25 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

May 24, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఈ డ్రామాలో వినాశనమనేది తప్పకుండా నిశ్చయించబడి ఉంది. మీరు వినాశనానికి ముందే కర్మాతీతులుగా అవ్వాలి”

ప్రశ్న: -

తండ్రి యొక్క ఏ పదాలు సమ్ముఖంగా విన్నప్పుడు చాలా ఆకర్షణ కలుగుతుంది?

జవాబు:-

మీరు నా పిల్లలు, అని తండ్రి ఎప్పుడైతే అంటారో, ఆ పదాలను సమ్ముఖంగా విన్నప్పుడు చాలా ఆకర్షణ కలుగుతుంది. సమ్ముఖంగా విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. మధుబన్, పిల్లలందరినీ ఆకర్షిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈశ్వరీయ పరివారముంది. ఇక్కడ బ్రాహ్మణుల సంగఠన ఉంది. బ్రాహ్మణులు పరస్పరంలో జ్ఞానాన్నే ఇచ్చి పుచ్చుకుంటారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మా తీర్థము అతీతమైనది….. (హమారే తీర్థ్ న్యారే హై…..)

ఓంశాంతి. మేము అవినాశీ యాత్రను అనగా ఆత్మిక యాత్రను చేస్తున్నామని పిల్లలకు తెలుసు. మనం ఈ యాత్ర నుండి తిరిగి మృత్యులోకంలోకి రాము. ఇటువంటి యాత్ర కూడా ఒకటి ఉంటుందని, ఇక ఎప్పుడూ అక్కడ నుండి తిరిగి రావాల్సిన అవసరం ఉండదని మనుష్యులకు తెలియనే తెలియదు. ఈ విషయం లక్కీ స్టార్స్ అయిన మీకు ఇప్పుడు తెలిసింది. ఈ విషయాన్ని పక్కాగా గుర్తుంచుకోవాలి. ఆత్మలైన మనం పాత్రను అభినయిస్తాము. ఆత్మనైన నేను ఈ వస్త్రాన్ని ధరించి పాత్రను అభినయించానని, ఇప్పుడు ఇంటికి వెళ్తానని ఆ నాటకంలో ఇలా అనరు. వారు తమను తాము శరీరమనే భావిస్తారు. ఆత్మనైన నేను, ఈ శరీరం రూపీ వస్త్రాన్ని వదిలి, మళ్ళీ ఇంకొకటి తీసుకుంటానని ఇక్కడ పిల్లలైన మీకు జ్ఞానముంది. ఇవి 84 జన్మల పాత వస్త్రాలు, వీటిని వదిలి కొత్త ప్రపంచంలో మళ్ళీ కొత్త వస్త్రాన్ని తీసుకుంటాము. ఈ లక్ష్మీనారాయణులు కొత్త వస్త్రాలను ధరించారు కదా. వారు మీ రాజధానికి చెందినవారే. మీరు కూడా వెళ్ళి ఇలాంటి కొత్త దైవీ వస్త్రాలను ధరిస్తారు. నిర్గుణుడినైన నాలో ఏ గుణాలు లేవని ఇక్కడ అంటారు. తండ్రియే మళ్ళీ అటువంటి గుణవంతులుగా చేస్తారు. తండ్రి అంటారు – నా పాత్ర కూడా ఉంది, నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని నిర్వికారులుగా చేస్తాను. ఇక్కడ ఇది జీవనబంధన ధామము, రావణ రాజ్యము. మేము పతితుల నుండి పావనంగా, మళ్ళీ పావనుల నుండి పతితులుగా ఎలా అవుతాము అనేది మీ బుద్ధిలో ఉంది. కలియుగం అంధకారమని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడిది రావణ రాజ్యం యొక్క అంతిమము, రామ రాజ్యం ఇప్పుడు ప్రారంభం కానున్నది. ప్రస్తుతం ఇది సంగమము. తండ్రికి కల్పం యొక్క సంగమయుగంలో రావాల్సి ఉంటుంది. ఇప్పుడిది వినాశన సమయమని మరియు భగవంతుడు స్థాపనార్థం ఎక్కడో గుప్త వేషంలో ఉన్నారని ప్రపంచంలోని వారు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆత్మలైన మీరు కూడా గుప్త వేషంలో ఉన్నారు. ఆత్మ వేరు, శరీరం వేరు. ఈ మనిషి శరీరం అనేది గుప్త వేషం వంటిది. తండ్రికి కూడా ఇందులో రావాల్సి ఉంటుంది. మీ శరీరానికి పేరు ఉంటుంది, వారికైతే శరీరమే లేదు. మీరు కూడా ఆత్మలే, వారు కూడా ఆత్మనే. ఇప్పుడు ఆత్మకు ఆత్మ పట్ల మోహం ఏర్పడింది. ఇతర సాంగత్యాలను వదిలి, మీతోనే సాంగత్యాన్ని జోడిస్తామని పాడుతారు కూడా. మీరు ఎలాగైతే మోహజీతులుగా ఉన్నారో, మేము కూడా అలా అవుతామని అంటారు. బాబా చాలా మోహజీతులు. కామ చితిపై కూర్చొని కాలిపోయిన పిల్లలు ఎంతమంది ఉన్నారు. పరమపిత పరమాత్మ రావడం కూడా, పాత ప్రపంచాన్ని వినాశనం చేయించేందుకు వస్తారు, కావున వారికి మోహం ఎలా ఉంటుంది. పతితులు ఎప్పుడైతే వినాశనం చెందుతారో, అప్పుడు శాంతి రాజ్యం ఏర్పడుతుంది. ఈ సమయంలో సుఖమైతే ఎవరికీ లేదు. అందరూ తమోప్రధానులుగా, దుఃఖితులుగా అయిపోయారు. ఇది పతిత ప్రపంచము. శివబాబాయే వచ్చి స్వర్గ స్థాపనను చేస్తారు, దానికి శివాలయమని పేరు పెట్టడం జరిగింది. శివబాబా దేవతల రాజధానిని స్థాపన చేశారు, అది చైతన్య శివాలయము. మరియు ఏ శివాలయంలోనైతే శివుని చిత్రం ఉందో, అది జడమైన శివాలయమైనట్లు. లక్ష్మీనారాయణులు తప్పకుండా స్వర్గానికి యజమానులుగా ఉండేవారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారు పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతున్నారు. ఇప్పుడు మీకు జ్ఞానముంది. మీరు లక్ష్మీనారాయణుల మందిరానికి వెళ్ళి వారికి తల వంచి నమస్కరించరు. మీరు వారి రాజధానిలోకి చైతన్యంగా వెళ్తారు. మేము దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు అలా లేము అని మీకు తెలుసు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో, వారి చిత్రాలు తయారవుతాయి. లక్ష్మీనారాయణుల మందిరాలను అందరికన్నా ఎక్కువగా బిర్లా నిర్మిస్తారు కనుక వారి సేవను కూడా చేయాలి – మీరు ఏ లక్ష్మీనారాయణుల మందిరాలనైతే నిర్మిస్తారో, వారి 84 జన్మల కథను మేము మీకు వినిపిస్తామని చెప్పండి. యుక్తిగా ఈ బహుమానాన్ని ఇవ్వాలి. బాబా సేవ యుక్తులను తెలియజేస్తారు. మాతలు వెళ్ళి చెప్పాలి – మీరు వారి మందిరాలనైతే నిర్మిస్తారు కానీ మీకు వారి జీవిత కథ గురించి తెలియదు, మాకు తెలుసు మరియు అర్థం చేయించగలము కూడా అని చెప్పాలి. అర్థం చేయించేవారు చాలా ఆసక్తికరంగా చెప్పగలిగేవారు ఉండాలి. తండ్రి కూడా కూర్చొని అర్థం చేయిస్తారు కదా. ఒకవేళ మీకు రావడానికి అనుమతి లభించకపోతే, ఇంట్లో కూర్చొని స్మృతి చేయండి అని తండ్రి అంటారు. మేము శివబాబా సంతానమని మీకు తెలుసు. మురళీ అయితే లభిస్తుంది. అయితే, ఇక్కడకు వస్తే స్మృతి యాత్ర బాగుంటుందని, ఇంట్లో కూర్చుంటే స్మృతి యాత్ర తగ్గిపోతుందని కాదు. మేఘాలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తాయి. మీరు కూడా రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. బాబా సమ్ముఖంగా వెళ్ళాలనుకుంటారు. ఆత్మకు జ్ఞానముంది, అయితే సమ్ముఖంగా విన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది, కానీ విషయమైతే అదే. శివబాబా కూర్చొని, పిల్లలకు ఎలా అర్థం చేయిస్తారు అనేది మీరు చూస్తారు. పిల్లలూ, మీరు నా వారు, మీరు 84 జన్మల పాత్రను అభినయించారు. మీరు జనన-మరణాలలోకి వస్తారు, నేను రాను, నేను పునర్జన్మలు తీసుకోను. అలాగని అజన్మ (జన్మ లేని వారు) అని కూడా కాను. నేను వస్తాను కానీ వృద్ధ తనువులో ప్రవేశిస్తాను. ఆత్మలైన మీరు చిన్న బిడ్డ శరీరంలో ప్రవేశిస్తారు, నేను పరంధామం నుండి కింద పాత్రను అభినయించేందుకు వస్తాను. నేను వికారుల గర్భంలోకి రాను. త్వమేవ మాతాశ్చ పితా….. అని నన్నే అంటారు. నాకు తల్లిదండ్రులెవరూ ఉండరు. నేను కేవలం శరీరాన్ని ఆధారంగా తీసుకొని పాత్రను అభినయిస్తాను. దుఃఖాన్ని హరించి, సుఖాన్ని ఇవ్వడం కోసం మీరు నన్ను పిలుస్తారు. ఇప్పుడు సమ్ముఖంగా వచ్చాను, ఆత్మలతో మాట్లాడుతున్నాను. ఇక్కడైతే అందరూ బ్రాహ్మణులే ఉన్నారు. మీరు బయటకు వెళ్ళినప్పుడు హంసలుగా మరియు కొంగలుగా అయిపోతారు. ఇక్కడ (మధుబన్ లో) మీకు బ్రాహ్మణుల సాంగత్యమే ఉంటుంది. పరస్పరంలో జ్ఞాన చర్చనే చేసుకుంటారు. మనం మన రాజధానిని స్థాపన చేసుకుంటున్నాము. బాబా వచ్చి ఉన్నారు, తండ్రిని స్మృతి చేసే యుక్తిని, ఒకరికొకరు తెలియజేసుకుంటూ ఉండండి. తండ్రిని స్మృతి చేయండి, అని భోజన సమయంలో కూడా ఒకరికొకరు సంకేతాన్ని ఇచ్చుకుంటూ ఉండండి. ఇది చాలా పెద్ద సంగఠన కదా. అక్కడైతే మీతో పాటు వికారులు ఉంటారు కనుక వారి ఆకర్షణ ఉంటుంది. ఇక్కడైతే ఎవరి ఆకర్షణ ఉండదు. యోధులు, యోధులతో పాటు ఉంటారు. ఇది మీ కుటుంబము. ఎవరు కలిసినా సరే, భగవంతుడిని స్మృతి చేస్తూ ఉండమని, వారికి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి అన్న విషయమే మీ బుద్ధిలో ఉంటుంది. ఇద్దరు తండ్రులున్నారు కదా. లౌకిక తండ్రి ఉన్నప్పటికీ, భగవంతుడిని స్మృతి చేస్తారు కదా. అతను లౌకిక ఫాదర్, లౌకిక ఫాదర్ ను గాడ్ ఫాదర్ అని అనరు. వీరు పారలౌకిక తండ్రి. తప్పకుండా గాడ్ ఫాదర్ నుండి వారసత్వం లభిస్తూ ఉండవచ్చు. ఈ విధంగా భూ-భూ చేస్తూ ఉండండి. మీరు బ్రాహ్మణులు కదా. సన్యాసులు కూడా భూ-భూ చేస్తారు కదా. ఈ ప్రపంచపు సుఖం కాకి రెట్ట సమానమైనది, ఎంత దుఃఖముంది. వారు హఠయోగులు, నివృత్తి మార్గం వారు. వారి ధర్మమే వేరు. సత్యయుగంలో మనం ఎంత సుఖంగా, పవిత్రంగా ఉంటాము అనేది మీకు తెలుసు. భారత్ లో దేవీ-దేవతల రాజ్యముండేటప్పుడు, ప్రవృత్తి మార్గం ఉండేది. ఎవరైతే పవిత్రంగా ఉండేవారో, వారే పతితంగా అయ్యారు. ఓ పతితపావనా రండి, అని పిలుస్తూ ఉంటారు కూడా. మళ్ళీ పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు. మేము వెళ్ళి జ్యోతిలో కలిసిపోతామని అంటారు. పునర్జన్మను కూడా అంగీకరించరు. అనేక మతాలున్నాయి కదా. రోజు-రోజుకు జనాభా వృద్ధి చెందుతూ ఉంటుంది. సన్యాసుల వృద్ధి ఎలా జరుగుతుంది అనేది కూడా తెలియజేయాలి. దిగంబర సన్యాసుల వృద్ధి కూడా జరుగుతుంది. ఎవరిది ఏ ధర్మమో, వారు అందులోనే ఉండడంతో అంతమతి సో గతి కలుగుతుంది. ఎవరు ఏ అభ్యాసాన్ని ఎక్కువగా చేస్తారో, ఉదాహరణకు ఎవరైనా శాస్త్రాలు మొదలైనవాటిని చదివితే, అంతమతి సో గతి కలుగుతుంది, అప్పుడు బాల్యంలోనే శాస్త్రాలు కంఠస్థం అయిపోతాయి. ఇప్పుడు తండ్రి అంటారు – నేను ఫలానా, నేను ఇది అని ఇటువంటి దేహాభిమానపు మాటలన్నీ వదిలేయండి. స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. ఈ శరీరాన్ని చూస్తూ కూడా చూడకండి. దేహ సహితంగా దేహపు సంబంధాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నింటినీ వదిలేయండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి, పరమాత్మను స్మృతి చేయండి. దీనికి చాలా సమయం పడుతుంది. మాయ స్మృతి చేయనివ్వదు. లేదంటే వానప్రస్థులకు ఇది చాలా సహజము. ఇప్పుడు పిల్లలు-పెద్దలు, అందరిదీ వానప్రస్థ అవస్థ అని తండ్రి స్వయంగా అంటారు. ఒక వైపు వినాశనం కూడా జరుగుతూ ఉంటుంది, మరో వైపు జన్మలు కూడా తీసుకుంటూ ఉంటారు. పునర్జన్మ తీసుకోవాల్సి ఉంటే వచ్చేస్తారు. పిల్లలు కూడా జన్మిస్తారు మరియు వినాశనం కూడా జరుగుతుంది. కొందరు గర్భంలో ఉంటారు, కొందరు మరెక్కడో ఉంటారు కానీ అందరూ సమాప్తమైపోతారని మీకు తెలుసు. అందరూ తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకొని తిరిగి వెళ్తారు. లెక్కాచారాలు మిగిలి ఉన్నట్లయితే శిక్షలను బాగా అనుభవించవలసి ఉంటుంది. తర్వాత అవి తేలికవుతాయి. అలాగని యోగంలో కూడా ఉంటూ, మరోవవైపు పాపాలు కూడా చేస్తూ ఉండమని కాదు. చాలామంది పిల్లలు ఒక వైపు చార్టు కూడా రాస్తూ ఉంటారు, మళ్ళీ మాయ నల్ల ముఖం చేసేసిందని అంటారు. మాయ ఓడించింది అంటే కచ్చాగా ఉన్నారని అంటారు కదా. మేము కొద్ది రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాము, తర్వాత వెళ్ళిపోతాము, ఇదంతా వినాశనం జరుగుతూ ఉంది అని మీరు భావించండని తండ్రి అర్థం చేయిస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని తండ్రి అంటారు. మేమెంతమందికి మార్గాన్ని తెలియజేస్తున్నాము మరియు ఎంతమంది చేత పురుషార్థం చేయిస్తున్నాము అని మీ చార్టును చూసుకుంటూ ఉండండి. తనువు, మనసు, ధనములతో ఆత్మిక సేవలో సహాయకులుగా అవ్వాల్సి ఉంటుంది. మనసును అమన్ గా (నిస్సంకల్పంగా) చేయలేకపోతున్నామని అంటారు. ఆత్మయే శాంత స్వరూపము. ఆత్మలైన మనం మన పరంధామానికి వెళ్ళి కూర్చుంటాము. ప్రాపంచిక సంకల్పాలేవీ రావు. అలాగని కళ్ళు మూసుకొని, స్పృహ లేకుండా ఉండాలని కాదు. చాలామంది ఇలాంటివి నేర్చుకుంటారు కూడా. 10-15 రోజులు స్పృహ లేకుండా కూడా ఉండిపోతారు. అటువంటి అభ్యాసం చేస్తారు, మళ్ళీ కొంత సమయం తర్వాత మేల్కొంటారు. టైమ్ బాంబులకు కూడా ఇన్ని గంటల తర్వాత పేలాలని, వాటికి కూడా సమయముంటుంది.

మనం యోగం జోడిస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఎప్పుడైతే తమోప్రధానమైన చెత్త తొలగిపోతుందో, అప్పుడు మనం సతోప్రధానంగా అయిపోతాము, అప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తాము. ఇప్పుడు మనం యోగం యొక్క యాత్రలో ఉన్నాము. ఇప్పుడు సమయం లభించింది, తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది, అప్పుడిక అంతా సమాప్తమైపోతుంది. సమయం నిశ్చయించబడి ఉంది, చివర్లో దోమల వలె శరీరాలను వదిలేస్తారు, వినాశనం జరుగుతుంది, మీరు కర్మాతీత అవస్థను పొందుతారు, ఇక వినాశనం ప్రారంభమవుతుంది. వినాశన దృశ్యం చాలా భయంకరంగా ఉంటుంది. ఇది డ్రామాలో తప్పకుండా నిశ్చయించబడింది. మన అవస్థ ఏకరసంగా ఉంటుందని మీకు తెలుసు. సంతోషంలో సదా హర్షితంగా ఉంటారు. ఈ ప్రపంచమైతే సమాప్తమవ్వాల్సిందే. కల్ప-కల్పం సంగమయుగం ఉంటుందని, అప్పుడు వినాశనం జరుగుతుందని మీకు తెలుసు. కేవలం బాంబులే కాదు, ప్రకృతి వైపరీత్యాలు కూడా సహాయం చేస్తాయి. ఇప్పుడు మనం వెళ్ళాలని పిల్లలకు బుద్ధిలో ఉండాలి. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తామో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి, ఉన్నత పదవిని పొందుతాము. దానం ఇంటి నుండి ప్రారంభమవుతుంది. దీనికోసం ప్రయత్నించాలి. కన్యలంటే పుట్టినింటిని మరియు అత్తవారింటిని ఉద్ధరించేవారు. కనుక దానం ఇంటి నుండే ప్రారంభమైనట్లు కదా. సేవలో తత్పరులై ఉండాలి. నన్ను స్మృతి చేసినట్లయితే వారసత్వం లభిస్తుందని శివబాబా చెప్తున్నారని చెప్పండి. ఇది స్పష్టమైన విషయం. అల్ఫ్ అయిన నన్ను స్మృతి చేసినట్లయితే స్వర్గ వారసత్వం మీది అవుతుంది. మీరు విశ్వానికి యజమానులుగా అయిపోతారు. ఇప్పుడు వారసత్వాన్ని పొందాలంటే నన్ను స్మృతి చేయండి. ఈ సందేశాన్నివ్వడం పిల్లల బాధ్యత. ఇంతకుముందు కూడా ఇచ్చారు. వినాశనం ఎదురుగా నిలబడి ఉందని తెలియజేయాలి. కలియుగం తర్వాత సత్యయుగం వస్తుంది. తండ్రియే వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. రావణుడు నరకవాసులుగా చేస్తాడు. తండ్రి వచ్చి స్వర్గవాసులుగా చేస్తారు. ఈ కథ భారత్ కు సంబంధించినదే. భారతవాసులను మేలుకొలపాలి. ఈ తండ్రి కొత్త సృష్టిని రచించేవారు అని ముందు శివుని మందిరాలకు వెళ్ళి అర్థం చేయించాలి. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని అంటారు. ఈ నిరాకార తండ్రి వచ్చి ఉన్నారు. బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపనను చేస్తున్నారు. ఇప్పుడు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు మేము మీకు తెలియజేస్తాము, అంగీకరించడం, అంగీకరించకపోవడం అనేది మీ ఇష్టము. మీరు చెప్పే విషయాలైతే చాలా మంచివి. తండ్రియే దుఃఖహర్త-సుఖకర్త. ఈ విధంగా కొద్దిగా అర్థం చేయించి వెళ్ళిపోవచ్చు. ఇది మీ వ్యాపారము. ఇందులో శ్రమేమీ లేదు. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారని కేవలం నోటితో ఈ విషయాన్ని చెప్పాలి. దేహీ-అభిమానులుగా అవ్వండి. శివుని పూజారుల వద్దకు వెళ్ళండి, తర్వాత లక్ష్మీనారాయణుల పూజారుల వద్దకు వెళ్ళండి. వాళ్ళకు వీరి జీవిత కథను వినిపించండి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తనువు, మనసు, ధనములతో ఆత్మిక సేవలో సహాయకులుగా అవ్వాలి. అందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి వారసత్వానికి అధికారులుగా చేయాలి. వినాశనానికి ముందే కర్మాతీతులుగా అయ్యేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి.

2. తండ్రి సమానంగా మోహజీతులుగా అవ్వాలి. ఆత్మకు ఆత్మపై ఏదైతే మోహము ఏర్పడిందో, దానిని తొలగించి, ఒక్క తండ్రి లగన్ (ప్రేమ)లో నిమగ్నమవ్వాలి.

వరదానము:-

వర్తమాన సమయంలో అన్నింటికన్నా సూక్ష్మమైన మరియు సుందరమైన దారము – ఈ మై పన్ (నేను). ఈ మై (నేను) అనే పదమే దేహాభిమానం నుండి అతీతంగా తీసుకువెళ్ళేది, అలాగే దేహాభిమానంలోకి తీసుకువచ్చేది కూడా. ఎప్పుడైతే ఈ మై పన్ అనేది వ్యతిరేక రూపంలో వస్తుందో, అప్పుడు తండ్రికి ప్రియంగా చేసేందుకు బదులుగా, ఎవరో ఒక ఆత్మకు ప్రియంగా చేస్తుంది లేదా పేరు-గౌరవం-కీర్తి ప్రతిష్టలకు ప్రియంగా చేస్తుంది. ఈ బంధనం నుండి ముక్తులుగా అయ్యేందుకు నిరంతరం నిరాకారీ స్థితిలో స్థితులై సాకారంలోకి రండి – ఈ అభ్యాసాన్ని న్యాచురల్ నేచర్ గా (సహజ స్వభావంగా) చేసుకున్నట్లయితే, నిరహంకారులుగా అయిపోతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top