21 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

September 20, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - నామరూపాలకు అతీతమైన వస్తువంటూ ఏదీ ఉండదు, ఆత్మ మరియు పరమాత్మలను కూడా నామ రూపాలకు అతీతము అని అనరు, వారిలో కూడా అవినాశీ పాత్ర నిశ్చయించబడి ఉంది”

ప్రశ్న: -

శివబాబాను భోళానాథ్ అంటూ స్మృతి చేస్తారు, వారిని భోళా అని ఎందుకన్నారు?

జవాబు:-

ఎందుకంటే తండ్రియే అహల్యలను, గణికలను (వేశ్యలను), కుబ్జలను ఉద్ధరిస్తారు. వారికి విశ్వ రాజ్యం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. మనుష్యులైతే తండ్రి గురించి – దుఃఖం కూడా వారే ఇస్తారు, సుఖం కూడా వారే ఇస్తారు అని అంటారు. కానీ బాబా అంటారు – నేను పిల్లలైన మీ కోసం సుఖం యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తాను. నన్ను దుఃఖహర్త-సుఖకర్త అని అంటారు. ఆలోచించండి, తండ్రినైన నేను, నా పిల్లలకు దుఃఖాన్ని ఎలా ఇవ్వగలను.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

దూరదేశంలో నివసించేవారు….. (దూర్ దేశ్ కా రెహ్నే వాలా…..)

ఓంశాంతి. ఆత్మిక పిల్లలు పాటను విన్నారు అనగా ఆత్మలు ఈ శరీరంలోని చెవులు రూపీ కర్మేంద్రియాల ద్వారా పాటను విన్నారు – దూరదేశం నుండి యాత్రికుడు వచ్చారు. మీరందరూ యాత్రికులే కదా. ఆత్మలైన మనుష్యమాత్రులందరూ యాత్రికులే. ఇక్కడ ఆత్మలకు ఇల్లంటూ ఏదీ లేదు. ఆత్మ నిరాకారి. నిరాకారీ ఆత్మలు నిరాకారీ ప్రపంచంలో నివసిస్తాయి, దానిని నిరాకారీ ఆత్మల ఇల్లు, దేశం లేక లోకం అని అంటారు. దీనిని జీవాత్మల దేశం అని అంటారు. అది ఆత్మల దేశము, తర్వాత ఆత్మలు ఇక్కడకు వచ్చి శరీరంలోకి ప్రవేశించినప్పుడు నిరాకారి నుండి సాకారిగా అవుతాయి. అయితే, ఆత్మకు ఏ రూపము లేదని కాదు. ఆత్మకు రూపము తప్పకుండా ఉంటుంది, పేరు కూడా ఉంటుంది. ఇంత చిన్న ఆత్మ ఈ శరీరం ద్వారా ఎంత పాత్రను అభినయిస్తుంది. ప్రతి ఆత్మలోనూ పాత్రను అభినయించేందుకు ఎంతటి రికార్డు నిండి ఉంది. రికార్డు ఒక్కసారి నిండితే ఇక తర్వాత ఎన్నిసార్లు రిపీట్ చేసినా, అదే నడుస్తూ ఉంటుంది. అలాగే ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఒక రికార్డు వంటిది. అందులో 84 జన్మల పాత్ర అంతా నిండి ఉంది. ఎలాగైతే ఆత్మ నిరాకారియో, అలా తండ్రి కూడా నిరాకారియే. అక్కడక్కడ శాస్త్రాలలో – వారు (తండ్రి) నామ-రూపాలకు అతీతమైనవారని రాసేసారు. కానీ నామ రూపాలకు అతీతమైన వస్తువంటూ ఏదీ ఉండదు. ఆకాశం కూడా పోలార్ కానీ దానికి నామ రూపాలైతే ఉన్నాయి కదా. పేరు లేని వస్తువంటూ ఏదీ ఉండదు. పరమపిత నామ రూపాలకు అతీతమైనవారని మనుష్యులు భావిస్తారు. కానీ పేరు లేకపోతే రూపము కూడా ఉండదు, దేశము కూడా ఉండదు, అప్పుడిక ఏమీ ఉండదు. దూరదేశంలో నివసించే పరమపిత పరమాత్మ – అని పిలుస్తారు కూడా. ఆ దూరదేశంలో ఆత్మలు నివసిస్తాయి. ఇది సాకార దేశము, ఇందులో రెండు రాజ్యాలు ఉన్నాయి – రామ రాజ్యము మరియు రావణ రాజ్యము. అర్ధకల్పం రామ రాజ్యము, అర్ధకల్పం రావణ రాజ్యము. సత్యయుగం నుండి ఈశ్వరీయ రాజ్యం మొదలవుతుందని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. రామ రాజ్యాన్ని స్థాపన చేసేవారు పరమపిత పరమాత్మ. వారెప్పుడూ రావణ రాజ్యాన్ని స్థాపన చేయరు. తండ్రి ఎప్పుడూ పిల్లల కోసం దుఃఖపు రాజ్యాన్ని తయారుచేయరు. ఈశ్వరుడే సుఖ-దుఃఖాలు ఇస్తారని అంటారు. తండ్రి అంటారు – నేను పిల్లలకు దుఃఖాన్ని ఎలా ఇవ్వగలను, నా పేరే దుఃఖహర్త-సుఖకర్త. ఇది మనుష్యులు చేసిన పొరపాటు. ఈశ్వరుడు ఎప్పుడూ దుఃఖం ఇవ్వరు. ఈ సమయంలో దుఃఖధామమే ఉంటుంది. అర్థకల్పం రావణ రాజ్యంలో దుఃఖమే లభిస్తుంది. సుఖమనేది ఇసుమంత కూడా లేదు. సుఖధామంలో ఎప్పుడూ దుఃఖము ఉండదు. తండ్రి స్వర్గ రచయిత. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. దీనిని ఎవరూ కొత్త ప్రపంచమని అనరు. కొత్త ప్రపంచం పేరే స్వర్గము. అదే మళ్ళీ పాత ప్రపంచంగా తయారవుతుంది. కొత్త వస్తువు పాతదిగా పాడైనట్లుగా కనిపిస్తే, ఆ పాత వస్తువును సమాప్తం చేయడం జరుగుతుంది. మనుష్యులు విషాన్నే (వికారాలనే) సుఖంగా భావిస్తారు. అమృతాన్ని వదిలి విషం ఎందుకు త్రాగాలి అని అంటూ ఉంటారు. గ్రంథ్ లో గురునానక్ చెప్పిన మాటలు కూడా ఉన్నాయి, అవేమిటంటే – ఇతరుల సంపాదనను భక్షించే దొంగలు మరియు దోపిడీదారులు లెక్కలేనంత మంది ఉన్నారు….. తండ్రి మహిమను పాడుతారు – మీరు ఏదైతే వచ్చి చేస్తారో, దాని వలన మేలే జరుగుతుంది అని. లేదంటే రావణ రాజ్యంలో మనుష్యులు చెడు పనులే చేస్తారు. తండ్రియే వచ్చి మురికి పట్టిన వస్త్రాలను శుభ్రపరుస్తారు. గ్రంథ్ లో చాలా విషయాలు రాసారు. సింధీలు గ్రంథ్ ను పెట్టుకుంటారు కానీ వారు సిక్కు ధర్మంవారు కారు. ఇక్కడ ఉన్నవారు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు. సిక్కుల గురువు గురునానక్, వారికి గడ్డం, పొడుగు జుట్టు ఉండేవి. అలాంటప్పుడు సిక్కులందరికీ గడ్డం, పొడుగు జుట్టు ఉండాలి. ఈ రోజుల్లో గడ్డం ఉంచుకోవటం లేదు. చాలా ఫ్యాషనబుల్ గా తయారయ్యారు. లేదంటే గురువును ఫాలో చేయాలి కదా. వారు గురునానక్ కు ఫాలోవర్స్ అని అన్నప్పుడు, మరి గురునానక్ ను ఫాలో చేయాలి కదా. గురునానక్ వచ్చి 500 సంవత్సరాలయింది అని ఇప్పుడు పిల్లలకు తెలిసింది. వారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అనే మాటకు మీరు వెంటనే సమాధానమిస్తారు. గురునానక్ ఎప్పుడు వస్తారో చెప్పండి అని ఎవరినైనా అడగండి. అప్పుడు వారు – వారి ఆత్మ జ్యోతి, జ్యోతిలో కలిసిపోయింది కావున మళ్ళీ ఎలా వస్తారు అని అంటారు. నేటికి 4500 సంవత్సరాల తర్వాత గురునానక్ మళ్ళీ వస్తారని మీరంటారు. మీ బుద్ధిలో మొత్తం ప్రపంచ చరిత్ర-భూగోళాలు తిరుగుతూ ఉంటాయి. బుద్ధుడు, క్రీస్తు మొదలైనవారంతా ఈ సమయంలో తమోప్రధానంగా ఉన్నారని, శ్మశానగ్రస్థులుగా ఉన్నారని మీరంటారు. దీనిని వినాశన సమయము అని అంటారు. మనుష్యమాత్రులందరూ మరణించినట్లుగా ఉన్నారు. అందరి జ్యోతి ఆరిపోయినట్లుగా ఉంది. అందరినీ మేల్కొల్పేందుకు తండ్రి వస్తారు. కామ చితిపై కూర్చుని భస్మమైన పిల్లలందరినీ అమృత వర్షంతో మేల్కొల్పి తమతో పాటు తీసుకువెళ్తారు. మాయ కామ చితిపై కూర్చోబెట్టి శ్మశానగ్రస్థులుగా చేసేసింది, అందరూ నిద్రపోయారు. ఇప్పుడు తండ్రి అమృతాన్ని తాగిస్తారు. అందుకే అమృత్సర్ అనే పేరు పెట్టారు. తండ్రి వచ్చి అమృతాన్ని తాగిస్తారు. జ్ఞానామృతం ఎక్కడ, సాధారణ నీరు ఎక్కడ! సిక్కుల పండుగ నాడు చాలా ఘనంగా కొలనును శుభ్రం చేస్తారు, మట్టి తీసేస్తారు. అందుకే దానికి అమృత్సర్ అనే పేరును పెట్టారు అనగా అమృతం యొక్క కొలను. గురునానక్ సాహెబ్ జ్ఞాన సాగరుడేమీ కారు, వారు కూడా తండ్రిని మహిమ చేసారు. వారు స్వయంగా, ఏక్ ఓంకార్, సత్ నామ్, వారు సదా సత్యాన్ని చెప్పేవారు అని అంటారు. సత్యనారాయణ కథ ఉంది కదా. సింధ్ ప్రాంతానికి చెందినవారు విదేశాలకు వెళ్ళేటప్పుడు సత్యనారాయణ కథను వినడం కోసం సభ ఏర్పాటు చేస్తారు. సత్యనారాయణ కథను వినడం ద్వారా చేరవలసిన స్థానానికి క్షేమంగా చేరుకుంటారని భావిస్తారు. అమరకథ, మూడవ నేత్రం కథ, ఇలా భక్తి మార్గపు కథలు ఎన్ని వింటూ వచ్చారు. శంకరుడు పార్వతికి కథ వినిపించారని అంటారు. శంకరుడు సూక్ష్మవతనంలో నివసించేవారు, అక్కడ ఏ కథను వినిపించారు? ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. వాస్తవానికి మీకు అమరకథను వినిపించి అమరలోకానికి తీసుకువెళ్ళేందుకు నేను వచ్చాను. మృత్యులోకం నుండి అమరలోకానికి నేను తీసుకువెళ్తాను. ఇకపోతే, సూక్ష్మవతనంలో పార్వతి ఏ తప్పు చేసారని ఆమెకు వచ్చి కథ వినిపిస్తారు. మనం నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా తయారవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇది అమరలోకానికి వెళ్ళేందుకు సత్యమైన సత్యనారాయణ కథ, మూడవ నేత్రం కథ. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రం లభించింది.

మీరు పుష్పాలుగా, పూజ్యులుగా ఉండేవారు, 84 జన్మల తర్వాత మీరే పూజారులుగా తయారయ్యారు అని తండ్రి అర్థం చేయిస్తారు. అందుకే, మీరే పూజ్యులు, మీరే పూజారులు అని అంటూ ఉంటారు. తండ్రి అంటారు – నేనైతే సదా పూజ్యుడను, నేను వచ్చి మిమ్మల్ని పూజారుల నుండి పూజ్యులుగా తయారుచేస్తాను. ఓ రామా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారుచేయండి అని అంటారు. భక్తులందరూ పిలుస్తూ ఉంటారు. ఓ పతితపావన, అని ఆత్మ పిలుస్తుంది కదా. గీతను కృష్ణుడేమీ వినిపించలేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పావనంగా తయారుచేసేవారు ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే, కేవలం ఆ రాముడు మాత్రమే. కనుక తండ్రి అర్థం చేయిస్తారు – ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు, గీత భగవంతుడు శివుడు, కృష్ణుడు కాదు అని ఒపీనియన్ (అభిప్రాయం) రాయించుకుంటూ ఉండండి. ముందు, భగవంతుడు అని ఎవరినంటారో అడగండి – నిరాకారుడినా లేక సాకారుడినా? కృష్ణుడైతే సాకారుడు, శివుడు నిరాకారుడు. వారు కేవలం ఈ తనువును లోన్ గా తీసుకుంటారు. అంతేకానీ, తల్లి గర్భం ద్వారా జన్మించరు. మొట్టమొదటగా గర్భంలో ప్రవేశించే ఆత్మ కృష్ణుని ఆత్మ. బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా సూక్ష్మ శరీరధారులు. శివునికి శరీరము లేదు. ఇక్కడ ఈ లోకంలో స్థూల శరీరాలుంటాయి. పతితపావనుడు, సర్వుల సద్గతిదాత, సర్వుల లిబరేటర్ (ముక్తిదాత), దుఃఖహర్త, సుఖకర్త అని తండ్రికి మహిమ ఉంది. అచ్ఛా, సుఖం ఎక్కడ ఉంటుంది? సుఖమనేది తర్వాత జన్మలో, రావణ రాజ్యం సమాప్తమై స్వర్గ స్థాపన జరిగినప్పుడు లభిస్తుంది. అచ్ఛా, దేని నుండి ముక్తులుగా చేస్తారు? రావణుని దుఃఖం నుండి ముక్తులుగా చేస్తారు. ఇది దుఃఖధామము కదా. అచ్ఛా, వారు గైడ్ (మార్గదర్శకునిగా) గా కూడా అవుతారు. ఈ శరీరాలైతే ఇక్కడే సమాప్తమైపోతాయి. ఇకపోతే, ఆత్మలను తీసుకువెళ్తారు. అందరినీ దుఃఖం నుండి విడిపించి, పవిత్రంగా తయారుచేసి ఇంటికి తీసుకువెళ్తారు. మనుష్యులు వివాహం చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు, ముందు పతి ఉంటారు, వెనుక పెళ్లి కూతురు ఉంటారు, ఆ తర్వాత ఊరేగింపు ఉంటుంది. ఇప్పుడు మీ మాల కూడా అలాగే ఉంది. పైన ఉన్న పుష్పం శివబాబా. ముందు పుష్పానికి నమస్కరిస్తారు. తర్వాత జంట పూసలైన బ్రహ్మా సరస్వతులు ఉంటారు. ఆ తర్వాత తండ్రికి సహాయకులైన పిల్లలైన మీరంటారు. పుష్పమైన శివబాబా స్మృతి ద్వారానే సూర్యవంశములోని విష్ణుమాల తయారయింది. బ్రహ్మా-సరస్వతులే లక్ష్మీనారాయణులుగా తయారవుతారు. దేవత, క్షత్రియ….. అలా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయి ఈ జ్ఞానాన్ని తీసుకొని లక్ష్మీనారాయణులుగా తయారవుతారు. వారి మాల ఇలా తయారయింది. ఈ బ్రహ్మా-సరస్వతులే రాజా-రాణిగా తయారవుతారు. వారు శ్రమించారు, అందుకే పూజించబడతారు. మాల అంటే ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. కేవలం అలా మాలను తిప్పుతూ ఉంటారు. 16,108 మాల కూడా ఉంటుంది. ఈ మాలను పెద్ద-పెద్ద మందిరాలలో పెడుతూ ఉంటారు. ఒకరు ఒక చోట నుండి, మరొకరు మరో చోట నుండి ఆ మాలను తిప్పుతూ ఉంటారు. బాబా బొంబాయిలో లక్ష్మీనారాయణుల మందిరానికి వెళ్ళేవారు. అక్కడ మాలను తిప్పేవారు, రామ-రామ అని జపిస్తూ ఉండేవారు. పుష్పం శివబాబా కదా. పుష్పాన్నే రామ-రామ అని అంటారు. ఆ తర్వాత మాల అంతటికీ నమస్కరిస్తారు కానీ జ్ఞానం ఏమీ ఉండదు. ఫాదర్లు కూడా చేతిలో మాలను తిప్పుతూ ఉంటారు. మీరు ఎవరి మాలను తిప్పుతున్నారు అని వారిని అడిగితే, క్రీస్తు స్మృతిలో మాలను తిప్పుతున్నామని చెప్తారు. పోప్ వారందరికీ పెద్ద ఫాదర్ కనుక వారికి పోప్ ల మాల ఉంటుంది. వారందరి చిత్రాలు ఉన్నాయి. పోప్ లకు ఎంత గౌరవముంటుంది. క్రీస్తు ఆత్మ ఎక్కడ ఉంది అనేది స్వయం పోప్ కు తెలియదు. క్రీస్తు ఆత్మ కూడా ఇప్పుడు బికారి రూపంలో ఉందని మీకు తెలుసు. మీరు కూడా ఇప్పుడు బికారుల నుండి రాకుమారులుగా తయారవుతున్నారు. భారత్ యే రాకుమారునిగా ఉండేది. ఇప్పుడు బికారిగా ఉంది. మళ్ళీ రాకుమారునిగా తయారవుతుంది. అలా తయారుచేసేవారు ఒక్క ఆత్మిక తండ్రి మాత్రమే. బికారుల నుండి రాకుమారులుగా తయారవుతారు. రాకుమార, రాకుమారీల కాలేజి కూడా ఒకటుంది, వారు అక్కడకు వెళ్ళి చదువుకుంటారు. మీరు ఇక్కడ చదువుకుని 21 జన్మలకు స్వర్గంలో రాకుమార-రాకుమారీలుగా తయారవుతారు. జ్ఞానంతో మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతారు.

సత్యయుగంలో రాకుమారునిగా ఉన్న శ్రీకృష్ణుడే 84 జన్మల తర్వాత బికారిగా అయ్యారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. 5 వేల సంవత్సరాల క్రితం దేవీ-దేవతలు ఎంత షావుకారులుగా ఉండేవారు. ఇప్పుడు వారే నిరుపేదలుగా, బికారులుగా తయారయ్యారు. ఈ విషయాలను కేవలం మీరు మాత్రమే వినగలరు. భగవానువాచ – వారు అందరికీ తండ్రి. మీరు గాడ్ ఫాదర్ ద్వారా వింటారు. గీతలో కేవలం ఈ ఒక్క పొరపాటు చేసారు – శివ భగవానువాచకు బదులుగా కృష్ణ భగవానువాచ అనే పేరు రాసేసారు. అందుకే అసత్యపు ప్రపంచమని అంటూ ఉంటారు. ఈ సమయంలో ప్రపంచమంతా ముళ్ళ అడవిగా తయారయింది. బొంబాయిలో బబుల్ నాథ్ మందిరముంది. తండ్రి వచ్చి ఈ ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తారు. అందరూ పరస్పరంలో ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు అనగా కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే దీనిని ముళ్ళ అడవి అని అంటారు. సత్యయుగాన్ని గార్డెన్ ఆఫ్ అల్లా అని అంటారు. ఆ పుష్పాలే ముళ్ళగా అవుతారు, మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. సత్యయుగంలో ఎప్పుడూ రావణుడిని కాల్చరు. రావణుడు భారత్ యొక్క పాత శత్రువు. మీకు రావణునితో యుద్ధం జరుగుతుంది, అతడు అర్ధ కల్పము దుఃఖమిచ్చాడు. చివరిలో పెద్ద యుద్ధం కూడా జరుగుతుంది. సత్యాతి-సత్యమైన దసరా జరగనున్నది. రావణ రాజ్యము సమాప్తమైపోతుంది. మీకు తర్వాత బంగారు మహళ్ళు లభిస్తాయి. ఇప్పుడు మీరు రావణునిపై విజయం పొంది స్వర్గానికి యజమానులుగా తయారవుతారు. బాబా మొత్తం విశ్వం యొక్క రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. అందుకే వారిని శివ భోళా భండారి అని అంటారు. వేశ్యలు, అహల్యలు, కుబ్జలు… తండ్రి అందరినీ విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. వారెంత భోళా. వారు రావడం కూడా పతిత ప్రపంచంలో, పతిత శరీరంలోకి వస్తారు. ఇకపోతే, స్వర్గానికి యోగ్యులు కానివారు వికారాలను విడిచిపెట్టలేరు. తండ్రి అంటారు – పిల్లలూ, ఇప్పుడు ఈ అంతిమ జన్మలో మీరు పావనంగా తయారవ్వండి. ఈ వికారాలు విషం వంటివి. ఇవి మిమ్మల్ని ఆదిమధ్యాంతాలు దుఃఖితులుగా చేస్తాయి. మీరు ఈ ఒక్క అంతిమ జన్మలో వీటిని విడిచిపెట్టలేరా? నేను మీకు అమృతాన్ని తాగించి అమరులుగా తయారుచేస్తాను, అయినా మీరు పవిత్రంగా అవ్వరు, వికారాలు లేకుండా, సిగరెట్ లేకుండా, మద్యం లేకుండా ఉండలేరు. అనంతమైన తండ్రినైన నేను చెప్తున్నాను – మీరు ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను.

మొత్తం ప్రపంచమంతటినీ దుఃఖం నుండి ముక్తి చేసి సుఖధామం, శాంతిధామాలకు తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు అన్ని ధర్మాలు వినాశనమైపోతాయి. ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం స్థాపన అవుతుంది. గ్రంథ్ లో కూడా పరమపిత పరమాత్మను అకాల్ మూర్త్ అని అంటారు. తండ్రి మహాకాలుడు. ఆ కాలుడు కేవలం ఒక్కరినో, ఇద్దరినో తీసుకువెళ్తాడు. నేనైతే ఆత్మలందరినీ తీసుకువెళ్తాను ,అందుకే నన్ను మహాకాలుడు అని అంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ అంతిమ జన్మలో జ్ఞానామృతాన్ని తాగి అమరులుగా తయారవ్వాలి. స్వర్గంలోకి వెళ్ళేందుకు స్వయాన్ని యోగ్యులుగా తయారుచేసుకోవాలి. చెడు అలవాట్లను వదిలేయాలి.

2. ఇప్పుడు చదువు చదువుకొని 21 జన్మలకు స్వర్గంలో రాకుమార-రాకుమారీలుగా తయారవ్వాలి. సత్యాతి-సత్యమైన సత్యనారాయణ కథను విని నరుని నుండి నారాయణునిగా తయారయ్యే పురుషార్థం చేయాలి.

వరదానము:-

ఎలాగైతే ఇంద్రజాలికుడు కొద్ది సమయంలోనే చాలా విచిత్రమైన ఆటలను చూపిస్తాడో, అలా ఆత్మిక ఇంద్రజాలికులైన మీరు మీ ఆత్మికతా శక్తి ద్వారా మొత్తం విశ్వాన్ని పరివర్తన చేసేవారు, నిరుపేదలను డబల్ కిరీటధారులుగా చేసేవారు. స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు కేవలం ‘నేను ఒక ఆత్మను’ అనే ఒక్క సెకండు యొక్క దృఢ సంకల్పాన్ని ధారణ చేస్తారు. విశ్వాన్ని పరివర్తన చేసేందుకు స్వయాన్ని విశ్వానికి ఆధారమూర్తిగా, ఉద్ధారమూర్తిగా భావిస్తూ విశ్వపరివర్తన కార్యంలో సదా తత్పరులై ఉంటారు. అందుకే, అందరికంటే పెద్ద ఆత్మిక ఇంద్రజాలికులు మీరు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top