జ్ఞానామృతాన్ని తాగి పవిత్రంగా అవ్వండి అని మనం చెప్తాము. విషం కావాలి అని వారంటారు. దీని గురించి ఒక చిత్రం కూడా ఉంది. అందుకే, అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తాగాలి అని అంటారు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని స్పిరిచ్యుల్ ఫాదర్ మాత్రమే ఇస్తారు. ఆ తండ్రి సర్వవ్యాపి ఎలా అవుతారు. మీరు తండ్రిని సర్వవ్యాపి అని నమ్మితే నమ్మండి. మేము ఇప్పుడు నమ్మము. ఇంతకుముందు మేము నమ్మేవారము. అది తప్పు అని తండ్రి ఇప్పుడు తెలియజేసారు. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు భారత్ నరకంగా ఉంది, దానిని మనం మళ్ళీ స్వర్గంగా అనగా పవిత్ర గృహస్థ ఆశ్రమంగా తయారుచేస్తాము. ఆది సనాతన దేవీ-దేవతలది పవిత్ర గృహస్థ ఆశ్రమము. ఇప్పుడున్నది అపవిత్ర వికారీ ప్రపంచము. తండ్రి అంటారు – నన్ను స్మృతి చేయండి. ఉన్నతాతి ఉన్నతమైనవారు శివబాబా, రచయిత, వారి నుండి వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు కలియుగంలో ఎంతోమంది మనుష్యులున్నారు. సత్యయుగంలోనైతే చాలా కొద్దిమంది మనుష్యులుంటారు. ఆ సమయంలో మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. కనుక తప్పకుండా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, అప్పుడు ముక్తిలోకి వెళ్తారు. ఈ విషయాలన్నీ పిల్లల బుద్ధిలో ఉండాలి. పిల్లలు తప్పకుండా సేవ చేయాలి. సేవతోనే ఉన్నత పదవిని పొందుతారు. అలాగని పరస్పరంలో పడకపోతే, శివబాబాను మర్చిపోవడం లేక శివబాబా సేవను వదిలేయడం చేయకూడదు. అలా చేస్తే పదవి భ్రష్టమైపోతుంది. అప్పుడిక ఈ సర్వీస్ చేయడానికి బదులుగా డిస్ సర్వీస్ చేస్తారు. పరస్పరంలో ఉప్పునీరుగా అయి సేవను వదిలేయడం – ఇటువంటి చెడ్డ పని ఇంకొకటి లేదు. బాబాను స్మృతి చేస్తే సంపాదన కూడా జరుగుతుంది. ఇప్పుడు జ్ఞానం లభించింది, పవిత్రంగా అవ్వండి మరియు తండ్రిని స్మృతి చేయండి. జ్ఞానపు రంగులో ముంచెత్తడాన్ని ధురియా అని అంటారు. జ్ఞానము మరియు విజ్ఞానము అని అంటారు. విజ్ఞానము అనగా యోగము, జ్ఞానము అనగా సృష్టి చక్ర జ్ఞానము. హోలీ-ధురియాల గురించి మనుష్యులు ఏమీ అర్థం చేసుకోరు. తండ్రిని స్మృతి చేయాలి మరియు జ్ఞానాన్ని అందరికీ వినిపించాలి. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రిని సర్వవ్యాపి అని అనలేరని బాబా పదే-పదే అర్థం చేయిస్తారు. లేకుంటే మీరు స్వయం ఎవరిని స్మృతి చేస్తారు? తండ్రి అంటారు – నిరంతరం నన్ను స్మృతి చేయండి. కానీ రచయిత గురించి తెలియకపోతే ఏం లభిస్తుంది. తెలియని కారణంగా సర్వవ్యాపి అని అంటారు. కనుక వారు ఉన్నతాతి ఉన్నతమైనవారు అని ఋజువు చేసి అర్థం చేయించండి. అప్పుడు సర్వవ్యాపి గురించిన విషయాలు బుద్ధి నుండి తొలగిపోతాయి. మనమంతా సోదరులము. తండ్రి ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. సత్యయుగంలో దేవీ-దేవతలుంటారు. మిగిలిన వారంతా ముక్తిలోకి వెళ్తారు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉండండి. క్రీస్తును ప్రార్థిస్తారు. క్రీస్తు అయితే అందరికీ ఫాదర్ కాదు కదా అని చెప్పండి. అందరికీ ఫాదర్ అయితే నిరాకారుడు, వారినే ఆత్మ, ఓ గాడ్ ఫాదర్, అని పిలుస్తుంది. క్రీస్తును వారి బిడ్డ అని అంటూ ఉంటారు. కొడుకు నుండి వారసత్వం ఎలా లభిస్తుంది. క్రీస్తు అయితే రచన. క్రీస్తును స్మృతి చేయడంతో ఆత్మ తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతుందని ఏ శాస్త్రంలోనూ రాసి లేదు. ఒక్క గీతలో మాత్రమే, నన్నొక్కడినే స్మృతి చేయండి అని ఉంది. గాడ్ ఫాదర్ శాస్త్రమే గీత. కేవలం తండ్రి పేరును మార్చి కృష్ణుని పేరును రాసేసారు. ఈ తప్పు చేసారు. ఉన్నతాతి ఉన్నతమైనవారు తండ్రి, వారే సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇస్తారు. శివుని చిత్రాన్ని అందరూ తమ వద్ద పెట్టుకోవాలి. శివబాబా ఈ వారసత్వాన్ని ఇస్తారు. తర్వాత 84 జన్మలలో పోగొట్టుకుంటారు. పతితపావనుడైన తండ్రియే వచ్చి పావనంగా తయారయ్యే యుక్తిని తెలియజేస్తారని మెట్ల చిత్రంపై అర్థం చేయించాలి. వారు కృష్ణ భగవానువాచ అని అంటారు, మీరు శివ భగవానువాచ అని అంటారు. మొదటి అంతస్థులో ఉన్నతమైన తండ్రి ఉంటారు, తర్వాత రెండవ అంతస్థులో సూక్ష్మవతనం, ఇది మూడవ అంతస్థు. సృష్టి ఇక్కడ ఉంది. చివర్లో సూక్ష్మవతనానికి వెళ్తారు. అక్కడ ట్రిబ్యునల్ (న్యాయసభ) కూర్చుంటుంది. శిక్షలు లభిస్తాయి. శిక్షలు అనుభవించి పవిత్రంగా అయి పైకి వెళ్ళిపోతారు. తండ్రి పిల్లలందరినీ తీసుకువెళ్తారు. ఇప్పుడిది సంగమము. దీనికి 100 సంవత్సరాలు ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలు అడుగుతారు – బాబా, స్వర్గంలో ఏమేమి ఉంటాయి? బాబా అంటారు – పిల్లలూ, అది మున్ముందు చూస్తారు. ముందు మీరు తండ్రిని తెలుసుకోండి. పతితం నుండి పావనంగా తయారయ్యే తపనలో ఉండండి. స్వర్గంలో ఏమి జరిగేది ఉంటే, అది జరుగుతుంది. మీరు ఎంత పావనంగా అవ్వాలంటే, తండ్రి నుండి కొత్త ప్రపంచం యొక్క పూర్తి వారసత్వం లభించాలి. ఇకపోతే, మధ్యలో ఏం జరుగుతుంది అనేది కూడా మున్ముందు చూస్తారు. కనుక ఈ విషయాలన్నింటినీ గుర్తుంచుకోవాలి. గుర్తుండని కారణంగా సమయానికి అర్థం చేసుకోరు, మర్చిపోతారు. పిల్లలు కర్మలు కూడా మంచివి చేయాలి. తండ్రి స్మృతిలో ఉంటే చెడు కర్మలు జరగనే జరగవు. చాలా మంది చెడు కర్మలు కూడా చేస్తారు. కేవలం ఈ బ్రాహ్మణీ చెప్పేదే బాగుందని భావించకూడదు. ఆ బ్రాహ్మణీ వెళ్ళిపోతే స్వయం కూడా సమాప్తమైపోతారు. బ్రాహ్మణీ కారణంగా మరణిస్తారు అనగా తండ్రి వారసత్వం తీసుకోవడం నుండి మరణిస్తారు. దీనిని కూడా దురదృష్టమని భావించడం జరుగుతుంది.

చాలా మంది పిల్లలు పరస్పరం నామ రూపాలలో చిక్కుకొని మరణిస్తారు. ఇక్కడ మీకు దైహిక ప్రేమ ఉండకూడదు. నిరంతరం శివబాబాను స్మృతి చేయాలి. ఎవ్వరితోనూ ఇచ్చి-పుచ్చుకోవడాలు ఉండకూడదు. మాకు ఎందుకు ఇస్తారు? అని అడగండి. మీ యోగమైతే శివబాబాతో కదా. ఎవరైతే డైరెక్టుగా ఇవ్వరో, వారిది శివబాబా వద్ద జమ అవ్వదు. బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది కనుక వారి ద్వారానే అంతా చెయ్యాలి. మధ్యలో ఎవరైనా తినేస్తే, శివబాబా వద్ద జమ అవ్వదు. శివబాబాకు ఇవ్వాలి అంటే అది బ్రహ్మా ద్వారా ఇవ్వాలి. సెంటరు కూడా బ్రహ్మా ద్వారానే తెరవండి. మీకు మీరే సెంటరు తెరిస్తే, అది సెంటరు కాదు. బాప్ దాదా ఇరువురూ కలిసి ఉన్నారు. వీరి చేతికి వచ్చిందంటే శివబాబా చేతికి వచ్చినట్లే. ఎన్ని సెంటర్లు ఉన్నాయి, వాటి గురించి ఏ సమాచారము లేదు. శివబాబా, ఇది మీ సెంటరు లెక్కాపత్రము అని వ్రాయాలి. సేఠ్ వద్దకు లెక్కాపత్రం రావాలి కదా. చాలా మందిది శివబాబా వద్ద జమ అవ్వదు. ఈ తెలివి కూడా ఉండదు, జ్ఞానమైతే చాలా ఉంది కానీ యుక్తి తెలియదు. మేము సెంటరు తెరిచాము అని అనుకుంటారు. మీరు ఎవరికి ఇచ్చారో, వారు సెంటరు తెరిచారు, అది శివబాబా తెరవలేదు. ఆ సెంటరు శక్తిని కూడా పుంజుకోదు. సెంటరు తెరవాలంటే శివబాబా ద్వారానే జరగాలి. శివబాబా, మేము ఇది ఇస్తాము, ఇందులో ఉపయోగించండి అని అనాలి. పిల్లలు చాలా తప్పులు చేస్తారు. యోగంలో చాలా కచ్చాగా ఉన్నారు. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానంతో పాటు తమ భవిష్యత్తును తయారుచేసుకునే యుక్తిని కూడా నేర్చుకోవాలి. ఒక్క తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఏ దేహధారి వెనుక దురదృష్టవంతులుగా అవ్వకూడదు.

2. పరస్పరంలో ఏ విషయం కారణంగానైనా తండ్రి సేవను విడిచిపెట్టకూడదు. ఉదయాన్నే లేచి మీతో మీరు మాట్లాడుకోవాలి. స్మృతి చేసే శ్రమ చేయాలి.

వరదానము:-

అన్నింటికంటే శక్తిశాలి స్థితి – మీ అనుభవము. అనుభవీ ఆత్మ తన అనుభవం యొక్క విల్ పవర్ తో మాయ యొక్క ఏ శక్తినైనా మరియు అన్ని విషయాలను, సర్వ సమస్యలను సహజంగానే ఎదుర్కోగలదు మరియు ఆత్మలందరినీ సంతుష్టపరచగలదు కూడా. అనుభవం యొక్క విల్ పవర్ ఆధారంగా ఎదుర్కునే శక్తితో సర్వులను సంతుష్టపరిచే శక్తి సులభంగా ప్రాప్తిస్తుంది. అందుకే, ప్రతి ఖజానాను అనుభవంలోకి తీసుకొచ్చి అనుభవీ మూర్తులుగా అవ్వండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top