23 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

November 22, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఈ డ్రామాలో మీరు హీరో-హీరోయిన్ పాత్రధారులు, మొత్తం కల్పంలో మీ వంటి హీరో పాత్ర ఇంకెవ్వరికీ లేదు”

ప్రశ్న: -

మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పరీక్షలో ఎవరు పాస్ అవ్వగలరు?

జవాబు:-

ఎవరైతే ఫాలో ఫాదర్ చేస్తూ తండ్రి సమానంగా పవిత్రంగా అవుతారో, వారే ఈ పరీక్షలో పాస్ అవ్వగలరు. 21 జన్మల అనంతమైన వారసత్వం లభిస్తుంది కనుక తప్పకుండా కాస్త శ్రమ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు శ్రమ చేయకపోతే కల్ప-కల్పానికి చేయరు, అప్పుడు ఉన్నత పదవిని ఎలా పొందుతారు. పవిత్రంగా అయినట్లయితే మంచి పదవిని పొందుతారు, లేదంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలతో బాబా సమ్ముఖంగా మాట్లాడుతున్నారు. మాతో అనంతమైన తండ్రి మాట్లాడుతున్నారని పిల్లలు అర్థం చేసుకుంటారు. వారు అందరికంటే అతి మధురమైనవారు. తండ్రి కూడా మధురంగా ఉంటారు, టీచరు కూడా మధురంగా ఉంటారు ఎందుకంటే ఇరువురి నుండి వారసత్వం లభిస్తుంది. గురువు నుండి భక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. ఇక్కడైతే ఒక్కరి నుండే మూడు లభిస్తాయి. సంతోషం కూడా కలుగుతుంది. మీరు వారి సమ్ముఖంగా కూర్చున్నారు. అనంతమైన తండ్రి, ఎవరినైతే పతితపావనుడని అంటారో, వారే మనుష్య సృష్టికి బీజరూపుడని మీకు తెలుసు. ఆ బీజము జడమైనది, వీరు చైతన్యమైనవారు. వారిని సత్ చిత్ ఆనంద స్వరూపుడని అంటారు. వారికి మహిమ కూడా ఉంది. వారు జ్ఞానసాగరుడు. కానీ వారి నుండి ఏ జ్ఞానం లభిస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఎవరికైతే తండ్రి జ్ఞానాన్ని ఇస్తున్నారో, వారే భక్తి మార్గంలో వీరి మందిరాలు, శాస్త్రాలు మొదలైనవి తయారుచేస్తారని మీకు తెలుసు. తప్పకుండా ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత కల్పం యొక్క ఈ సంగమం వస్తుందని కూడా మీకు తెలుసు. దీనిని ఆత్మిక అవినాశీ పురుషోత్తమ సంగమయుగమని అంటారు. వాస్తవానికి ఉత్తమ పురుషులైతే చాలా మంది ఉంటారు. కానీ వారు ఒక్క జన్మలో ఉత్తమ పురుషులుగా అవుతారు, తర్వాత మధ్యములుగా, కనిష్ఠులుగా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులను చూడండి, ఎంత ఉత్తమ పురుషులుగా ఉన్నారు. వీరు పురుషోత్తముడు మరియు పురుషోత్తమని. ఇరువురిని అటువంటి ఉత్తములుగా ఎవరు తయారుచేసారు? భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైనవారు, వారు పైన ఉంటారు అని అంటూ ఉంటారు. మనుష్య సృష్టిలో ఉన్నతాతి ఉన్నతమైనవారు ఈ విశ్వ మహారాజు-మహారాణి. ఉన్నతాతి ఉన్నతమైన భారత్ లో రాజ్యం చేసేవారు. ఇప్పుడు వారు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు, ఇది ఎవ్వరికీ తెలియదు. మిమ్మల్ని ఇంత ఉన్నతంగా తయారుచేసే తండ్రి ఎంత మధురంగా అనిపించాలి. వారి మతాన్ని అనుసరించాలి. అంత ఉన్నతంగా, విశ్వానికి యజమానులుగా తయారుచేసే తండ్రి ఎంత సాధారణ రీతిలో చదివిస్తున్నారు. అనంతమైన తండ్రి భారత్ లో వస్తారని కూడా మీకు తెలుసు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. వారు వచ్చి భారత్ ను స్వర్గంగా తయారుచేస్తారు. స్వర్గవాసులుగా ఉన్న మేము 84 జన్మలను అనుభవించి నరకవాసులుగా అయ్యామని ఇప్పుడు స్మృతి కలిగింది. తండ్రి మళ్ళీ స్వర్గవాసులుగా తయారుచేయడానికి వచ్చారు. ఇప్పుడు తండ్రి అంటారు – నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతుంది. సతోప్రధానంగా అవ్వకుండా తిరిగి ఎవ్వరూ వెళ్ళలేరు, లేదంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. శిక్షలు కూడా ఆత్మకే లభిస్తాయి కదా. గర్భ జైలులో శరీరాన్ని ధరింపజేసిన తర్వాత శిక్షలు ఇస్తారు. పిల్లలు చాలా దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది, త్రాహి-త్రాహి అంటారు (దుఃఖములో రక్షణ కోసం అలమటిస్తారు). ఇక మళ్ళీ పాపం చేయము అని అంటారు. పిల్లలైన మీరు గర్భ జైలులోకి వెళ్ళకూడదు. అక్కడ గర్భ మహలు ఉంటుంది ఎందుకంటే పాపముండదు. ఇక్కడ రావణ రాజ్యంలో పాపముంటుంది, అందుకే రామ రాజ్యాన్ని కోరుకుంటారు. కానీ రావణ రాజ్యం అంటే ఏమిటో వారికి తెలియదు. రావణుడిని కాలుస్తున్నారు కనుక సమాప్తమవ్వాలి. కానీ మళ్ళీ-మళ్ళీ కాలుస్తారు అంటే అతడు ఇంకా మరణించలేదు. మరి ఇవన్నీ చేయడం వలన లాభమేమిటి? వారు వెళ్ళి లంకను దోచుకొని వస్తారు. ఒక వృక్షానికి వ్యాధి ఉంటుంది, దానిని బంగారం అనుకొని తీసుకువస్తారు. వాస్తవానికి మీరు ఈ సమయంలో రావణునిపై విజయాన్ని పొందుతారు మరియు స్వర్ణిమ యుగానికి యజమానులుగా అవుతారు. అజ్మీర్ లో వైకుంఠం మోడల్ ను తయారుచేసారు. బాబా పిల్లలను మళ్ళీ స్వర్గానికి యజమానులుగా తయారుచేయడానికి వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. మనం వజ్ర-వైఢూర్యాల మహళ్ళలో రాజ్యం చేస్తాము.

ఇప్పుడు పిల్లలైన మీరు యోగబలంతో నిర్వికారీగా, సతోప్రధానంగా అవుతారు. ఆత్మ సంపూర్ణ నిర్వికారీగా అయి మళ్ళీ శాంతిధామానికి వెళ్ళిపోతుంది, అక్కడ దుఃఖమన్న మాటే లేదు. ఈ నాటకంలో మీది అందరి కన్నా పెద్ద పాత్ర, ముఖ్యమైన హీరో-హీరోయిన్ల పాత్ర అని బాబా అర్థం చేయించారు. రాజ్యాన్ని తీసుకోవడము మరియు పోగొట్టుకోవడము – ఇది ఆట. మీరే హీరో-హీరోయిన్లు. హీరో అంటే ముఖ్యమైన పాత్రధారి అని అర్థము. మీరు స్వర్ణిమ యుగంలో పవిత్ర గృహస్థ ఆశ్రమంలో ఉండేవారు. ఇనుప యుగంలో అపవిత్ర గృహస్థ వ్యవహారముంది. ఇప్పుడు బాబా స్వర్ణిమ యుగంలోకి తీసుకువెళ్తారు. అక్కడ సూర్యవంశీయులైన లక్ష్మీ-నారాయణుల రాజ్యముంటుంది. వారు పునర్జన్మలు తీసుకొని చంద్రవంశంలోకి వస్తారు, వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని కోట్ల మంది అయిపోయారు. ఇప్పుడిక జనాభా తగ్గాలి అని అంటారు. ఎవరికైతే ఒకరిద్దరు పిల్లలే ఉంటారో, వారు ఆపరు కదా. జనాభాను తగ్గించడమైతే తండ్రి చేతిలో ఉంది అనే వార్తను ఇప్పుడు మీరు చెప్పవచ్చు. ఎక్కువ మంది మనుష్యులు ఉంటే, మరణిస్తారని తండ్రికి తెలుసు. నేను అందరినీ సమాప్తం చేసి ఏక ధర్మ స్థాపన చేయడానికి వచ్చాను. అక్కడ 9 లక్షల మంది ఉంటారు. ఇది ఛూ మంత్రము (ఇంద్రజాలం) కదా. కలియుగం రూపీ రాత్రి పూర్తయి పగలు మొదలవుతుంది. జనాభా నియంత్రణ కోసం ఎంత ఖర్చు చేస్తారు. తండ్రి వద్ద ఎలాంటి ఖర్చు లేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి, అంతా సమాప్తమైపోతుంది, డ్రామాలో నిశ్చయించబడి ఉంది. వారు ఏ ప్లాన్లనైతే తయారుచేస్తున్నారో, అవి కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉన్నాయి. యూరోప్ వాసులు యాదవులు, భారతవాసులు కౌరవులు మరియు పాండవులు. వారంతా ఒకవైపు ఉన్నారు, ఇటు వైపు ఇరువురు సోదరులు ఉన్నారు. భారత్ లో సోదరులున్నారు. ఇప్పుడు కలియుగంలో సోదరులుగా ఉన్న మీరు సంగమంలోకి వచ్చారు. కౌరవులు మరియు పాండవులు ఒకే ఇంటి వారు. వాస్తవానికి ఆత్మలందరూ పరస్పరంలో సోదరులు. ఆత్మలైన మిమ్మల్నే బాబా మొట్టమొదట కలిసారు. ఎవరైతే రేస్ లో మొట్టమొదట చేరుకుంటారో, వారు బహుమతిని తీసుకుంటారు. మీది స్మృతి యొక్క పరుగు. ఇది ఏ శాస్త్రాలలోనూ లేదు. తండ్రి అంటారు – నాతో యోగం జోడించండి. ఈ యోగం యొక్క యాత్ర ఈ సమయంలోనే ఉంటుంది. ఈ యాత్రను ఇంకెవ్వరూ నేర్పించలేరు. సత్యయుగంలో ఆత్మిక యోగము ఉండదు, శారీరక యోగము ఉండదు – అక్కడ అవసరమే ఉండదు. ఈ విషయం ఈ సమయంలో మీ బుద్ధిలో కూర్చుంటుంది. డ్రామాలోని ఒక్కొక్క సెకెండు యొక్క పాత్రను అర్థం చేయించారు, దీనిని స్వదర్శన చక్రమని అంటారు. వాస్తవానికి స్వదర్శన చక్రధారులుగా మీరిప్పుడు అవుతారు. మీకు 84 జన్మలు మరియు సృష్టి చక్రం యొక్క జ్ఞానం ఉంది. స్వ అనగా ఆత్మ. ఆత్మకు ఈ జ్ఞానముంది కనుక ఇప్పుడు పిల్లలైన మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. నేను మిమ్మల్ని ఆత్మిక పిల్లలు, స్వదర్శన చక్రధారీ బ్రాహ్మణ కుల భూషణులు అని అంటాను. ఈ పదాల అర్థాన్ని కొత్తవారెవ్వరూ అర్థం చేసుకోలేరు. మీకు ఈ అలంకారాలను ఇవ్వరు ఎందుకంటే మీలో చాలా మంది పారిపోతారు. ఇప్పుడు మీ బుద్ధిలో 84 జన్మల చక్రముంది. ఇప్పుడు నంబరువన్ లోకి వెళ్తారు. ముందు ఇంటికి వెళ్ళి తర్వాత దేవతలుగా అవుతారు. ఆ తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. ఇది ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఎవరైనా ఈ మాత్రం గుర్తు చేసుకున్నా, అహో సౌభాగ్యము. ఇంకా కొద్ది సమయమే ఉంది. తర్వాత మనం స్వర్గంలోకి వెళ్తాము. ఇకపోతే, శాస్త్రాలలో చాలా కట్టుకథలను రాసారు. అందరికీ ప్రియమైన కృష్ణుని గురించి కూడా రాసారు – పాము కాటేసింది, ఇలా జరిగింది….. అని. కృష్ణుడు రాధ కన్నా ప్రియంగా అనిపిస్తారు ఎందుకంటే మురళీ వాయించారు. ఇది వాస్తవానికి జ్ఞానానికి సంబంధించిన విషయము. ఈ సమయంలో మీరు జ్ఞాన-జ్ఞానేశ్వరీలు. ఇప్పుడు చదువుకొని, రాజ-రాజేశ్వరీలుగా అవుతారు. ఇది లక్ష్యము-ఉద్దేశ్యము. ఇక్కడి ఉద్దేశ్యమేమిటి అని కొంతమంది మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు చెప్పండి – మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడము అని. మనమే దేవతలుగా ఉండేవారము. 84 జన్మల తర్వాత శూద్రులుగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యాము, తర్వాత దేవతలుగా అవుతాము. చదివించేవారు జ్ఞాన సాగరుడైన పరమాత్మ, కృష్ణుడు కాదు. ఈ రాజయోగాన్ని ఎవ్వరూ నేర్పించలేరు. మీరంటారు – బాబా, మేము కల్ప-కల్పము వచ్చి మీ నుండి రాజ్య-భాగ్యాన్ని తీసుకుంటాము. ఈ విషయం కూడా మీకు తెలుసు. ఈ మహాభారీ యుద్ధంతోనే స్వర్గం యొక్క గేట్లు తెరుచుకోనున్నాయి. బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు కనుక తప్పకుండా స్వర్గం కావాలి. నరకం సమాప్తమవ్వాలి. ఈ మహాభారీ యుద్ధం గురించి శాస్త్రాలలో ఉంది.

(దగ్గు వచ్చింది) ఇది ఎవరికి వచ్చింది? శివబాబాకా లేక బ్రహ్మాబాబాకా? (బ్రహ్మాకు) ఇది కర్మభోగము. చివరి వరకు వస్తూనే ఉంటుంది, సంపూర్ణంగా అయ్యేంతవరకు వస్తుంది, అప్పుడిక ఈ శరీరం కూడా ఉండదు. అప్పటివరకు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, దీనినే కర్మభోగమని అంటారు. సత్యయుగంలో కర్మభోగముండదు. అనారోగ్యాలు మొదలైనవేవీ ఉండవు. మనం సదా ఆరోగ్యవంతులుగా – సదా ఐశ్వర్యవంతులుగా అవుతాము. సదా హర్షితంగా ఉంటాము ఎందుకంటే అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. మళ్ళీ అర్ధకల్పం తర్వాత దుఃఖం మొదలవుతుంది. అది కూడా ఎప్పుడైతే భక్తి వ్యభిచారిగా అవుతుందో, అప్పుడు దుఃఖం ఎక్కువవుతుంది. అప్పుడు త్రాహి-త్రాహి అంటారు మరియు తర్వాత వినాశనం జరుగుతుంది. ఇప్పుడు మీరు సమ్ముఖంగా వింటుంటే, ఎంత మజా అనిపిస్తుంది. వీరు మన సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సత్యమైన సద్గురువని తెలుసు. ఈ మహిమ ఒక్క నిరాకార తండ్రిది మాత్రమే. వారు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు. ఆ తండ్రిని స్మృతి చేసినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. వీరు సాధు-సత్పురుషులు, మహాత్ముల వలె సింహాసనంపై కూర్చోరు. ఎప్పుడూ కాళ్ళకు కూడా నమస్కరించనివ్వరు. తండ్రి అంటారు – నేను మీ వినమ్రుడైన సేవకుడను. నాకు కాళ్ళు ఎక్కడున్నాయి? ఇక మీరు దేనికి తల వంచి నమస్కరిస్తారు? చాలా మంది గురువుల ముందు తల వంచి నమస్కరిస్తూ-నమస్కరిస్తూ మీ నుదురే అరిగిపోయింది. ఏదైతే భక్తి మార్గంలో ఉంటుందో, అది జ్ఞాన మార్గంలో ఉండదు. భక్తి మార్గంలో ఓ రామా….. అని అంటారు. ఇక్కడ ఏ శబ్దము చేయకూడదని తండ్రి అంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ గుప్తంగా తండ్రిని స్మృతి చేయాలి. ఓ శివా….. అని కూడా అనకూడదు. మీరు శబ్దానికి అతీతంగా వెళ్ళాలి. పిల్లలకు లోలోపల తండ్రి స్మృతి ఉంటుంది. వీరు మా బాబా అని ఆత్మకు తెలుసు. మీరు లోలోపల గుప్తంగా స్మృతి చేయాలి, దీనిని అజపాజప (నిరంతర) స్మృతి అని అంటారు. ఇక్కడ జపం చేయకూడదు. మాలను లోపల తిప్పినా లేక బయట తిప్పినా, విషయం ఒక్కటే. లోపల తిప్పడాన్ని గుప్తమని ఏమీ అనరు. గుప్తమైన విషయమేమిటంటే – స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడము. వారు శివబాబా, వీరు ప్రజాపిత బ్రహ్మా. మీకు డబల్ ఇంజన్ లభిస్తుంది అలంకరించబడటానికి. వీరి ఆత్మ కూడా అలంకరించబడుతుంది. తర్వాత అందరూ పుట్టింటికి వెళ్తారు. అక్కడి నుండి మళ్ళీ అత్తవారింటికి, విష్ణుపురిలోకి వస్తారు. ఇది డబల్ పుట్టినిల్లు – అలౌకికమైనది. అది లౌకికమైనది, ఇంకొకటి పారలౌకికమైనది. ఈ అలౌకిక తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు, అందుకే ఈ దాదాను ఎందుకు కూర్చోబెట్టారని అంటారు. ఈ తనువు ద్వారా పరమాత్మ చదివిస్తున్నారని ఎవ్వరికీ తెలియదు. వీరు అనేక జన్మల అంతిమంలో పూజ్యుని నుండి పూజారిగా అయ్యారు. రాజు నుండి నిరుపేదగా అయ్యారు. బాబా అర్థం చేయిస్తారు – ఈ తనువులో నేను ప్రవేశిస్తాను. అయినా ఎవ్వరి బుద్ధిలోను కూర్చోదు. మందిరాలలో ఎద్దును పెట్టారు. ఇప్పుడు శంకరుడైతే సూక్ష్మవతనవాసి. సూక్ష్మవతనంలో ఎద్దులు మొదలైనవి ఉండనే ఉండవు. ఎద్దు అనగా మేల్ (పురుషునికి గుర్తు). భగీరథుడిని పురుషునిగా చూపిస్తారు. మనుష్యులు పూర్తిగా తెలివిహీనులుగా అయిపోయారు. రావణుడు తెలివిహీనులుగా చేసాడని తండ్రి అంటారు. రామరాజ్యం కావాలని తమంతట తామే అంటారు. ఇప్పుడు రామరాజ్యమైతే సత్యయుగంలో ఉంటుంది. కలియుగంలో రావణ రాజ్యముంటుంది. రాముడు మరియు రావణుడు భారత్ లోనే ఉంటారు. శివ జయంతిని కూడా భారత్ లోనే జరుపుకుంటారు. రావణ జయంతిని జరుపుకోరు ఎందుకంటే అతడు శత్రువు. ఎవరైతే సుఖాన్ని ఇస్తారో, వారి జయంతినే జరుపుకుంటారు. ఇప్పుడు శివబాబా వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు మరియు రావణుడిపై విజయాన్ని ప్రాప్తింపజేస్తారు. రావణుడు ఎవరు, ఎప్పుడు వస్తారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఏక్యురేట్ లెక్కను తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాలను మంచి రీతిగా ధారణ చేయండి, మర్చిపోకండి. జ్ఞాన సాగరుని వద్దకు మేఘాలై వచ్చారు. నింపుకొని వర్షాన్ని కురిపించాలి. ధారణ చాలా బాగుండాలి. ఇక్కడ మీరు సమ్ముఖంగా కూర్చున్నారు. మేము అనంతమైన తండ్రి సమ్ముఖంగా, ఇంట్లో కూర్చున్నామని అనుభూతి కలుగుతుంది. మీరు బ్రాహ్మణ కుల భూషణులు కూడా. మమ్మా, బాబా కూడా ఉన్నారు. బాబా మనల్ని టీచరు రూపంలో చదివిస్తున్నారు. సద్గురువు రూపంలో తమతో పాటు తీసుకువెళ్తారు. ఆ గురువులు తీసుకువెళ్ళరు. గురువు పని ఫాలోవర్స్ ను తమతో పాటు తీసుకువెళ్ళడము. వాస్తవానికి వారు ఫాలోవర్స్ కూడా కాదు. ఆ గురువులు సన్యాసులు, మరి ఆ గృహస్థులు ఫాలోవర్స్ ఎలా అవుతారు. మీరు శివబాబాను కూడా ఫాలో చేస్తారు, బ్రహ్మా బాబాను కూడా ఫాలో చేస్తారు. వీరు ఎలా తయారవుతారో, మీరు కూడా అలాగే తయారవుతారు. ఆత్మలమైన మనం పవిత్రంగా అయి బాబా వద్దకు వెళ్తాము. బాబా అంటారు – నన్నొక్కడినే స్మృతి చేయండి. సత్యాతి-సత్యమైన ఫాలోవర్స్ అంటే మీరు.

తండ్రి అంటారు – నేను మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకే వచ్చాను. ఇప్పుడు జ్ఞాన-చితిపై కూర్చున్నట్లయితే తీసుకువెళ్తాను. సత్యయుగంలో లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, ఆ సమయంలో మిగిలిన ధర్మాల వారంతా శాంతిధామంలో ఉండేవారు. ఈ విషయాలు చాలా సహజమైనవి. బాబాకు ఫాలోవర్స్ గా అవ్వండి. ఎంతగా పవిత్రంగా అవుతారో, అంత మంచి పదవిని పొందుతారు, లేదంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. వెళ్ళడమైతే తప్పకుండా వెళ్ళాలి, 21 జన్మల వారసత్వం లభిస్తుంది అన్నప్పుడు ఎందుకు శ్రమించకూడదు. ఇప్పుడు శ్రమించకపోతే, ఇక కల్ప-కల్పము శ్రమించరు. మరి ఉన్నత పదవిని ఎలా పొందుతారు. ఇది పెద్ద అనంతమైన క్లాసు. ఒకే పరీక్ష ఉంటుంది – మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వాలి. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క తండ్రికి సత్యాతి-సత్యమైన ఫాలోవర్స్ గా అయి పూర్తి పవిత్రంగా అవ్వాలి. 21 జన్మల వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేయాలి.

2. నోటితో ‘‘ఓ శివబాబా’’ అని కూడా అనకూడదు. శబ్దానికి అతీతంగా వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ లోలోపల తండ్రిని స్మృతి చేయాలి.

వరదానము:-

ఎవరైతే సూక్ష్మ ఆజ్ఞలను పాలన చేస్తారో, ఆ పిల్లలకే స్థూల ఆజ్ఞలను పాలన చేసే శక్తి వస్తుంది. సూక్ష్మమైన మరియు ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే – నిరంతరం స్మృతిలో ఉండండి మరియు మనసా-వాచా-కర్మణా పవిత్రంగా అవ్వండి. సంకల్పంలో కూడా అపవిత్రత లేక అశుద్ధత ఉండకూడదు. ఒకవేళ సంకల్పాలలోనైనా సరే, పాత అశుద్ధ సంస్కారాలు టచ్ చేసినట్లయితే, సంపూర్ణ వైష్ణవులు లేక సంపూర్ణ పవిత్రులు అని అనరు. అందుకే, ఒక్క సంకల్పం కూడా ఆజ్ఞ లేకుండా నడవకూడదు, అప్పుడు సంపూర్ణ ఆజ్ఞాకారులని అంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top