24 April 2021 TELUGU Murli Today – Brahma Kumaris

April 23, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు ఏ హద్దులు లేనటువంటి ప్రపంచానికి యజమానులుగా అవుతారు, యోగబలంతో మొత్తం విశ్వం యొక్క రాజ్యాధికారాన్ని తీసుకోవడము కూడా అద్భుతము”

ప్రశ్న: -

డ్రామా యొక్క ఏ బంధనంలో తండ్రి కూడా బంధించబడి ఉన్నారు?

జవాబు:-

బాబా అంటారు – నేను పిల్లలైన మీ సమ్ముఖంలోకి రావాల్సిందే, నేను ఈ బంధనంలో బంధించబడి ఉన్నాను. నేను రానంత వరకు చిక్కుముడి విడిపోదు. అంతేకానీ, నేను మీపై ఎటువంటి కృపను చూపించేందుకు గానీ, ఆశీర్వదించేందుకు గానీ రాను. నేనేమీ మరణించిన వారిని బ్రతికించను. నేను మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా చేసేందుకు వస్తాను.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మిమ్మల్ని పొంది మేము….. (తుమ్హే పాకే హమ్నే…..)

ఓంశాంతి. పాటలోని పదాలను విని పిల్లలైన మీ రోమాలు నిక్కబొడుచుకోవాలి, ఎందుకంటే మీరు సమ్ముఖంలో కూర్చొన్నారు. మొత్తం ప్రపంచంలో ఎంతమంది విద్వాంసులు, పండితులు, ఆచార్యులు ఉన్నప్పటికీ, అనంతమైన తండ్రి ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తారని మనుష్య మాత్రులెవ్వరికీ తెలియదు. ఇది పిల్లలకు మాత్రమే తెలుసు. నేను ఏమై ఉన్నా, ఎలా ఉన్నా, మీ వాడిని – అని పిల్లలు అంటారు. మీరు ఏమై ఉన్నా, ఎలా ఉన్నా, నా పిల్లలే అని తండ్రి కూడా అంటారు. వారు ఆత్మలందరికీ తండ్రి అని మీకు కూడా తెలుసు. వారిని అందరూ పిలుస్తారు. రావణుని నీడ ఎంతగా ఉందో చూడండి అని తండ్రి అర్థం చేయిస్తారు. ఎవరినైతే మనం పరమపిత పరమాత్మ అని అంటామో, వారిని పిత అని అనడంతో సంతోషం ఎందుకు కలగడం లేదు అనేది ఒక్కరు కూడా అర్థం చేసుకోలేరు. ఇది మర్చిపోయారు. ఆ బాబాయే మనకు వారసత్వాన్ని ఇస్తారు. ఇంత సహజమైన ఈ విషయాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోలేరని తండ్రి స్వయంగా అర్థం చేయిస్తారు. ఓ ఖుదా, హే రామా….. అని ఎవరినైతే మొత్తం ప్రపంచం పిలుస్తుందో, వారు వీరే అని తండ్రి అర్థం చేయిస్తారు. అలా పిలుస్తూ-పిలుస్తూ ప్రాణాలు వదిలేస్తారు. ఇక్కడ ఆ తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. మీ బుద్ధి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది. బాబా కల్పక్రితం వలె వచ్చి ఉన్నారు. కల్ప-కల్పము బాబా వచ్చి పతితుల నుండి పావనులుగా చేసి దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకువెళ్తారు. సర్వుల పతితపావనుడు తండ్రి అని మహిమ కూడా చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు వారి సమ్ముఖంలో కూర్చొన్నారు. మీరు మోస్ట్ బిలవెడ్ స్వీట్ చిల్డ్రన్ (అతి ప్రియమైన మధురమైన పిల్లలు). ఇది భారతవాసుల విషయమే. తండ్రి కూడా భారత్ లోనే జన్మ తీసుకుంటారు. నేను భారత్ లో జన్మ తీసుకుంటాను కావున తప్పకుండా భారతవాసులే ప్రియమనిపిస్తారు. అందరూ భగవంతుడినే స్మృతి చేస్తారు. ఎవరు ఏ ధర్మానికి చెందినవారో, వారు తమ ధర్మస్థాపకుడిని స్మృతి చేస్తారు. మేము ఆది సనాతన ధర్మానికి చెందినవారిగా ఉండేవారమని భారతవాసులకే తెలియదు. భారత్ యే ప్రాచీన దేశము అని బాబా అర్థం చేయిస్తారు. అప్పుడు వారు, కేవలం భారత్ యే ఉండేదని ఎవరు చెప్పారు అని అడుగుతారు. చాలా మాటలు వింటారు. ఒకరు ఒకటి చెప్తారు, ఇంకొకరు ఇంకొకటి చెప్తారు. కొందరు అంటారు – ‘గీతను శివ పరమాత్మయే గాయనం చేసారని ఎవరు చెప్పారు, కృష్ణుడు కూడా పరమాత్మయే కదా, వారు గాయనం చేసారు. పరమాత్మ సర్వవ్యాపి. ఈ ఆటంతా వారిదే. ఇవన్నీ భగవంతుని రూపాలు. భగవంతుడే అనేక రూపాలను ధరించి లీలలు చేస్తారు. భగవంతుడు ఏది కావాలనుకుంటే అది చేయగలరు.’ మాయ కూడా ఎంత ప్రబలమైనది అనేది పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. బాబా, మేము తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటాము, నరుని నుండి నారాయణునిగా అవుతామని ఈ రోజు అంటారు. రేపు ఇక్కడ ఉండరు. ఎంతమంది వెళ్ళిపోయారు, విడాకులిచ్చేసారు అనేది కూడా మీకు తెలుసు. వారు మమ్మాను కారులో తీసుకువెళ్ళేవారు, వారు ఈ రోజు లేరు. ఇటువంటి మంచి-మంచి వారు కూడా మాయ సాంగత్యంలోకి వచ్చి ఎలా పడిపోతారంటే, ఇక పూర్తిగా కింద పడిపోతారు. ఎవరైతే కల్పక్రితం అర్థం చేసుకున్నారో, వారే అర్థం చేసుకుంటారు. నేటి ప్రపంచంలో ఏమవుతుందో చూడండి మరియు పిల్లలైన మీరు ఎలా తయారవుతున్నారో చూసుకోండి. పాటను విన్నారు కదా. మేము ఎటువంటి వారసత్వాన్ని తీసుకుంటామంటే, దాని ద్వారా మేము మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతామని చెప్తారు. అక్కడ హద్దు విషయాలేవీ ఉండవు. ఇక్కడ హద్దులున్నాయి. మా ఆకాశంలోకి మీ విమానాలు వచ్చినట్లయితే, వాటిని షూట్ చేస్తాము అని అంటారు. అక్కడైతే హద్దు విషయాలేవీ ఉండవు. ఈ పాటను కూడా పాడుతారు కానీ అర్థం తెలియదు. మీరు బాబా ద్వారా మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతున్నారని మీకు తెలుసు. ఈ 84 జన్మల చక్రాన్ని అనేక సార్లు తిరిగారు. కొద్ది సమయమే దుఃఖం పొందారు, సుఖమైతే ఎంతో ఉంటుంది, అందుకే మీకు అపారమైన సుఖాన్ని ఇస్తానని బాబా అంటారు. ఇప్పుడు మాయతో ఓడిపోకండి. బాబా పిల్లలు చాలామంది ఉన్నారు. అందరూ ఒకే విధమైన సుపుత్రులుగా ఉండలేరు. కొంతమందికి 5-7 మంది పిల్లలుంటారు – వారిలో ఒకరిద్దరు కుపుత్రులుగా ఉంటే తల పాడు చేసేస్తారు. లక్షల-కోట్ల రూపాయలను పోగొట్టేస్తారు. తండ్రేమో పూర్తిగా ధర్మాత్మగా ఉంటారు, పిల్లలు పూర్తిగా సున్నా ఖాతాతో ఉంటారు. బాబా ఇటువంటి ఉదాహరణలను చాలా చూసారు.

మొత్తం ప్రపంచమంతా ఈ అనంతమైన తండ్రి సంతానమని పిల్లలైన మీకు తెలుసు. ఈ భారత్ నా జన్మ స్థలమని తండ్రి అంటారు. ప్రతి ఒక్కరికి తమ ధరణి పట్ల గౌరవముంటుంది. వేరే స్థానంలో శరీరాన్ని వదిలినట్లయితే, వారిని వారి గ్రామానికి తీసుకొస్తారు. తండ్రి కూడా భారత్ లోనే వస్తారు. భారతవాసులైన మీకు మళ్ళీ అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. మేము మళ్ళీ దేవతలుగా, విశ్వానికి యజమానులుగా అవుతున్నాము అని పిల్లలైన మీరు అంటారు. మేము యజమానులుగా ఉండేవారము, ఇప్పుడు ఎలాంటి గతి ఏర్పడింది. ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చి చేరుకున్నారు. 84 జన్మలను అనుభవిస్తూ-అనుభవిస్తూ ఈ పరిస్థితి ఏర్పడింది. డ్రామాను అర్థం చేసుకోవాలి కదా. దీనిని గెలుపు-ఓటముల ఆట అని అంటారు. ఈ ఆట భారత్ కు చెందినదే, ఇందులో మీ పాత్ర ఉంది. ఈ డ్రామాలో బ్రాహ్మణులైన మీది అందరికన్నా ఉన్నతోన్నతమైన పాత్ర. మీరు విశ్వమంతటికీ యజమానులుగా అవుతారు, చాలా సుఖాన్ని అనుభవిస్తారు. మీ అంతటి సుఖాన్ని ఇంకెవ్వరూ అనుభవించలేరు. దాని పేరే స్వర్గము. ఇది నరకము. ఇక్కడి సుఖం కాకిరెట్టతో సమానము. నేడు లక్షాధికారులుగా ఉన్నారు, మరుసటి జన్మలో ఏమవుతారు అనేది ఏమీ తెలియదు. ఇది పాపాత్ముల ప్రపంచము. సత్యయుగం పుణ్యాత్ముల ప్రపంచము. మీరు పుణ్యాత్ములుగా అవుతున్నారు కావున ఎప్పుడూ కూడా పాపం చేయకూడదు. ఎప్పుడూ బాబాతో స్పష్టంగా వ్యవహరించాలి. బాబా అంటారు – ద్వాపరం నుండి మొదలుకొని నాతో పాటు ధర్మరాజు సదా ఉంటారు. సత్య-త్రేతా యుగాలలో నాతో పాటు ధర్మరాజు ఉండరు. ద్వాపరం నుండి మీరు నా పేరు మీద దాన-పుణ్యాలను చేస్తూ వస్తున్నారు. ఈశ్వరార్పణము అని అంటారు కదా. గీతలో శ్రీకృష్ణుని పేరు రాయడంతో శ్రీ కృష్ణార్పణము అని రాసేసారు. రిటర్న్ ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే కావున శ్రీ కృష్ణార్పణము అని అనడం తప్పు. ఈశ్వరార్పణము అని అనడం రైట్. శ్రీ గణేశార్పణము అని అనడంతో ఏమీ లభించదు. అయినా సరే, ఆ భావనకు అందరికీ ఏదో ఒకటి ఇస్తూ వచ్చాను. కానీ, నా గురించి ఎవరికీ తెలియదు. మనం అంతటినీ శివబాబాకు సమర్పణ చేస్తున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. నేను మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చానని బాబా కూడా అంటారు. ఇప్పుడు ఇది దిగే కళ. రావణ రాజ్యంలో దాన-పుణ్యాలేవైతే చేస్తారో, అవి పాపాత్ములకే ఇస్తారు. కళలు తగ్గుతూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా లభించినా, అది అల్పకాలము కోసమే. ఇప్పుడు మీకు 21 జన్మల కోసం లభిస్తుంది. దానిని రామ రాజ్యం అని అంటారు. అక్కడ ఈశ్వరుని రాజ్యముందని అనరు. రాజ్యము దేవీ దేవతలది. నేను రాజ్యం చేయను అని తండ్రి అంటారు. మీ ఆది సనాతన దేవి దేవతా ధర్మం ఏదైతే ఉండేదో, అది ఇప్పుడు ప్రాయః లోపమైపోయింది. అది ఇప్పుడు మళ్ళీ స్థాపనవుతుంది. తండ్రి కళ్యాణకారి, వారిని సత్యమైన బాబా అని అంటారు. వారు తమ యొక్క మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల సత్య జ్ఞానాన్ని మీకు ఇస్తున్నారు. బాబా మీకు అనంతమైన చరిత్ర-భూగోళాలను వినిపిస్తారు. ఇది ఎంత గొప్ప సంపాదన. మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. కానీ వారు ఆ హింసాత్మక చక్రాన్ని చూపించారు. వాస్తవానికి ఇది జ్ఞాన చక్రము. కానీ ఈ జ్ఞానం ప్రాయః లోపమైపోతుంది. ఇవి మీ ముఖ్యమైన చిత్రాలు. ఒక వైపు త్రిమూర్తి, మరొక వైపు కల్ప వృక్షం మరియు చక్రము. శాస్త్రాలలో కల్పం యొక్క ఆయువు లక్షల సంవత్సరాలని రాసేసారు. మొత్తం దారమంతా చిక్కులు పడి ఉంది. తండ్రి తప్ప ఇంకెవ్వరూ చిక్కు ముడులను విప్పలేరు. స్వయంగా తండ్రి సమ్ముఖంలోకి వచ్చారు. వారు అంటారు – డ్రామానుసారంగా నేను రావలసి ఉంటుంది, నేను ఈ డ్రామాలో బంధించబడి ఉన్నాను. నేను రాకపోవడమనేది జరగదు. అలాగని నేను వచ్చి మరణించిన వారిని బ్రతికిస్తానని లేదా ఎవరినైనా అనారోగ్యం నుండి విడిపిస్తానని కాదు. బాబా, మాపై కృప చూపించండి అని చాలా మంది పిల్లలు అంటారు. కానీ ఇక్కడ కృప మొదలైన విషయాలేవీ లేవు. మీకు ఎటువంటి నష్టం కలగకుండా మిమ్మల్ని ఆశీర్వదించడం కోసం మీరు నన్ను పిలవలేదు కదా. హే పతితపావనా రండి, దుఃఖహర్త-సుఖకర్త రండి అని మీరు నన్ను పిలుస్తారు. శరీరానికి దుఃఖహర్తలుగా డాక్టర్లు కూడా ఉంటారు. నేనేమైనా దాని కోసం వస్తానా! కొత్త ప్రపంచమైన స్వర్గానికి యజమానులుగా చేయండి లేక శాంతిని ఇవ్వండి అని మీరు అంటారు. అంతేకానీ, మీరు వచ్చి మమ్మల్ని అనారోగ్యం నుండి బాగుచేయండి అని అనరు. సదా కోసం శాంతి లేదా ముక్తి లభించదు, పాత్రను అభినయించాల్సిందే. చివర్లో వచ్చేవారికి ఎంత శాంతి లభిస్తుంది. ఇప్పటి వరకు వస్తూనే ఉన్నారు. ఇంత సమయమైతే శాంతిధామంలో ఉన్నారు కదా. డ్రామానుసారంగా ఎవరి పాత్ర ఉంటుందో, వారే వస్తారు. పాత్ర మారదు. శాంతిధామంలో ఉన్న చాలామంది ఆత్మలు చివర్లో వస్తారని బాబా అర్థం చేయిస్తారు. ఈ డ్రామా తయారై ఉంది. చివర్లో రావాల్సినవారు చివర్లోనే వస్తారు. ఈ వృక్షం తయారై ఉంది. ఈ చిత్రాలు మొదలైనవేవైతే తయారుచేసారో, వాటి గురించి మీరు అర్థం చేయించాలి. కల్పక్రితం వలె చిత్రాలు ఇంకా వెలువడుతూ ఉంటాయి. 84 జన్మల విస్తారం వృక్షంలో కూడా ఉంది. డ్రామా చక్రంలో కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ మెట్ల చిత్రాన్ని తయారుచేసారు. మనుష్యులకు ఏమీ తెలియదు. పూర్తిగా బుద్ధిహీనులుగా ఉన్నారు. జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు అయిన పరమపిత పరమాత్మ ఈ తనువు ద్వారా మమ్మల్ని చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఎవరైతే మొట్టమొదట విశ్వానికి యజమానిగా ఉండేవారో, వారిలోనే నేను వస్తాను అని తండ్రి చెప్తారు. మేము కూడా బ్రహ్మా ద్వారానే బ్రాహ్మణులుగా అవుతామని మీకు కూడా తెలుసు. గీతలో ఈ విషయాలు లేవు. తండ్రి అంటారు – ఇతను స్వయంగా నారాయణుడి పూజను చేసేవారు, రైలులో ప్రయాణిస్తూ కూడా గీతను చదివేవారు. ఇతను పెద్ద ధర్మాత్మ అని మనుష్యులు అనుకునేవారు. ఇప్పుడు ఆ విషయాలన్నింటినీ మర్చిపోతూ ఉంటారు. ఎంతైనా, ఇతను గీత మొదలైనవన్నీ చదివారు కదా. నాకు ఇవన్నీ తెలుసు అని బాబా అంటారు. మేము ఎవరి ముందు కూర్చొన్నామని ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎవరి ద్వారానైతే విశ్వానికి యజమానులుగా అవుతారో, వారిని పదే-పదే ఎందుకు మర్చిపోతారు? మీకు 16 గంటలు ఫ్రీ టైమ్ ఇస్తాను, మిగిలిన సమయంలో స్వయం యొక్క సేవ చేసుకోండి. స్వయం యొక్క సేవ చేసుకుంటున్నారంటే విశ్వ సేవ చేస్తున్నట్లు. కర్మలు చేస్తున్నప్పుడు తక్కువలో తక్కువ 8 గంటలు తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేయండి. ప్రస్తుతం రోజంతటిలో 8 గంటలు స్మృతి చేయలేరు. ఆ అవస్థ ఏర్పడినప్పుడు, వీరు చాలా సేవ చేస్తున్నారని భావిస్తారు. మేము చాలా సేవ చేస్తున్నామని అనుకోకండి. భాషణ చాలా ఫస్ట్ క్లాస్ గా చేస్తారు కానీ యోగం అస్సలు లేదు. యోగం యొక్క యాత్రనే ముఖ్యమైనది.

తలపై వికర్మల భారం చాలా ఉంది కావున ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి అంటారు. 2 నుండి 5 గంటల వరకు ఫస్ట్ క్లాస్ వాయుమండలం ఉంటుంది. రాత్రి వేళ ఆత్మ, ఆత్మాభిమానిగా అవుతుంది, దానిని నిద్ర అని అంటారు, అందుకే ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి అంటారు. ఇప్పుడు మన్మనాభవ అని తండ్రి అంటారు. ఇది పైకి ఎక్కే కళకు మంత్రము. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రితో స్పష్టంగా మరియు సత్యంగా వ్యవహరించాలి. మీరు కళ్యాణకారీ తండ్రి పిల్లలు కావున సర్వుల కళ్యాణం చేయాలి. సుపుత్రులుగా అవ్వాలి.

2. కర్మలు చేస్తున్నప్పుడు కూడా తక్కువలో తక్కువ 8 గంటలు తప్పకుండా స్మృతిలో ఉండాలి. స్మృతియే ముఖ్యమైనది – దీనితోనే వికర్మల భారాన్ని తొలగించుకోవాలి.

వరదానము:-

చాలా సార్లు పురుషార్థీ అనే పదం కూడా ఓడిపోవడంలో లేక అసఫలతను పొందడంలో మంచి డాలుగా అవుతుంది, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, మేము ఇంకా పురుషార్థులము అని అంటారు. కానీ యథార్థమైన పురుషార్థులు ఎప్పుడూ ఓడిపోరు, ఎందుకంటే పురుషార్థం అనే పదానికి యథార్థమైన అర్థము – స్వయాన్ని పురుష్ అనగా ఆత్మగా భావిస్తూ నడుచుకోవడం. ఇటువంటి ఆత్మిక స్థితిలో ఉండే పురుషార్థులు సదా గమ్యాన్ని ఎదురుగా పెట్టుకుని నడుచుకుంటారు, వారెప్పుడూ ఆగరు, ధైర్యాన్ని, ఉత్సాహాన్ని విడిచిపెట్టరు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top