29 May 2021 TELUGU Murli Today – Brahma Kumari

May 28, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఎలాగైతే బాబా ప్రేమ సాగరుడో, ఎలాగైతే ప్రపంచంలో ఎవరూ వారిలా ప్రేమించలేరో, అలా పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా అవ్వండి. ఎవరినీ దుఃఖ పెట్టకూడదు”

ప్రశ్న: -

ఏ రకమైన ఆలోచనలు నడుస్తూ ఉన్నట్లయితే, సంతోషం యొక్క పాదరసం ఎక్కి ఉంటుంది?

జవాబు:-

ఇప్పుడు మేము జ్ఞాన రత్నాలతో మా జోలెను నింపుకుంటున్నాము, తర్వాత ఈ గనులు మొదలైనవన్నీ నిండుగా అయిపోతాయి. అక్కడ (సత్యయుగంలో) మేము బంగారు మహళ్ళను నిర్మిస్తాము. 2. మా ఈ బ్రాహ్మణ కులం ఉత్తమమైన కులము, మేము సత్యాతి-సత్యమైన సత్యనారాయణ కథను, అమరకథను వింటాము మరియు వినిపిస్తాము….. ఇటువంటి ఆలోచనలు నడుస్తూ ఉన్నట్లయితే, సంతోషపు పాదరసం ఎక్కి ఉంటుంది.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. పిల్లలు తండ్రి స్మృతిలో కూర్చున్నారు, ఈ శ్రీమతం అనగా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతం లభిస్తుంది. స్మృతి యాత్ర చాలా మధురమైనది. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో, అంతగా బాబా మధురంగా అనిపిస్తారని పిల్లలకు నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు ఎందుకంటే తండ్రి శ్యాక్రిన్ కదా. ఒక్క తండ్రి మాత్రమే ప్రేమిస్తారు, మిగిలినవారంతా కొడతారు. ప్రపంచమంతా ఒకరినొకరు తిరస్కరించుకుంటూ ఉంటారు, తండ్రి ప్రేమిస్తారు, వారిని కేవలం పిల్లలైన మీరు మాత్రమే తెలుసుకున్నారు. తండ్రి అంటారు – నేను ఎవరై ఉన్నా, ఎలా ఉన్నా, ఎంత గొప్పవాడిని! మీ తండ్రి ఎంత గొప్పవారో చెప్పండి. అప్పుడు మీరు – వారొక బిందువు అని అంటారు, మిగిలినవారెవరికీ ఈ విషయం తెలియదు. పిల్లలు కూడా పదే-పదే మర్చిపోతూ ఉంటారు. భక్తి మార్గంలో పెద్ద-పెద్ద చిత్రాలను పూజించేవారిమి, ఇప్పుడు బిందువును ఎలా స్మృతి చేయాలని అడుగుతారు. బిందువు బిందువునే స్మృతి చేస్తుంది కదా. నేను ఒక బిందువునని, నా తండ్రి కూడా అలాగే ఉంటారని ఆత్మకు తెలుసు. ఆత్మయే ప్రెసిడెంట్ గా అవుతుంది, ఆత్మయే నౌకరుగా అవుతుంది. పాత్రను ఆత్మయే అభినయిస్తుంది. తండ్రి అందరికన్నా మధురమైనవారు. ఓ పతితపావనా, దుఃఖహర్త-సుఖకర్త రండి అని అందరూ స్మృతి చేస్తారు. మేము ఎవరినైతే బిందువు అని అంటున్నామో, వారు చాలా సూక్ష్మమైనవారు కానీ వారు మహిమ ఎంతో గొప్పదని ఇప్పుడు పిల్లలైన మీకు నిశ్చయముంది. వారు జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు అన్న మహిమను పాడుతారు కానీ వారు ఎలా వచ్చి సుఖాన్ని ఇస్తారు అనేది అర్థం చేసుకోరు. ఎవరెవరు శ్రీమతమనుసారంగా ఎంతగా నడుచుకుంటున్నారు అనేది, మధురాతి-మధురమైన పిల్లలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలరు. సేవ చేసేందుకు శ్రీమతం లభిస్తుంది. చాలామంది మనుష్యులు అనారోగ్యంతో రోగగ్రస్తులుగా ఉన్నారు. చాలామంది ఆరోగ్యవంతులుగా కూడా ఉన్నారు. సత్యయుగంలో ఆయుష్షు చాలా ఎక్కువగా, సుమారుగా 125-150 సంవత్సరాలు ఉండేదని భారతవాసులకు తెలుసు. ప్రతి ఒక్కరు తమ ఆయుష్షునంతా పూర్తిగా జీవిస్తారు. ఇది పూర్తిగా ఛీ-ఛీ ప్రపంచము. ఇంకా కొద్ది సమయమే ఉంది. మనుష్యులు ఇప్పటికీ పెద్ద-పెద్ద ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తూ ఉంటారు. అవి ఇంకా ఎంత సమయం ఉంటాయనేది వారికి తెలియదు. మందిరాలు మొదలైనవి నిర్మిస్తారు, లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. వాటి ఆయువు ఇంకా ఎంత సమయం ఉంటుంది. అవి సమాప్తమవ్వనున్నాయని మీకు తెలుసు. ఇళ్ళు మొదలైనవి నిర్మించుకోవడానికి బాబా మిమ్మల్ని ఎప్పుడూ వద్దనరు. మీరు మీ ఇంట్లోనే, ఒక గదిలో హాస్పిటల్ కమ్ యూనివర్సిటీని తెరవండి. ఏ ఖర్చు లేకుండా ఈ నాలెడ్జ్ ద్వారా 21 జన్మల కోసం ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషాలను పొందాలి. మీకు చాలా సుఖం లభిస్తుందని కూడా అర్థం చేయించారు. తమోప్రధానంగా అయినప్పుడు ఎక్కువ దుఃఖం కలుగుతుంది. ఎంతెంతగా తమోప్రధానమవుతూ ఉంటారో, అంతగా ప్రపంచంలో దుఃఖం-అశాంతి పెరుగుతూ ఉంటాయి. మనుష్యులు చాలా దుఃఖితులు అవుతారు. తర్వాత జయజయకారాలు ఉంటాయి. ఏ వినాశనాన్ని అయితే పిల్లలైన మీరు దివ్యదృష్టితో చూసారో, దానిని మళ్ళీ ప్రాక్టికల్ గా చూడనున్నారు. స్థాపన యొక్క సాక్షాత్కారం కూడా చాలామందికి కలిగింది. చిన్న పిల్లలకు చాలా సాక్షాత్కారాలు కలిగాయి. వారికి జ్ఞానమేమీ ఉండేది కాదు. పాత ప్రపంచ వినాశనం తప్పకుండా జరగనున్నది. తండ్రియే వచ్చి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారని పిల్లలైన మీకు తెలుసు. కానీ పిల్లలు ఉన్నత పదవిని పొందే పురుషార్థం చేయాలి. పిల్లలైన మీకు తండ్రి కూర్చొని, ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తారు. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉందని వాళ్ళకు తెలియదు. నేను దాతను, నేను మీకు ఇచ్చేందుకు వచ్చానని తండ్రి అంటారు. పతితపావనా రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని మనుష్యులు అంటారు.

తండ్రి అంటారు – ఇంతకుముందు మీరు ఎంత తెలివైనవారిగా ఉండేవారు, సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయారు. ఈ విషయాలు ఇప్పుడు మీ బుద్ధిలోకి వచ్చాయి. మేము విశ్వంపై రాజ్యం చేసేవారిమని ఇంతకుముందు భావించేవారు కాదు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, మళ్ళీ తప్పకుండా అవుతారు. చరిత్ర-భూగోళాలు రిపీట్ అవుతాయి. తండ్రి అర్థం చేయించారు – 5 వేల సంవత్సరాల క్రితం నేను వచ్చాను, మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేసాను, తర్వాత మీరు 84 జన్మల మెట్లు దిగుతారు. ఈ విస్తారం ఏ శాస్త్రంలోనూ లేదు. శివబాబా శాస్త్రాలు మొదలైనవి ఏమైనా చదివారా. వారిని జ్ఞానం యొక్క అథారిటీ అని అంటారు. మనుష్యులు కూడా శాస్త్రాలు మొదలైనవి చదివి శాస్త్రాల అథారిటీగా అవుతారు. వారు కూడా పతితపావనా రండి, అని పాడుతారు. గంగా స్నానం చేయడానికి వెళ్తారు. వాస్తవానికి ఈ భక్తి అనేది గృహస్థుల కోసమే ఉన్నది. సద్గతిదాత ఎవరు అనేది వారికి కూడా తెలియదని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు – ఓ పతితపావనా రండి, అని మీరు నన్ను పిలుస్తారు కూడా. నేను మిమ్మల్ని పావనంగా చేస్తాను. నేను మిమ్మల్ని చదివించడానికి వస్తాను, అంతేకానీ మాపై కృప చూపించండి అని అడగకూడదు. నేను టీచరును, మీరు కృప మొదలైనవి ఎందుకు అడుగుతారు. ఆశీర్వాదాలనైతే అనేక జన్మలుగా తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వచ్చి తల్లిదండ్రుల ఆస్తికి యజమానులుగా అవ్వండి, ఇంకేమని ఆశీర్వదించాలి! కొడుకు జన్మించగానే తండ్రి ఆస్తికి యజమానిగా అయినట్లు. కృప చూపించండి అని లౌకిక తండ్రితో అంటారు. ఇక్కడైతే కృప చూపించే విషయమేమీ లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. బాబా ఒక బిందువు అని కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి మీకు తెలియజేసారు. అందరూ పరమపిత పరమాత్మను గాడ్ ఫాదర్, సుప్రీమ్ సోల్ అని అంటారు కూడా. కావున వారు పరమ ఆత్మ అయినట్లు కదా. వారు సుప్రీమ్. మిగిలినవారంతా ఆత్మలు కదా. సుప్రీమ్ తండ్రి వచ్చి తమ సమానంగా తయారుచేస్తారు, ఇంకేమీ కాదు. స్వర్గ రచయిత అయిన అనంతమైన తండ్రి వచ్చి, స్వర్గానికి యజమానులుగా చేస్తారని ఎవరి బుద్ధిలోనైనా ఉంటుందా. కృష్ణుని చేతిలో స్వర్గం యొక్క గోళం ఉందని ఇప్పుడు మీకు తెలుసు. గర్భం నుండి బిడ్డ బయటకు వచ్చినప్పటి నుండి ఆయుష్షు ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణుడు పూర్తి 84 జన్మలను తీసుకుంటారు. గర్భం నుండి బయటకు వచ్చిన రోజు నుండి 84 జన్మలను లెక్కిస్తారు. లక్ష్మీనారాయణులకు పెద్దవారిగా అవ్వడానికి 30-35 సంవత్సరాలు పడుతుంది కదా. మరి ఆ 30-35 సంవత్సరాలను, 5 వేల సంవత్సరాల నుండి తగ్గించవలసి ఉంటుంది. శివబాబా విషయంలో లెక్కపెట్టలేరు, శివబాబా ఎప్పుడు వచ్చారు అన్న సమయాన్ని చెప్పలేరు. ప్రారంభం నుండి సాక్షాత్కారాలు జరిగేవి. ఒక ముసల్మాను కూడా తోట మొదలైనవి చూసేవారు. ఈ నవవిధ భక్తిని ఎవరూ చేయలేదు. ఇంట్లో కూర్చొని ఉండగా, తమకు తామే ధ్యానంలోకి వెళ్తూ ఉండేవారు. వారు ఎంతగా నవవిధ భక్తిని చేస్తారు. కనుక తండ్రి కూర్చుని సమ్ముఖంగా అర్థం చేయిస్తారు. బాబా దూరదేశం నుండి వచ్చారని పిల్లలకు తెలుసు. వీరిలో ప్రవేశించి మనల్ని చదివిస్తారు. కానీ బయటకు వెళ్ళడంతో నషా తగ్గిపోతుంది. ఈ విషయాలు గుర్తు ఉన్నట్లయితే, సంతోషపు పాదరసం కూడా ఎక్కి ఉంటుంది మరియు కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. కానీ దీనికి సమయం పడుతుంది. ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణుని ఆత్మకు అంతిమ జన్మలో పూర్తి జ్ఞానముంది, మళ్ళీ గర్భం నుండి బయటకి వచ్చిన తర్వాత, పైసా అంత జ్ఞానం కూడా ఉండదు. కృష్ణుడేమీ మురళీని మోగించలేదని, అతనికి జ్ఞానమే తెలియదని తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. లక్ష్మీనారాయణులకే తెలియనప్పుడు, ఇక ఋషులు, మునులు, సన్యాసులు మొదలైనవారు ఎలా తెలుసుకోగలరు. విశ్వానికి యజమానులైన లక్ష్మీనారాయణులకే తెలియనప్పుడు, ఈ సన్యాసులు ఎలా తెలుసుకోగలరు. శ్రీకృష్ణుడు సాగరంలో రావి ఆకుపై వచ్చారు, ఇది చేసారు….. అని అంటారు. ఇవన్నీ కూర్చొని రాసిన కథలు. నదిలో అడుగు పెట్టగానే, అది కిందకు వెళ్ళిపోయిందని అంటారు. మనుష్యులు ఎలాంటి విషయాలను తయారుచేయగలరో ఆలోచించండి. తప్పుడు మాటలను ఎప్పుడూ నమ్మకండి అని తండ్రి అర్థం చేయిస్తారు. శాస్త్రాలు మొదలైనవాటిని ఎంతమంది మనుష్యులు చదువుతారు. మీరు చదివినదంతా మర్చిపోండి, ఈ దేహాన్ని కూడా మర్చిపోండి అని తండ్రి అంటారు. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకొని, రకరకాల నామ, రూప, దేశాలతో, రకరకాల వస్త్రాలను ధరించి పాత్రను అభినయిస్తుంది. ఇది ఛీ-ఛీ వస్త్రమని ఇప్పుడు తండ్రి అంటారు. ఆత్మ మరియు శరీరం రెండూ పతితంగా ఉన్నాయి. ఆత్మ గురించే శ్యామము మరియు సుందరము అని అంటారు. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు సుందరంగా ఉండేది, తర్వాత కామ చితిపై కూర్చోవడంతో నల్లగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి జ్ఞాన చితిపై కూర్చోబెడతారు. నన్ను స్మృతి చేసినట్లయితే ఈ మాలిన్యం తొలగిపోతుందని పతితపావనుడైన తండ్రి అంటారు. ఆత్మలోనే మాలిన్యం చేరుకుంటుంది. కలియుగాంతంలో మీరు నిరుపేదలుగా ఉన్నారు. అక్కడ సత్యయుగంలో మీరు బంగారు మహళ్ళను నిర్మిస్తారు. ఇక్కడ వజ్రాలకు ఎంత విలువ ఉందో చూస్తే, ఆశ్చర్యమనిపిస్తుంది. అక్కడైతే అవి రాళ్ళ వలె ఉంటాయి. ఇప్పుడు మీరు తండ్రి నుండి జ్ఞాన రత్నాలతో జోలెను నింపుకుంటున్నారు. సాగరం నుండి రత్నాల పళ్ళెములను నింపుకొని తీసుకువస్తారని రాయబడి ఉంది. సాగరం నుండి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. అక్కడ గనులు నిండి ఉంటాయి. మీకు సాక్షాత్కారం జరిగింది. మాయా మశ్చీంద్రుని ఆటను కూడా చూపిస్తారు. అతను బంగారు ఇటుకలు పడి ఉండడాన్ని చూసి, నేను తీసుకువెళ్తానని అనుకుంటాడు. కిందకు వచ్చి చూస్తే ఏమీ లేదు. అక్కడైతే బంగారు ఇటుకలతో మహళ్ళు నిర్మిస్తారు. ఇటువంటి ఆలోచనలు రావాలి, అప్పుడు సంతోషపు పాదరసం ఎక్కుతుంది. తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. శివబాబా 5 వేల సంవత్సరాల క్రితం కూడా వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. 5 వేల సంవత్సరాల క్రితం వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పించానని, కల్ప-కల్పం మీకే నేర్పిస్తానని మీకు తెలుసు. ఎవరైతే వచ్చి బ్రాహ్మణులుగా అవుతారో, వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. విరాట రూపాన్ని కూడా తయారుచేస్తారు. అందులో బ్రాహ్మణుల పిలకను మాయం చేసేసారు. బ్రాహ్మణుల కులం చాలా ఉత్తమమైనదిగా గాయనం చేయడం జరుగుతుంది. వారు దైహిక బ్రాహ్మణులు, మీరు ఆత్మికమైనవారు. మీరు సత్యాతి-సత్యమైన కథను వినిపిస్తారు. ఇదే సత్యనారాయణ కథ, అమరకథ. మీకు అమరకథను వినిపించి అమరులుగా చేస్తున్నారు. ఈ మృత్యులోకం సమాప్తమవ్వనున్నది. నేను మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చానని శివబాబా అంటారు. ఎంతమంది ఆత్మలు ఉంటారు. ఆత్మలు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎటువంటి శబ్దము ఉండదు. తేనెటీగల గుంపు వెళ్ళేటప్పుడు ఎంత శబ్దం వస్తుంది. రాణి ఈగ వెనుక తేనెటీగలన్నీ పరుగెడతాయి. వాటికి పరస్పరంలో ఎంత ఐకమత్యముంటుంది. భ్రమరి ఉదాహరణ కూడా ఇక్కడకు సంబంధించినదే. మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. మీరు పతితులకు జ్ఞానం యొక్క భూ-భూ చేస్తారు, అప్పుడు వారు పావన విశ్వానికి యజమానులుగా అయిపోతారు. మీది ప్రవృత్తి మార్గము, అందులో కూడా మెజారిటీ మాతలది, అందుకే వందే మాతరం అని అంటారు. బ్రహ్మాకుమారీ అంటేనే తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వాన్ని ఇప్పించేవారు. తండ్రి సదా సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. ఎవరైతే సేవ చేస్తారో, రాసుకుంటారో-చదువుకుంటారో వారే నవాబులుగా అవుతారు….. రాజుగా అవ్వడం మంచిదా లేక నౌకరుగా అవ్వడం మంచిదా. మేము ఏమవుతాము అనేది అంతిమ సమయంలో మీకు అంతా తెలిసిపోతుంది. అప్పుడు మేము శ్రీమతంపై ఎందుకు నడవలేకపోయామని పశ్చాత్తాపపడతారు. శ్రీమతాన్ని అనుసరించండి అని తండ్రి అంటారు. అలాగని, ఎవరైనా సెంటరు కోసం ఒక గదిని ఇచ్చి, వారు స్వయం మాంసం మొదలైనవి తింటూ ఉండడం కాదు. ఒకరు పుణ్యాత్మ, ఒకరు పాపాత్మ. అప్పుడది ఆశ్రమం అవ్వదు. ఇంట్లో స్వర్గాన్ని తయారుచేస్తున్నప్పుడు, స్వయం కూడా స్వర్గంలో ఉండాలి కదా. కేవలం ఆశీర్వాదాలపై ఆధారపడకూడదు. తండ్రిని స్మృతి చేయాలి. పవిత్రంగా తయారుచేసిన తర్వాతనే తమతో పాటు తీసుకువెళ్తారు. ఎంత భారీ లాటరీ లభిస్తుందని మీకు చాలా సంతోషం ఉండాలి. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి ఇచ్చేంతటి ప్రేమను, ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు. వారినే ప్రేమ సాగరుడు అని అంటారు. మీరు కూడా ఆ విధంగా తయారవ్వండి. ఒకవేళ ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చినా, బాధపెట్టినా దుఃఖితులై మరణిస్తారు. ఇక్కడ బాబా శాపమేమీ ఇవ్వడం లేదు, అర్థం చేయిస్తున్నారు. సుఖం ఇచ్చినట్లయితే సుఖమయంగా ఉంటారు. అందరినీ ప్రేమించండి. బాబా కూడా ప్రేమ సాగరుడు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎటువంటి తప్పుడు మాటలను నమ్మకూడదు. ఇంతవరకు ఏవైతే తప్పుడు విషయాలను చదివారో, వాటిని మరచి, అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయాలి.

2. కేవలం ఆశీర్వాదాలపైనే ఆధారపడకూడదు, స్వయాన్ని పవిత్రంగా చేసుకోవాలి. ప్రతి అడుగులోనూ తండ్రిని అనుసరించాలి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఎవరినీ బాధపెట్టకూడదు.

వరదానము:-

ఎప్పుడైతే సమర్థ సంకల్పాలను రచిస్తారో, అప్పుడే సంకల్ప సిద్ధి ప్రాప్తిస్తుంది. ఎవరైతే ఎక్కువ సంకల్పాలను రచిస్తారో, వారు వాటిని పాలన చేయలేరు. అందుకే రచన ఎంత ఎక్కువగా ఉంటుందో, అంత శక్తిహీనంగా ఉంటుంది. కనుక ముందు వ్యర్థాన్ని రచించడం సమాప్తం చేయండి, అప్పుడు సఫలత ప్రాప్తిస్తుంది. కర్మలలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు యుక్తి – కర్మ చేసేందుకు ముందు దాని ఆది మధ్యాంతాలను తెలుసుకొని, తర్వాత కర్మలు చేయండి. దీనితోనే సంపూర్ణ మూర్తులుగా అయిపోతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

0 Comment

No Comment.

Scroll to Top