22 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

May 21, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - తమదంతా ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకుని భవిష్యత్తును తయారుచేసుకోండి, ఎందుకంటే మృత్యువు తలపై ఉంది”

ప్రశ్న: -

జ్ఞానాన్ని వింటున్నా సరే పిల్లల్లో ధారణ ఎందుకు జరగడం లేదు?

జవాబు:-

ఎందుకంటే విచార సాగర మథనం చేయడం రాదు. బుద్ధియోగం దేహం మరియు దేహ సంబంధాలలో వేలాడుతూ ఉంది. ముందు బుద్ధి నుండి మోహం తొలగితే, ఎంతోకొంత ధారణ జరుగుతుంది. మోహమనేది ఎటువంటిదంటే, అది పూర్తిగా కోతిలా చేస్తుంది, అందుకే తండ్రి పిల్లలకు మొట్టమొదటి ప్రతిజ్ఞను గుర్తు చేయిస్తున్నారు – దేహ సహితంగా, దేహపు సర్వ సంబంధాలను మర్చిపోండి మరియు నన్ను స్మృతి చేయండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

భోళానాథుని కన్నా అతీతమైనవారు… (భోలేనాథ్ సే నిరాలా…)

ఓంశాంతి. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, పాడైనదానిని బాగుచేసేవారు అని అనంతమైన తండ్రినే అంటారని ఇప్పుడు పిల్లలకు బాగా తెలుసు. కృష్ణుడు పాడైనదానిని బాగు చేయలేరు. గీతా భగవంతుడు కృష్ణుడు కాదు, శివుడు. శివబాబా రచయిత మరియు కృష్ణుడు రచన. స్వర్గ వారసత్వాన్ని కేవలం స్వర్గ రచయిత మాత్రమే ఇవ్వగలరు. ఇదే భారత్ యొక్క ముఖ్యమైన అతి పెద్ద పొరపాటు. శ్రీకృష్ణుడిని ఎవరూ ‘బాబా’ అని అనలేరు. వారసత్వమనేది తండ్రి నుండే లభిస్తుంది మరియు అది భారత్ కే లభించింది. భారత్ లోనే శ్రీకృష్ణుడు రాకుమారునిగా, రాధ రాకుమారిగా గాయనం చేయబడ్డారు. మహిమ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ఒక్కరిదే. శ్రీకృష్ణుడు ఉన్నతాతి ఉన్నతమైన రచన, వారు విశ్వానికి యజమాని. దానిని సూర్యవంశం, దైవీ వంశం అని అంటారు. గీత ఆది సనాతన దేవీ దేవతా ధర్మ శాస్త్రము. సత్యయుగంలో ఎవరికీ జ్ఞానం వినిపించలేదు. తండ్రి సంగమంలోనే వినిపించారు. చిత్రాలతో కూడా ముందు ఈ విషయాన్ని నిరూపించాలి. ఇరువురి చిత్రాలను చూపిస్తారు – గీతా భగవంతుడు, రచయిత, పునర్జన్మ రహితుడు వీరు, అంతేకానీ శ్రీకృష్ణుడు కాదు, వారు రచన. శివబాబాయే వజ్ర తుల్యంగా తయారుచేస్తారని మీకు తెలుసు. వజ్ర సమానము, గవ్వ సమానము అని కూడా అంటూ ఉంటారు. మీరు నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి – ఇది తండ్రి ఆజ్ఞ అని పిల్లల బుద్ధిలో ఉండాలి. వారు అనంతమైన తండ్రి. కృష్ణుడు విశ్వానికి రాజుగా అవుతారు కానీ ఎంతైనా వారు హద్దు యొక్క యజమాని. శివబాబా అయితే రాజు అవ్వరు కదా. వాస్తవానికి గీతకు చాలా మహిమ ఉంది. దానితో పాటు భారత్ కు కూడా మహిమ ఉంది. భారత్ అన్ని ధర్మాల వారికి గొప్ప తీర్థ స్థానము. కేవలం కృష్ణుని పేరు వేసిన కారణంగా, మహత్వమంతా పోయింది. ఈ కారణంగానే భారత్ గవ్వ సమానంగా అయిపోయింది. ఇలా జరగడం డ్రామానుసారంగానే జరుగుతుంది కానీ అప్రమత్తం చేయవలసి ఉంటుంది. తండ్రి చాలా మంచి రీతిగా అర్థం చేయిస్తారు. రోజు రోజుకు గుహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు కనుక పాత చిత్రాలను మార్చి వేరే చిత్రాలను తయారుచేయించాల్సి ఉంటుంది. ఇది చివరి వరకు జరుగుతూనే ఉంటుంది. శివబాబా మాకు వారసత్వాన్ని ఇస్తున్నారని పిల్లలు మంచి రీతిగా బుద్ధిలో ఉంచుకోవాలి. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని అంటారు. కృష్ణుడిని స్మృతి చేయడం వలన వికర్మలు వినాశనం కావు. అతడు సర్వశక్తివంతుడైతే కాదు. సర్వశక్తివంతుడు తండ్రి, వారసత్వాన్ని కూడా వారే ఇస్తారు. మనుష్యులు, కృష్ణుడినే స్మృతి చేస్తూ ఉంటారు. అచ్ఛా, కృష్ణుడే చెప్పారనుకోండి, దేహ సంబంధాలను వదిలి నన్నొక్కడినే స్మృతి చేయండి అనే అతను కూడా చెప్తారు. అప్పుడు ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది కదా. కృష్ణుడైతే ఆత్మలందరికీ తండ్రి కాదు. ఇవన్నీ విచార సాగర మథనం చేసి బుద్ధిలో ధారణ చేయాలి. కొంతమంది మోహంలో చిక్కుకున్న కారణంగా ఇక ధారణ చేయలేరు. ఇతర సాంగత్యాలను వదిలి మీతోనే సాంగత్యాన్ని జోడిస్తామని, నాకు ఒక్కరు తప్ప వేరెవ్వరూ లేరని మీరు పాడుతూ వచ్చారు. కానీ మోహమనేది ఎలాంటిదంటే, అది పూర్తిగా కోతిలా చేస్తుంది. కోతిలో మోహం మరియు లోభం చాలా ఉంటుంది. ఇప్పుడు మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని, మీ వద్ద ఉన్నదంతా ఈశ్వరీయ సేవలో వినియోగించి భవిష్యత్తును తయారుచేసుకోండని షావుకారులకు కూడా అర్థం చేయించడం జరుగుతుంది. కానీ కోతుల వలె వేలాడుతూ ఉన్నారు, వదలరు. దేహ సహితంగా, దేహ సంబంధాలేవైతే ఉన్నాయో, వాటి నుండి బుద్ధియోగాన్ని తొలగించండి అని తండ్రి అంటారు. తండ్రి శ్రీమతాన్ని అనుసరించండి. ఈ ధనం, సంతానం మొదలైనవన్నీ ఈశ్వరుడు ఇచ్చారని మీరంటారు. ఇప్పుడు వారు స్వయంగా వచ్చారు. మీ ఈ ధన-సంపదలు మొదలైనవన్నీ సమాప్తమవ్వనున్నాయని చెప్తారు. కొందరిది మట్టిలో పూడ్చుకుపోతుంది….. భూకంపాలు మొదలైనవి వస్తాయి. ఇదంతా సమాప్తమైపోతుంది. విమానాలు పడిపోయినప్పుడు లేదా నిప్పు అంటుకున్నప్పుడు పోలీసులు వచ్చే లోపు, దొంగలు లోపలికి చొరబడతారు. కనుక తండ్రి అర్థం చేయిస్తారు – పిల్లలూ, దేహధారుల పట్ల మోహాన్ని తొలగించుకోవాలి, మోహజీతులుగా అవ్వాలి. దేహాభిమానమనేది అన్నింటికన్నా మొదటి నంబరు శత్రువు. దేవతలు దేహీ-అభిమానులు. దేహాభిమానం రావడంతోనే వికారాల్లో చిక్కుకుంటారు. మీరు అర్ధకల్పం దేహాభిమానులుగా ఉంటారు. ఇప్పుడు దేహీ-అభిమానులుగా ఉండే అభ్యాసం చేయాలి. మనుష్యమాత్రులెవరైతే ఉన్నారో, వారెవ్వరికీ ఈ విషయాలు గురించి తెలియదు, అలానే పరమాత్మ గురించి కూడా తెలియదు. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఎవరు, ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంటుంది, పాత్రను ఎలా అభినయిస్తుంది, మేమే పాత్రధారులము – ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు. అందుకే అనాథలని అంటారు. ఆత్మ, జ్యోతిలో లీనమైపోతుందని వారంటారు. కానీ ఆత్మ అవినాశి. ఆత్మలోనే 84 జన్మల పాత్ర రచించబడి ఉంది. ఆత్మ ఒక నక్షత్రమని అంటారు కానీ అర్థం చేసుకోరు. ఆత్మయే పరమాత్మ అని అంటారు, తండ్రి గురించి అసలేమీ తెలియదు. భృకుటి మధ్యలో ప్రకాశించే నక్షత్రమని ఆత్మ గురించి చెప్తారు. పరమాత్మ గురించి ఏమీ చెప్పరు. వారిని పరమ-ఆత్మ అని అంటారు, వారు కూడా పరంధామంలో ఉంటారు. వారు కూడా ఒక బిందువు. అయితే, వారు పునర్జన్మ రహితుడు కానీ ఆత్మలు పునర్జన్మల్లోకి వస్తాయి. జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, పవిత్రతా సాగరుడు అని పరమాత్మను గురించే అంటారు. దేవతలకు ఈ వారసత్వాన్ని ఎవరిచ్చారు. తండ్రి ఇచ్చారు. సర్వ గుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు….. ఈ దేవతల వంటి వారు ఇప్పుడు ఎవరూ లేరు. వీరికి ఈ వారసత్వం ఎలా లభించింది అనేది ఎవరికీ తెలియదు. తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు, వారినే జ్ఞానసాగరుడు అని అంటారు. వారు ఈ సమయంలో వచ్చి జ్ఞానాన్నిస్తారు, అది తర్వాత ప్రాయః లోపమైపోతుంది. ఆ తర్వాత భక్తి ఉంటుంది, దానిని జ్ఞానమని అనలేము. జ్ఞానంతో సద్గతి కలుగుతుంది. దుర్గతి ఏర్పడినప్పుడు, సర్వుల సద్గతిదాత, జ్ఞానసాగరుడు వస్తారు. తండ్రియే వచ్చి జ్ఞాన స్నానాన్ని చేయిస్తారు. అది నీటి స్నానము, దానితో సద్గతి కలగదు. ఇటువంటి చిన్న విషయాలను కూడా ధారణ చేయాలి. ముఖ్యమైన మంచి-మంచి చిత్రాలు ఏవైతే ఉన్నాయో, వాటిని ఎవరైనా మంచి రీతిగా అర్థం చేసుకోగలిగేలా, అవి పెద్దవిగా ఉండాలి. అక్షరాలు చాలా బాగుండాలి. చిత్రాలను తయారుచేసేవారు ఈ విషయాలను బుద్ధిలో ఉంచుకోవాలి. ఎవరికైనా సరే ఆహ్వానాన్ని ఇచ్చి పిలవాలి – మీరు వచ్చి పరమపిత పరమాత్ముని పరిచయాన్ని తెలుసుకోండి మరియు భవిష్య 21 జన్మల కోసం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని. సోదరీ-సోదరులారా, పారలౌకిక తండ్రి నుండి అనంతమైన సుఖం యొక్క స్వరాజ్యం ఎలా లభిస్తుంది అనేది వచ్చి తెలుసుకోండి, అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని పొందడం నేర్చుకోండి, ఇందులో భయపడాల్సిన విషయమేమీ లేదు అని చెప్పండి. ఓ పతిత పావనా రండి, అని పిలుస్తూ ఉంటారు. కామము మహాశత్రువు అని తండ్రి కూడా అంటారు. పావన ప్రపంచంలోకి వెళ్ళాలంటే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వికారాల ద్వారా జన్మ తీసుకునేవారిని పతితులని అంటారు. సత్య, త్రేతా యుగాలలో విషం ఉండదు, దానిని సంపూర్ణ నిర్వికారీ ప్రపంచమని అంటారు. అక్కడ వికారాలనేవి అసలు ఉండవు. మరి పిల్లలు ఎలా జన్మిస్తారని మీరెందుకు అడుగుతారు. మీరైతే నిర్వికారులుగా అవ్వండి. పిల్లలు ఎలా జన్మించవలసి ఉంటే అలా జన్మిస్తారు. అసలు మీరు దీని గురించి ఎందుకు అడుగుతారు? మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే జన్మజన్మల వికర్మలు వినాశనమవుతాయి. ఇది పాపాత్ముల ప్రపంచము. అది పుణ్యాత్ముల ప్రపంచము. దీనిని మంచి రీతిగా బుద్ధిలో కూర్చోబెట్టాలి. భక్తి ఫలాన్ని భగవంతుడు వచ్చి ఇస్తారు. తండ్రియే సర్వులకు సద్గతినిచ్చి స్వర్గానికి యజమానులుగా చేస్తారు. తండ్రి అంటారు – ఇప్పుడు పవిత్రంగా అవ్వండి, నన్నొక్కడినే స్మృతి చేయండి, ఇది మహామంత్రము. తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభిస్తుంది. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా అయిపోతారని తండ్రి అంటారు. మెట్ల వరుస చిత్రం గురించి అర్థం చేయించాలి. రోజు-రోజుకు ప్రతీదీ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది అని ఇందులో స్పష్టంగా వ్రాయాలి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉన్నప్పుడు వేరే ధర్మమేదీ ఉండేది కాదు. ఎవరైతే పవిత్రంగా అవుతారో, వారే పవిత్ర ప్రపంచంలోకి వస్తారు. మీలో ఎంత శక్తి నిండుతూ ఉంటుందో, అంత ముందుగా వస్తారు. అందరూ కలిసి అయితే రారు. సత్య, త్రేతా యుగాలలో దేవీ దేవతలు చాలా కొద్దిమందే ఉంటారని, తర్వాత వృద్ధి జరుగుతుందని కూడా మీకు తెలుసు. ప్రజలైతే ఎంతోమంది ఉంటారు. అర్థం చేయించేవారు కూడా చాలా మంచివారు ఉండాలి. మీరు వచ్చి అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి, మీరు ఓ తండ్రి, అని ఎవరినైతే పిలుస్తారో, వాస్తవానికి వారి పేరే శివ అని చెప్పండి. ఈశ్వరా లేక ప్రభూ, భగవంతుడా, అని అనడం వలన వారు తండ్రి అని, వారి నుండి వారసత్వం లభించనున్నదని అర్థం చేసుకోరు. శివబాబా అని అనడంతో వారసత్వం గుర్తుకొస్తుంది. వారిని శివ పరమాత్మాయ నమః అని అంటారు. మరి పరమాత్ముని పేరు చెప్పండి. నామ రూపాలకు అతీతమైనవారు ఎవరూ ఉండరు. వారి పేరు శివ. కేవలం శివాయ నమః అని అనకూడదు, శివ పరమాత్మాయ నమః అని అనాలి. ప్రతి మాటను చాలా మంచి రీతిగా స్పష్టంగా అర్థం చేయించవలసి ఉంటుంది. శివాయ నమః అని అనడంతో కూడా తండ్రి అనే ఆనందం కలగదు. మనుష్యులైతే అన్ని పేర్లను స్వయానికే పెట్టుకున్నారు. మనుష్యులనెప్పుడూ భగవంతుడని అనరని మీకు తెలుసు. బ్రహ్మా-విష్ణు-శంకరులను కూడా దేవతలని అంటారు. రచయిత తండ్రి అయితే ఒక్క నిరాకారుడు మాత్రమే. లౌకిక తండ్రి పిల్లలను రచిస్తారు, వారసత్వాన్ని ఇస్తారు కదా, అదే విధంగా అనంతమైన తండ్రి కూడా వారసత్వాన్ని ఇస్తారు. భారత్ ను విశ్వానికి యజమానిగా తయారుచేస్తారు. మొత్తం ప్రపంచమంతటికీ పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమే. తమ ధర్మ స్థాపకులు కూడా ఈ సమయంలో పతితులుగా ఉన్నారని, శ్మశానగ్రస్థులుగా ఉన్నారని ఎవరికీ తెలియదు. ఇప్పుడిది అందరి వినాశన సమయము. తండ్రియే వచ్చి అందరినీ మేలుకొల్పుతారు. వినాశన సమయంలోనే ఆ ఖుదా, భగవంతుడు వస్తారు. వారే జ్ఞానసాగరుడు. సాగరుని పిల్లలు భస్మీభూతులైపోయారని అనగా కామచితిపై కూర్చొని నల్లగా, ఇనుప యుగం వారిగా అయిపోయారని రాయబడింది. మళ్ళీ వారు సుందరంగా ఎలా అవుతారు. స్మృతి యాత్ర ద్వారా అవుతారని తండ్రి అంటారు. యోగమనే పదాన్ని ఉపయోగించినప్పుడు మనుష్యులు తికమకపడతారు. నన్ను స్మృతి చేసినట్లయితే, అంతమతి సో గతి జరుగుతుందని (అంతిమ సమయంలో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అలాంటి గతి లభిస్తుంది) తండ్రి అంటారు. ఎంత సహజంగా అర్థం చేయిస్తారు, అయినా ఈ విషయాలు ఎందుకు బుద్ధిలో కూర్చోవు. దేహాభిమానం చాలా ఉంది, అందుకే ధారణ జరగదు. బాబా చాలా మంచి యుక్తిని తెలియజేస్తారు. ఏ అనంతమైన తండ్రినైతే స్మృతి చేస్తారో, వారు వచ్చి ఏమి చేసారు. భారత్ ను స్వర్గంగా తయారుచేసారు. హద్దు వారసత్వాన్ని అయితే జన్మజన్మలుగా తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి 21 జన్మల కోసం అనంతమైన వారసత్వాన్ని తీసుకోండి. సత్య, త్రేతా యుగాలలో దేవతలు రాజ్యం చేసేవారు. సూర్యవంశీయులే చంద్రవంశీయులుగా, వారే తర్వాత వైశ్యవంశీయులుగా, వారే మళ్ళీ శూద్రవంశీయులుగా….. అవుతారు, వారే మళ్ళీ – అనే పదాలు వ్రాయడంతో వారే పునర్జన్మలు తీసుకుంటారని, వర్ణాలలోకి వస్తారని నిరూపించబడుతుంది. తండ్రి అయితే అందరికీ అర్థం చేయిస్తారు, మీరు సమ్ముఖంగా కూర్చున్నారు కనుక సంతోషపడతారు. కొందరికి భాగ్యంలో లేకపోతే సేవ చేయరు. సేవ చేసినట్లయితే వారి పేరు ప్రసిద్ధమవుతుంది. బాబా కుమార్తెలు ఎంత చురుకుగా ఉన్నారు, వారు అన్ని పనులను చేస్తారు, వారు మాకు స్వర్గ రాజ్యాధికారపు వారసత్వాన్ని ఇస్తారు, ఈ సామాగ్రిని కూడా ఇస్తారని చెప్పుకుంటారు. ఈ చిత్రాలు అంధుల ఎదురుగా అద్దం వంటివి, ఇందులో ఇంద్రజాలం విషయమేమీ లేదు. పవిత్రతే ముఖ్యమైన విషయము. ఇది అంతిమ జన్మ అని అర్థం చేసుకుంటారు, స్వర్గానికి వెళ్ళాలంటే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. పావనంగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. సన్యాసులు పావనంగా అవ్వడానికి ఇళ్ళు-వాకిళ్ళను వదిలేస్తారు. వినాశనం ఎదురుగా నిలబడి ఉందని, నన్ను స్మృతి చేసినట్లయితే నావ తీరానికి చేరుతుందని తండ్రి అంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. వినాశనానికి ముందే తమదంతా సఫలం చేసుకోవాలి. ఇది వినాశన సమయం కావున తప్పకుండా పావనంగా అవ్వాలి.

2. దేహధారుల పట్ల మోహాన్ని తొలగించి మోహజీతులుగా అవ్వాలి. మొదటి నంబరు శత్రువైన దేహాభిమానంపై విజయం పొందాలి. ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి, తండ్రితో బుద్ధియోగాన్ని జోడించాలి.

వరదానము:-

వర్తమాన సమయంలో మనన శక్తి ద్వారా ఆత్మలో సర్వ శక్తులను నింపుకునే అవసరముంది. దీని కోసం అంతర్ముఖులుగా అయి ప్రతి పాయింటును మననం చేయండి, అప్పుడు వెన్న వెలువడుతుంది మరియు మీరు శక్తిశాలిగా అవుతారు. ఇటువంటి శక్తిశాలి ఆత్మలు అతీంద్రియ సుఖం యొక్క ప్రాప్తిని అనుభవం చేస్తారు, వారిని అల్పకాలికమైనది ఏదీ కూడా ఆకర్షించలేదు. వారి మగ్నావస్థ ద్వారా ఏదైతే ఆత్మిక శక్తిశాలి స్థితి తయారవుతుందో, దాని ద్వారా విఘ్నాల ఫోర్సు సమాప్తమైపోతుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top