21 April 2021 TELUGU Murli Today – Brahma Kumaris

April 20, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా, సత్యమైన విషయాలను విని ప్రకాశంలోకి వచ్చారు కనుక అందరినీ అంధకారం నుండి బయటకు తీసి, ప్రకాశంలోకి తీసుకురావడం మీ కర్తవ్యము”

ప్రశ్న: -

పిల్లలైన మీరు ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించేటప్పుడు, ఏ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి?

జవాబు:-

నోటితో పదే-పదే బాబా-బాబా అని అంటూ ఉండండి. దీనితో ‘నేను’ అనేది సమాప్తమైపోతుంది, వారసత్వం కూడా గుర్తుంటుంది. ‘బాబా’ అని అనడంతో సర్వవ్యాపి యొక్క జ్ఞానం ముందే సమాప్తమైపోతుంది. ఒకవేళ ఎవరైనా భగవంతుడు సర్వవ్యాపి అని అన్నట్లయితే, తండ్రి అందరిలోనూ ఎలా ఉండగలరని అడగండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నేడు మానవుడు అంధకారంలో ఉన్నాడు….. (ఆజ్ అంధేరే మే హై ఇన్సాన్…..)

ఓంశాంతి. పిల్లలు ఏమన్నారు మరియు ఎవరిని – ఓ జ్ఞాన సాగరా, ఓ జ్ఞాన సూర్యుడైన బాబా….. అని పిలిచారు. భగవంతుడిని బాబా అని అంటారు కదా. భగవంతుడు తండ్రి కనుక మీరంతా సంతానము. మేము అంధకారంలోకి వచ్చి చేరుకున్నాము, మీరు మమ్మల్ని ప్రకాశంలోకి తీసుకువెళ్ళండి అని పిల్లలంటారు. ‘బాబా’ అని అనడంతో తండ్రిని పిలుస్తున్నారని ఋజువౌతుంది. ‘బాబా’ అన్న పదం పలకడంతో ప్రేమ కలుగుతుంది ఎందుకంటే తండ్రి నుండి వారసత్వం తీసుకోవడం జరుగుతుంది. కేవలం ఈశ్వరా లేక ప్రభు అని అనడంతో, తండ్రి వారసత్వం యొక్క మాధుర్యం అనుభూతి అవ్వదు. ‘బాబా’ అని అనడంతో వారసత్వం గుర్తుకొస్తుంది. బాబా, మేము అంధకారంలోకి వచ్చి చేరుకున్నాము, మీరు ఇప్పుడు మళ్ళీ జ్ఞానంతో మా జ్యోతిని వెలిగించండి అని మీరు పిలుస్తారు, ఎందుకంటే ఆత్మల జ్యోతి ఆరిపోయి ఉంది. మనుష్యులు మరణించినప్పుడు 12 రోజులు దీపాన్ని వెలిగిస్తారు. దీపం ఆరిపోకుండా నేతిని వేసేందుకు ఒకరు కూర్చొని ఉంటారు.

భారతవాసులైన మీరు ప్రకాశంలో అనగా పగలులో ఉండేవారని, ఇప్పుడు రాత్రిలో ఉన్నారని బాబా అర్థం చేయిస్తారు. 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటుంది. అది హద్దు విషయము. ఇది అనంతమైన పగలు మరియు అనంతమైన రాత్రి. సత్య-త్రేతా యుగాలను బ్రహ్మా పగలు అని అంటారు, ద్వాపర-కలియుగాలను బ్రహ్మా రాత్రి అని అంటారు. రాత్రి వేళలో అంధకారం ఉంటుంది, మనుష్యులు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. భగవంతుడిని వెతికేందుకు అన్నివైపులకు తిరుగుతూ ఉంటారు కానీ పరమాత్మను పొందలేరు. పరమాత్ముడిని పొందేందుకే భక్తి చేస్తారు. ద్వాపరం నుండి భక్తి ప్రారంభమవుతుంది అనగా రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. దసరా గురించి కూడా ఒక కథను తయారుచేసారు. కథలను ఎప్పుడూ మనసుకు తోచినట్లుగా తయారుచేస్తారు, బయోస్కోప్, నాటకాలు మొదలైనవి తయారుచేసినట్లుగా చేస్తారు. శ్రీమత్ భగవద్గీతయే సత్యమైనది. పరమాత్మ పిల్లలకు రాజయోగాన్ని నేర్పించారు, రాజ్యాన్నిచ్చారు. తర్వాత భక్తి మార్గంలో కూర్చొని కథలను తయారుచేస్తారు. వ్యాసుడు గీతను తయారుచేసారు అనగా కథను తయారుచేసారు. సత్యమైన విషయాన్ని అయితే మీరు తండ్రి ద్వారా ఇప్పుడు వింటున్నారు. ఎల్లప్పుడూ బాబా-బాబా అని అంటూ ఉండాలి. పరమాత్మ మన తండ్రి, వారు కొత్త ప్రపంచ రచయిత, కనుక తప్పకుండా వారి నుండి మనకు స్వర్గ వారసత్వం లభించాలి. ఇప్పుడు 84 జన్మలను అనుభవించి మనం నరకానికి చేరుకున్నాము. తండ్రి అర్థం చేయిస్తారు – పిల్లలూ, భారతవాసులైన మీరు సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా ఉండేవారు, విశ్వానికి యజమానులుగా ఉండేవారు. అప్పుడు ఇతర ధర్మాలేవీ ఉండేవి కావు, దానిని స్వర్గము లేక కృష్ణపురి అని అంటారు. ఇది కంసపురి. లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేదని బాప్ దాదా స్మృతినిప్పిస్తారు. తండ్రియే జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, పతితపావనుడు, అంతేకానీ నీటి గంగ కాదు. వధువులందరికీ భగవంతుడు ఒక్కరే వరుడు – ఇది మనుష్యులకు తెలియదు. అందుకే ఆత్మల తండ్రి ఎవరు, అని అడగడం జరుగుతుంది, అప్పుడు తికమకపడతారు. మాకు తెలియదు అని అంటారు. అరే ఆత్మా, నీకు నీ తండ్రి గురించి తెలియదా. గాడ్ ఫాదర్ అని అంటారు. మరి వారి నామ రూపాలు ఏమిటి, గాడ్ ను గుర్తించగలరా అని అడగడం జరుగుతుంది. అప్పుడు, వారు సర్వవ్యాపి అని అంటారు. అరే, పిల్లల తండ్రి ఎప్పుడైనా సర్వవ్యాపి కాగలరా. రావణుని ఆసురీ మతాన్ని అనుసరించి ఎంత తెలివిహీనులుగా అయిపోతారు. దేహాభిమానము నంబరువన్. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోరు. నేను ఫలానా అని అంటారు, అప్పుడది శరీరానికి సంబంధించిన విషయమవుతుంది. నిజానికి స్వయం ఎవరు అన్నది తెలియదు. నేను జడ్జి, నేను ఫలానా….. ‘నేను’, ‘నేను’ అని అంటూ ఉంటారు, కానీ ఇది రాంగ్. నేను మరియు నాది, ఇవి రెండు విషయాలు. ఆత్మ అవినాశీ, శరీరం వినాశీ. పేరు శరీరానికి ఉంటుంది. ఆత్మకు పేరేమీ పెట్టడం జరగదు. బాబా అంటారు – నా పేరు కేవలం శివ. శివజయంతిని కూడా జరుపుకుంటారు. ఇప్పుడు నిరాకారుని జయంతి ఎలా జరుగుతుంది. వారు ఎవరిలోకి వస్తారు అనేది ఎవరికీ తెలియదు. ఆత్మలందరికీ ఆత్మ అన్న పేరే ఉంటుంది. పరమాత్ముని పేరు శివ. మిగిలిన వారందరూ సాలిగ్రామాలు. ఆత్మలు పిల్లలు. ఒక్క శివుడే ఆత్మలందరికీ తండ్రి. వారు అనంతమైన తండ్రి. మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి, మేము దుఃఖితులుగా ఉన్నాము అని అందరూ వారిని పిలుస్తారు. ఆత్మ పిలుస్తుంది, దుఃఖంలో పిల్లలందరూ స్మృతి చేస్తారు, ఆ పిల్లలే సుఖంలో ఉన్నప్పుడు ఎవ్వరూ స్మృతి చేయరు. రావణుడు దుఃఖితులుగా చేసాడు.

ఈ రావణుడు మీ పాత శత్రువు అని బాబా అర్థం చేయిస్తారు. డ్రామా ఆట ఇలా తయారుచేయబడింది. ఇప్పుడు అందరూ అంధకారంలో ఉన్నారు, అందుకే ఓ జ్ఞానసూర్యుడా రండి, మమ్మల్ని ప్రకాశంలోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. భారత్ సుఖధామంగా ఉన్నప్పుడు, ఎవరూ పిలిచేవారు కాదు. అక్కడ అప్రాప్తి అన్న వస్తువేదీ ఉండేది కాదు. ఇక్కడైతే ఓ శాంతిదేవా, అని ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. బాబా వచ్చి – శాంతి మీ స్వధర్మము, మీ కంఠహారము అని అర్థం చేయిస్తారు. ఆత్మ శాంతిధామ నివాసి, శాంతిధామం నుండి మళ్ళీ సుఖధామంలోకి వెళ్తుంది. అక్కడైతే సుఖమే సుఖముంటుంది. మీకు ఆర్తనాదాలు చేయవలసిన అవసరం ఉండదు. దుఃఖంలోనే ఇలా ఆర్తనాదాలు చేస్తారు – దయ చూపించండి, దుఃఖహర్త-సుఖకర్త అయిన తండ్రి, రండి, శివబాబా, మధురమైన తండ్రి, మళ్ళీ రండి అని అంటారు. వారు తప్పకుండా వస్తారు కావుననే శివజయంతిని జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు స్వర్గం యొక్క రాకుమారుడు. వారి జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ కృష్ణుడు ఎప్పుడు వచ్చారు అన్నది ఎవరికీ తెలియదు. రాధా-కృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇది ఎవరికీ తెలియదు. ఓ గాడ్ ఫాదర్….. అని మనుష్యులే పిలుస్తూ ఉంటారు. అచ్ఛా, మరి వారి నామ రూపాలు ఏమిటి అని అడిగితే, వారు నామ రూపాలకు అతీతుడు అని అంటారు. అరే, మీరు గాడ్ ఫాదర్ అని అంటారు, మళ్ళీ నామ రూపాలకు అతీతుడు అని ఎలా అంటారు. ఆకాశము శూన్యము, దానికి కూడా ‘ఆకాశం’ అన్న పేరుంది. తండ్రి యొక్క నామ రూపాలు మొదలైనవాటి గురించి మాకు తెలియదని మీరంటారు, అచ్ఛా, మీ గురించి అయినా మీకు తెలుసా, అని అడగండి. తెలుసు, మేము ఆత్మలము అని అంటారు. అచ్ఛా, ఆత్మ నామ రూపాలను చెప్పండి – అని అడగండి. అప్పుడు ఆత్మయే పరమాత్మ అని అంటారు. ఆత్మ నామ రూపాలకు అతీతం కాజాలదు. ఆత్మ ఒక బిందువు, నక్షత్రం వలె ఉంటుంది, భృకుటి మధ్యలో ఉంటుంది. ఈ చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిశ్చయించబడి ఉంది. ఇది బాగా అర్థం చేసుకోవలసిన విషయము, అందుకే 7 రోజుల భట్టీ గాయనం చేయబడింది. ద్వాపరం నుండి రావణ రాజ్యం ప్రారంభమయ్యింది, అప్పటి నుండి వికారాలు ప్రవేశించాయి, మెట్లు దిగుతూ వచ్చారు. ఇప్పుడు అందరికీ గ్రహణం పట్టింది, నల్లగా అయిపోయారు. అందుకే, ఓ జ్ఞానసూర్యుడా రండి, వచ్చి మమ్మల్ని ప్రకాశంలోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. జ్ఞాన అంజనమును సద్గురువు ఇచ్చారు, అజ్ఞాన అంధకారము వినాశనమయ్యింది….. అని అంటారు. అప్పుడు, బుద్ధిలోకి తండ్రి వస్తారు. అంతేకానీ, జ్ఞాన అంజనాన్ని గురువు ఇస్తారని కాదు….. గురువులైతే అనేకమంది ఉన్నారు, వారిలో జ్ఞానం ఎక్కడుంది, వారికి గాయనం లేదు. జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. అటువంటప్పుడు ఇతురులెవరైనా జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలరు. భగవంతుడిని కలుసుకునేందుకు అనేక మార్గాలున్నాయని సాధువులు అంటారు. శాస్త్రాలు చదవడం, యజ్ఞ-తపాదులు మొదలైనవి చేయడం – ఇవన్నీ భగవంతుడిని కలుసుకునేందుకు మార్గాలని అంటారు కానీ పతితులు పావన ప్రపంచంలోకి ఎలా వెళ్ళగలరు. నేను స్వయంగా వస్తానని తండ్రి అంటారు. భగవంతుడైతే ఒక్కరే, బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా దేవతలు. వారిని భగవంతుడు అని అనరు, వారికి కూడా తండ్రి శివుడే. ప్రజాపిత బ్రహ్మా అయితే ఇక్కడే ఉంటారు కదా. ప్రజలు ఇక్కడ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఇన్స్టిట్యూషన్ అన్న పేరు కూడా రాయబడి ఉంది. కనుక మీరు పిల్లలైనట్లు. ఎంతోమంది బి.కె.లున్నారు. వారసత్వం శివుని నుండి లభిస్తుంది, అంతేకానీ బ్రహ్మా నుండి కాదు. వారసత్వం తాతగారి నుండి లభిస్తుంది. బ్రహ్మా ద్వారా స్వర్గంలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారుచేస్తారు. బ్రహ్మా ద్వారా పిల్లలను దత్తత తీసుకుంటారు. పిల్లలు కూడా – బాబా, మేము మీ వారిమి, మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటామని అంటారు. బ్రహ్మా ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన జరుగుతుంది. శివబాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. శ్రీమతము అనగా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన భగవంతుని గీత. భగవంతుడు ఒక్కరే, వారు నిరాకారుడు. పిల్లలైన మీరు 84 జన్మలు తీసుకున్నారని తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మ, పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు….. అని అంటారు. చాలా కాలం నుండి వేరుగా ఉన్నది భారతవాసులే. ఆ సమయంలో వేరే ధర్మమేమీ ఉండేది కాదు. ఈ ధర్మం వారే మొట్టమొదట దూరమయ్యారు. తండ్రి నుండి దూరమై, ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చారు. తండ్రి అంటారు – ఓ ఆత్మలూ, ఇప్పుడు తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇది స్మృతి యాత్ర లేక యోగాగ్ని. మీ శిరస్సుపై ఏదైతే పాపాల భారం ఉందో, అది ఈ యోగాగ్నితో భస్మమవుతుంది. ఓ మధురమైన పిల్లలూ, మీరు స్వర్ణిమ యుగం నుండి ఇనుప యుగంలోకి వచ్చేసారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. ఇది బుద్ధితో చేసే పని కదా. దేహ సహితంగా దేహపు సంబంధాలన్నింటినీ వదిలి నన్నొక్కడినే స్మృతి చేయండి. మీరు ఆత్మలు కదా. ఇది మీ శరీరము. నేను, నేను అని ఆత్మ అంటుంది. రావణుడు మిమ్మల్ని పతితులుగా చేసాడు. ఈ ఆట తయారుచేయబడింది. పావన భారత్ మరియు పతిత భారత్ ఉంటాయి. పతితంగా అయినప్పుడు తండ్రిని పిలుస్తారు. రామరాజ్యం కావాలని కూడా అంటారు కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. జ్ఞానాన్నిచ్చే జ్ఞానసాగరుడు అయితే ఒక్క తండ్రి మాత్రమే. తండ్రియే వచ్చి సెకండులో వారసత్వాన్నిస్తారు. ఇప్పుడు తండ్రి నుండి సూర్యవంశీ, చంద్రవంశీ వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు. తర్వాత సత్య-త్రేతా యుగాలలో మీరు అమరులుగా అయిపోతారు. ఫలానావారు మరణించారు అని అక్కడ ఇలా అనరు. సత్యయుగంలో అకాల మృత్యువులు ఉండవు. మీరు కాలుడిపై విజయాన్ని పొందుతారు. అక్కడ దుఃఖం యొక్క పేరే ఉండదు. దానిని సుఖధామమని అంటారు. నేను మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తానని తండ్రి అంటారు, అక్కడ చాలా వైభవాలుంటాయి. భక్తి మార్గంలో మందిరాలను నిర్మించారు. ఆ సమయంలో కూడా ఎంత ధనముండేది. భారత్ ఎలా ఉండేది! మిగిలిన ఆత్మలందరూ నిరాకారీ ప్రపంచంలో ఉండేవారు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ఇప్పుడు స్వర్గ స్థాపనను చేస్తున్నారని పిల్లలు తెలుసుకున్నారు. ఉన్నతాతి ఉన్నతమైనవారు శివబాబా, తర్వాత సూక్ష్మ వతనవాసులైన బ్రహ్మా-విష్ణు-శంకరులు, తర్వాత ఈ ప్రపంచము.

జ్ఞానం ద్వారానే పిల్లలైన మీకు సద్గతి కలుగుతుంది. జ్ఞానం, భక్తి మరియు వైరాగ్యము అని కూడా గాయనం చేయడం జరుగుతుంది. పాత ప్రపంచం పట్ల వైరాగ్యం కలుగుతుంది ఎందుకంటే సత్యయుగ రాజ్యాధికారం లభిస్తుంది. ఇప్పుడు తండ్రి అంటారు – పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేయండి, నన్ను స్మృతి చేస్తూ మీరు నా వద్దకు వచ్చేస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శిరస్సుపై ఏదైతే పాపాల భారం ఉందో, దానిని యోగాగ్నితో భస్మం చేసుకోవాలి. దేహ సహితంగా దేహపు సంబంధాలన్నింటినీ బుద్ధి ద్వారా వదిలి, ఒక్క తండ్రిని స్మృతి చేయాలి.

2. పిలిచేందుకు బదులుగా లేక ఆర్తనాదాలు చేసేందుకు బదులుగా తమ శాంతి స్వధర్మములో స్థితులవ్వాలి, శాంతి మీ కంఠహారము. దేహాభిమానంలోకి వచ్చి నేను మరియు నాది అనే పదాలను వాడకూడదు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి.

వరదానము:-

ఏ విధంగా మహాన్ ఆత్మలు ఎప్పుడూ ఎవరి ముందు తల వంచరో, వారి ముందే అందరూ తల వంచుతారో, అలా తండ్రి ద్వారా ఎన్నుకోబడిన సర్వ శ్రేష్ఠ ఆత్మలైన మీరు, ఎక్కడైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే లేదా మాయ యొక్క రకరకాల ఆకర్షించే రూపాలలో కూడా స్వయం తల వంచుకోజాలరు. ఇప్పటి నుండే, సదా ఇతరులను వంచే స్థితిలో స్థితులైతే, అత్యంత ఉన్నత పదవి యొక్క అధికారం ప్రాప్తిస్తుంది. ఇటువంటి ఆత్మల ముందు సత్యయుగంలో ప్రజలు స్వమానంతో వంగుతారు మరియు ద్వాపరంలో మీ స్మృతిచిహ్నాల ముందు భక్తులు తల వంచుతూ ఉంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top