23 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

September 22, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మన్మనాభవ మంత్రాన్ని పక్కా చేయించండి, ఒక్క తండ్రినే సదా ఫాలో చేయండి - ఇదే తండ్రికి సహయోగులుగా అవ్వడము”

ప్రశ్న: -

పురుషోత్తములుగా అయ్యేందుకు సహజమైన మరియు శ్రేష్ఠమైన పురుషార్థం ఏమిటి?

జవాబు:-

ఓ పురుషోత్తములుగా అయ్యే పిల్లలూ – మీరు సదా శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండండి. ఒక్క తండ్రిని స్మృతి చేయండి, ఇంకే విషయంలోనూ జోక్యం చేసుకోకండి. తినండి, తాగండి, అన్నీ చేయండి కానీ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పురుషోత్తములుగా అవుతారు. ఎవరిపైనైతే బృహస్పతి దశ ఉందో, వారే పురుషోత్తములుగా అవుతారు. వారు ఎప్పుడూ శ్రీమతాన్ని ఉల్లంఘించరు. వారి ద్వారా ఎలాంటి తప్పుడు కర్మలు జరగవు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఓం నమః శివాయ…

ఓంశాంతి. ఈ మహిమ ఎవరిది? ఒక్క పరమపిత పరమాత్మది. ఎవరైతే మంచి పనులు చేస్తారో, వారికి తప్పకుండా మహిమ జరుగుతుంది. చెడు పనులు చేసేవారు నిందించబడతారు. ఉదాహరణకు అక్బర్ ను మహిమ చేసేవారు, ఔరంగజేబ్ ను నిందించేవారు. రాముడిని మహిమ చేస్తారు, రావణుడిని నిందిస్తారు. భారత్ లోనే రామ రాజ్యము, రావణ రాజ్యము ప్రసిద్ధమైనవి. రామ రాజ్యాన్ని పురుషోత్తమ రాజ్యమని మరియు రావణ రాజ్యాన్ని ఆసురీ రాజ్యమని అంటారు. పిల్లలకు ఇప్పుడే సంగమయుగం గురించి తెలిసింది. ఇది పురుషోత్తమ యుగము. ఈ భారత్ ను పురుషోత్తమంగా తయారుచేసే తీరాలి. ఇక్కడ నివసించే వ్యక్తులను కూడా పురుషోత్తములుగా తయారుచేయాలి మరియు నివసించే స్థానాన్ని కూడా పురుషోత్తమంగా తయారుచేయాలి. భారత్ నే స్వర్గము అని అంటారు, నివసించేవారిని దేవీ-దేవతలు, స్వర్గవాసులు అని అంటారు. కావున నివసించే స్థానం మరియు నివసించేవారు కూడా ఉత్తమంగా అవుతారు. కొత్త ప్రపంచం ఉత్తమంగా ఉంటుందని, పాత ప్రపంచం కనిష్ఠంగా ఉంటుందని అందరికీ తెలుసు. ప్రపంచం ఎలా ఉంటుందో, అందులో నివసించేవారు కూడా అలాగే ఉంటారు. కొత్త భారత్ , పాత భారత్ అని అంటూ ఉంటారు, ఇతర ఏ ఖండాన్ని కొత్త ఖండము అని అనరు. కొత్త ప్రపంచంలో కొత్త అమెరికా, కొత్త చైనా ఉంటాయని కాదు. కొత్త ప్రపంచంలో కొత్త భారత్ అని అంటారు, అందుకే ‘న్యూ ఇండియా’ అని అంటారు. కొత్త భారత్ అనే పేరు పెడతారు కానీ అర్థం లేకుండా పెడతారు. ఈ సమయంలో ‘న్యూ ఇండియా’ ఎక్కడ నుండి వచ్చింది! న్యూ ఇండియాలో ఢిల్లీ పరిస్తాన్ గా ఉంటుంది. ఇప్పుడు పరిస్తాన్ ఎక్కడుంది? పిల్లలైన మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు ఇక్కడకు వస్తారు. బృహస్పతి దశ ఉన్నతోన్నతమైనది. పురుషోత్తములుగా అవ్వడంతో బృహస్పతి దశ కూర్చొంటుంది. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసే అనంతమైన తండ్రి నుండి మనం అనంతమైన సుఖాన్ని తీసుకునే పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. సత్యయుగంలో పురుషోత్తములు ఉంటారు. తర్వాత కిందకు వస్తే, మధ్యములుగా, ఆ తర్వాత కనిష్టులుగా అయిపోతారు. ఇప్పుడు తండ్రి మనల్ని సతోప్రధానంగా, సత్యయుగ స్వర్గవాసులుగా, పురుషోత్తములుగా తయారుచేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇది చాలా-చాలా సహజము. దీని కోసం మందులు తీసుకోవాల్సిన పని లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం స్మృతి చేయాలి, అందుకే దీనిని ‘సహజ స్మృతి’ అని అంటారు. స్మృతి ద్వారానే పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా తయారవ్వాలి. అందరికీ ముక్తి తప్పకుండా లభించనున్నది. తండ్రి అంటారు – నేను సర్వుల సద్గతిదాతను, కావున మనుష్యుల శరీరాలు తప్పకుండా సమాప్తమైపోతాయి. ఇకపోతే, ఆత్మలను పవిత్రంగా తయారుచేసి తీసుకువెళ్తాను. తిరిగి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. తండ్రి ఏర్పాట్లు చేయిస్తున్నారు ఎందుకంటే ఆత్మ యొక్క రెక్కలు తెగిపోయాయి అనగా ఆత్మ తమోప్రధానంగా ఉంది. మీరు యోగబలంతో పవిత్రంగా అయ్యే శ్రమ చేస్తారు. ఎవరైతే శ్రమ చేయరో, వారు తమ లెక్కాచారాన్ని చూపించుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఆలోచించే విషయమేమీ లేదు. పిల్లల కర్తవ్యమేమిటంటే – తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి, తండ్రికి సహాయకులుగా అయి సహయోగం ఇవ్వాలి. తండ్రి సహయోగము ఉండాలి మరియు పిల్లల సహయోగము కూడా ఉండాలి. సహయోగం ఎలా ఇవ్వాలి అని తండ్రిని చూసి ఫాలో చేయండి. పురుషోత్తములుగా తయారయ్యేందుకు అందరికీ నా మంత్రాన్ని ఇస్తూ ఉండండి. తండ్రి కల్ప-కల్పము వచ్చి – నన్ను స్మృతి చేయకుండా పతితుల నుండి పావనంగా అవ్వలేరు అని చెప్తారు. నేనేమైనా గంగా స్నానం చేయిస్తానా? కేవలం ‘మన్మనాభవ’ అనే మహామంత్రాన్ని గుర్తు చేసుకోవాలి. దీని అర్థము – నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయి, పురుషోత్తములుగా అయి, స్వర్గానికి యజమానులుగా అవుతారు. స్త్రీ-పురుషులు ఇరువురూ పవిత్ర ప్రవృత్తి మార్గానికి యజమానులుగా అవుతారు. తండ్రి ఈ విషయాలన్నింటినీ వివరంగా అర్థం చేయిస్తారు. మీరు ప్రాక్టికల్ గా ఇలా తయారవుతారు. భగవంతుడు వచ్చి పిల్లలను పురుషోత్తములుగా తయారుచేసారని మీకు తెలుసు, అందుకే పతితులను పావనంగా చేసే పతిత-పావనా రండి అని పిలుస్తారు. పురుషోత్తమ మాసానికి చాలా మహిమను వినిపిస్తారు కదా. కావున ఈ పురుషోత్తమ యుగానికి చాలా మహిమ ఉంది. కలియుగం అనగా రాత్రి తర్వాత పగలు తప్పకుండా రావాలి. దుఃఖం తర్వాత సుఖం వస్తుంది. ఈ పదాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. స్త్రీ-పురుషులు ఇరువురూ ఉత్తమోత్తములుగా, శ్రేష్ఠాతి-శ్రేష్ఠంగా తయారవుతారు, ఎందుకంటే ఇది ప్రవృత్తి మార్గము. సత్యయుగం చాలా ప్రసిద్ధమైనది, దానినే సుఖధామం అని అనడం జరుగుతుంది. ఆ తర్వాత ద్వాపర యుగం వచ్చినప్పుడు మనుష్యులు సన్యాసాన్ని ధారణ చేసి ఉత్తములుగా తయారవుతారు, అందుకే పతిత మనుష్యులు వెళ్ళి వారికి తల వంచి నమస్కరిస్తారు. పవిత్రమైనవారి ముందు అపవిత్రమైనవారు తల వంచి నమస్కరిస్తారు. ఇది కామన్ విషయము. పతిత పావనుడైన తండ్రిని తెలుసుకోని కారణంగా పతిత-పావని అని గంగను పావనంగా భావించి, అక్కడకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. గంగ మరియు సాగరం యొక్క మేళా కూడా జరుగుతుంది. పిల్లలైన మీకు తండ్రి చాలా స్పష్టంగా అర్థం చేయిస్తారు, అయినప్పటికీ, తండ్రి అంటారు – కోట్లలో కొందరు, ఆ కొందరిలో కూడా కొందరు అర్థం చేసుకుంటారు అని. మళ్ళీ వారిలో కూడా కొంతమంది ఆశ్చర్యం కలిగేలా వింటారు, వినిపిస్తారు, విడాకులిస్తారు మరియు పారిపోతారు… డిస్సర్వీస్ చేసేవారిగా అయిపోతారు. సర్వీస్ మరియు డిస్సర్వీస్, రెండూ జరుగుతూ ఉంటాయి. తండ్రిని తెలుసుకోనివారు, చాలామంది పారిపోతారు కూడా. మీరు పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతారు. మళ్ళీ, పిల్లలే కూర్చొని విఘ్నాలను కలిగిస్తారు, డిస్సర్వీస్ చేస్తారు, అప్పుడు ఎంతటి మహా పాపమవుతుంది. రావణుడు అందరినీ మహాపాపులుగా తయారుచేస్తాడు. కానీ ఎవరైతే పిల్లలుగా అయి డిస్సర్వీస్ చేస్తారో, వారి కోసం ట్రిబ్యునల్ (న్యాయ సభ) కూర్చొంటుంది. భక్తి మార్గంలో ఇంత కఠినమైన శిక్షలు లభించవు కానీ ఇక్కడ తండ్రికి చెందినవారిగా అయి డిస్సర్వీస్ చేస్తే, తండ్రికి రైట్ హ్యాండ్ గా ధర్మరాజు ఉన్నారు. అందుకే తండ్రి అంటారు – పిల్లలూ, నా సేవలో సహాయకులుగా అయిన తర్వాత ఇక ఏ తప్పుడు పనులు చేయకండి, డిస్సర్వీస్ చేస్తే అబలలకు విఘ్నాలు కలుగుతాయి. మాతలపై బాబాకు దయ కలుగుతుంది. భగవంతుడు ద్రౌపదికి కాళ్ళు ఒత్తారు కదా. నన్ను వివస్త్రంగా చేస్తున్నారని ద్రౌపది పిలిచారు. బాబా మాతల తలపై కలశాన్ని పెడతారు. ముందు మాతలు, ఆ తర్వాత పురుషులు. కానీ ఈ మధ్యన పురుషులలో చాలా గర్వం ఉంటుంది – నేను స్త్రీకి గురువును, పతిని, ఈశ్వరుడను, స్త్రీ నాకు దాసి అని. కానీ ఇక్కడ తండ్రి నిరహంకారిగా అయి మాతలకు కాళ్ళు కూడా ఒత్తుతారు. మీరు అలసిపోయారు. నేను మీ అలసటను దూరం చేసేందుకు వచ్చాను. మాతలైన మిమ్మల్ని అందరూ తిరస్కరించారు. సన్యాసులు స్త్రీలను వదిలి వెళ్ళిపోతారు. కొందరికి 5-7 మంది పిల్లలుంటారు, వారిని సంభాళించలేకపోతే విసిగిపోయి పారిపోతారు. రచనను రచించి, వారిని భ్రమించేలా చేసి వెళ్ళిపోతారు. తండ్రి అంటారు – నేను ఎవ్వరినీ భ్రమించేలా చేయడం లేదు. నేను అందరికీ దుఃఖహర్త, సుఖకర్తను. మాయ వచ్చి దుఃఖితులుగా చేస్తుంది. ఇది కూడా ఒక ఆట. అజ్ఞాన కాలంలో మనుష్యులు – సుఖ-దుఃఖాలను భగవంతుడే ఇస్తారని భావిస్తారు, కానీ తండ్రి అయిన ఈశ్వరుడు ఈ వ్యాపారం చేయరు. ఇది కర్మల అనుసారంగా తయారై తయారవుతున్న డ్రామా, ఎవరు ఎలాంటి కర్మలు చేస్తే, అలాంటి ఫలాన్ని పొందుతారు. ఇది శ్రేష్ఠ కర్మలు చేసే సమయము. గతంలో చేసిన కర్మలకు ఇప్పుడు పశ్చాత్తాపపడడం కాదు. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా, దివాలా తీసినా, వారు ఆ కర్మలకు పశ్చాత్తాపపడతారు. పిల్లలైన మీరు ఎంత సౌభాగ్యశాలిగా అవుతారు, మీరు 21 జన్మలు కోసం చేసిన కర్మలకు పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉండదు. ఇది ఎంత భారీ ఫలము. కావున తండ్రి శ్రీమతాన్ని అనుసరించాలి. తండ్రి ఇతర ఏ విషయాలలోనూ జోక్యం చేసుకోరు. తినండి, తాగండి, ఏదైనా చేయండి, కానీ కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. మీరు – మేము పతితులము అని అంటారు, కావున పావనంగా అయ్యేందుకు తండ్రి ఏ యుక్తులనైతే చెప్తారో, వాటిని అనుసరించండి. కేవలం స్మృతి చేసే విషయంలో శ్రమ ఉంటుంది. మాయా తుఫానులకు భయపడకూడదు. ఇది గుప్తమైన శ్రమ. జ్ఞానం కూడా గుప్తమైనది, మురళి వినిపించడము ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కానీ ఈ వాణి ద్వారా మీరు పావనంగా అవ్వరు. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. కనుక అనంతమైన తండ్రిని స్మృతి చేయండి మరియు వారికి సహాయకులుగా కూడా అవ్వాలి. ఆత్మిక హాస్పిటల్ మరియు యూనివర్సిటీని తెరిచే పురుషార్థం కూడా చేయండి. ఏదైనా మంచి స్థానముంటే, అక్కడకు వెళ్ళి భాషణ చేయండి. మీరు చేతిలో పుస్తకం తీసుకోకూడదు. మీలో మొత్తం జ్ఞానమంతా ఉంది, ఇకపోతే అర్థం చేయించేందుకు వృక్షము, త్రిమూర్తి, సృష్టి చక్రం యొక్క రహస్యాలను అందరికీ అర్థం చేయించాలి. నేను బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను రచిస్తానని తండ్రి అంటారు. బ్రాహ్మణుల లక్ష్యము-ఉద్దేశ్యము అయిన విష్ణువు నిలబడి ఉన్నారు. అలా తయారుచేసే టీచర్ ఆ నిరాకారుడు. బ్రహ్మా ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన….. అని అంటూ ఉంటారు. కల్పక్రితం కూడా ఇటువంటి చిత్రాలనే తయారుచేయించారు. సైన్సు మొదలైనవాటితో ఎన్ని మిస్సైల్స్ తయారుచేస్తారో చూడండి. పిల్లలైన మీకు పురుషోత్తములుగా అయ్యేందుకు కూడా శ్రమ అనిపిస్తుంది, ఎందుకంటే జన్మ-జన్మల భారం తలపై ఉంది. సెకండులో నిశ్చితార్థం అవుతుంది, ఇక ఆత్మలు తండ్రిని స్మృతి చేయాలి, దీని ద్వారా తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు.

తండ్రి అంటారు – మన్మనాభవ, మీరు కర్మయోగులు. స్మృతి చార్టు పెట్టుకోవాలి. మీకు మాయతో యుద్ధం జరుగుతుంది. ఇది చాలా కఠినమైన యుద్ధము. మీరు స్మృతిలో ఉండేందుకు ప్రయత్నిస్తారు, మాయ స్మృతిని దూరం చేసేస్తుంది. జ్ఞానంలో ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఆత్మలో 84 జన్మల సంస్కారాలు నిండి ఉన్నాయి. ఇది అనాదిగా తయారై తయారవుతున్న డ్రామా. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది సమాప్తమయ్యేది కాదు. సృష్టిని ఎందుకు రచించారు అన్న ప్రశ్నే తలెత్తదు. ఆత్మ ఎలా మారుతుంది. కొత్త ఆత్మ ఎక్కడ నుండి రాదు. ఆత్మలు ఏవైతే ఉన్నాయో, అవే ఉంటాయి. ఎక్కువ, తక్కువ అవ్వవు. పాత్రధారులంతా పూర్తిగా ఉన్నారు. మీరు అనంతమైన పాత్రధారులు, మీరు ఎంతమందినైతే చూస్తున్నారో, అంతమంది పాత్రధారులు డ్రామాలో ఉన్నారు, మళ్ళీ అంతమందే ఉంటారు. ఎవ్వరూ మోక్షం పొందరు. మనుష్యులు ఆవాగమన (వచ్చి-వెళ్ళే) చక్రం నుండి విడుదల అవ్వాలని కోరుకుంటారు కానీ అవ్వలేరు. ఎవరైతే పాత్రను అభినయించేందుకు వస్తారో, వారికి మళ్ళీ రావాల్సి ఉంటుంది. తండ్రి అంటారు – నాకు కూడా ఈ పతిత ప్రపంచంలోకి వచ్చి-వెళ్ళాల్సి ఉంటుంది. నేను కల్ప-కల్పము వస్తాను. నేనే రావాల్సి వస్తుంది అన్నప్పుడు, పిల్లలు రావడమనేది ఎలా ఆగిపోతుంది. మీరు 84 సార్లు శరీరంలోకి వస్తారు, నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. నేను రావడం-వెళ్ళడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే, మీ గతి-మతి మీకే తెలుసు….. అని పాడుతారు. సద్గతినిచ్చేందుకు ఏ మతమైతే ఉందో, అది మీకు మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. వారు పాడుతారు, కానీ మీరు ప్రత్యక్షంగా ఉన్నారు. ముఖ్యమైన విషయం స్మృతికి సంబంధించింది, ఇంకా అంధులకు చేతికర్రగా అవ్వాలి. ఇది పురుషోత్తమ యుగము. ఇది 5 వేల సంవత్సరాల తర్వాత వస్తుంది. పురుషోత్తమ మాసం మూడు సంవత్సరాల తర్వాత వస్తుంది. అదంతా భక్తి మార్గము. వారి మంత్ర-తంత్రాల పుస్తకాలు అనేకమున్నాయి. ఇక్కడ ఆ విషయాలేవీ లేవు. భక్తి చేయనివారిని అధర్మయుక్తమైనవారు అని అంటారు. కావున వారిని సంతుష్టపరిచేందుకు నిమిత్తంగా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తారు – మధురమైన పిల్లలూ, ఎప్పుడూ డిస్సర్వీస్ చేసే పురుషార్థం చేయకూడదు. ఎవరైనా ద్రోహులుగా అయితే, వారిని అజామిళుడు అని అంటారు. అజామిళుడు, సూరదాసు మొదలైనవారి కథలు ఎన్ని ఉన్నాయి. ఇదంతా భక్తి మార్గము. వారికంటే పెద్ద పాపాత్ములు ఎవరంటే – ఇక్కడకు వచ్చి, నా పిల్లలుగా అయి నాకు విడాకులిచ్చేవారు. ఎవరైతే నన్ను నిందలపాలు చేస్తారో, వారి కోసం ట్రిబ్యునల్ కూర్చొంటుంది. ప్రతిజ్ఞ చేసి మళ్ళీ డిస్సర్వీస్ చేస్తే కఠినమైన శిక్ష లభిస్తుంది. పదవి ఉన్నతమైనది కావున తప్పులకు కూడా కఠినమైన శిక్షలు ఉంటాయి. అందుకే, ఏ ఆజ్ఞను ఉల్లంఘించకూడదు. సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నతమైన స్థానాన్ని పొందలేరని అంటారు, అనగా నరుని నుండి నారాయణునిగా అయ్యే లక్ష్యాన్ని పొందలేరు. గురువులకు నింద తీసుకొచ్చేవారు ఉన్నతమైన స్థానాన్ని పొందలేరని మీరు అంటారు కదా, మరి ఆ స్థానమేమిటి అని మీరు గురువులను అడుగవచ్చు. వారు ఆ స్థానం గురించి చెప్పలేరు. తండ్రి టైటిల్ ను వారు తమపై పెట్టుకున్నారు. ఒకవేళ పూర్తిగా చదువుకోకపోతే ఉన్నత పదవిని కూడా పొందలేరని టీచర్ అంటారు. పావనంగా అయి దేవీ-దేవతలుగా అవ్వాలి. ఇక్కడ పావనమైనవారు ఎవరూ ఉండరు. ఇప్పుడు అందరూ పావనంగా అవ్వాలి. 21 జన్మల కోసం రాజ్య భాగ్యం లభిస్తుంది కావున కేవలం ఈ ఒక్క అంతిమ జన్మలో పావనంగా అవ్వాలి, ఇది ఎంత పెద్ద ప్రాప్తి. ప్రాప్తి లేకపోతే ఇలాంటి పురుషార్థం చేస్తారా? కానీ మాయ ఎటువంటిదంటే, అది ఉన్నత ప్రాప్తిలో కూడా విఘ్నాలు కలిగిస్తుంది మరియు కింద పడేస్తుంది. అహో మమ మాయా… అచ్ఛా!

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. డిస్సర్వీస్ జరిగే విధంగా ఏ కార్యము చేయకూడదు. తండ్రికి నింద తీసుకొచ్చే కర్మలేవీ చేయకూడదు. ఆజ్ఞల ఉల్లంఘన నుండి రక్షించుకోవాలి, పురుషోత్తములుగా అవ్వాలి.

2. మాయా తుఫానులకు భయపడకూడదు, పావనంగా అయ్యేందుకు స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి.

వరదానము:-

తండ్రి సమానంగా లైట్-మైట్ హౌస్ గా అయ్యేందుకు ఏ విషయాన్ని చూసినా లేక విన్నా, దాని సారాన్ని తెలుసుకొని ఒక్క సెకండులో ఇముడ్చుకొనే లేక పరివర్తన చేసుకునే అభ్యాసం చేయండి. ఎందుకు, ఏమిటి అనే విస్తారంలోకి వెళ్ళకండి ఎందుకంటే ఏ విషయం యొక్క విస్తారంలోకైనా వెళ్ళినట్లయితే, సమయము మరియు శక్తులు వ్యర్థమైపోతాయి. కనుక విస్తారాన్ని ఇముడ్చుకొని సారంలో స్థితులయ్యే అభ్యాసం చేయండి – దీని ద్వారా ఇతర ఆత్మలకు కూడా ఒక్క సెకండులో మొత్తం జ్ఞానం యొక్క సారమంతటినీ అనుభవం చేయించగలరు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top